సమష్టి కృషితోనే సుస్థిర వృద్ధి
మహిళా సాధికారత-జీవవైవిధ్య రక్షణ-ప్రపంచ శాంతి-బాలికలు, స్త్రీల సాధికారతను కాపాడటం
పిల్లలు, స్త్రీల పట్ల ఎక్కడైనా, ఏ రూపంలోనైనా విచక్షణ చూపరాదు.
ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో స్త్రీలు, పిల్లల విషయంలో ఎటువంటి ఇబ్బంది కలిగించరాదు. ముఖ్యంగా అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, దోపిడీ లాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలి.
బలవంతపు వివాహాల రద్దు, బాల్యవివాహాలు, అవయవాలను గాయపర్చడం (FGM = Female Gender Mutilation) మొదలైన చర్యలను నిరోధించాలి.
కుటుంబంలో బాధ్యతలను పంచుకోవడం, సాంఘిక రక్షణ కల్పించాలి.
మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంచడం, విధాన నిర్ణయంలో భాగస్వామ్యం కల్పించడం, రాజకీయ, ఆర్థిక, ప్రజాజీవితంలో వారికి సమాన అవకాశం కల్పించడం లాంటి చర్యలు తీసుకోవాలి.
ఐసీపీడీ (International Conference On Population and Development) సదస్సుల ద్వారా స్త్రీలకు రక్షణ కల్పించాలి.
ఆస్తుల్లో, ఆర్థిక వనరుల్లో, విత్త సేవల్లో, సహజ వనరుల్లో స్త్రీలకు భాగస్వామ్యం కల్పించాలి. వారసత్వ చట్టాలు వర్తింపచేయాలి.
స్త్రీలకు సమాచార సాంకేతిక (ICT) సాధికారత కల్పించాలి.
బాలికలు, స్త్రీలకు సాధికారత కల్పించడంలో చట్టాలను కఠినంగా తయారుచేయాలి. అమలు కూడా బలంగా ఉండాలి.
నీరు, పారిశుద్ధ్య నిర్వహణలో సుస్థిర నిర్వహణ కలిగి ఉండాలి.
నీరే ప్రాణాధారం
2030 నాటికి అందరికి సురక్షిత నీరు అందించాలి. అలాగే పారిశుద్ధ్యాన్ని కల్పించాలి. బహిర్గత మల విసర్జనను నియంత్రించాలి. స్త్రీలు, బాలికలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
నీటి నాణ్యతను పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం, ప్రమాదకర రసాయనాల విడుదలను నిర్మూలించడం, Open dumpuing తగ్గించడం, పునఃఉపయోగం (re use) పెంచడంతోపాటు నీటి వృథాను సగానికి తగ్గించాలి.
2030 నాటికి నీటి ఉపయోగ నాణ్యతను అన్ని రంగాల్లో పెంచి, నీటి కొరతను తగ్గించాలి.
2030 నాటికి అన్ని దశల్లో సమగ్ర నీటి వనరుల యాజమాన్యం పాటించాలి. వివిధ ప్రాంతాలు, రాష్ర్టాలు, దేశాల మధ్య సరిహద్దు సహకారం, నీటి వినియోగం కలిగి ఉండాలి.
2020 నాటికి నీటి సంబంధిత వనరులను ముఖ్యంగా పర్వతాలు, అడవులు, తడి భూములు, నదులు, కొలనులను రక్షించుకోవాలి.
2030 నాటికి నీటిని సమర్థమంతంగా ఉపయోగించాలి. ముఖ్యంగా పునరుపయోగ సాంకేతికతను పెంచడంతోపాటు ఉప్పునీటిని మంచినీరుగా మార్చాలి.
నీటి వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణలో స్థానిక ప్రజల సహకారం పొందాలి.
శక్తి వనరుల వృద్ధి
ఆధునిక శక్తిని, కొనసాగించగల శక్తిని, నమ్మకమైన తక్కువ ధరలకు లభ్యమైన శక్తిని పెంపొందించాలి.
2030 నాటికి నమ్మకమైన, ఆధునిక, తక్కువ ధరల్లో సార్వత్రిక శక్తిని పొందాలి.
పునరుత్పాదకత శక్తిని తగినంత మోతాదులో అందుబాటులో ఉంచాలి.
శక్తి సామర్థ్యాన్ని ప్రపంచంలో రెండింతలకు పెంచాలి.
శక్తి వినియోగంలో కాలుష్యం తగ్గించడం, పరిశోధనను ఉధృతం చేయడం, వీటిలో అంతర్జాతీయ సహకారాన్ని పెంచి, పునరుత్పాదకత శక్తిని పెంచాలి.
2030 నాటికి LDC దేశాల్లో అంటే పేద, ద్వీప దేశాల్లో (SIDS) శక్తి అవస్థాపన పెంచి, కొనసాగించగల శక్తి వనరులను వృద్ధి చేయాలి.
అవస్థాపక అభివృద్ధి
నాణ్యమైన, నమ్మకమైన, కొనసాగించగల, వ్యాకోచితమైన అవస్థాపక అభివృద్ధి జరగాలి.
అదేవిధంగా ప్రాంతీయ, సరిహద్దు అవస్థాపక అభివృద్ధికి ఉపయోగపడాలి.
2030 నాటికి సమ్మిళిత, కొనసాగించగల, పారిశ్రామీకరణ జరగాలి. స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక ఉపాధి, ఉత్పత్తి పెరగాలి. పేద దేశాల్లో ఈ నిష్పత్తి రెండింతలు కావాల్సి ఉంది.
చిన్నతరహా పరిశ్రమలకు విత్తపరమైన సేవలను అందించాలి. మార్కెట్ల అభివృద్ధి, నిరంతర వృద్ధిని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉధృతం చేయాలి.
2030 నాటికి అవస్థాపన మెరుగు జరగాలి. పాత పరిశ్రమల్లో నూతన సాంకేతికత సుస్థిరవృద్ధికి దారితీయాలి. పర్యావరణ రక్షిత సాంకేతికతను అభివృద్ధి చేయాలి.
పరిశ్రమల్లో నవకల్పనలు, సాంకేతిక పెరుగుదల, పరిశోధనల్లో ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడుల పెరుగుదల సాధించాలి.
వెనుకబడిన దేశాల్లో (LDC) భూ పరివేష్ఠిత, ద్వీప దేశాల్లో అవస్థాపన విత్త వనరులు, సాంకేతికతను ఉధృతం చేయాలి. ఆఫ్రికా దేశాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలి.
దేశీయ సాంకేతిక అభివృద్ధి కోసం పరిశోధన, నవకల్పనలు, పర్యావరణ రక్షణ మొదలైన వాటిని పారిశ్రామిక వికేంద్రీకరణలో ఉపయోగించాలి.
2020 నాటికి వెనుకబడిన దేశాల్లో సార్వత్రిక సమాచార, సాంకేతికత (ICT)ను అభివృద్ధిపర్చాలి.
దేశాల మధ్య అసమానతలు
2030 నాటికి కిందిస్థాయిలో 40 శాతం ప్రజల ఆదాయ పెరుగుదల జాతీయ పెరుగుదలను మించాలి.
2030 నాటికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ్మిళిత అభివృద్ధిని ఎలాంటి వయస్సు, లింగ, అంగవైకల్యం, జాతి, మత భేదం ఉండకుండా సాధించాలి.
అందరికీ సమాన అవకాశాల కల్పన, అసమానతల తగ్గింపు, విచక్షణాపర చట్టం, విధానాలు పాటించాలి.
సమానత్వ సాధనలో కోశ, వేతన, సాంఘిక రక్షణ విధానాలు పాటించాలి.
అంతర్జాతీయ విత్త మార్కెట్లు, సంస్థలపై నియంత్రణ ఉండాలి.
పేద దేశాలకూ ప్రాధాన్యత
అంతర్జాతీయ ఆర్థిక, విత్త వ్యవహారాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. దీనివల్ల భాగస్వామ్యం పెరుగుతుంది.
శ్రామిక గమనశీలతలో రక్షణ, సమర్థమంతమైన విధానాలు పాటించాలి.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO ) ఒప్పందాల్లో పేద దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలి.
పేద దేశాలు, ఆఫ్రికా దేశాలు, చిన్న ద్వీపదేశాలు, భూ పరివేష్టిత దేశాలు, మొదలైన వారికి సహాయాన్ని ప్రత్యక్ష పెట్టుబడులకు అవసరమైన చోట పెంచాలి.
2030 నాటికి అంతర్జాతీయ చెల్లింపు వ్యయాల ఖర్చు 3 శాతంలోపు ఉండాలి.
నగరాల సుస్థిరాభివృద్ధి
2030 నాటికి అందరికి కావాల్సిన సురక్షిత, కొనుగోలు చేయగల ఇండ్లు అందుబాటులో ఉండాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి. మురికివాడలు లేకుండా చేయాలి.
రక్షిత రవాణా విధానం కలిగి ఉండటంతోపాటు మహిళలు, పిల్లలు, అంగవికలురు, వృద్ధులకు రవాణాలో ప్రత్యేకత చూపాలి.
2030 నాటికి సుస్థిరత కొనసాగించగల పట్టణీకరణ అందరికీ కల్పించాలి.
ప్రపంచ సంస్కృతిని రక్షించాలి.
2030 నాటికి ఆర్థిక నష్ట విపత్తులు, నీటి సంబంధ విపత్తుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలి.
గాలి నాణ్యత పెంచడం, వృథా నిర్వహణ పర్యావరణ నష్టాలను తగ్గించాలి.
రక్షిత, సమ్మిళిత, గ్రీన్ ప్రజా ప్రదేశాలు కలిగి ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులకు అందుబాటులో ఉంచాలి.
పట్టణ, పట్టణ పరిసరాలు, గ్రామాలకు మధ్య ధనాత్మక ఆర్థిక, సాంఘిక పర్యావరణ సంబంధం పెంచాలి.
2020 నాటికి విపత్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడాలి. దీనికి సంబంధించిన Hyogo Frame Workను అమలు చేయాలి.
వెనుకబడిన దేశాల్లో విత్త, సాంకేతిక, సుస్థిర అభివృద్ధిలో స్థానిక వనరుల వినియోగం పెంచాలి.
సుస్థిర ఉత్పత్తి, వినియోగం
పదేండ్లలో సుస్థిర వినియోగం, సుస్థిర ఉత్పత్తి సాధించాలి.
2030 నాటికి సుస్థిర యాజమాన్యం, సహజ వనరుల సమర్థమంతమైన వినియోగం సాధించాలి.
2030 నాటికి ప్రపంచ ఆహారవృథాను సగానికి తగ్గించాలి. పంట అనంతర నష్టాన్ని కూడా తగ్గించాలి.
2020 నాటికి గాలి, నీరు, భూమి కాలుష్యాన్ని అరికట్టాలి.
2030 నాటికి సాధ్యమైనంత వరకు వృథాను నియంత్రించాలి.
పెద్ద, బహుళజాతి సంస్థలు సుస్థిరవృద్ధిని పాటించే విధంగా ప్రోత్సహించాలి.
జాతీయ విధానాలకు అనుగుణంగా ప్రజాసేకరణ చర్యలు చేపట్టి సుస్థిర వృద్ధి సాధించాలి.
2030 నాటికి ప్రజలందరికి సుస్థిరవృద్ధిపై సరైన అవగాహన కల్పించాలి.
సుస్థిర వినియోగం, ఉత్పత్తి కోసం సాంకేతిక పద్ధతులను అభివృద్ధి చేయాలి.
పర్యాటకంలో సుస్థిర వృద్ధిని భాగం చేయాలి. ఇందులో ఉపాధి, స్థానిక సంస్కృతిని, వస్తువుల అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలి.
శాంతి స్థాపన, అవినీతి అంతం
సుస్థిర అభివృద్ధి కోసం శాంతపరమైన సమ్మిళిత సంఘాలు అందరికీ న్యాయం కల్పించాలి.
పిల్లల రక్షణ కోసం చర్యలు తీసుకోవడంతోపాటు అక్రమ రవాణ ఆపాలి.
అందరికీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో న్యాయం చేయాలి.
2030 నాటికి అక్రమ రవాణా ఆపాలి. దొంగిలించిన ఆస్తులను రాబట్టడంతోపాటు అన్నిరకాల నేరాలను నిర్మూలించాలి.
పారదర్శకత గల సంస్థల అభివృద్ధి జరగాలి.
విధాన నిర్ణయంలో సమ్మిళిత భాగస్వామ్యం పెంచాలి.
2030 నాటికి జననాలు 100 శాతం నమోదు కావాలి.
ప్రజలందరికీ ప్రాథమిక స్వేచ్ఛ కల్పించాలి, ఇది జాతీయ, అంతర్జాతీయ ఒప్పందాలను అనుసరించి ఉండాలి.
విచక్షణా రహిత చట్టాలు , విధానాలు అభివృద్ధి చేయాలి.
జీవవైవిధ్య రక్షణ
2020 నాటికి అడవుల నరికివేత ఆపాలి. నష్టాన్ని పూరించడం, మొక్కలను పెంచడం చేయాలి.
సుస్థిరవృద్ధిలో భాగంగా పర్వతాల పర్యావరణ వ్యవస్థను కాపాడాలి.
జీవవైవిధ్య నష్టాన్ని ఆపాలి. అదేవిధంగా అంతరించిపోయే జీవజాలాన్ని కాపాడాలి. దీనికోసం అత్యవసర చర్యలు తీసుకోవాలి.
జన్యుపరమైన వనరులను అభివృద్ధి చేసే వాటిని అందరి లబ్ధి కోసం వాడాలి.
వృక్ష, జంతుజాలాన్ని కాపాడాలి. జంతు వేటను నిరోధించి, అక్రమ రవాణాను ఆపాలి.
పర్యావరణ పెంపుదల, పేదరికాన్ని తగ్గించాలి.
జీవవైవిధ్య రక్షణ కోసం నిధులను సేకరించాలి.
అడవుల యాజమాన్యం కోసం సరైన వనరులను సమీకరించాలి.
రక్షిత జంతుజాల వేటను నిరోధించాలి.
సుస్థిరవృద్ధి – కార్బన్ ట్యాక్స్
ఉద్గారాలకు ప్రధాన కారణం చమురును మండించడం. కాబట్టి చమురు వినియోగానికి సబ్సిడీ ఇచ్చే భారతదేశం చమురు వినియోగంపై పన్నును విధిస్తుంది. పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీ ఎత్తివేసింది.
దీంతో పాటు బొగ్గు వినియోగాన్ని తగ్గించేందుకు పన్ను కూడా విధిస్తుంది. ఈ విధంగా పర్యావరణ రక్షణలో భారతదేశం తన వంతు కృషి చేస్తుంది. టన్నుకు రూ. 50 ఉన్న Coal Cessను రూ. 100కు పెంచింది. దీంతో పాటు పెట్రోల్, డీజిల్‌పై పన్నులు వేస్తున్నది. ఈ రెండు పన్నులను Implicit Carbon Tax అంటారు.
భారత్ గ్రీన్ హౌస్ గ్యాస్
భారత్ అభివృద్ధి చెందిన దేశం కాకపోయినా ఉద్గారాల విడుదలలో చైనా, యూఎస్ తర్వాత 3వ స్థానంలో ఉంది.
అందువల్ల 2020 నాటికి ఉద్గారాల విడుదల 20-25 శాతం తగ్గుతుందని పేర్కొన్నది.
గణాంకాల ప్రకారం భారత్ తలసరి విడుదల ప్రపంచ తలసరి ఉద్గారాల విడుదల కంటే తక్కువగా ఉంటుందని పేర్కొంది.
94వ అంతర్జాతీయ ఒప్పందాల్లో భారత్‌కు భాగస్వామ్యం ఉంది.
రాజ్యాంగంలో కూడా పర్యావరణ రక్షణ చేర్చారు. ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 48A, ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 51A, ఉమ్మడి జాబితాలో అడవులు, వన్యప్రాణి రక్షణ చేర్చడం జరిగింది.
భారత్‌లో మొదటిసారిగా 12వ ప్రణాళికలో సుస్థిరవృద్ధిని ప్రధాన ఎజెండాగా పేర్కొంది.
భారత్ వివిధ విధానాల్లో సుస్థిరవృద్ధి ప్రస్తావన తీసుకువచ్చింది. ముఖ్యంగా జాతీయ పర్యావరణ విధానం(NEP ), జాతీయ వ్యవసాయ విధానం (NAP)లో పేర్కొంది.
2008కుగాను భారత్ NAPCC (National Action Plan on Climate Change) పేర్కొని అందులో 8 అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
2010లో భారత్ పర్యావరణ సంబంధ అంశాల పరిష్కారం కోసం భోపాల్‌లో NGT (National Green Tribunal)ను ఏర్పాటు చేశారు.
భారత్ మొదటి నుంచి (ప్రపంచ మొదటి ధరిత్రి సదస్సు- 1992, రియోడి జనీరో) తన వంతు కృషి చేస్తూనే ఉంది.
రియోలో పేర్కొన్న 27 అంశాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉంది.
1990లో Herman edward dolly సుస్థిరవృద్ధిలో పేర్కొన్న 3 నియమాలను కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తుంది.
ముఖ్యంగా పునరుద్ధరించగల వనరులను పునఃకల్పన రేటుకు మించి ఉపయోగించరాదు. రెండో నియమం ప్రకారం పునరుద్ధరించడానికి వీలులేని వనరులు ప్రత్యామ్నాయంగా లభించే రేటు కంటే ఎక్కువ రేటులో ఉపయోగించరాదు.
అదేవిధంగా 3వ సూత్రం ప్రకారం పర్యావరణ విలీనం చేసుకోగలిగిన సామర్థ్యం కంటే ఎక్కువ పరిమాణంలో విసర్జించరాదు.
పర్యావరణ పరిరక్షణ
పర్యావరణాన్ని కలుషితం చేసే ఉద్గారాలను విడుదల చేసే పరిశ్రమలకు సబ్సిడీల్లో కోత విధించాలి.
వాతావరణ మార్పులపై అత్యవసర చర్యలు చేపట్టాలి. ఇందుకోసం UNFCCC తీసుకునే చర్యకు ఉపకరించాలి.
అన్ని దేశాల్లో వాతావరణ విపత్తులు రాకుండా చర్యలు తీసుకోవాలి.
వాతావరణ మార్పులకు అనుకూలంగా జాతీయ విధానాలను, వ్యూహాలు, ప్రణాళికలను తయారు చేయాలి. చివరికి పర్యావరణ రక్షణ సాధించాలి.
ప్రజల్లో విద్య, అవగాహన సుస్థిరవృద్ధి పెంచాలి. విపత్తులు రాకుండా చర్యలు తీసుకోవాలి.
10 అమెరికన్ బిలియన్ డాలర్లతో ఏర్పాటయ్యే (2020) Green Climate Change నిధిని UNFCCC సమర్థమంతంగా అమలు చేసి పర్యావరణ పరిరక్షణ సాధించాలి.
సుస్థిరవృద్ధిలో సముద్రాలు, మహాసముద్రాలు, చేపలను కాపాడటంతో పాటు పేద దేశాల్లో స్త్రీలను, యువకుల బాధలను కాపాడటంతో సరైన యాజమాన్యాన్ని అభివృద్ధి చేయాలి.
2025 నాటికి చేపల రక్షణ కోసం పూర్తి చర్యలు తీసుకోవాలి.
2020 నాటికి తీరప్రాంత రక్షణ జరగాలి.
సముద్రాల కాలుష్యాన్ని నిర్మూలించాలి. దీనికి శాస్త్రీయ సహకారం పెంపొందించాలి.
అధికంగా చేపలు పట్టడం ఆపాలి. దీని కోసం శాస్త్రీయ విధానాన్ని అభివృద్ధి చేయాలి.
జాతీయ, అంతర్జాతీయ సూత్రాలను సముద్ర చేపలపై, తీరప్రాంతానికి సంబంధించి కనీసం 10 శాతమైనా అమలు చేయాలి.
IUU (Illegal Unreported and Unregulated) చేపలు పట్టే విషయంలో సబ్సిడీలను నియంత్రించాలి.
SIDS, LDC ఇతర అభివృద్ధి దేశాలకు Maritime Technologyని అందించాలి.
చిన్న జాలర్లను కాపాడుతూ వారి మార్కెట్లను విస్తరించాలి.
సముద్రాల రక్షణ కోసం UNCLOS (United Nations Convention on the Law Of the Sea) అమలుచేయాలి.
2020 నాటికి అంతర్జాతీయ ఒప్పందాలను అనుసరించి అంతరంగిక చేపల అభివృద్ధి, బీడు భూముల అభివృద్ధి మొదలైనవి అమలు చేయాలి.
ఉపాధి కల్పన
సమ్మిళిత, కొనసాగించగల ఆర్థికవృద్ధిని పెంచాలి. సంపూర్ణ, ఉత్పాదక ఉపాధిని పెంచి, నాణ్యమైన పని పరిస్థితులు కల్పించాలి.
హెచ్చుతగ్గులు లేని స్థిర తలసరి ఆదాయ వృద్ధిని పెంచాలి. పేద దేశాల్లో కనీసం 7 శాతం GDP వృద్ధి ఉండాలి.
శ్రమ సాంద్రత పద్ధతులు పెంచాలి. నవకల్పనలు, సాంకేతికతను పెంచి ఉత్పాదకతను పెంచే ప్రయత్నం చేయాలి.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల వృద్ధిని పెంచడంతోపాటు నవకల్పన పెరుగుదల, విత్త సంస్థల అందుబాటు, పనిలో నాణ్యతను పెంచాలి.
2030 నాటికి వనరుల వినియోగంలో సామర్థ్యం, ఉత్పత్తిలో సౌకర్యం కలిగి ఉండాలి. అభివృద్ధి చెందిన దేశాలతో సమానస్థాయి అభివృద్ధి కోసం.. పేద దేశాలకు 10 ఏండ్ల వరకు పర్యావరణాన్ని ఆర్థిక అభివృద్ధితో విడదీయాలి.
సంపూర్ణ ఉత్పాదక ఉపాధి స్త్రీ, పురుషులకు సమానంగా ఇవ్వాలి.
సమాన విలువకు సమాన వేతన విధానం పాటించాలి. అదేవిధంగా అంగవైకల్యం కలవారికి, యువకులకు ఉపాధి కల్పించాలి.
యువకులకు ఉపాధిలేని, విద్యలేని, శిక్షణలేని నిష్పత్తిని 2020 నాటికి సాధ్యమైనంత మేరకు తగ్గించాలి.
2025 నాటికి బాలకార్మిక వ్యవస్థ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలి.
శ్రామిక హక్కులు కాపాడాలి. వలస కార్మికులకు ఉపాధి పెంచాలి. అదేవిధంగా స్త్రీ వలస కార్మికుల పరిస్థితులను మెరుగుపర్చాలి.
2030 నాటికి కొనసాగించగల పర్యాటక అభివృద్ధి చేస్తూ ఉపాధిని పెంచడంతోపాటు స్థానిక సంస్కృతిని, స్థానిక ఉత్పత్తులను పెంచాలి.
బ్యాంకులను, బీమా సంస్థలను, ఇతర విత్త సేవలను ప్రోత్సహించాలి.
వెనుకబడిన దేశాలకు వాణిజ్య సహకారాన్ని పెంచాలి.
2020 నాటికి పని పరిస్థితులను పెంచి రక్షణ కల్పించాలి.
సుస్థిరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వనరుల సేకరణ, పన్ను ఆదాయాన్ని పెంచాలి.
ఓడీఏ (Official Development Assistiance)ను అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తూ భారత్‌లాంటి చెందుతున్న దేశాలకు 0.7శాతం జీడీపీని, వెనుకబడిన దేశాలకు 0.15-0.20 శాతం జీడీపీని ఖర్చుచేయాలి.
అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం బహుళ వనరులను చేపట్టాలి.
అధికంగా అప్పుల పాలైన (Highly Indebted Poor Countries) పేద దేశాలను అప్పుల భారం నుంచి రక్షించాలి.
వెనుకబడిన దేశాల్లో సాంకేతికతను అభివృద్ధి చేయాలి.
ప్రపంచ దేశాల మధ్య ప్రాంతీయ సంబంధాలు మెరుగుపర్చాలి. సాంకేతికతను ఇచ్చి పుచ్చుకోవాలి.
పర్యావరణ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని, పర్యావరణ రక్షణ సాంకేతికతను సభ్య దేశాలు పంచుకోవాలి.
పేద దేశాల్లో టెక్నాలజీ బ్యాంక్, STS (Science& Technology Innvation)ని పెంచే ప్రయత్నం చేయాలి.
సుస్థిరవృద్ధి కోసం ప్రపంచ దేశాల మధ్య పూర్తి సహకారాన్ని అభివృద్ధి చేయాలి.
2020 నాటికి పేద దేశాల ఎగుమతులు రెండింతలు కావాలి.
స్వేచ్ఛా వాణిజ్యాన్ని అమలుచేయాలి. పన్ను రహిత, కోటా రహిత విధానాన్ని పాటించి వెనుకబడిన దేశాల ఎగుమతుల అడ్డంకులు తొలగించాలి.
ప్రపంచ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచాలి.
సుస్థిర వృద్ధి కోసం పొందికైన విధానాన్ని (Coherence Policy ) అమలుచేయాలి.
ఒకదేశం మరొక దేశాన్ని గౌరవిస్తూ పేదరికాన్ని నిర్మూలించాలి. సుస్థిరవృద్ధిలో దేశాలు పరస్పరం సహకరించుకోవాలి.
అభివృద్ధి చెందుతున్న దేశాల సుస్థిర వృద్ధి కోసం, విత్త సాంకేతికత, నైపుణ్యతను సమకూర్చుకోవాలి.
సుస్థిరవృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం పెరగాలి.
2020 నాటికి పేద, ద్వీప దేశాల్లో ఎలాంటి లింగ, వయస్సు, జాతి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి సుస్థిర ఫలాలు లభించాలి.
2030 నాటికి దేశాలు సరైన జీడీపీని పొందాలి. కానీ సుస్థిరవృద్ధితో కూడిన జీడీపీని అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఆర్థికాభివృద్ధి, పర్యావరణం రెండు కలిసి ప్రయాణించాలి.
సుస్థిర ఆర్థికవృద్ధి
ఆర్థికవృద్ధిలో ప్రస్తుత తరాల అవసరాల కోసం భావితరాలను ఇబ్బందులకు గురి చేయరాదనేది ప్రధాన ఎజెండాగా బ్రంట్‌లాండ్ కమిషన్ పేర్కొంది.
ఆర్థిక అభివృద్ధి కోసం భూమి, గాలి, నీటి నాణ్యత దెబ్బతీయరాదన్నదే సుస్థిర లక్ష్యం. అంటే efficiency పారిటో సిద్ధాంతాన్ని తప్పక అమలుచేయాలి. ప్రస్తుత సమాజానికి న్యాయం చేయడానికి భవిష్యత్ తరాలకు అన్యాయం చేయకూడదు.
20వ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 40 రెట్లు పెరిగింది. అదే విధంగా ప్రజల జీవన ప్రమాణం కూడా గణనీయంగా పెరిగింది.
కానీ చమురు, ఖనిజాలు, కలప, నీరు, పర్యావరణం దెబ్బతిన్నాయి.
అంటే సుస్థిర అభివృద్ధికి బదులు, అస్థిర అభివృద్ధి జరిగింది.
2050 నాటికి ప్రపంచ జనాభా 9 బిలియన్లు కాబోతున్నది. దానికనుగుణంగా పర్యావరణ రక్షణ చర్యలు చేపట్టాలి.
పేదరికాన్ని, నిరుద్యోగాన్ని సుస్థిరవృద్ధితో సాధించాలి. అంటే Green Economy సాధ్యపడుతుంది.
సుస్థిరవృద్ధిలో యంత్రాలు, రోడ్లు, విద్య, ఆరోగ్యం, అడవులు, గాలి, నీరు, భూమిని పరిగణలోకి తీసుకోవాలి అని Pearce, Warford పేర్కొంది.
ఆర్థికవృద్ధిలో వృక్ష, జంతుజాలం, నీరు, గాలి, అడవులు భూమిని కాపాడుకోవాలి.
వస్తుత్పత్తిని సాధ్యమైనంత వరకు సూర్యరశ్మితో, నీటితో, ఘన వ్యర్థపదార్థాలతోనైనా తయారు చేయాలి. 2015-30 SDG (Sustainable Development Goals)ను అమలు చేస్తే సరిపోతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు