దేశంలో శక్తి వనరులు
పునరుత్పాదక ఇంధన వనరులు
-ఇవి ప్రకృతిలో తిరిగి ఏర్పడే ఇంధనాలు
-వీటి వల్ల తక్కువ కాలుష్యం కలుగుతుంది.
ఉదాహరణ: సౌరశక్తి, పవన శక్తి, జలశక్తి, బయోమాస్.
సౌరశక్తి
-సూర్యకాంతి ఆధారంగా తయారయ్యే విద్యుత్‌నే సౌరశక్తి అంటారు.
-భారత భూభాగంపై ప్రతి ఏడాది 5000 ట్రిలియన్ కిలోవాట్ సామర్థ్యం గల సూర్యకాంతి పడుతుంది. ఇది 300 రోజులు అందుబాటులో ఉంటుంది.
-సూర్యుని నుంచి కొంత శక్తి భూమిని చేరడాన్ని సౌరపుటం (Insolation) అంటారు.
-ప్రపంచంలో సౌర ఉత్పత్తిలో ముందు వరుసలో ఉన్న దేశాలు జర్మనీ (మొదటి స్థానం), చైనా (రెండోస్థానం), ఇటలీ (మూడోస్థానం) ఉన్నాయి. దేశంలో 2016 మే 31 నాటికి అత్యధిక సౌరశక్తిని ఉత్పత్తిని చేస్తున్న రాష్ర్టాలు రాజస్థాన్ (మొదటి స్థానం), తమిళనాడు (రెండో స్థానం), గుజరాత్ (మూడో స్థానం) ఉన్నాయి
-దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న అతిపెద్ద సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం- చరంకా సోలార్ పార్క్ (గుజరాత్). దీని సామర్థ్యం-221 మెగావాట్లు.
-దేశంలో మొదటి సోలార్ రాష్ట్రం- హిమాచల్‌ప్రదేశ్
-దేశంలో మొదటి సోలార్ సిటీ- సిమ్లా
-దేశంలో మొదటి సోలార్ గ్రామం- బైసనివారిపల్లె (చిత్తూరు జిల్లా)
సౌరశక్తి ఉత్పత్తి రకాలు
-సౌరశక్తి ప్రధానంగా 2 రకాలుగా ఉత్పత్తి అవుతుంది.
సోలార్ ఫొటో వోల్టాయిక్స్
-సిలికాన్ మూలకంతో నిర్మిచిన సోలార్ ప్యానెళ్లపై కాంతి పడటం వల్ల ఎలక్ట్రానిక్స్ ఉద్భవించి చివరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
ఉదాహరణ: సోలార్ లాంతర్లు, క్యాలిక్యులేటర్లు, వీధి దీపాలు, సిగ్నల్ వ్యవస్థ.
సోలార్ థర్మల్ పవర్
-కాంతిపుంజాన్ని ఒకే ప్రదేశం వద్ద కేంద్రీకరించి శక్తిని ఉత్పత్తి చేయడం.
ఉదాహరణ: సోలార్ బాయిలర్స్, వాటర్ హీటర్స్, గీజర్స్.
-ప్రపంచంలో అతిపెద్ద సోలార్ బాయిలర్- షిర్డీ (2009). దీని ద్వారా రోజుకు 51,000 మందికి వంట చేస్తున్నారు
వాయుశక్తి
-వీచేగాలిననుసరించి టర్బైన్ తిరగడం వల్ల ఉత్పత్తి అయ్యే శక్తి.
-ఈ శక్తి ఉత్పత్తికి గాలివేగం గంటకు 18 కి.మీ ఉండాలి.
-దేశంలో పవన శక్తి ఉత్పత్తి 1986లో ప్రారంభమైంది.
-మొదటగా విండ్ఫామ్స్ ఏర్పాటైన ప్రదేశాలు: రత్నగిరి (మహారాష్ట్ర), ఓఖా (గుజరాత్), ట్యుటికోరన్ (తమిళనాడు).
-ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా వాయుశక్తిని ఉత్పత్తి చేస్తున్న దేశాలు వరుసగా చైనా (మొదటి స్థానం), అమెరికా (రెండో స్థానం), జర్మనీ (మూడో స్థానం), ఇండియా (ఐదోస్థానం) ఉన్నాయి. తమిళనాడు (మొదటి స్థానం), గుజరాత్ (రెండో స్థానం), మహారాష్ట్ర (మూడో స్థానం) ఉన్నాయి.
-దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వాయుశక్తిలో తమిళనాడు వాటా- 35 శాతం.
-దేశంలో అతిపెద్ద పవన శక్తి ఉత్పత్తి కేంద్రం- ముప్పండాల్ (తమిళనాడు- 1500 మె.వా). దీని తర్వాత జైసల్మీర్ విండ్ పార్క్ (రాజస్థాన్-1064 మె.వా).
జలవిద్యుత్
-స్థితిశక్తి రూపంలో ఉన్న నీరు గతిశక్తి రూపంలోకి మారినప్పుడు టర్బైన్ తిరగడం వల్ల ఎలక్ట్రాన్ల ఉత్పత్తి జరిగి చివరికి జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
-దేశంలో జలవిద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన నోడల్ ఏజెన్సీ- నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్.
శక్తి వనరుల రకాలు
-వీటిని ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించారు. అవి సంప్రదాయ ఇంధన వనరులు, సంప్రదాయేతర ఇంధన వనరులు.
-సంప్రదాయ ఇంధన వనరులు (Conventional Energy Sources).
-వీటినే పునరుత్పాదకంకాని లేదా తరిగిపోయే ఇంధన వనరులు (Non Renewable Energy Resources) అంటారు. అంటే ఒకసారి వాడితే మళ్లీ ఉత్పత్తి కావు. ప్రపంచంలో ప్రస్తుతం అధిక కాలుష్యానికి కారణం ఈ ఇంధన వనరులే. వీటిని సులభంగా నిల్వ చేయవచ్చు. రవాణా చేయవచ్చు. ఉదా: బొగ్గు, పెట్రోల్, సహజవాయువు. వీటినే శిలాజ ఇంధనాలు (Fossil Fuels) అంటారు. ఇవి అవాయు పరిస్థితుల వల్ల ఏర్పడ్డాయి
బొగ్గు (Coal)
-దీనికి గల ఇతర పేర్లు నల్ల బంగారం (Black Gold), విద్యుత్ శక్తి గిడ్డంగి ( Electricity Resorvoir)
-ఇది తక్కువ కెలోరిఫిక్ విలువను, అధిక బూడిదను కలిగి ఉంటుంది. కావున మండించినపుడు అధిక కాలుష్యం ఏర్పడుతుంది.
-భారత బొగ్గులో కర్బన శాతం తక్కువగా ఉంటుంది. అంటే భారత బొగ్గు తక్కువ నాణ్యతను కలిగి ఉన్నది.
-బొగ్గు నాణ్యత అనేది దానిలోని కర్బన పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
-దేశంలో ప్రధానమైన బొగ్గు గనులు: ఝరియా (జార్ఖండ్), రాణిగంజ్ (పశ్చిమ బెంగల్).
పెట్రోల్ (Petrol)
-లాటిన్ భాషలో పెట్రోలియం అంటే Rock Oil.
-ఇది అవక్షేప శిలలతో (Sedimentary Rocks) సహజంగా లభించిన పసుపు నుంచి నలుపు రంగులో ఉండే ద్రవం.
-ఇది హైడ్రోకార్బన్ల సమ్మేళనం.
-పెట్రోలియం అనే పదం రెండింటికి వర్తిస్తుంది. అవి.. క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తులు.
-దేశంలో పెట్రోల్ నిల్వలు గల ప్రదేశాలు: బాంబే హై (ముంబై), దిగ్భాయ్ (అసోం).
సహజవాయువు (Natural Gas)
-ఇది కూడా పెట్రోల్ మాదిరిగా భూపొరల నుంచి లభించే వాయువు
-ఇది కూడా హైడ్రోకార్బన్ల సమ్మేళనమే
-దీనిలో అధికంగా మీథేన్, దాని తర్వాత ఆల్కేన్స్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్లు ఉంటాయి.
కోల్ బెడ్ మీథేన్ (CBM)
-దీనినే కోల్ బెడ్ గ్యాస్, కోల్ సీమ్ గ్యాస్, కోల్ మైన్ మీథేన్ అంటారు.
-ఇది కోల్బెడ్ నుంచి సంగ్రహించే ఒక రకమైన సహజవాయువు.
-ఇది ప్రస్తుతం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ప్రధాన ఇంధన వనరుగా మారింది.
-దీనిలో భారయుత హైడ్రోకార్బన్స్ అయిన ప్రొఫెన్, బ్యూటెన్లు తక్కువగా ఉంటాయి.
-బొగ్గులోని ఘన మాత్రిక మీథేన్‌ను అధిశోషణం చేసుకోవడం వల్ల హైడ్రోజన్ సల్ఫైడ్ కోల్పోతుంది. ఫలితంగా ఏర్పడే వాయువును స్వీట్ గ్యాస్ అంటారు.
-ఈ వాయువు ఉత్పత్తి కోసం, నిర్వహణ కోసం దేశంలో మొదటగా ఏర్పాటైన సంస్థ-గ్రేట్ ఈస్టర్న్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (GEECL-Asansol, West Bengal).
షెల్ గ్యాస్
-ఇది షెల్ అనే అవక్షేప శిలల్లో దొరికే ఒక రకమైన సహజవాయువు.
-ఇది ఎక్కువగా అమెరికాలో వినియోగంలో ఉంది.
-దీని నిల్వలు అత్యధికంగా గల దేశం – చైనా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు