జంతువుల జీవిత చరిత్రలోని దశలు

- గుడ్లు పెట్టడం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జంతువులను అండోత్పాదకాలు అంటారు. పక్షులు, పాములు, చేపలు, కీటకాలు దీనికి ఉదాహరణ.
- కుక్క, పిల్లి, ఆవు వంటి జంతువులు ప్రత్యక్షంగా పిల్లలను కంటాయి. వీటిని శిశూత్పాదకాలు అంటారు.
- కీటకాలు అండోత్పాదకాలు.
- బొద్దింక గుడ్లతిత్తి అనే పెట్టెలో గుడ్లను పెడుతుంది. గొల్లభామ గుడ్లను దగ్గరగా కాయమాదిరిగా చేస్తుంది.
- దోమ సుమారు మూడు వందల గుడ్లను నీటిలో పెట్టి, వాటిని పడవ ఆకారంలో ఉండే బల్లకట్టుగా చేస్తుంది.
- సీతాకోకచిలుక గుడ్లు అభివృద్ధి చెంది గొంగళిపురుగుగా మారుతుంది.
- గొంగళి పురుగు దాని చుట్టూ కోశాన్ని ఏర్పరుచుకుంటుంది. ఈ దశను ప్యూపా దశ అంటారు.
- ప్యూపా కోశం నుంచి ప్రౌఢ సీతాకోకచిలుకగా బయటకు వస్తుంది.
- గొంగళి పురుగు ప్రౌఢ సీతాకోక చిలుక కంటే భిన్నంగా కనిపిస్తుంది. ఇది సీతాకోకచిలుకగా రూపవిక్రియ చెందుతుంది.
- రూప విక్రియ అంటే తల్లిదండ్రులకు భిన్నంగా ఉండే లార్వా తల్లిదండ్రులను పోలి ఉండే రూపాన్ని పొందడం.
- దోమ లార్వాను రిగ్లర్ అంటారు. ఈగ లార్వాను మెగ్గాట్ అంటారు.
- చేపలు సామాన్యంగా అండోత్పాదకాలు. కాని షార్క్ చేపలు శిశూత్పాదకాలు.
- కప్పలు అండోత్పాదకాలు. ఇవి నీటిలో గుంపులు గుంపులుగా గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు లార్వాలుగా అభివృద్ధి చెందుతాయి.
- కప్ప లార్వాను టాడ్పోల్ అంటారు. ఇది చిన్ని చేపలాగా కనిపిస్తుంది. రూపవిక్రియ చెందిన తర్వాత టాడ్పోల్ లార్వా చిరుకప్పగా మారుతుంది.
- పాములు, మొసళ్లు, తొండల గుడ్లు పెద్దవిగా ఉంటాయి. ఈ గుడ్లలో ఉన్న ఆహారాన్ని సొన అంటారు.
- అండోత్పాదకాలు. కానీ రక్తపింజర శిశూత్పాదకం.
- పక్షులు కూడా అండోత్పాదకాలు. వీటి గుడ్లు పెద్దవి. వీటిలో సొన ఎక్కువగా ఉంటుంది.
- అభివృద్ధి చెందే పిండానికి తగినంత వేడి ఇవ్వడానికి పక్షి గుడ్లపై కూర్చుంటుంది. దీన్నే పొదగడం అంటారు.
- కోడి 21 రోజులు గుడ్లను పొదుగుతుంది.
- ఆస్ట్రిచ్ అతిపెద్ద గుడ్లను పెడుతుంది. హమ్మింగ్ పక్షి అతిచిన్న గుడ్డును పెడుతుంది.
- పిల్లలను కని, పాలిచ్చి పెంచే జంతువులను క్షీరదాలు అంటారు.
- ఆవు, పిల్లి, కుక్క, గేదె, గుర్రం, పులి, సింహం, ఏనుగు, కోతి, మానవుడు క్షీరదాలు.
- క్షీరదాలన్నీ శిశూత్పాదకాలు, కొన్ని క్షీరదాలు అండోత్పాదకాలు. ఉదా: ఎకిడ్నా, ప్లాటిపస్
- తల్లి గర్భంలో పిల్లజీవి ఉండే కాలాన్ని గర్భావధి కాలం అంటారు.
Previous article
If there are two auxiliary verbs, the adverb…..?
Next article
Which country is No-1in milk production?
RELATED ARTICLES
Latest Updates
రాష్ట్ర ప్రభుత్వానికి ‘కామధేనువు’గా ఏ పన్నును పిలుస్తారు?
జల్లికట్టు వేడుకలను ఏ గ్రామంలో నిర్వహించారు?
సముద్రపు చుంచెలుకలు.. యాపిల్ నత్తలు
‘ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్’ అనే గ్రంథాన్ని రాసినవారు?
Write GRE to fly abroad
ఒకట్ల స్థానంలో ఏడు ఉన్న వందలోపు ప్రధాన సంఖ్యలు ?
క్లోనింగ్ ద్వారా రూపొందించిన మొదటి పాష్మీనా జాతి మేక?
జీవిత బీమా – భవిష్యత్తుకు ధీమా
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ప్రారంభించి ఎన్నేండ్లు పూర్తయ్యింది?
చిత్తడి నేలలను ఏ చర్యలతో కోల్పోతున్నాం?