చిప్కో ఉద్యమం
చిప్కో ఉద్యమం గాంధీ అహింస పద్ధతులైన సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతో జరిగింది.
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా 1964లో ఏర్పాటైన దశోలి గ్రామ స్వరాజ్య మండల్ ఈ ఉద్యమానికి పునాది వేసింది.
చిప్కో అంటే హత్తుకోవడం అని అర్థం.
చిప్కో ఉద్యమకారులు చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ, వాటిని హత్తుకొని ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
సుందర్లాల్ బహుగుణ, గౌరీదేవి, చండీ ప్రసాద్ భట్ మొదలైనవారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.
1927లో అడవుల చట్టంలోని అనేక ఆంక్షలు గిరిజనుల జీవన విధానానికి హానికరంగా ఉండటం వల్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
1930లో ఉత్తరప్రదేశ్లోని తిలారి ప్రాంతంలో చేపట్టిన భారీ ఊరేగింపు ద్వారా వ్యతిరేకత తెలియజేసిన 17 మంది సామాన్య ప్రజలను రాజుగారి సైనికులు చంపేశారు. అయినా ఈ ఉద్యమం క్రమక్రమంగా బలపడి 1970 నాటికి చిప్కో ఉద్యమంగా మారింది.
1961లో సరళాబెహన్ ఉత్తరాఖండ్ సర్వోదయ మండలిని ఏర్పాటు చేశారు.
1966 మే 30న చాలామంది గిరిజనులు ఈ ఉద్యమంలో చేరారు. వృక్షాలను నరికి అటవీ సంపదను దోచుకునే ధనిక గుత్తేదారులు, పారిశ్రామిక వేత్తలను గిరిజనులు అడ్డుకున్నారు.
1972 డిసెంబర్ 12, 15 తేదీల్లో విచక్షణారహితంగా వృక్షాలను నరికి సంపదను దోచుకునే వారికి వ్యతిరేకంగా ఉత్తర కాశి, గోపేశ్వర్ ప్రాంతాల్లో చారిత్రాత్మక ప్రదర్శనలు చేశారు.
1973 ఏప్రిల్లో గిరిజన మహిళలు చీకటి వెలుగుల్లో చెట్లను ఆలింగనం చేసుకుని నరకడాన్ని ప్రతిఘటించారు.
1974 మార్చి 27 నుంచి గౌరీదేవి నాయకత్వంలో గిరిజన మహిళలు చెట్లు నరకకుండా రాత్రింబవళ్లు కాపలా కాశారు.
ఉత్తరప్రదేశ్లో కొనసాగిన ఈ ఉద్యమం 1980 నాటికి విజయం సాధించింది. అప్పటి ప్రధానమంత్రి హిమాలయ అడవుల్లో చెట్లను నరకాడాన్ని నిషేధించారు.
ఈ ఉద్యమం 1970, 1980 దశకాల్లో భారతదేశమంతటా వ్యాపించింది. ఈ ఉద్యమం మొట్టమొదటిసారిగా ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని కలిగించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు