హమ్ సునేగి నారీ కి బాత్ అనేది దేని నినాదం?
1.నేషనల్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీని ఎప్పుడు ప్రారంబించారు?
1) 2011 2) 2012 3) 2013 4) 2014
2.ఈ కింది విధానాలను, వాటిని రూపొందించిన సంవత్సరాలను జతపర్చండి?
1. మహిళా సాధికారత విధానం ఎ. 1993
2. జాతీయ బాల కార్మిక విధానం బి. 2013
3. నూతన జాతీయ బాలల విధానం సి. 1987
4. జాతీయ పోషకాహార విధానం డి. 2001
1) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3.మహిళా శిశు సంక్షేమ రంగంలో కృషి చేస్తున్న కింది సంస్థలను వాటి విధులతో జతపర్చండి.
1. CSWB ఎ. మారుమూల ప్రాంతాల్లోగల స్త్రీలు,శిశువులు, అశక్తుల సంక్షేమం
2. NIPCCD బి. ICDS సిబ్బందికి శిక్షణ
3. RMK సి. సూక్ష్మ రుణాల ద్వారా అభివృద్ధికి తోడ్పటం
4. CARA డి. దత్తతకు సంబంధించిన వ్యవహారాలు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4.స్త్రీ, శిశు సంక్షేమం కోసం చేసిన ప్రత్యేక సదుపాయాలు వివక్షత కిందకు రావని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
1) 15(1) 2) 15(3) 3) 16(1) 4) 16(3)
5.లింగ నిష్పత్తిలో వస్తున్న తీవ్రమైన తరుగుదలను అరికట్టేందుకు ఉద్దేశించిన సామాజిక శాసనం ఏది?
1) PCPNDT చట్టం 2) SITA చట్టం
3) ITPA చట్టం 4) POCSO చట్టం
6.మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి కింది శాసనాలను, వాటిని రూపొందించిన సంవత్సరాలను జతపర్చండి.
1. యంగ్ పర్సన్స్ హామ్ఫుల్ పబ్లికేషన్స్ యాక్ట్ ఎ. 2013
2. ది ఇన్ఫాంట్ మిల్క్ సబ్స్టిట్యూషన్, ఫీడింగ్ బి. 1960
3. ఆర్ఫానేజ్ అండ్ చారిటబుల్ యాక్ట్ సి. 1992
4. బంగారు తల్లి గర్ల్ చైల్డ్ ప్రమోషన్ అండ్ ఎంపవర్మెంట్ యాక్ట్ డి. 1956
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
7.మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
ఎ. 4 స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు కలవు.
బి. 2 చట్టబద్ధ సంస్థలు కలవు.
సి. 2006లో పూర్తిస్థాయి మంత్రిత్వ శాఖగా ఏర్పడింది.
డి. రాష్ట్రీయ మహిళా కోశ్ (RMK)కు మహిళా మంత్రిత్వశాఖ మంత్రే ఎక్స్-అఫిషియో చైర్మన్‌గా ఉంటారు.
1) ఎ, డి 2) బి, సి
3) ఎ, బి, డి 4) పైవన్నీ సరైనవే
8.జాతీయ మహిళా కమిషన్‌కు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి.
ఎ. ది కమిటీ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ – 1974 సూచనల మేరకు ఏర్పడింది.
బి. నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్ – 1988 సూచనల మేరకు ఏర్పడింది.
సి. పరివారిక్ మహిళా లోక్ అదాలత్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది.
డి. సభ్యుల పదవీకాలం మూడు సంవత్సరాలు.
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) బి, డి 4) పైవన్నీ సరైనవే
9.బాలల హక్కుల కమిషన్ ప్రకారం బాలలు అంటే ఎన్ని సంవత్సరాల లోపువారు?
1) 14 2) 16 3) 18 4) 21
10.CRC (చైల్డ్ రైట్స్ కన్వెన్షన్)కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ. 1989లో ఏర్పడింది.
బి. 1990 నుంచి అమల్లోకి వచ్చింది.
సి. 1959లో ఏర్పడింది.
డి. 1992లో భారత్ సంతకం చేసింది.
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) పైవన్నీ సరైనవే
11. స్త్రీల అక్రమ రవాణాను నిరోధించడానికి ఉద్దేశించిన సమగ్ర పథకం ఉజ్వలను ఏ సంవత్సరంలో రూపొందించారు?
1) 2007, డిసెంబర్ 4 2) 2009, డిసెంబర్ 4
3) 2007, ఏప్రిల్ 4 4) 2009 ఏప్రిల్ 4
12.జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్-2014 సదస్సు ఏ నగరంలో జరిగింది?
1) న్యూఢిల్లీ 2) హైదరాబాద్
3) బ్యాంకాక్ 4) బీజింగ్
13.ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ రైట్స్ ఫర్ ఉమెన్ అని దేన్ని పిలుస్తారు?
1) కన్వెన్షన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫామ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెనెస్ట్ ఉమెన్
2) ఉమెన్ రైట్స్ కన్వెన్షన్ 3) ఉమెన్ రైట్స్ డిక్లరేషన్
4) కన్వెన్షన్ ఆన్ డిస్క్రిమినేషన్ అగెనెస్ట్ ఉమెన్
14.ICDS పూర్తి రూపాన్ని తెల్పండి?
1) ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్
2) ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్
3) ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్
4) ఇంటిగ్రేటెడ్ అండ్ ఇన్నోవేటివ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్
15.ఎంతమంది జనాభాకు ఒక మినీ అంగన్వాడి సెంటర్‌ను మంజూరు చేస్తారు?
1) 200-400 2) 150-250
3) 200-300 4) 150-400
16.ICDS కింద అమలుపర్చే టేక్ హోమ్ రేషన్ ఎవరికి ఉద్దేశించినది?
1) మూడేండ్ల లోపు పిల్లలకు 2) పాలిచ్చే తల్లులకు
3) గర్భినీ స్త్రీలకు 4) పైవారందరికి
17.ICDS వారాన్ని గుర్తించండి.
1) నవంబర్ 14 నుంచి 19 వరకు
2) అక్టోబర్ 2 నుంచి 7 వరకు
3) జనవరి 1 నుంచి 6 వరకు
4) నవంబర్ 20 నుంచి 25 వరకు
18.కింది వాటిలో స్వధార్ పథకం కిందకు రాని సేవను/సేవలను గుర్తించండి.
ఎ. కౌన్సెలింగ్ బి. షెల్టర్
సి. రిహాబిలిటేషన్
డి. ప్రివెన్షన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్
1) ఎ 2) ఎ, బి, సి 3) సి, డి 4) డి
19. సబల పథకాన్ని దేశవ్యాప్తంగా ఎన్ని జిల్లాల్లో అమలు పరుస్తున్నారు?
1) 105 2) 205 3) 305 4) 405
20. తెలంగాణలో సబల పథకాన్ని ఎన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు?
1) 3 2) 4 3) 5 4) 1
21.IGMSY పథకాన్ని ఏ సంవత్సరం ప్రారంభించారు?
1) 2009 2) 2008 3) 2010 4) 2011
22. హమ్ సునేగి నారీ కి బాత్ అనేది దేని నినాదం?
1) నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్
2) నేషనల్ పాలసీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్
3) బేటీ బచావో, బేటీ పడావో
4) నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఉమెన్
23.రాజీవ్‌గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడాలిసెంట్ బాయ్స్ అనే పథకాన్ని ఏమని పిలుస్తారు?
1) సబల 2) సాక్ష్యం 3) అబల 4) రుద్ర
24. సాక్ష్యం పథకాన్ని ఎవరు అమలు చేస్తారు?
1) ICPS వారు 2) ICDS వారు
3) IKP వారు 4) MEPMA వారు
25. 10 నుంచి 19 ఏండ్ల మధ్య వయసుగల వారి ఆరోగ్య సంరక్షణ కోసం ఉద్దేశించిన పథకం ఏది?
1) నేషనల్ అడాలిసెంట్ హెల్త్ ప్రోగ్రామ్
2) ICDS 3) ICPS 4) NRHM
26.డిజిటల్ జెండర్ అట్లాస్‌ను ఎవరి సాయంతో రూపొందించారు?
1) యునెస్కో 2) యునిసెఫ్
3) టెక్ మహీంద్ర 4) ఇన్ఫోసిస్
27. బంగారు తల్లి కార్యక్రమం అనేది?
ఎ. చట్టబద్ధ సంక్షేమ కార్యక్రమం
బి. రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం
సి. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం
డి. యునిసెఫ్ సహకరిస్తుంది
1) ఎ, డి 2) ఎ, బి 3) ఎ, బి, డి 4) బి, డి
28.ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ICPS)ను ఏ చట్టాన్ని సమర్థంగా అమలు చేయడానికి రూపొందించారు?
1) బాలకార్మిక నిషేధ చట్టం
2) మనుషుల అక్రమ రవాణా నిషేధ చట్టం
3) వెట్టిచాకిరి నిర్మూలన చట్టం
4) బాల న్యాయ చట్టం
29.కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో వెట్టిచాకిరిని నిషేధించింది?
1) 1976 2) 1986 3) 1975 4) 1996
30. కింది వాటిని జతపర్చండి.
1. 1098 ఎ. ఫార్మర్స్ హెల్ప్‌లైన్ ఫర్ కంట్రోలింగ సూసైడ్స్
2. 100 బి. ఉమెన్ హెల్ప్‌లైన్
3. 181 సి. షీ టీమ్
4. 104 డి. చైల్డ్ హెల్ప్‌లైన్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
31.1996లో ప్రారంభమైన చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలను ఏ NGO సహకారంతో నిర్వహిస్తున్నారు?
1) యునిసెఫ్ 2) చైల్డ్‌లైన్ ఇండియా
3) బాల వికాస 4) ప్రధాన్
32. టూవార్డ్స్ ఎ న్యూ డాన్ అనేది ఏ పథకం నినాదం?
1) పూర్ణశక్తి పథకం 2) సబల
3) సాక్ష్యం 4) బేటీ బచావో, బేటీ పడావో
33.చైల్డ్ సెక్స్ రేషియో తక్కువగా ఉన్న జిల్లాల్లో అమలు చేస్తున్న పథకం ఏది?
1) ICDS 2) బంగారు తల్లి
3) బేటీ బచావో, బేటీ పడావో 4) పూర్ణశక్తి
34.బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం ఏ చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ఉద్దేశించినది?
ఎ. POCSO చట్టం బి. PCPNDT చట్టం
సి. బాండెడ్ లేబర్ (ప్రొహిబిషన్) చట్టం
డి. SITA చట్టం
1) ఎ, బి 2) ఎ, బి, సి, డి 3) ఎ, బి, డి 4) బి
35. కల్యాణ లక్ష్మి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 2014, అక్టోబర్ 2 2) 2015, అక్టోబర్ 2
3) 2014, జనవరి 2 4) 2015, జనవరి 2
36. రాజీవ్‌గాంధీ నేషనల్ క్రెచ్ సెంటర్ ఫర్ వర్కింగ్ మదర్స్ పథకాన్ని ఎవరు అమలు చేస్తున్నారు?
1) CSWB 2) RMK
3) NIPCCD 4) CARA
37. నేషనల్ మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్‌ను ఏ సంవత్సరంలో NRHMలో విలీనం చేశారు?
1) 2006 2) 2005 3) 2013 4) 2014
38. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1992 2) 1993 3) 1994 4) 1995
39.బాలబంధు పథకాన్ని ఎవరు అమలు చేస్తున్నారు?
1) NHRC 2) NCPCR 3) ICDS 4) ICPS
40.భారతీయ మహిళా బ్యాంకు చైర్పర్సన్ ఎవరు?
1) ఉషారాణి 2) ఉషా మెహతా
3) ఉషా పాటిల్ 4) ఉషా అనంత సుబ్రమణియం
41. నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ గర్ల్ చైల్డ్ ను ఏ సంవత్సరం రూపొందించారు?
1) 1990 2) 1989 3) 1991 4) 1992
42. నేషనల్ చిల్డ్రన్ ఫండ్‌ను ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు?
1) 1995 2) 1996 3) 1997 4) 1998
43. నేషనల్ చార్టర్ ఆఫ్ చిల్డ్రన్‌ను ఏ సంవత్సరం రూపొందించారు?
1) 2000 2) 2001 3) 2002 4) 2003
44. తెలంగాణలో మహిళా భద్రత కోసం ఎవరి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు?
1) రేచల్ చటర్జి 2) వాణిప్రాసద్
3) పూనం మాలకొండయ్య
4) శైలజారమా అయ్యర్
45. కింది వాటిని జతపర్చండి.
1. SITA ఎ. 1994
2. ITPA బి. 2012
3. POCSO సి. 1986
4. PCPNDT డి. 1956
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
46. మహిళా సంక్షేమ మంత్రిత్వ శాఖలో భాగంగా పనిచేస్తున్న స్వతంత్ర సంస్థలను, వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాల ఆధారంగా సరైన కాలక్రమంలో అమర్చిన ఐచ్చికం ఈ కింది వాటిలో ఏది?
1) CSWB, FNB, NIPCCD, CARA, RMK
2) CSWB, NIPCCD, FNB, RMK, CARA
3) FNB, RMK, CSWB, NIPCCD, CARA
4) NIPCCD, CARA, CSWB, RMK, FNB
48. వ్యాఖ్య: పితృస్వామ్య భావజాలంగల సమాజంలో మహిళలకు సమానత్వం ఉండే అవకాశం ఉండదు.
వివరణ: పితృస్వామ్య భారతీయ సమాజంలో ఎన్ని చట్టాలు రూపొందించినా సమాజ దృక్పథంలో మార్పు రానంతవరకు, సమాజంలో మహిళలకు పురుషుడితో సమాన స్థాయిని కల్పించలేము.
1) వ్యాఖ్య సరైనదే, వివరణ సరైనది కాదు
2) వ్యాఖ్య, వివరణ రెండూ సరైనవే, కానీ రెండింట సంబంధం లేదు
3) వ్యాఖ్య సరైనదే, వ్యాఖ్యకు వివరణ కూడా సరైనదే
4) వ్యాఖ్య, వివరణ రెండూ సరైనవి కావు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు