Indian Economy | పిల్లల జనాభాలో టాప్.. అక్షరాస్యతలో డ్రాప్
అక్షరాస్యత
అక్షరాస్యత : ఒక వ్యక్తిని అక్షరాస్యుడిగా పరిగణించాలంటే 7 సం.లు పైబడిన వారు ఏదైనా గుర్తించిన భాషలో చదవడం, రాయడం, సంతకం చేయడంతోపాటు అర్థం చేసుకునే వారిని అక్షరాస్యులుగా భావిస్తారు.
- మొదట్లో ఒక వ్యక్తి ఏదైనా భాషలో అవగాహనతో కూడుకొని చదవడం, రాయడం చేయగలిగే వారిని అక్షరాస్యులుగా భావించేవారు. కానీ 1981 నుంచి 7 సం.లు పైన ఉన్నవారినే అక్షరాస్యులుగా పరిగణిస్తారు.
- అక్షరాస్యత రేటు = 7 సం.లు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన అక్షరాస్యత జనాభా X 7 సం.లు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన మొత్తం జనాభా
- 1901లో భారతదేశ అక్షరాస్యత 5.5 శాతం
- 1951 భారతదేశ అక్షరాస్యత 18.33 శాతం
- 2011లో భారతదేశ అక్షరాస్యత 73.3 శాతం
- పురుష అక్షరాస్యత 80.9 శాతం
- స్త్రీల అక్షరాస్యత 64.6 శాతం
- 2001లో భారత అక్షరాస్యత 64.8 ఉంటే 2011 నాటికి 73.3 శాతం ఉంది. అంటే 2001తో పోలిస్తే 2011లో అక్షరాస్యత 18 శాతం పెరిగింది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక అక్షరాస్యత గల రాష్ర్టాలు 1) కేరళ (93.9 శాతం) 2) మిజోరం (91.5 శాతం)
- 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప అక్షరాస్యత గల రాష్ర్టాలు బీహార్ (61.8 శాతం) 2) అరుణాచల్ ప్రదేశ్ (65.4 శాతం)
- 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక అక్షరాస్యత గల కేంద్ర పాలిత ప్రాంతం లక్షదీవులు (91.8శాతం)
- 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప అక్షరాస్యత గల కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ (76.8 శాతం)
- 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అధిక అక్షరాస్యత గల జిల్లా సెర్చిప్ (మిజోరం 98.76 శాతం)
- దేశంలో అల్ప అక్షరాస్యత గల జిల్లా అలీరాజ్‌పూర్ (మధ్యప్రదేశ్) 76.8 శాతం
- 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ అక్షరాస్యత 67.8 శాతం
- పట్టణ జనాభా అక్షరాస్యత 84.1 శాతం
- గ్రామీణ అక్షరాస్యత కంటే పట్టణ అక్షరాస్యత అధికంగా ఉంది.
- గ్రామీణ అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం కేరళ (93.0 శాతం)
- అల్పంగా ఉన్న రాష్ట్రం బీహార్ (59.8 శాతం)
- గ్రామీణ అక్షరాస్యత అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు
- అల్పంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలి
- పట్టణ అక్షరాస్యత అధికం గల రాష్ట్రం మిజోరం (97.6 శాతం)
- అల్ప అక్షరాస్యత గల రాష్ట్రం యూపీ (75.1 శాతం)
- పట్టణ అక్షరాస్యత అధికం గల కేంద్ర పాలిత ప్రాంతం లక్షదీవులు
- అల్పం గల కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్
- పురుషుల్లో, స్త్రీలలో అధిక అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ (పురుషులు 96.1 శాతం), (స్త్రీలు 92.1 శాతం)
- పురుషుల్లో, స్త్రీలలో అల్ప అక్షరాస్యత గల రాష్ట్రం బీహార్ (పురుషులు 71.2 శాతం), (స్త్రీలు 51.2 శాతం)
- పురుషుల్లో, స్త్రీలలో అధిక అక్షరాస్యత గల కేంద్ర పాలిత ప్రాంతం లక్షదీవులు
- అల్ప అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ
శిశు జనాభా / పిల్లల జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం బాల బాలికల (0-6 సం.) జనాభా 16.45 కోట్లు
- బాలుర జనాభా 8.57 కోట్లు
- బాలికల జనాభా 7.87 కోట్లు
- 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాల్లో బాల బాలికల జనాభా 12.13 కోట్లు
- పట్టణాల్లో బాల బాలికల జనాభా 4.32 కోట్లు
- 2011 సెన్సస్ ప్రకారం అధికంగా పిల్లల జనాభా గల రాష్ర్టాలు 1) ఉత్తరప్రదేశ్ (3.07 కోట్లు) 2) బీహార్ (1.91 కోట్లు)
- పిల్లల జనాభా అల్పంగా గల రాష్ర్టాలు
1) సిక్కిం (64.111)
2) గోవా (1.44 లక్షలు) - 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల జనాభా అధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతాలు 1) ఢిల్లీ (20.12 లక్షలు)
2) పాండిచ్చేరి 1.32 లక్షలు - పిల్లల జనాభా అల్పంగా గల కేంద్ర పాలిత ప్రాంతాలు 1) లక్షదీవులు (7,255)
2) డామన్ డయ్యూ (26,934) - 2001లో దేశ జనాభాలో పిల్లల జనాభా శాతం 15.9
- 2011లో దేశ జనాభాలో పిల్లల జనాభా శాతం 13.6
- 2001 కంటే 2011లో దేశ జనాభాలో పిల్లల జనాభా శాతం 2.3 శాతం తగ్గింది.
- 2011 లో గ్రామీణ పిల్లల జనాభా 14.6 శాతం, పట్టణాల్లో పిల్లల జనాభా 11.5 శాతం
- 2011లో గ్రామీణ పిల్లల జనాభా శాతం కంటే పట్టణ పిల్లల జనాభా శాతం 3.1 శాతం తక్కువగా ఉంది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల జనాభా శాతం అధికంగా గల రాష్ర్టాలు
1) మేఘాలయ (19.2 శాతం)
2) బీహార్ (18.4 శాతం) - పిల్లల జనాభా శాతం అల్పంగా గల రాష్ర్టాలు 1) గోవా (9.9 శాతం),
2) తమిళనాడు (10.3 శాతం) - 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక పిల్లల జనాభా శాతం గల కేంద్ర పాలిత ప్రాంతాలు 1) దాద్రానగర్ హవేలీ (14.8 శాతం), ఢిల్లీ (12 శాతం)
- పిల్లల జనాభా శాతం అల్పంగా గల కేంద్ర పాలిత ప్రాంతాలు 1) పాండిచ్చేరి (10.6 శాతం), 2) అండమాన్ నికోబార్ దీవులు (10.7 శాతం)
పిల్లల / శిశు లింగ నిష్పత్తి /Child Sex Ratio
శిశు లింగ నిష్పత్తి : 0-6 సం.ల మధ్య గల ప్రతి 1000 మంది బాలురకు గల బాలికల నిష్పత్తినే పిల్లల/శిశు లింగ నిష్పత్తి అంటారు.
- 2001లో శిశు లింగ నిష్పత్తి 927 ఉంటే 2011 నాటికి 919 ఉంది. అంటే 8 పాయింట్లు తగ్గింది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లలో (0-6 సం.ల) గ్రామీణ లింగ
నిష్పత్తి 923 : 1000 - పట్టణ లింగ నిష్పత్తి 905 : 1000
- 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ పిల్లల లింగ నిష్పత్తి కంటే గ్రామీణ లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల్లో అధిక లింగ నిష్పత్తి గల రాష్ర్టాలు 1) అరుణాచల్ ప్రదేశ్ (972), 2) మేఘాలయ (970)
- పిల్లల్లో అల్ప లింగ నిష్పత్తి గల రాష్ర్టాలు
1) హర్యానా (834), 2) పంజాబ్ (846) - 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల్లో అధిక లింగ నిష్పత్తి గల కేంద్ర పాలిత ప్రాంతాలు 1) అండమాన్ నికోబార్ దీవులు (968), 2) పాండిచ్చేరి (967)
- పిల్లల్లో అల్ప లింగ నిష్పత్తి గల కేంద్ర పాలిత ప్రాంతాలు 1) ఢిల్లీ (871)
2) చండీగఢ్ (880) - 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక గ్రామీణ శిశు లింగ నిష్పత్తి గల
రాష్ట్రం- ఛత్తీస్‌గఢ్ (977) - అల్ప గ్రామీణ శిశు లింగ నిష్పత్తి గల రాష్ట్రం – హర్యానా (835)
- 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక పట్టణ శిశు లింగ నిష్పత్తి గల రాష్ట్రం మిజోరం (974), అల్ప పట్టణ శిశు లింగ నిష్పత్తి గల రాష్ట్రం హర్యానా (832)
- వయస్సువారి విభజన (Age Composition)
వయస్సు వారి విభజన: మొత్తం జనాభాలో శ్రామిక జనాభా అనుపాతాన్ని తెలియజేసేదాన్ని వయసు వారి విభజన అంటారు - 0-14 సం.లు లేదా 15 సం.లలోపు వయస్సు ఉన్న పిల్లలు, 60 సం.లపైన ఉన్న వృద్ధులు. ఈ రెండు వర్గాల వారినీ అనుత్పాదక జనాభా అంటారు. ఎందుకంటే వీరు ఎటువంటి ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొనరు.
- 15 నుంచి 59 సం.ల మధ్య వయస్సు ఉన్న జనాభాను ఉత్పాదక జనాభా అంటారు.
- 1911లో 0-14 సం.ల మధ్య వయస్సు వారు 38.8 శాతం, 15-59 సం.ల మధ్య వయస్సు ఉన్నవారు 60.2 శాతం, 60 సంవత్సరాలపైన వయసు వారు 1 శాతం మాత్రమే ఉండేవారు.
- 2001లో 0-14 సం.ల మధ్య వయస్సు వారు 35.4శాతం, 15-59 సం.ల మధ్య వయస్సు వారు 57.1 శాతం ఉంటే 60 సంవత్సరాలు పైన వయస్సు వారు 7.5 శాతం మాత్రమే ఉండేవారు.
- 2011లో 0-14 సం.ల మధ్య వయస్సు వారు 30.8శాతం (37.24 కోట్లు) , 15-59 సం.ల మధ్య వయస్సు వారు 60.3 శాతం (72.99 కోట్లు) ఉంటే 60 సంవత్సరాలు పైన వయస్సు వారు 8.9 శాతం (10.8 కోట్లు) మాత్రమే ఉన్నారు.
- ఉత్పాదక జనాభా / శ్రామిక జనాభా/ పనిచేసే జనాభా వయస్సు 15-59 శాతం.
- ఉత్పాదక జనాభా ఎక్కువ గల ప్రాంతం డామన్ డయ్యూ (72.6 శాతం), తక్కువ గల రాష్ట్రం బీహార్ (52.1 శాతం).
- అనుత్పాదక జనాభా/ 60 సం.ల కంటే అధిక వయస్సు గల జనాభా శాతం ఎక్కువ గల రాష్ట్రం కేరళ (12.6 శాతం), తక్కువ గల రాష్ట్రం అసొం(6.7 శాతం)
ప్రాక్టీస్ బిట్స్
1. అక్షరాస్యులు అంటే?
ఎ) 7 సం.ల పైన చదవడం, రాయడం
బి) 7 సం.ల పైన చదవడం, రాయడం, సంతకం చేయడం
సి) 7 సం.ల పైన చదవడం, రాయడం, సంతకం చేయడం, అర్థం చేసుకోవడం
డి) 7 సం.ల పైన గుర్తించిన భాషలో చదవడం, రాయడం, సంతకం చేయడం, అర్థం చేసుకోవడం
2. 1901లో భారతదేశ అక్షరాస్యత ఎంత?
ఎ) 2.1 శాతం బి) 3.8 శాతం
సి) 4.3 శాతం డి) 5.5 శాతం
3. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక అక్షరాస్యత గల రెండో రాష్ట్రం ఏది?
ఎ) కేరళ బి) మిజోరం
సి) మహారాష్ట్ర డి) అసోం
4. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా అక్షరాస్యత ఎంత?
ఎ) 84.1 శాతం బి) 48.1 శాతం
సి) 67.8 శాతం డి) 78.6 శాతం
5. 1951లో భారతదేశ అక్షరాస్యత ఎంత?
ఎ) 12.34 శాతం బి) 15.64 శాతం
సి) 18.33 శాతం డి) 21.13 శాతం
6. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ అక్షరాస్యత కంటే పట్టణ అక్షరాస్యత?
ఎ) అధికం బి) అల్పం
సి) దాదాపు సమానం
డి) 6 రెట్లు ఎక్కువ
7. 2011 సెన్సస్ ప్రకారం స్త్రీ, పురుషుల్లో అధిక అక్షరాస్యత గల కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
ఎ) డామన్ డయ్యూ బి) లక్ష దీవులు
సి) దాద్రానగర్ హవేలీ డి) పాండిచ్చేరీ
8. 2011లో భారతదేశ అక్షరాస్యత ఎంత?
ఎ) 73.3 శాతం బి) 80.9 శాతం
సి) 64.6 శాతం డి) 66.54 శాతం
9. ఏ సంవత్సరం నుంచి 7 సం.లపైబడిన వారిని అక్షరాస్యులుగా గుర్తించడం
పరిగణనలోకి తీసుకున్నారు?
ఎ) 1951 బి) 1961
సి) 1971 డి) 1981
10. 2011 జనాభా లెక్కల ప్రకారం
శిశు జనాభా ఎంత?
ఎ) 8.57 కోట్లు బి) 7.87 కోట్లు
సి) 16.45 కోట్లు డి) 12.13 కోట్లు
11. 2011 జనాభా లెక్కల ప్రకారం
అధిక పిల్లలు గల రాష్ట్రం ఏది?
ఎ) మహారాష్ట్ర బి) కేరళ
సి) బీహార్ డి) ఉత్తరప్రదేశ్
12. 2011 జనాభా లెక్కల ప్రకారం
పిల్లల లింగ నిష్పత్తి?
ఎ) 901:1000 బి) 919:1000
సి) 912:1000 డి) 920:1000
13. 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల్లో అధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏది?
ఎ) అరుణాచల్ ప్రదేశ్ బి) మేఘాలయ
సి) హర్యానా డి) ఢిల్లీ
14. ఉత్పాదక జనాభా వయస్సు?
ఎ) 60 సంవత్సరాల్లోపు
బి) 15-59 సం.ల మధ్య
సి) 21-60 సం.ల మధ్య
డి) 18-59 సం.ల మధ్య
15. 2011 జనాభా లెక్కల ప్రకారం 0-14 సం.ల మధ్య వయసువారు?
ఎ) 30.8 శాతం బి) 37.24 కోట్లు
సి) 10.8 కోట్లు డి) ఎ, బి
16. ఉత్పాదక జనాభా అల్పంగా గల
రాష్ట్రం ఏది?
ఎ) అసోం బి) బీహార్
సి) ఒడిశా డి) మహర్యానా
17. 2001తో పోలిస్తే 2011లో అక్షరాస్యత
ఎంత శాతం పెరిగింది?
ఎ) 12 బి) 14
సి) 16 డి) 18
18. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అధిక అక్షరాస్యత గల జిల్లా?
ఎ) సెర్బిప్ (మిజోరం)
బి) అలీరాజ్‌పూర్ (మధ్యప్రదేశ్)
సి) డామన్
డి) నికోబార్ దీవులు
19. 2011 జనాభా లెక్కల ప్రకారం
పిల్లల జనాభా శాతం?
ఎ) 15.9 శాతం బి) 13.6 శాతం
సి) 18.2 శాతం డి) 12.8 శాతం
20. 2011 జనాభా లెక్కల ప్రకారం 60 సం.ల పై బడిన వారు?
ఎ) 8.9 శాతం బి) 10.8 కోట్లు
సి) ఎ, బి డి) 37. 24 కోట్లు
సమాధానాలు
1-డి 2-డి 3-బి 4-సి
5-సి 6-ఎ 7-బి 8-ఎ
9-డి 10-సి 11-డి 12-బి
13-ఎ 14-బి 15-డి 16-బి
17-డి 18-ఎ 19-బి 20-సి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు