Indian Geography | దేశంలో తుఫానులు ఎక్కువగా సంభవించే నెలలు?
1. ప్రతిపాదన (ఎ): భారతదేశ ద్వీపకల్పంలో పడమర వైపు ప్రవహించే నదులకు డెల్టాలు లేవు
కారణం (ఆర్): ఈ నదులు ఎలాంటి ఒండ్రు అవక్షేపాలను మోసుకెళ్లవు
సరైన సమాధానం?
1) ఎ, ఆర్ నిజం, ఎ ఆర్కు సరైన వివరణ
2) ఎ, ఆర్ నిజం. కానీ ఆర్ ఎకు సరైన వివరణ కాదు
3) ఎ నిజం, ఆర్ తప్పు
4) ఎ తప్పు, ఆర్ నిజం
2. కింది వాటిలో దేని నుంచి ప్రధానంగా గట్టి కలప లభిస్తుంది?
ఎ. వెడల్పాటి ఆకులు గల సతతహరిత అడవులు
బి. వెడల్పాటి ఆకులు గల ఆకురాల్చే అడవులు
సి. సతతహరిత శృంగాకారపు అడవులు
డి. సూదిమొన ఆకారపు ఆకులు గల ఆకురాల్చే అడవులు
1) ఎ, సి 2) ఎ, బి, సి
3) ఎ, బి 4) ఎ, బి, సి, డి
3. కింది వాటిని చదవండి
ఎ. శిశు మరణాలు అంటే సంవత్సరం పూర్తికాకుండానే శిశువు మరణించడం
బి. 1000 జననాల్లో సంవత్సరంలోపు చనిపోయిన పిల్లల సంఖ్య ఆధారంగా శిశు మరణాల సంఖ్యను నిర్ణయిస్తారు
సి. కుటుంబ పేదరికం ఒక్కటే శిశుమరణాలకు కారణం
పై వాటిలో సరైనవి?
1) ఎ, సి 2) బి, సి 3) ఎ, బి 4) ఎ, బి, సి
4. ధనుష్కోడి వేటిని కలిపే కేంద్రం?
1) అరేబియా సముద్రం గల్ఫ్ ఆఫ్ కంభట్
2) బంగాళాఖాతం, అరేబియా సముద్రం
3) బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం
4) హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం
5. కింది వాటిలో ఏది లాగూన్ కాదు?
1) చిల్కా సరస్సు 2) అష్టముడి సరస్సు
3) పెరియార్ సరస్సు 4) పులికాట్ సరస్సు
6. ధ్రువ నక్షత్రం కదులుతున్నట్లు కనిపించదు ఎందుకు?
1) అది ధృవాల నుంచి చాలా దూరంలో ఉంది
2) అది భూభ్రమణ అక్షరేఖ దిశలో ఉంది
3) అది భూభ్రమణ వేగంతోనే కదులుతుంది
4) అది దాదాపుగా విశ్వానికి మధ్యలో ఉంది
7. పశ్చిమ కనుమలకు తూర్పున ఉన్న పీఠభూమి ప్రదేశం కంటే పశ్చిమ తీర ప్రాంత మైదానాలు ఎక్కువ వర్షపాతాన్ని పొందడానికి కారణం?
1) తీర ప్రాంత మైదానాలు నిటారుగా ఉంటాయి
2) తీర ప్రాంత మైదానాలు నైరుతి రుతుపవనాల వాయవ్య దిశ వైపున ఉన్నాయి
3) పీఠభూమిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల మబ్బులు ఆవిరైపోతాయి
4) రెండువైపులా వర్షపాతం సమానంగా ఉంటుంది
8. జతపర్చండి?
1. ఉద్గమ శిలలు ఎ. బసాల్ట్, రియోలైట్, ఆండిలైట్
2. పాతాళ అగ్నిశిలలు బి. గ్రానైట్, డ్యూనైట్
3. ఉప పాతాళ అగ్నిశిలలు సి. డోలరైట్, గాబ్రో
1) 1-సి, 2-బి, 3-ఎ 2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-ఎ, 2-సి, 3-బి 4) 1-ఎ, 2-బి, 3-సి
9. జతపర్చండి.
1. కాల్కేరియస్ అవక్షేప శిలలు ఎ. వృక్ష సంబంధ
2. కార్బోని ఫెర్రస్ అవక్షేప శిలలు బి. అల్యూమినియం, సిలికాతో కూడిన రసాయన పదార్థాలు
3. మృత్తిక శిలలు సి. జంతు సంబంధ
4. వాలుకా శిలు డి. ఇసుక రేణువులు
1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
10. కింది వాటిలో ఏది భూపటాలాన్ని, ప్రావారాన్ని వేరు చేస్తుంది?
1) మొహొరోవిసిక్ డిస్కంటిన్యూటీ
2) గుటెన్బర్గ్ డిస్కంటిన్యుటీ
3) రెపెట్టి డిస్కంటిన్యుటీ
4) లేహ్మాన్ డిస్కంటిన్యుటీ
11. పుట్టశిల (స్టాలగ్మైట్లు), ఉదశిల (స్టాలక్టైట్లు)
భూ స్వరూపం ఏర్పడటానికి కారణం?
1) పవనం 2) హిమానీ నదాలు
3) నదులు 4) భూగర్భ జలం
12. జతపర్చండి.
1. స్టాటో ఆవరణం ఎ. వర్షం, మేఘాలు, పవనాలు, ఆర్ధ్రత, ధూళి వంటి శీతోష్ణస్థితి అంశాలు కలిగి ఉండే ఆవరణం
2. ట్రోపో ఆవరణం బి. ధూళి కణాలు, మేఘాల్లాంటివి శీతోష్ణస్థితి అంశాలు లేని ఆవరణం
3. మీసో ఆవరణం సి. బాహ్య ట్రోపో ఆవరణం
4. ఐనో ఆవరణం డి. ఆక్సిజన్, నైట్రోజన్ అణువులు కలిసి అయనీకరణం చెందుతాయి
1) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
13. జతపర్చండి.
1. ఓజోన్ ఆవరణం ఎ. స్ట్రాటో ఆవరణం
2. సమాచార వ్యవస్థ
కలిగిన పొర బి. ఐనో ఆవరణం
3. మిశ్రమ ఆవరణం సి. ట్రోపో ఆవరణం
1) 1-ఎ, 2-బి, 3-సి 2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-సి, 2-బి, 3-ఎ 4) 1-ఎ, 2-సి, 3-బి
14. కింది వాటిలో ఏ వర్షపాతం ప్రధానంగా క్యుములోనింబస్ మేఘాల వల్ల సంభవిస్తుంది?
1) పర్వతీయ వర్షపాతం 2) సంవహన వర్షపాతం
3) చక్రవాత వర్షపాతం 4) ఏదీకాదు
15. టోర్నడోలు అంటే ఏమిటి?
1) ఉత్తర అమెరికాలోని మిసిసిపి, మిస్సోరి, మెక్సికో సింధూ శాఖలతో సంభవించే తీవ్రమైన గాలివానలతో కూడిన సమశీతోష్ణ మండల చక్రవాతాలు
2) ఉత్తర అమెరికాలోని మిసిసిపి, మిస్సోరి, మెక్సికో సింధూ శాఖలతో సంభవించే తీవ్రమైన గాలివానలతో కూడిన ఉష్ణ మండల చక్రవాతాలు
3) ఉత్తర అమెరికాలోని మిసిసిపి, మిస్సోరి, మెక్సికో సింధు శాఖలతో సంభవించే తీవ్రమైన గాలివానలతో కూడిన సమ ఉష్ణ మండల చక్రవాతాలు
4) ఏదీకాదు
16. దేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం?
1) అరేబియా 2) బంగాళాఖాతం
3) మధ్యధరా 4) ఎర్రసముద్రం
17. ఉత్తరార్ధగోళంలో ఉప అయన రేఖ దిగువన, వాణిజ్య పవనాలు భూమధ్య రేఖ ఏ దిశలో వీస్తాయి?
1) వాయవ్య దిశగా 2) ఆగ్నేయ దిశగా
3) నైరుతి దిశగా 4) ఈశాన్య దిశగా
18. నైరుతి రుతుపవనాలుగా మార్పు చెందే పవనాలు?
1) ఈశాన్య వ్యాపార పవనాలు
2) ఆగ్నేయ వ్యాపార పవనాలు
3) వాయవ్య పశ్చిమ పవనాలు
4) నైరుతి పశ్చిమ పవనాలు
19. దేశంలో తుఫానులు ఎక్కువగా సంభవించే నెలలు?
1) అక్టోబర్, డిసెంబర్ 2) నవంబర్, డిసెంబర్
3) డిసెంబన్, జనవరి 4) అక్టోబర్, నవంబర్
20. 1818లో నూలు పరిశ్రమను ఏ ప్రాంతం లో స్థాపించారు?
1) రాణిగంజ్ 2) రిష్రా
3) పోర్ట్గ్లోస్టర్ 4) చంపారన్
21. జతపర్చండి.
1. ఇనుము, ఉక్కు పరిశ్రమ (1832) ఎ. పోర్ట్నోవా
2. సిమెంట్ పరిశ్రమ (1904) బి. మద్రాస్
3. పెట్రోలియం పరిశ్రమ (1825) సి. మాకుమ్
4. అగ్గిపుల్లల పరిశ్రమ (1921) డి. అహ్మదాబాద్
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
22. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం పర్వతాలు, పీఠభూముల్లో ఉండాల్సిన అడవుల శాతం ఎంత?
1) 60 2) 62 3) 50 4) 33
23. దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ను నిర్వహిస్తున్నారు?
1) కేరళ 2) ఒడిశా 3) మధ్యప్రదేశ్ 4) త్రిపుర
24. దక్షిణ భారతదేశం ఎక్కువగా దక్కన్ పీఠభూమి. ఇది ఉత్తర మైదాన ప్రాంతం నుంచి వేటి ద్వారా వేరుపడుతుంది?
1) నర్మదా నది 2) వింధ్యాపర్వతాలు
3) సాత్పూర పర్వతాలు 4) చంబల్లోయ
25. కోట్టు, అంటు బెట్టు వ్యవసాయాన్ని సాధారణంగా ఏమని పిలుస్తారు?
1) అడవుల పునరుద్ధరణ 2) జూం సాగు
3) అడవుల విధ్వంసం 4) వర్షాధార సాగు
26. కింది సంప్రదాయ జల సంరక్షణ పద్ధతులు, వాటిని అనుసరించే ప్రాంతాలతో జతపర్చండి?
1. జాంగ్ ఎ. తమిళనాడు
2. జాబో బి. రాజస్థాన్
3. జోహడ్స్ సి. లఢక్
4. షాడ్ డి. మహారాష్ట్ర
5. యేరి ఇ. నాగాలాండ్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-బి, 2-డి, 3-ఇ, 4-సి, 5-ఎ
3) 1-ఇ, 2-డి, 3-ఎ, 4-బి, 5-సి
4) 1-ఇ, 2-సి, 3-ఎ, 4-డి, 5-బి
27. దేశంలోని జీవవైవిధ్య హాట్స్పాట్ (సంక్షోభ ప్రాంతం) ఏది?
1) ఆరావళి కొండలు 2) పశ్చిమ కనుమలు
3) పాపాఘాట్స్ 4) రెడ్ హిల్స్
28. లక్ష్మీదేవిపల్లి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) కామారెడ్డి 2) సిద్దిపేట
3) మెదక్ 4) నిర్మల్
29. తెలంగాణ ప్రాంతంలోకి పడమటి కనుమలు (సహ్యద్రి పర్వతాలు) ఏ శ్రేణి నుంచి విడిపోతాయి?
1) సాత్మాల 2) అజంత
3) లక్ష్మీదేవిపల్లి 4) రాఖీ కొండలు
30. సిర్నాపల్లి కొండల్లో ఉండే తెగ ఏది?
1) కోయలు 2) వాల్మీకి బోయ
3) పర్బాన్లు 4) లంబాడీలు
31. కింది వాటిలో జియోలాజికల్ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ర్టానికి చెందిన శిలలు ఏవి?
1) వింధ్య శిలలు
2) గోండ్వానా, ద్రవిడియన్ శిలలు
3) ఆర్కియన్ శిలలు 4) పైవన్నీ
32. తెలంగాణలో పశ్చిమ కనుమల్లో ఎత్తయిన శ్రేణి ‘మహబూబ్ఘాట్’ ఏ జిల్లాలో ఉంది?
1) నిర్మల్
2) జయశంకర్ భూపాలపల్లి
3) కుమ్రం భీం ఆసిఫాబాద్ 4) ఆదిలాబాద్
33. తెలంగాణ మొత్తం మీద అత్యల్ప వర్షపాతం సంభవించే జిల్లా ఏది?
1) సిద్దిపేట 2) జగిత్యాల
3) పెద్దపల్లి 4) గద్వాల్
34. తెలంగాణ ప్రాంతంలో సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం?
1) కొత్తగూడెం 2) హైదరాబాద్
3) రామగుండం 4) మిర్యాలగూడెం
35. తెలంగాణలో సాధారణంగా అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం?
1) ఆదిలాబాద్ 2) నిజామాబాద్
3) నల్లగొండ 4) ఖమ్మం
36. దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వెళ్లేకొద్ది వర్షపాతం?
1) తగ్గుతుంది 2) పెరుగుతుంది
3) ఎలాంటి మార్పుండదు 4) ఏదీకాదు
37. సాధారణంగా నైరుతి రుతుపవనాలు తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడు చేరుకుంటాయి?
1) జూన్ మొదటి వారం 2) జూన్ రెండో వారం
3) పై రెండూ 4) పై ఏదీకాదు
38. ఈశాన్య రుతుపవన కాలంలో ఏ రకం వర్షపాతం కలుగుతుంది?
1) సంవహన వర్షపాతం 2) పర్వతీయ వర్షపాతం
3) చక్రవాత వర్షపాతం 4) ఏదీకాదు
39. నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులను విముక్తి కల్పించడానికి ఉద్దేశించిన పథకం?
1) డిండి ఎత్తిపోతల పథకం
2) నక్కలగండి ప్రాజెక్టు
3) పై రెండూ 4) పై ఏదీకాదు
సమాధానాలు
1-1, 2-3, 3-3, 4-3, 5-3, 6-2, 7-2, 8-4, 9-1, 10-1, 11-4, 12-4, 13-1, 14-2, 15-1, 16-3, 17-3, 18-2, 19-4, 20-3, 21-3, 22-1, 23-3, 24-2, 25-2, 26-4, 27-2, 28-2, 29-1, 30-4, 31-4, 32-1, 33-4, 34-3, 35-1, 36-2, 37-3, 38-3, 39-3.
జీ. గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు