ఆదర్శ వాయువు పాటించాల్సిన నియమం?
ఉష్ణం- ఉష్ణోగ్రత
1. ఉష్ణం అనేది ఒక ?
ఎ) బలం బి) శక్తి
సి) సామర్థ్యం డి) సాపేక్షభావన
2. ఉష్ణోగ్రత అనేది?
ఎ) బలం బి) శక్తి
సి) సామర్థ్యం డి) సాపేక్షభావన
3. రసాయన శక్తిని ఉష్ణశక్తిగా మార్చేది?
ఎ) ఎలక్ట్రిక్ హీటర్ బి) గ్యాస్ స్టవ్
సి) ఇండక్షన్ హీటర్ డి) మైక్రోవేవ్ ఓవెన్
4. ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా ఎందులో మారుతుంది?
ఎ) థర్మల్ పవర్ స్టేషన్ బి) బాయిలర్
సి) టర్బైన్ డి) జనరేటర్
5. ఉష్ణశక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది?
ఎ) బాయిలర్ బి) ఆవిరి యంత్రం
సి) ప్రెషర్ కుక్కర్ డి) మైక్రోవేవ్ ఓవెన్
6. థర్మామీటరును ఉపయోగించి వేటిని కొలుస్తారు?
ఎ) ఉష్ణోగ్రత బి) ఉష్ణశక్తి
సి) విశిష్టోష్ణం డి) బి, సి
7. థర్మామీటరు పనిచేసే సూత్రం- వేడిచేస్తే పదార్థం?
ఎ) సంకోచిస్తుంది బి) వ్యాకోచిస్తుంది
సి) ఆవిరవుతుంది డి) గట్టిపడుతుంది
8. థర్మామీటర్లో పాదరసాన్ని ఉపయోగించడానికి కారణం?
ఎ) వ్యాకోచం ఏకరీతిగా ఉంటుంది,
మంచి కారణం
బి) మెరిసే స్వభావం ఉంటుంది. గాజుకు
అంటుకోదు
సి) పాదరస మట్టాన్ని సులభంగా గుర్తించవచ్చు
డి) పైవన్నీ
9. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉపయోగించే థర్మామీటర్లు ఏ రకానికి చెందినవి?
ఎ) పాదరసం బి) ఆల్కహాల్
సి) డిజిటల్ డి) ఎ, సి
10. నీరు మరిగే ఉష్ణోగ్రత?
ఎ) 1000C బి) 373 K
సి) 2120F డి) అన్నీ సరైనవే
11. ఏ ఉష్ణోగ్రతా మానాన్ని పరమ ఉష్ణోగ్రతామానం అంటారు?
ఎ) సెల్సియస్ బి) ఫారన్‌హీట్
సి) కెల్విన్ డి) రాయమర్
12. సెల్సియస్మానంలో 10C ఉష్ణోగ్రత పెరిగితే కెల్విన్ మానంలో ఉష్ణోగ్రతలో పెరుగుదల?
ఎ) 1K బి) 2K సి) 0.5K డి) 0.8K
13. సెల్సియస్మానంలో అథో, ఊర్థ స్థిర బిందువుల మధ్య ఎన్ని భాగాలు ఉంటాయి?
ఎ) 32 బి) 64 సి) 90 డి) 100
14. ఫారన్హీట్మానంలో అథో, ఊర్థ స్థిర బిందువుల మధ్య ఎన్ని భాగాలు ఉంటాయి?
ఎ) 90 బి) 180 సి) 270 డి) 360
15. పరమ శూన్య ఉష్ణోగ్రత అంటే..?
ఎ) ‘0’ కెల్విన్
బి) -273.150 సెల్సియస్
సి) -469.690 ఫారన్‌హీట్
డి) అన్నీ సరైనవే
16. కొలతలకు ఉపయోగించే స్కేల్‌ను తయారుచేయడానికి ఉపయుక్తమైన పదార్థం?
ఎ) అల్యూమినియం బి) ఇన్వార్ స్టీల్
సి) ఇత్తడి డి) ఉక్కు
17. అసంగత వ్యాకోచాన్ని ప్రదర్శించే పదార్థం?
ఎ) కొబ్బరినూనె బి) ఆల్కహాల్
సి) నీరు డి) ఈథర్
18. లోలక గడియారం విషయంలో సరైన ప్రవచనం?
ఎ) వేసవికాలం కంటే చలికాలంలో కాస్త వేగంగా నడుస్తుంది
బి) వేసవికాలం కంటే చలికాలంలో కాస్త నెమ్మదిగా నడుస్తుంది
సి) వేసవికాలం కంటే వర్షాకాలంలో కాస్త నెమ్మదిగా నడుస్తుంది
డి) అన్ని కాలాల్లో కచ్చితమైన సమయాన్ని సూచిస్తుంది
19. నీటికి గరిష్ఠ సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది?
ఎ) 00C బి) 10C
సి) 20C డి) 40C
20. నెమ్మదిగా జరిగే ఉష్ణప్రసార ప్రక్రియ?
ఎ) వహనం బి) సంవహనం
సి) వికిరణం
డి) అన్ని ప్రక్రియల్లో ఉష్ణం ఒకే వేగంతో ప్రసారం అవుతుంది
21. వేగంగా జరిగే ఉష్ణప్రసార ప్రక్రియ?
ఎ) వహనం బి) సంవహనం
సి) వికిరణం
డి) అన్ని ప్రక్రియల్లో ఉష్ణం ఒకే వేగంతో ప్రసారం అవుతుంది
22. సూర్యుని నుంచి భూమికి ఉష్ణప్రసారం ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది?
ఎ) వహనం బి) సంవహనం
సి) వికిరణం డి) పైవన్నీ
23. ఘనపదార్థాల్లో సాధ్యమయ్యే ఉష్ణప్రసారం?
ఎ) వహనం బి) సంవహనం
సి) వికిరణం డి) ఎ, బి
24. ద్రవాల్లో సాధారణంగా జరిగే ఉష్ణప్రసార ప్రక్రియ?
ఎ) వహనం బి) సంవహనం
సి) వికిరణం డి) ఎ, బి
25. వంట పాత్రలకు అడుగు భాగంలో రాగి పూత పూయడానికి కారణం?
ఎ) రాగి ఉత్తమ ఉష్ణవాహకం
బి) పాత్రలు అందంగా ఉండటానికి
సి) పాత్రలను శుభ్రం చేయడం తేలిక అవుతుంది
డి) పాత్రలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండటానికి
26. సిమెంటు రోడ్లను వేసేటప్పుడు మధ్యలో ఖాళీలను వదులుతారు ఎందుకు?
ఎ) వేయడం సౌకర్యవంతంగా ఉంటుందని
బి) అందంగా ఉండటానికి
సి) ఎండాకాలం వ్యాకోచం వల్ల పగుళ్లు రాకుండా ఉండటానికి
డి) పైవన్నీ
27. నీరు, మంచుగా మారేటప్పుడు ఏ విధంగా జరుగుతుంది?
ఎ) మొదట అడుగుభాగం మంచుగా మారుతుంది
బి) మొదట పైభాగం మంచుగా మారుతుంది
సి) మొత్తం ఒకేసారి మంచుగా మారుతుంది
డి) మొదట మధ్యభాగం మంచుగా మారుతుంది
28. మంచు నీటిపై తేలుతుంది. ఎందుకంటే?
ఎ) మంచు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువ
బి) మంచు బరువు నీటి బరువు కంటే తక్కువ
సి) మంచు ద్రవ్యరాశి నీటి ద్రవ్యరాశి కంటే తక్కువ
డి) మంచు సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ
29. ఒక బీకరులో ఉన్న నీటిలో మంచు ముక్క తేలుతూ ఉంది. ఈ మంచు ముక్క పూర్తిగా కరిగితే బీకరులోని నీటి మట్టం?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది
డి) మారదు
30. మంచుపై పీడనం పెరిగితే దాని ద్రవీభవన ఉష్ణోగ్రత విలువ
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మారదు
డి) పీడన విలువపై ఆధారపడి ఉంటుంది
31. హిమీకరణ మిశ్రమం (మంచు+సాధారణ ఉప్పు) కరిగే ఉష్ణోగ్రత విలువ?
ఎ) 00 C బి) -90 C
సి) -180 C డి) -270 C
32. జతపాతం వద్ద నీరు పై నుంచి కిందికి పడినప్పుడు ఉష్ణోగ్రత?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మారదు
డి) మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది
33. పదార్థాల కెలోరిఫిక్ విలువలు తెలుసుకోవడానికి దేన్ని ఉపయోగిస్తారు?
ఎ) కెలోరీమీటర్
బి) బాంబ్‌కెలోరీ మీటర్
సి) పైరోమీటర్ డి) బోలోమీటర్
34. ప్రెషర్ కుక్కర్లో నీరు మరిగే ఉష్ణోగ్రత దాదాపు?
ఎ) 1000 C బి) 800 C
సి) 1200 C డి) 1100 C
35. ఒక కెలోరి ఎన్ని జౌళ్లకు సమానం?
ఎ) 4.18 బి) 8.41
సి) 1.84 డి) 1.48
36. దైర్ఘ్య, విస్తీర్ణ, ఘనపరిమాణ వ్యాకోచ గుణకాల నిష్పత్తి?
ఎ) 1:1:1 బి) 1:2:3
సి) 1:4:9 డి) 1:8:27
37. కిందివాటిలో సరైనది గుర్తించండి.
ఎ) చల్లని నీరు ఫ్రిజ్‌లో త్వరగా మంచులా మారుతుంది
బి) గోరువెచ్చని నీరు ఫ్రిజ్‌లో త్వరగా మంచుగా మారుతుంది
సి) పైరెండూ ఒకే సమయంలో మంచుగా మారుతాయి
డి) మరిగే నీరు ఫ్రిజ్‌లో త్వరగా మంచుగా మారుతుంది
38. బాగా ఎండగా ఉన్నప్పుడు ఏ రోడ్డు ఎక్కువగా వేడిగా ఉంటుంది?
ఎ) సిమెంటు రోడ్డు బి) మట్టిరోడ్డు
సి) తారు రోడ్డు
డి) అన్నిరోడ్లు ఒకే విధంగా ఉంటాయి
39. గదిలోని ఫ్రిజ్ తలుపును తెరిచి ఉంచితే?
ఎ) గది చల్లబడుతుంది
బి) గది వేడెక్కుతుంది
సి) గది ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు
డి) గది మొదట వేడెక్కి తరువాత
చల్ల బడుతుంది
40. మట్టితో చేసిన కప్, స్టీల్ కప్‌లు ఒకే ఆకారం, పరిమాణంలో ఉన్నాయి. ఈ రెండింటినీ
ఒకేసారి ఒకే ఉష్ణోగ్రతలో ఉన్న వేడినీటితో నింపితే?
ఎ) స్టీల్ కప్‌లో నీరు త్వరగా చల్లబడుతుంది
బి) మట్టి కప్‌లో నీరు త్వరగా చల్లబడుతుంది
సి) రెండూ ఒకేసారి చల్లబడతాయి
డి) నీటి ఉష్ణోగ్రతను బట్టి పరిస్థితులుంటాయి
41. ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలో తాపత్రయంగా పనిచేసేది ఏది?
ఎ) ద్విలోహ పట్టీ బి) ఉష్ణయుగ్మం
సి) హీటర్ తీగ డి) రిలే స్విచ్
42. ‘నియమిత ద్రవ్యరాశి గల వాయువు పీడనం దాని ఘనపరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది.’ అనే నియమం ఏది?
ఎ) చార్లెస్ I నియమం
బి) చార్లెస్ II నియమం
సి) బాయిల్ నియమం
డి) కెల్విన్ నియమం
43. ప్రమాణ పీడనం, ఉష్ణోగ్రతల వద్ద ఒక మోల్ వాయువు ఘనపరిమాణం లీటర్లలో ఎంత?
ఎ) 11.2 బి) 22.4
సి) 33.6 డి) 44.8
44. అవగాడ్రో సంఖ్య విలువ?
ఎ) 6.023×1023 బి) 2.063×1023
సి) 6.023×1019 డి) 6.25×1018
45. కృష్ణ వస్తువు కనిపించే రంగు?
ఎ) తెలుపు బి) నీలం
సి) ఊదా డి) నలుపు
46. వికిరణం విషయంలో ‘ఉత్తమ ఉద్గారకాలు, ఉత్తమ శోషకాలు’గా పనిచేస్తాయి అని చెప్పిన శాస్త్రవేత్త?
ఎ) వీన్ బి) థామ్సన్
సి) కిర్కాఫ్ డి) రేలే-జీన్స్
47. ఆదర్శవాయువు పాటించాల్సిన నియమం?
ఎ) బాయిల్ బి) చార్లెస్ I
సి) చార్లెస్ II డి) పైవన్నీ
48. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు?
ఎ) 6000K బి) 4500 K
సి) లక్ష కెల్విన్ డి) 1000 K
49. నీటిని 0 డిగ్రీల నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసినప్పుడు ఏం జరుగుతుంది?
ఎ) వ్యాకోచిస్తుంది బి) సంకోచిస్తుంది
సి) మొదట సంకోచించి తరువాత వ్యాకోచిస్తుంది
డి) మొదట వ్యాకోచించి తరువాత సంకోచిస్తుంది
50. నల్లని మచ్చ ఉన్న ఒక తెల్లని పింగాణీ ప్లేటును బాగా వేడి చేసి, చీకటి గదిలోకి తీసుకెళ్తే?
ఎ) నల్లని మచ్చ ప్రకాశవంతంగా కనిపిస్తుంది
బి) తెల్లని ప్లేటు ప్రకాశవంతంగా కనిపిస్తుంది
సి) చీకటి గదిలో ప్లేటు, దానిపై ఉన్న నల్లని మచ్చ రెండూ ప్రకాశవంతంగా కనిపిస్తాయి
డి) చీకట్లో నల్లని మచ్చ కనిపించదు
51. సెంటీగ్రేడ్‌లో ఉష్ణోగ్రత భేద 20 డిగ్రీల సెల్సియస్ అయితే దీనికి అనురూపంగా ఫారన్‌హీట్‌లో ఉష్ణోగ్రతా భేదం?
ఎ) 30 బి) 36 సి) 40 డి) 20
52. సెంట్ సీసా మూత తీసినప్పుడు వాసన గది అంతా తొందరగా వ్యాపించడానికి కారణం?
ఎ) సెంట్ ద్రవీభవన గుప్తోష్ణం అధికం
బి) సెంట్ ద్రవీభవన గుప్తోష్ణం తక్కువ
సి) సెంట్ బాష్పీభవన గుప్తోష్ణం అధికం
డి) సెంట్ బాష్పీభవన గుప్తోష్ణం తక్కువ
53. ఎస్కిమోలు మంచు ఇండ్లలో ఉండటానికి కారణం?
ఎ) అవి చిన్నగా ఉండటం వల్ల
బి) మంచు, రెండు మంచు గోడల మధ్య ఉండే గాలి అధమ ఉష్ణవాహకాలు కావడం వల్ల
సి) మంచు, రెండు మంచు గోడల మధ్య ఉండే గాలి ఉష్ణవాహకాలు కావడం వల్ల
డి) అవి గోళాకారంగా ఉండటం వల్ల
54. 4 డిగ్రీల సెల్సియస్ వద్ద పూర్తిగా నీటితో నిండి ఉన్న పాత్రను చల్లార్చినా లేదా వేడి చేసినా ఏమవుతుంది?
ఎ) నీరు పొర్లిపోతుంది
బి) నీరు పొర్లిపోదు
సి) నీటి మట్టం తగ్గిపోతుంది
డి) బాష్పీభవనం చెందుతుంది
55. విద్యుత్ కెటిల్లో నీరు వేడెక్కడానికి కారణం?
ఎ) వహనం బి) సంవహనం
సి) వికిరణం డి) ఎ, సి
56. వజ్రం, ఆంథ్రసైట్, గ్రానైట్, గ్రాఫైట్లలో మంచి విద్యుత్ వాహకం అలాగే మంచి ఉష్ణవాహకం?
ఎ) వజ్రం బి) ఆంథ్రసైట్
సి) గ్రానైట్ డి) గ్రాఫైట్
57. కొండ ప్రాంతాల్లో ఆహారం ఉడకడానికి ఎక్కువ సమయం పట్టడానికి కారణం?
ఎ) అక్కడ వాతావరణ పీడనం తక్కువ కాబట్టి మరిగే ఉష్ణోగ్రత అధికం
బి) అక్కడ వాతావరణ పీడనం తక్కువ కాబట్టి మరిగే ఉష్ణోగ్రత తక్కువ
సి) వాతావరణ పీడనం తక్కువ కాబట్టి మరిగే ఉష్ణోగ్రత తక్కువ
డి) వాతావరణ పీడనం తక్కువ కాబట్టి మరిగే ఉష్ణోగ్రత ఎక్కువ
58. రెండు ఆధారాలపై పెద్ద మంచు దిమ్మను ఉంచి, దానిపై నుంచి ఇక ఇనుపతీగను పోనిస్తూ, దాని(తీగకు) భారానికి వేలాడదీస్తే ఏమవుతుంది?
ఎ) దిమ్మె రెండు ముక్కలవుతుంది
బి) దిమ్మె కరిగిపోతుంది
సి) దిమ్మె అలాగే ఉండిపోతుంది
డి) ఇనుపతీగ తెగిపోతుంది
59. పొడి మంచు అంటే?
ఎ) ద్రవ CO2 బి) ఘన CO2
సి) CO2 వాయువు డి) సాధారణ మంచు
60. ఘనీభవించేటప్పుడు సంకోచించేది?
ఎ) మంచు బి) పోత ఇనుము
సి) బిస్మత్ డి) మైనం
61. నీటి ఆవిరి వేడినీళ్ల కంటే ఎక్కువగా చర్మాన్ని కాల్చడానికి కారణం?
ఎ) స్థితి మార్పులో ఆవిరి ఎక్కువ ఉష్ణాన్ని కోల్పోవడం
బి) స్థితి మార్పులో ఆవిరి తక్కువ ఉష్ణాన్ని కోల్పోవడం
సి) స్థితి మార్పులో నీరు తక్కువ ఉష్ణాన్ని కోల్పోవడం
డి) స్థితి మార్పులో నీరు ఎక్కువ ఉష్ణాన్ని కోల్పోవడం
తెలుగు అకాడమీ సౌజన్యంతో
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు