ధ్రువప్రాంతంలో ఎస్కిమోలు
ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రదేశాన్ని ‘ధ్రువ ప్రాంతం’ అంటారు. ఉత్తర ధ్రువ ప్రాంతం గురించి అక్కడ నివసించే ఎస్కిమోల జీవనవిధానం గురించి తెలుసుకుందాం.
ధ్రువప్రాంతంలోని ఖండాల ఉత్తర భాగాలను ‘టండ్రా ప్రాంతం’ అంటారు. టండ్రా అతి చలిగా ఉండే ప్రాంతం. టండ్రా ప్రాంతంలో సూర్యకాంతి తక్కువగా పడుతుంది. అందుకే ఈ ప్రాంతంలో ప్రత్యేక మైన మొక్కలు ఉంటాయి. దీన్నే టండ్రా వృక్షజాలం అంటారు.
కాలాలు
- టండ్రా ప్రాంతంలో రెండు కాలాలు కలవు. అవి.
- శీతాకాలం, వేసవికాలం.
- నవంబర్, డిసెంబంర్, జనవరి నెలల్లో ధ్రువప్రాంతంలో శీతాకాలం ఉంటుంది.
- ఈ కాలంలో సూర్యుడు కనిపించడు. అందుకే చీకటిగా ఉంటుంది. ఈ కాలంలో ధ్రువప్రాంతంలోని
- నదులు, సరస్సులు కాలువల్లో నీరు గడ్డకడుతుంది. చెట్లు చనిపోతాయి.
- మొక్కలపై మంచుచే నిండి ఉంటుంది.
- ఈ కాలంలోమనుషులతో పాటు జంతువులు, పక్షుల ఈ ప్రాంతాన్ని వదిలి వేరొక ప్రాంతానికి వలస పోతాయి.
- ఈ కాలంలో ధ్రువప్రాంతం నిర్మానుషంగా, నిర్జీవంగా ఉంటుంది.
వేసవి కాలం
- ఫిబ్రవరి, మార్చి నెలలను వేసవి కాలంగా పిలుస్తారు.
- ఫిబ్రవరి, మార్చిలో సూర్యుడు కనపించటం ప్రారంభం అవుతుంది.
- మొదట సూర్యుడు గంటన్నర మాత్రమే కనిపించి అస్తమిస్తాడు.
- తరువాత రెండు గంటలు మాత్రమే కనిపించి అస్తమిస్తాడు.
- తరువాత ఆరు గంటలు మాత్రమే కనిపించి అస్తమిస్తాడు.
- తరువాత ఎనిమిది గంటలు మాత్రమే కనిపించి అస్తమిస్తాడు
- తరువాత 16గంటలు కనిపించి అస్తమిస్తాడు.
- కాలక్రమేణా కాలాన్ని పెంచుకుంటూ చివరికి 24 గంటలు ఉదయిస్తాడు. మే, జూన్, జూలై మూడు
- నెలల్లో సూర్యుడు అస్తమించకుండా నడినెత్తిపైన క్షితిజంలో ఉంటాడు.
- భూమి, ఆకాశం కలిసినట్లు ఉండే ప్రదేశాన్ని దిగ్ మండలం/ క్షితిజం అంటారు.
- శీతాకాలంలో గడ్డకట్టిన నదులు, సరస్సుల్లో మంచు కరిగి ప్రవహిస్తాయి.
- శీతాకాలంలో ఈ ప్రాంతాన్ని వదిలివెళ్లిన ప్రజలు, జంతువులు, పక్షులు వేసవికాలం రాగానే ఈ ప్రాంతానికి తిరిగివస్తాయి.
- ఈ ప్రాంతం వేసవికాలంలో సస్యశ్యామలంగా ఉంటుంది.
వృక్ష సంపద
- మంచు మైదానం, మంచుతో కప్పబడిన చెట్లు, రాళ్లు, గుట్టలు, చెట్లులేని టండ్రాప్రాంతం కావడం వల్ల మట్టి కొరత ఉంటుంది.
- ferma frost అంటే భూ ఉపరితలం మంచుతో కప్పబడి ఉండటం, ferma frost శాశ్వతంగా గడ్డకట్టిన మంచురాయి. ఈ ప్రదేశంలో నాచుమొక్కలు లిల్లీ ఫ్లవర్స్ పెరుగుతాయి.
ప్రజలు
- ధ్రువప్రాంతంలో నివసించే ప్రజలను ఎస్కిమోలు అంటారు.
- ఎస్కిమో అంటే మంచు బూట్ల వ్యక్తి అని అర్థం.
- సైబీరియా, అలస్కా, కెనడా, లాబ్రడార్, గ్రీన్లాండ్ ప్రాంతాల్లో ఎస్కిమోలు తక్కువ సమయంలో విస్తరించారు.
బృందాలు
- ఎస్కిమోలు రెండు బృందాలుగా నివసిస్తారు.
- ఇన్యుయిట్, యూవిక్
- ఇన్యుయిట్ అంటే నిజమైన/అసలైన/స్థానిక ప్రజలు.
భాషలు
- ధ్రువప్రాంతంలో ఎస్కిమోలు మూడు భాషలు మాట్లాడతారు.
- అల్యుయిట్, యిపిక్, ఇన్యుపిట్
- ఎస్కిమోలు అత్యధికంగా మాట్లాడే భాష ఇన్యుపిట్. ఉత్తర అలస్కా నుంచి గ్రీన్లాండ్ వరకు
- ఎస్కిమోలు ఇన్యుపిట్ భాషను ఎక్కువగా మాట్లాడతారు.
- ఎస్కిమోలు నివసించే ప్రాంతంలో మాంసం వండటానికి, కాల్చడానికి కట్టెపుల్లల కొరత ఉంటుంది.
- దీంతో చేపలు, మాంసాన్ని పచ్చిగా తింటారు.
- చేపలు, మాంసం గడ్డకట్టేలా చేసి సన్న సన్న ముక్కలుగా కోసి సీలు లేదా తిమింగలం కొవ్వు పదార్థాల నూనెలో ముంచుకొని తింటారు.
- కొన్ని రకాల మాంసాన్ని కుళ్లిన తర్వాత కుళ్లిన భాగాన్ని తొలగించి నూనె దీపాల్లో ముంచుకొని తింటారు.
నివాసం
- ఎస్కిమోలు నివసించే నివాసాలను ‘ఇగ్లూ’ అంటారు.
- ఇగ్లూ (మంచుతో చేసిన గుండ్రటి ఇళ్లు) అంటే ఎస్కిమో పదానికి ఆశ్రయం అని అర్థం. అయితే తూర్పు మధ్య ప్రాంతాల్లో మాత్రమే మంచు ఇండ్లను ఉపయోగిస్తారు.
- వేసవి కాలంలో చాలామంది ఎస్కిమోలు జంతు చర్మంతో చేసిన గుడారాల్లో నివసిస్తారు. శీతాకాలంలో పశ్చిమ అలస్కాలో చెక్క చట్రాల మీద బరువుగా ఉండే ‘వాల్డ్రాస్’ అనే చర్మాన్ని కప్పి పెద్ద పెద్ద గుడారాలను ఏర్పాటు చేసుకుంటారు.
- అలస్కా ఉత్తర తీరంలో తిమింగలం పక్కెటెముకలను ఉపయోగించి గుండ్రటి ఇండ్లను నిర్మించుకుంటారు.
- ఉత్తర అలస్కా నుంచి గ్రీన్లాండ్ వరకు రాతి పలకలతో ఇండ్లు కడతారు.
- నైరుతి అలస్కా నుంచి సైబీరియా వరకు ఉన్న ఎస్కిమో ప్రజలు యిపిక్ భాష ఎక్కువగా మాట్లాడుతారు.
జనాభా
- సుమారు 5వేల సంవత్సరాల క్రితం ఎస్కిమోలు సైబీరియా నుంచి మొదలై ఆర్కిటిక్ వలయ మైదానం, బేరింగ్ జలసంధి ద్వారా ఉత్తర అమెరికాలో ప్రవేశించారు.
- వీరు అతి తక్కువ సమయంలోనే సైబీరియా, అలస్కా, గ్రీన్లాండ్, కెనడా ప్రాంతానికి విస్తరించారు.
జనాభా వివిధ ప్రాంతాల్లో…
- సైబీరియా 2000
- కెనడా 22,000
- అలస్కా 30,000
- గ్రీన్లాండ్ 43,000 మంది నివసిస్తున్నారు.
- కొంత మంది ఎస్కిమో బృందాలు బేరింగ్ జలసంధి మార్గం మధ్యలో అటవీ ప్రాంతా ల్లో స్థిరపడ్డారు.
- మరికొంత మంది ఎస్కిమో బృందాలు పశ్చిమం వైపు అంటే బేరింగ్ జలసంధి ప్రాంతంలోనే నివాసాలు ఏర్పరుచుకున్నారు.
జీవన విధానం
- ఎస్కిమోలది ‘సంచార జీవన విధానం’. వీరు చిన్న చిన్న బృందాలుగా నివసిస్తున్నారు. ఉత్తర అలస్కాలో 500 మంది బృందాలుగా నివసిస్తున్నారు.
- తూర్పు ప్రాంతం (నార్త్ అమెరికా)లోని బాపిన్ దీవులు, లాబ్రడర్, గ్రీన్లాండ్లో 25 నుంచి 45 బృందాల ఎస్కిమోలు కలరు.
- వీరు సంచారం చేసే దూరం 1100 కిమీ.
వృత్తి విధానం
- వేటాడడం, చేపలు పట్టడం
- శీతాకాలం- సీల్ చేపలు పట్టడం
- వేసవికాలం- కూరిబౌ జంతువులను వేటాడడం
- వేసవికాలంలో కుటుంబ సభ్యులు, కుటుంబంలో ఒకరుగాని పండ్లు సేకరించడం.
- శీతాకాలంలో 10-12మంది బృందాలుగా ఏర్పడి సీల్ చేపలు పట్టడం.
- వేసవికాలంలో 100 మంది బృందంగా ఏర్పడి తిమింగలాలు, కారిబౌ జంతువులను వేటాడడం.
- ఆయుధాలు- బల్లాలు, బాణాలు, హార్పూన్స్
- కయాక్ పడవ (చక్క ఛట్రంపై చర్మం కప్పి జారుకుంటూ దానిపై నుంచి హార్పూన్స్ విసురుట. మంచులో)
ఆహారం
- పచ్చిమాంసం, చేపలు, కొవ్వులు. కూరగాయలు చాలా అరుదు. వీరు ఆహారాన్ని వృథాచేయరు. వేటాడిన జంతువులు, చేపల మాంసాన్ని పాతిపెట్టి పైన రాళ్లను గుర్తుగా పెడతారు. (ఇతర జంతువులు తినకుండా ఉండటానికి)
వస్ర్తధారణ
- ఎస్కిమోలు మక్లుక్ అనే బూట్లు, Phants, తలను కప్పే టోపి ఉండే కోట్స్ వేసుకుంటారు. వీటినే ‘పర్కలు’ అంటారు. స్త్రీలు, పురుషులు వేసుకొనే పర్క్ల్లో కొంత తేడా ఉంటుంది. పురుషులు వేసుకొనే పర్క్లకు ముందు, వెనుక వేలాడుతూ పెద్ద పెద్ద క్లాత్ ముక్కలుంటాయి.
- చలికాలంలో రెండు పొరలతో కూడిన వస్ర్తాలను ధరిస్తారు.
- శీతాకాలంలో కారిబౌ జంతువు చర్మంతో చేసిన వస్ర్తాలు ధరిస్తారు. వేసవి కాలంలో సీల్ చేప చర్మంతో చేసిన వస్ర్తాలు ధరిస్తారు. ఇవి నీటిలో తడవకుండా చాలా గట్టిగా ఉంటాయి.
కళలు
- రోజూ ఉపయోగించే వస్తువులు, పరికరాలను ఎస్కిమోలు అలంకరిస్తారు. ఎముకలు, దంతాలు, సోప్స్టోన్ అనే మెత్తటి రాయితో జంతువులు, చిన్నచిన్న బొమ్మలతోపాటు ఆయుధాలు తయరుచేస్తారు.
- పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో చెక్క ముఖ తొడుగులను రంగులు, జంతు చర్మంతో అలంకరిస్తారు.
రవాణా
- నీటిపై ఉమియాక్సి అనే పడవను రవాణాకు ఉపయోగిస్తారు.
- మంచుపై జారేందుకు కయాక్ అనే పడవను ఉపయోగిస్తారు. 10 లేదా 12 కుక్కలతో కూడిన స్లెడ్జ్ బండ్లను ఉపయోగిస్తారు. ఇవి ఒక టన్ను వరకు బరువు లాగుతాయి.
విందు-వినోదాలు
- కుస్తీలు పట్టడం, పరుగు పందెం, హార్పూన్స్ విసురుట, పాటలు పాడటం, కథలు చెప్పడం, డప్పులు వాయించడం. బృందా లు మరొక బృందంతో కలిసినప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు, విందులు చేస్తారు.
వైకింగ్స్
- ఐస్లాండ్ నుంచి గ్రీన్లాండ్కు వలస వచ్చినవారిని వైకింగ్స్ అంటారు. వైకింగ్స్తో ఎస్కిమోలకు 1200-1600 సంవత్సరాల పరిచయం కలదు. ఎస్కిమో ప్రాంతానికి వైకింగ్స్ రావడం వల్ల ఎస్కిమోలకు రోగనిరోధక శక్తి తగ్గింది.
- వైకింగ్స్ వల్ల ఎస్కిమోలకు జలుబు, మశూచి, క్షయ వ్యాధులు వచ్చాయి.
ఆచార, సాంప్రదాయాలు
- జననం, మరణం, జీవనం, ఆరోగ్యం, ఆహారం అంశాలకు ఎస్కిమోలు అధిక ప్రాధాన్యం ఇస్తారు.
- ఆహార, ఆరోగ్య, జీవన దేవతగా ‘సెడ్నా’ అనే దేవతను పూజిస్తారు. దీంతోపాటు అతీతమైన శక్తిగా ‘శిల’ను పూజిస్తారు.
- చనిపోయిన జంతువులు, మనుషుల ఆత్మలు జీవించి ఉంటాయని బలంగా నమ్ముతారు.
- మత, ఆచార సాంప్రదాయాలను ‘షమాన్లు’ అంటారు.
- ఎస్కిమోలు వైకింగ్స్ సంబంధాన్ని వృద్ధి, పతనంతో పోల్చారు.
- వృద్ధి చెందినవి. విద్య, ఉపాధి, ధనం
- పతనం-‘పేదరికం’తో కనీస అవసరాలు తీరక మరణించారు.
- 1576-78లో బ్రిటిష్ నావికుడు మాట్రిక్ ప్రాస్ బిషర్ ఎస్కిమోల ప్రాంతాన్ని సందర్శించిన తొలి వ్యక్తి.
ఎస్కిమోల అభివృద్ధి దశలు
- 1879-1910 – తిమింగళాల వేట
- 1925-1950 – చర్మ, ఆధునిక వ్యాపారం
- 1950 మధ్యకాలం- రవాణా స్థావరాల ఏర్పాటు
- 1960 మధ్యకాలం- పట్టణాల నిర్మాణం
- 1970 మధ్యకాలం- చమురు నిక్షేపాల అన్వేషణ
Previous article
బహు పార్శ్వ సూచీని అభివృద్ధి చేసినది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు