Economy | నీతి ఆయోగ్ – అభివృద్ధి ఎజెండా – సమీక్ష
నీతి ఆయోగ్ – ప్రణాళిక సంఘం భేదాలు
- మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రణాళిక సంఘం తన పద్ధతులను కార్యాచరణను మార్చుకోవడంలో ఆశించిన లక్ష్యాలు సాధించలేకపోయింది.
- ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వికేంద్రీకృత ప్రణాళిక రూపకల్పన చేయాలన్న లక్ష్యంతో ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ అనే నూతన సంస్థను ఏర్పాటు చేశారు.
- గత సంచికలో నీతి ఆయోగ్ నిర్మాణం లక్ష్యాలు, విధుల గురించి తెలుసుకున్నాం
- నీతి ఆయోగ్ అభివృద్ధి అజెండా సమీక్ష ప్రణాళిక సంఘం నీతి ఆయోగ్ మధ్య
పోలికలు, భేదాల గురించి నేర్చుకుందాం.
నీతి ఆయోగ్ అభివృద్ధి ఎజెండా - గతంలో ఉన్న పంచవర్ష ప్రణాళిక స్థానంలో ఏర్పడ్డ నీతి ఆయోగ్ నూతన విజన్‌ను రూపొందించింది.
- భారత ఆర్థిక వ్యవస్థలో త్వరితగతిన అభివృద్ధి సాధించేందుకు 15 సంవత్సరాల (2017-32) విజన్ ప్లాన్‌ను నీతి ఆయోగ్ రూపొందించింది.
- ఈ విజన్ ప్లాన్‌లో రాబోయే 15 సం.రాల్లో దేశంలో సాధించవలసిన లక్ష్యాలను రూపొందించారు.
- ఈ న్యూ విజన్ ప్లాన్ లక్ష్యాల సాధనకు రెండు రకాల కార్యాచరణ విధానాలను నిర్ణయించారు.
- 1) 3 సంవత్సరాల కార్యాచరణ వ్యూహం (2017-20)
- 2) 7 సంవత్సరాల కార్యాచరణ వ్యూహం (2017-24)
3 సంవత్సరాల ఎజెండా - 2017 మార్చి 31తో 12వ పంచవర్ష ప్రణాళిక పూర్తి అయిన వెంటనే జాతీయ అభివృద్ధి లక్ష్యాల సాధనకు 3 సంవత్సరాల ఎజెండాను ప్రకటించారు. ఈ ఎజెండాలో 7 భాగాలు, 24 అధ్యాయాలు ఉన్నాయి.
1) మూడు సంవత్సరాల ఆదాయం, వ్యయం
2) ప్రధాన రంగాల్లో ఆర్థిక రూపాంతరీకరణ
3) ప్రాంతీయ అభివృద్ధి
4) వృద్ధి సాధకాలు 5) ప్రభుత్వం
6) సాంఘిక రంగం 7) సుస్థిరాభివృద్ధి - ఈ మూడు సంవత్సరాల కార్యాచరణ వ్యూహంతోపాటు 7 సంవత్సరాల
కార్యాచరణ వ్యూహంలో అనుసరించిన విధానాలను నీతి ఆయోగ్ సమీక్ష ద్వారా సూచించవచ్చు.
నీతి ఆయోగ్ సమీక్ష - వ్యవసాయ రంగ అభివృద్ధికి ముఖ్యంగా వ్యవసాయ, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుతోపాటు గిట్టుబాటు ధర కోసం మార్కెటింగ్ కమిటీ చట్టంలో సంస్కరణలు, మార్పులు సూచించారు.
- పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా దిగుబడిని పెంచేందుకు రెండోహరిత విప్లవ సాధనకు కృషి చేయడం.
- నగదు రహిత లావాదేవీల విధానానికి ప్రోత్సాహం
- సాంఘిక సేవల కల్పనను మెరుగుపరచడం
- కాలానుగుణంగా విజన్ డాక్యుమెంట్, కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం.
- భూ యజమానుల ఆస్తికి ఎటువంటి భంగం కలగకుండా కౌలుదారుల హక్కుల పరిరక్షణకు వ్యవసాయ భూమి లీజు చట్టం 2016 రూపొందించారు.
- భారత వైద్యమండలి చట్టాన్ని రద్దు చేసి, నూతన జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటు కోసం ముసాయిదా చట్టాన్ని రూపొందించడం.
- దేశంలో నవకల్పన సాధన బలోపేతం కోసం ‘అటల్ నవకల్పన మిషన్’ ఏర్పాటు చేశారు.
- సామాజిక సేవలైన విద్య, వైద్యం, తాగునీటి సరఫరా మొదలైన సేవల పనితీరును అంచనా వేయడానికి సూచీలు తయారు చేశారు.
- కేంద్ర ప్రభుత్వ సహాయంతో వివిధ రాష్ర్టాల్లో అమలవుతున్న అనేక పథకాలకు హేతుబద్ధత కల్పించడానికి తగిన సూచనలు చేయడానికి ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
- స్వచ్ఛ భారత్ అభియాన్ అమలు వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ 2015 మార్చి 9న కొన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
- శ్రామికుల్లో, విద్యార్థుల్లో ఆధునిక నైపుణ్యాభివృద్ధిని పెంచడానికి కొన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో 2015 మర్చి 9న ఒక ఉపసంఘాన్ని నియమించారు.
- పేదరికం అంచనా, నిర్మూలన కోసం 2015 మార్చి 16న ప్రధాన మంత్రి అధ్యక్షతన ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
- జాతీయ, అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయాలను, సలహాలను సేకరించి త్వరిత గతిన అభివృద్ధి సాధించాలని ఉపన్యాసాల పరంపర కొనసాగిస్తున్నారు.
నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ సమావేశం - ‘వీక్షిత్ భారత్@2047 టీమ్ ఇండియా పాత్ర’ అనే అంశంపై 2023 మే 27న ఢిల్లీలోని ప్రగతి మైదానంలోని కొత్త కన్వెన్షన్ సెంటర్లో నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ సమావేశం జరిగింది. దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధితో సహా పలు అంశాలపై చర్చించారు. అంతేకాకుండా దేశం రాబోయే 25 సంవత్సరాల్లో వేగవంతమైన వృద్ధిని సాధించగలదని ప్రకటించారు.
ప్రాక్టీస్ బిట్స్
1. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును పెంచేందుకు నీతి ఆయోగ్ ఎన్ని సంవత్సరాల విజన్ప్లాన్ను రూపొందించింది?
ఎ) 5 బి) 10 సి) 15 డి) 20
2. కౌలుదారుల హక్కుల పరిరక్షణకు నీతి ఆయోగ్ రూపొందించిన చట్టం ?
ఎ) వ్యవసాయ భూమి లీజు చట్టం – 2016
బి) వ్యవసాయ భూమి లీజు చట్టం – 2015
సి) వ్యవసాయ కౌలుదారుల భూ లీజు చట్టం – 2014
డి) వ్యవసాయ కౌలుదారుల భూ లీజు చట్టం – 2017
3. న్యూవిజన్ ప్లాన్ లక్ష్యాల సాధనకు ఎన్ని రకాల కార్యచరణ వ్యూహాలను రూపొందించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
4. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ) ప్రణాళిక సంఘం స్థాపన 1950 మార్చి 15
బి) నీతి ఆయోగ్ స్థాపన 2015 జనవరి 1
సి) ప్రణాళిక సంఘం రద్దు 2005 ఏప్రిల్ 1
డి) ఎ, బి
5. కిందివాటిలో ప్రణాళిక సంఘం నీతి ఆయోగ్ మధ్య పోలికలు ఏవి?
ఎ) ప్రధాని అధ్యక్షత వహిస్తారు
బి) రాజ్యాంగబద్ధ సంస్థ కాదు
సి) చట్టబద్ధ సంస్థ కాదు డి) పైవన్నీ
6. నీతి ఆయోగ్ 3 సంవత్సరాల ఎజెండాలో ఎన్ని పార్ట్స్- చాప్టర్స్ ఉన్నాయి?
ఎ) 7 పార్ట్స్ – 25 చాప్టర్స్
బి) 7 పార్ట్స్ – 24 చాప్టర్స్
సి) 3 పార్ట్స్ – 7 చాప్టర్స్
డి) 3 పార్ట్స్ – 24 చాప్టర్స్
7. కింది వాటిలో ప్రణాళిక సంఘం – నీతి ఆయోగ్ మధ్య పోలిక అంశం ఏది?
ఎ) ఉపాధ్యక్షుడిని దాని సభ్యులు ఎన్నుకుంటారు
బి) ఉపాధ్యక్షుడిని ప్రధాని నియమిస్తారు
సి) ఉపాధ్యక్షుడిని ఆర్థిక మంత్రి నియమిస్తారు
డి) ఉపాధ్యక్షుడిని రాష్ట్రపతి నియమిస్తారు
8. ప్రణాళిక సంఘంలో రాష్ర్టాల పాత్ర?
ఎ) పరిమితం బి) అపరిమితం
సి) కీలకం డి) ఏదీకాదు
9. నీతి ఆయోగ్ తన నివేదికలను ఎవరికి సమర్పిస్తుంది?
ఎ) ఎన్డీసీకి బి) ప్రధానికి
సి) రాష్ట్రపతికి డి) పాలకమండలికి
10. నీతి ఆయోగ్ ఎటువంటి ధోరణితో రూపొందింది?
ఎ) కేంద్రీకరణ ధోరణి
బి) వికేంద్రీకరణ ధోరణి
సి) ఎ, బి
డి) ఏదీకాదు
11. ప్రణాలిక సంఘ నిర్మాణ విధానం ఏది?
ఎ) పై నుంచి కిందికి
బి) కింది నుంచి పైకి
సి) సమాంతరం డి) ఏదీకాదు
12. కింది వాటిలో ఏ సంస్థ మేధోసంపత్తిగా పనిచేస్తుంది?
ఎ) ప్రణాళిక సంఘం
బి) నీతి ఆయోగ్
సి) ఆర్థిక సంఘం డి) పైవన్నీ
13. నీతి ఆయోగ్‌కు రాష్ర్టాలకు నిధులను కేటాయించే అధికారం ?
ఎ) ఉంది బి) లేదు
సి) కొన్ని సందర్భాల్లో కేటాయిస్తుంది
డి) ఏదీకాదు
14. ప్రణాళిక సంఘం తన నివేదికలను ఎవరికి సమర్పించేది?
ఎ) ఆర్థిక మంత్రి బి) ప్రధాన మంత్రి
సి) ఎన్డీసీ డి) రాష్ట్రపతి
15. ప్రణాళిక సంఘంలో తాత్కాలిక సభ్యులు ఎంతమంది ఉంటారు?
ఎ) ఇద్దరు బి) నలుగురు
సి) ఏడుగురు డి) లేరు
16. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ) ప్రణాళిక సంఘం విధివిధానాలను అమలు చేయమని రాష్ర్టాలను ఒత్తిడి చేసేది
బి) నీతి ఆయోగ్ విధి విధానాలను అమలు చేయమని రాష్ర్టాలను ఒత్తిడి చేయదు
సి) ప్రణాళిక నిర్మాణంలో నీతి ఆయోగ్ బాటమ్ టు టాప్ విధానాన్ని అనుసరిస్తుంది
డి) పైవన్నీ సరైనవే
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు