General Studies | ధనవంతులు 169.. సంపద 675 బిలియన్ డాలర్లు
ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితా-2023
- ఫోర్బ్స్ 37వ వార్షిక ధనవంతుల జాబితా 2023, ఏప్రిల్ 4న విడుదల చేసింది.
- ఈ జాబితా ప్రకారం ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య-2640
- ప్రపంచ బిలియనీర్ల మొత్తం సంపద 12.2 ట్రిలియన్ డాలర్లు.
- 2022లో ఫోర్బ్స్ విడుదల చేసిన ధనవంతుల జాబితాతో పోల్చుకుంటే 2023 జాబితాలో బిలియనీర్ల సంఖ్య, వారి సంపద తగ్గింది.
- 2022 జాబితా ప్రకారం బిలియనీర్ల సంఖ్య 2668 కాగా, వారి మొత్తం సంపద 12.7 ట్రిలియన్ డాలర్లు. అంటే 2023 జాబితా ప్రకారం 500 బిలియన్ డాలర్ల సంపద తగ్గింది.
- ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో గత నివేదికతో పోలిస్తే 254 మంది బిలియనీర్ల హోదా కోల్పోయారు.
- ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో 150 మంది కొత్తగా బిలియనీర్ హోదా పొందారు.
టాప్-5
1. బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఫ్యామిలీ (ఫ్రాన్స్)- మొత్తం సంపద: 211 బిలియన్ డాలర్స్
2. ఎలాన్ మస్క్ (అమెరికా)- మొత్తం సంపద: 180 బిలియన్ డాలర్స్
3. జెఫ్ బెజోస్ (అమెరికా)- మొత్తం సంపద: 114 బిలియన్ డాలర్స్
4. ల్యారీ ఎల్లిసన్ (అమెరికా)- మొత్తం సంపద: 107 బిలియన్ డాలర్స్
5. వారెన్ బఫెట్ (అమెరికా)- మొత్తం సంపద: 106 బిలియన్ డాలర్స్ - ఈ నివేదికలో భారత్‌కు చెందిన ముఖేశ్ అంబానీ 83.4 బిలియన్ డాలర్ల సంపదతో తొమ్మిదో స్థానం పొందారు.
- గౌతమ్ అదానీ 47.2 బిలియన్ డాలర్ల సంపదతో 24వ స్థానం పొందారు.
- 2022 నివేదికలో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ ఈ నివేదికలో రెండో స్థానానికి పడిపోయారు.
- ఎలాన్ మస్క్ 2022 ఏప్రిల్‌లో 44 బిలియన్ డాలర్లతో ‘ట్విట్టర్’ను కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో అతని కార్ల కంపెనీ టెస్లా షేర్లు సుమారు 50% విలువను కోల్పోయాయి. దీంతో ఎలాన్ మస్క్ గత సంవత్సరంతో పోలిస్తే 39 బిలియన్ డాలర్ల సంపద తక్కువ కలిగి ఉన్నాడు.
- ఈ జాబితాలో అగ్రస్థానం పొందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ గత నివేదికతో పోలిస్తే, ఇప్పుడు 53 బిలియన్ డాలర్లు ఎక్కువ కలిగి ఉన్నాడు. (గత నివేదికలో మూడో స్థానం)
- 1987లో ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితా విడుదల ప్రారంభించిన తర్వాత ఒక ఫ్రాన్స్ దేశ వ్యక్తి అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి.
- బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఫ్రాన్స్‌లోని విలాస వస్తువుల దిగ్గజ సంస్థ LVMH ను 1987లో స్థాపించారు.
- అమెజాన్ సంస్థ షేర్ల విలువ గత సంవత్సరం 38% తగ్గడంతో జెఫ్ బెజోస్ సంపద 57 బిలియన్ డాలర్లు తగ్గి, గత ఏడాది ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో మూడో స్థానానికి పడిపోయాడు.
అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశాలు
1. అమెరికా (735 మంది)
2. చైనా (495 మంది)
3. భారతదేశం (169 మంది)
4. జర్మనీ (126 మంది)
5. రష్యా (105 మంది)
- ఈ నివేదిక ప్రకారం ప్రపంచ బిలియనీర్ల సరాసరి వయస్సు-65
- అతిపెద్ద వయస్సు కలిగిన బిలియనీర్- జార్జ్ జోసెఫ్ (101 సంవత్సరాలు)
- ఈ జాబితాలో 30 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు కలిగిన వారు 15 మంది ఉన్నారు.
- 2023 ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో అధికులు పురుషులు అయితే ఈ జాబితాలో 337 మంది మహిళలు బిలియనీర్లుగా ర్యాంకులు పొందారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 13శాతం ఎక్కువ. అంటే గత సంవత్సరం 327 మంది మహిళలు చోటు దక్కించుకున్నారు.
మహిళా ధనవంతుల్లో అగ్రస్థానం
- ఫ్రాంకోయిస్ చెటెన్కోర్ట్ మేయర్స్ (ఫ్రాన్స్) మొత్తం సంపద 20.5 బిలియన్ డాలర్స్. ఈమె ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్నారు.
- ప్రపంచంలో బిలియనీర్ల జాబితాలో 69% మంది సెల్ఫ్ మేడ్ అంటే వారు తమ కంపెనీలు వారే స్థాపించడం లేదా కంపెనీల సహ-వ్యవస్థాపకులుగా ఉన్నవారు అని అర్థం.
- గత సంవత్సరంలో 33 మంది బిలియనీర్లు మరణించారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న 25 మంది బిలియనీర్ల మొత్తం సంపద 2.1 ట్రిలియన్ డాలర్లు. అయితే ఇది 2022 నివేదికతో పోలిస్తే 200 బిలియన్ డాలర్లు తక్కువ. ఇది 2022లో 2.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
- ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం బిలియనీర్ అంటే ఒక వ్యక్తి నికర సంపద ఒక బిలియన్ డాలర్ అంతకంటే ఎక్కువ ఉండాలి.
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా-2023లో భారతీయులు - ఈ జాబితాలో మొత్తం 169 మంది భారతీయులు చోటు దక్కించుకోగా, వారి మొత్తం సంపద 675 బిలియన్ డాలర్లుగా ఉంది.
- గత జాబితాతో పోలిస్తే భారత బిలియనీర్ల సంఖ్య పెరిగి, సంపద తగ్గింది. 2022 జాబితాలో 166 మంది బిలియనీర్లు చోటు దక్కించుకోగా వారి సంపద 750 బిలియన్ డాలర్లు. అంటే ఈ జాబితా ప్రకారం 10% సంపద తగ్గింది.
- 2023 జనవరిలో అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ అదాని గ్రూప్ స్టాక్ మార్కెట్లో మోసాలు చేస్తుందని నివేదిక ఇవ్వడంతో ఆ సంస్థ అధిపతి గౌతమ్ అదాని సంపద 90 బిలియన్ డాలర్ల నుంచి ఈ నివేదిక వచ్చిన నాటికి 47.2 బిలియన్ డాలర్లకి పడిపోయింది.
- గౌతమ్ అదాని 2022 సెప్టెంబర్‌లో ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో, 2023 జనవరి నాటికి ప్రపంచ ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. అయితే ఈ జాబితాలో భారతదేశంలో రెండో స్థానంలో ప్రపంచ ధనవంతుల జాబితాలో 24వ స్థానంలో ఉన్నారు.
- భారతదేశ టాప్-10 ధనవంతుల సంపద ల్లో దిలీప్ సింఘ్వి సంపద తప్ప అందరి సంపద తగ్గింది.
- రిలయన్స్ అధిపతి ముఖేశ్ అంబాని సంపదలో గత సంవత్సరంతో పోలిస్తే 8% తగ్గుదల ఉన్నా కూడా అతనే 83.4 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో తొమ్మిదో స్థానం, భారతదేశ, ఆసియా ఖండంలో ధనవంతుడిగా నిలిచాడు.
- 2022 మార్చి నెలలో 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిలిచింది. ఈ జాబితాలో 13 మంది భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు.
- ఈ జాబితాలో టాప్-10 భారతీయ ధనవంతుల్లో సావిత్రి జిందాల్ అనే ఒకే ఒక మహిళ చోటు దక్కించుకున్నారు. ఈమె 17.5 బిలియన్ డాలర్ల సంపదతో ఆరో స్థానంలో ఉన్నారు.
- 2023 జాబితా ప్రకారం ముగ్గురు మహిళలు సహా 16 మంది కొత్తగా బిలియనీర్ల జాబితాలో భారతదేశం నుంచి చోటు దక్కించుకున్నారు.
- తొలిసారి జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో అతిచిన్న వయస్కుడైన నిఖిల్ కామత్ (36), అతని సోదరుడు నితిన్ కామత్‌లు వరుసగా 1.1 బిలియన్ డాలర్స్, 2.7 బిలియన్ డాలర్స్ సంపదతో ఉన్నారు.
- నిఖిల్ కామత్, నితిన్ కామత్‌లు బెంగళూరుకు చెందినవారు కాగా, వీరు జెరోదా అనే బ్రోకరేజీ సంస్థను స్థాపించారు.
- భారత్‌లో అతిపెద్ద వయస్కుడైన బిలియనీర్- కేశబ్ మహీంద్రా (99 ఏళ్లు)
- భారత్‌లో టాప్-5 ధనవంతులు
1. ముఖేశ్ అంబాని- 83.4 బిలియన్ డాలర్స్ (ముంబై)
2. గౌతమ్ అదాని- 47.2 బిలియన్ డాలర్స్ (అహ్మదాబాద్)
3. శివ్ నాడార్ – 25.6 బిలియన్ డాలర్స్ (న్యూఢిల్లీ)
4. సైరస్ పూనావాలా- 22.6 బిలియన్ డాలర్స్ (పుణె)
5. లక్ష్మీ మిట్టల్ – 17.7 బిలియన్ డాలర్స్ - తెలుగు రాష్ర్టాల నుంచి 10 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అందులో మురళిదేవి కుటుంబం 4.9 బిలియన్ డాలర్లతో 552వ ర్యాంకులో ఉంది. ప్రతాప్‌రెడ్డి 2.2 బిలియన్ డాలర్లతో 1368వ ర్యాంకు పొందారు.
- ఫోర్బ్స్ అనేది 1917, సెప్టెంబర్ 15న బీసీ ఫోర్బ్స్ చేత ఏర్పాటు చేయబడిన అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్.
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
Previous article
Current Affairs | 2023 ఐఎస్ఎల్ ట్రోఫీ విజేత ఎవరు?
Next article
April 26 Current Affairs | కరెంట్ అఫైర్స్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు