Economy | వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం ఎప్పుడు ఏర్పడుతుంది?
మే 10 తరువాయి….
18. కింది వాటిని పరిశీలించండి. జవాబు: ఎ
1. ఉత్పత్తి ప్రత్యేకీకరణ అభివృద్ధికి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ పై దృష్టి సారిస్తుంది.
2. వ్యవసాయ వ్యవస్థాపకత నైపుణ్యాలను ఎఫ్‌పీవోలు అభివృద్ధి చేస్తాయి.
3. వ్యవసాయ వ్యవస్థాపక నైపుణ్యాల ప్రక్రియను సులభతరం చేయడానికి చిన్న రైతుల వ్యవసాయ వ్యాపార సహకార సంఘాన్ని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
పై వాక్యాల్లో ఏవి సరైనవి?
ఎ. 1, 2 బి. 2, 3
సి. 1, 2, 3 డి. పైవేవీ కావు
వివరణ: రైతు ఉత్పత్తిదారుల సంస్థ కంపెనీల చట్టంలోని పార్ట్ IXA కింద లేదా సంబంధిత రాష్ర్టాల సహకార సొసైటీల చట్టం కింద పొందుపరిచిన/నమోదైన రైతుల ఉత్పాదక సంస్థ. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉత్పత్తి, మార్కెటింగ్‌లో స్కేల్ ఆర్థిక వ్యవస్థల ద్వారా సమష్టిగా ప్రభావితం చేసే ఉద్దేశంతో ఏర్పడింది. చిన్న రైతుల వ్యవసాయ వ్యాపార సహకార సంఘం ఏర్పాటును కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహకార విభాగం తప్పనిసరి చేసింది. 2027-28 నాటికి 10 వేల కొత్త ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసి ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం 10 వేల రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఏర్పాటు, ప్రోత్సాహం అనే కేంద్ర ప్రభుత్వ రంగ పథకాన్ని ఆమోదించి ప్రారంభించింది.
19. కింది వాక్యాలను పరిశీలించండి. జవాబు: డి
1. ఏడాది కాలంలో ప్రధాన ద్రవ్యోల్బణం క్రమంగా పెరిగింది
2. కేంద్రీయ ద్రవ్యోల్బణంలో స్వల్ప మార్పు ఉంది
3. వినియోగదారీ ఆహార ధరల సూచీ ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో పెరిగింది
పై వాక్యాల్లో ఏవి సరైనవి కావు?
ఎ. 1, 2 బి. 1, 2, 3
సి. 2 డి. అన్నీ సరైనవే
20. ఆర్థిక వ్యవస్థలో వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. జవాబు: సి
1. ఇది ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్ల వస్తువులు, సేవల మొత్తం సరఫరాలో ఏర్పడే పెరుగుదల
2. ముడి సరుకుల లేదా శ్రామికుల వ్యయం లో తగ్గుదల ఈ ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చు
పై వాక్యాల్లో ఏవి సరైనవి కావు?
ఎ. 1 బి. 2
సి. 1, 2 డి. ఏదీ కాదు
వివరణ: వేతనాలు, ముడిపదార్థాల ధరల పెరుగుదల కారణంతో అన్ని ధరలు పెరిగినప్పుడు వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అధిక ఉత్పత్తి ఖర్చులు ఆర్థిక వ్యవస్థలో మొత్తం సరఫరాను తగ్గించగలవు. వస్తువులకు డిమాండ్ మారకపోవడంతో ఉత్పత్తి నుంచి ధరల పెరుగుదల వినియోగదారులపైకి చేరి కాస్టు ద్రవ్యోల్బణాన్ని సృష్టిస్తుంది.
21. కింది వాక్యాలను పరిశీలించండి. జవాబు: సి
1. స్తబ్ధత అంటే-ఆర్థిక వ్యవస్థలో వృద్ధి మందగమనం, అధిక నిరుద్యోగం, ధరల పెరుగుదల ఏకకాలంలో కనిపించడం
2. సాధారణంగా సరఫరాకు విఘాతం కలిగినప్పుడు స్తబ్ధత ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది.
పై వాక్యాల్లో ఏవి సరైనవి?
ఎ. 1 బి. 2
సి. 1, 2 డి. ఏదీ కాదు
వివరణ: స్తబ్ధత/ప్రతిష్ఠంభన అనేది ద్రవ్యోల్బణంతో పాటు వృద్ధి మందగమనం, అధిక నిరుద్యోగిత రేట్లతో కలిసి ఏర్పడిన ఒక ఆర్థిక వలయం.
22. కింది వాక్యాలను పరిశీలించండి. జవాబు: ఎ
1. లింగ అసమానత సూచిక అనేది యూఎన్డీపీ విడుదల చేసిన అసమానత సూచిక
2. ఇది పునరుత్పత్తి ఆరోగ్యం, సాధికారత, స్త్రీశ్రామిక శక్తి భాగస్వామ్య రేటు వంటి మానవాభివృద్ధికి సంబంధించిన మూడు ముఖ్యమైన అంశాల్లో లింగ అసమానతలను కొలుస్తుంది పై వాక్యాల్లో ఏవి సరైనవి?
ఎ. 1 బి. 2
సి. 1, 2 డి. ఏది కాదు
వివరణ: పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రసూతి మరణాల నిష్పత్తి, యుక్తవయస్సులో జననాల ద్వారా కొలుస్తారు. పార్లమెంటులో మహిళల సీట్ల నిష్పత్తి కనీస మాధ్యమిక విద్యతో 25 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వయోజన స్త్రీలు, పురుషుల నిష్పత్తి ద్వారా సాధికారతను కొలుస్తారు.
23. కింది వాక్యాలను పరిశీలించండి. జవాబు: ఎ
1. భారత వ్యవసాయ రంగం సగటు వార్షిక వృద్ధిరేటు గత ఆరేళ్లలో 6.4 శాతం ఉంది.
2. 2020-21లో భారతదేశం నుంచి వ్యవసాయం, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు గతేడాది కన్నా 18 శాతం పెరిగాయి.
పై వాక్యాల్లో ఏవి సరైనవి కావు?
ఎ. 1 బి. 2 సి. 1, 2 డి. ఏదీ కాదు
వివరణ: దృఢమైన భవిష్యత్తు అనుసంధానాలతో వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల రంగం ప్రధానంగా ఆహార భద్రతకు హామీ ఇస్తూ దేశం మొత్తం అభివృద్ధికి దోహదపడింది. భారత వ్యవసాయ రంగం సగటు వార్షిక వృద్ధిరేటు గత ఆరేళ్లలో 4.6 శాతం ఉంది. 2020-21లోని 3.3 శాతంతో పోలిస్తే 2021-22లో 3.0 శాతం పెరిగింది. 2021-22లో వ్యవసాయ ఎగుమతులు 50.2 బిలియన్ అమెరికన్ డాలర్లతో అత్యధిక స్థాయికి చేరాయి.
24. కింది వాక్యాలను పరిశీలించండి. జవాబు: బి
1. రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు, సేవలను ఎప్పుడైనా రుణంపై కొనుగోలు చేసేలా అవకాశం కల్పించడానికి కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని 2014లో ప్రారంభించారు.
2. భారత ప్రభుత్వం 2018-19లో మత్స్య, పశు సంవర్ధక రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు సౌకర్యం విస్తరించింది. మత్స్య, పశు సంవర్ధక రంగంలో ఇలాంటి కార్డుల సంఖ్య కూడా పెరిగింది. పై వాక్యాల్లో ఏవి సరైనవి?
ఎ. 1 బి. 2 సి. 1, 2 డి. ఏదీ కాదు
వివరణ: రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు, సేవలను ఎప్పుడైనా రుణంపై కొనుగోలు చేసేలా అవకాశం కల్పించడానికి కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని 1998లో ప్రారంభించారు. భారత ప్రభుత్వం 2018-19 మత్స్య, పశు సంవర్ధక రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని విస్తరించడంతో ఆయా రంగాల్లో ఇలాంటి కార్డుల సంఖ్య కూడా పెరిగింది. రైతులు బ్యాంకులకు కనీస వడ్డీ రేటు చెల్లించేలా చూడటానికి భారత ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టింది.
25. కింది వాక్యాలను పరిశీలించండి. జవాబు: బి
1. ఫ్లిప్పింగ్ అంటే ఒక విదేశీ కంపెనీ మొత్తం యాజమాన్యాన్ని భారతీయ సంస్థకు బదిలీ చేసే ప్రక్రియ.
2. రివర్స్ ఫ్ల్లిప్పింగ్ అంటే ముందుగా బదిలీ అయిన ఆ కంపెనీల స్థానాన్ని తిరిగి విదేశీ యాజమాన్యానికి మార్చే ప్రక్రియ.
3. ఫ్ల్లిప్పింగ్లో సాధారణంగా అన్ని మేథోసంపత్తి అంశాలు, బదిలీ చేయబడిన కంపెనీకి చెందిన సమాచార బదిలీ ఉంటాయి.
4. స్టార్టప్ ప్రారంభ దశలో ఫ్ల్లిప్పింగ్ జరుగుతుంది. వ్యవస్థాపకులు, పెట్టుబడిదారుల వాణిజ్య పన్ను, వ్యక్తిగత ప్రాధాన్యాలు దీన్ని నడిపిస్తాయి.
పై వాక్యాల్లో ఏది/ఏవి సరైనవి కావు?
ఎ. 1, 2, 3 బి. 1, 2
సి. 2, 3, 4 డి. 3, 4
26. కింది అంశాలను పరిశీలించండి. జవాబు: బి
1. నిధి మన ఆతిథ్య పరిశ్రమను శక్తిమంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక కార్యక్రమం
2. నిధి ఆతిథ్య పరిశ్రమలో అవకాశాలకు ప్రవేశ ద్వారంగా మారాలని ఆకాంక్షించినది
పై వాక్యాల్లో ఏవి సరైనవి?
ఎ. 1 బి. 2
సి. 1, 2 డి. ఏదీ కాదు
వివరణ: ఇది కేవలం డేటా బేస్ మాత్రమే కాదు. దీనితో నమోదు ఆతిథ్య విభాగానికి వివిధ సేవలు, ప్రయోజనాలను సాంకేతిక పద్ధతుల్లో అందించేందుకు హామీ ఇస్తుంది. ఇది ఆతిథ్య సంస్థలకు ఉత్తమ ఆలోచనలు, ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి, సులభంగా వ్యాపారం చేయడం కోసం ప్రభుత్వంతో అనుసంధితమవడానికి వేదికగా కూడా ఉపయోగపడుతుంది.
27. అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్ వర్క్ దేనికి సంబంధించింది? జవాబు: సి
ఎ. విదేశీయుడు కలిగి ఉన్న బ్యాంకు ఖాతా
బి. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య చెలామణిని గుణించడం కోసం ఆర్బీఐ రూపొందించిన విధానం
సి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ
డి. ఎన్పీఏల సమస్యలను పరిష్కరించడంలో దోహదపడే ఖాతా
వివరణ: అకౌంట్ అగ్రిగేటర్ అనేది వినియోగదారుల సమ్మతితో వారి ఆర్థిక సమాచారాన్ని సేకరించి దాన్ని ఒక ఆర్థిక సంస్థ నుంచి మరో ఆర్థిక సంస్థకు బదిలీ చేసే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ. సంస్థలు ఆర్థిక రంగ నియంత్రణలో ఉండే ఆర్థిక సమాచారాన్ని అందించే లేదా ఆర్థిక సమాచారాన్ని వినియోగించుకునేవిగా నమోదు చేసుకోవచ్చు.
28. కొన్నిసార్లు వార్తల్లో కనిపించిన RAISE వ్యవస్థ దేనికి సంబంధించినది? జవాబు: ఎ
ఎ. గిగ్ ఒక వేదికపై పనిచేసే వారికి సామాజిక భద్రత
బి. అనాథలకు సామాజిక భద్రత
సి. ఎస్టీ బాలుర నైపుణ్యాభివృద్ధి
డి. ఎస్సీ మహిళలకు విద్యావకాశాలు
వివరణ: సామాజిక భద్రతపై కోడ్, 2020ని కార్యాచరణలోకి తెచ్చే నియమావళి RAISE విధానం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధానపు నియమ నిబంధనలు రూపొందించాయి. గిగ్, వివిధ వేదికలపై ఉన్న కార్మికులకు పూర్తి సామాజిక భద్రతను అందించడానికి ఐదు పార్శాలతో కూడిన RAISE విధానాన్ని అవలంబించవచ్చు.
29. కింది వాటిని పరిశీలించండి. జవాబు: బి
1. పాఠశాల విద్యా సంవత్సరాలు
2. శిశు మరణాలు, పోషణ
3. విద్యుత్ 4. జీవన ప్రమాణం
5. పారిశుద్ధ్యం
పైన పేర్కొన్న వాటిలో బహుమితీయ పేదరిక సూచీని కొలవడానికి వేటిని ఉపయోగిస్తారు?
ఎ. 1, 2, 4 బి. 4
సి. 1, 2, 3, 4, 5 డి. 2
30. కింది వాటిని పరిశీలించండి. జవాబు: ఎ
1. స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది కేంద్ర ప్రాయోజిత పథకం. ఇది 2014లో ప్రారంభమైంది.
2. గృహ, పట్టణ వ్యవహారాల శాఖ దీన్ని అమలు చేసే సంస్థ
3. స్మార్ట్ సొల్యూషన్స్ అనువర్తనాల ద్వారా ప్రధాన మౌలిక సదుపాయాలు, పరిశుభ్రమైన, స్థిరమైన వాతావరణాన్ని అందించేలా నగరాలను ప్రోత్సహించడం, అందులోని పౌరులకు మంచి జీవన ప్రమాణాన్ని అందించడం దీని లక్ష్యం
4. ఇది రెండంచెల పర్యవేక్షణ స్థాయిల్లో ఉంటుంది. జాతీయ స్థాయిలో అపెక్స్ కమిటీ ఉంటుంది.
పై వాక్యాల్లో ఏవి సరైనవి కావు?
ఎ. 1, 2 బి. 2, 3, 4
సి. 1, 3, 4 డి. 2, 4
31. కింది అంశాలను పరిశీలించండి. జవాబు:సి
1. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే గ్రామీణ వాణిజ్య బ్యాంకుల నుంచి ద్రవ్యత్వాన్ని గ్రహించడానికి అనుషంగిక ద్రవ్యత్వ నిర్వహణ సాధనం.
2. ఎల్ఏఎఫ్ కారిడార్‌కు ఆధారంగా ఎస్డీఎఫ్ ఎఫ్ఆర్ఆర్ఆర్ను భర్తీ చేస్తుంది.
3. ఎస్డీఎఫ్ కింద డిపాజిట్లకు నగదు నిల్వల నిష్పత్తికి అర్హత ఉండదు. కానీ చట్టబద్ధమైన ద్రవ్యత్వ నిష్పత్తి నిర్వహణకు అవి అర్హత కలిగిన ఆస్తిగా పరిగణించబడతాయి.
పై వాక్యాల్లో ఏవి సరైనవి?
ఎ. 1, 2 బి. 2 సి. 2, 3 డి. 3
వివరణ: ఎస్డీఎఫ్- ఇది వాణిజ్య బ్యాంకుల నుంచి ద్రవ్యత్వాన్ని గ్రహించడానికి అనుషంగిక నిరంతర ద్రవ్యత్వ నిర్వహణ సాధనం. 2022 నుంచి ఎల్ఏఎఫ్ కారిడార్‌లో భాగంగా స్థిర రివర్స్ రెపోరేటును ఎస్డీఎఫ్ భర్తీ చేస్తుంది. దీని వడ్డీ రేటు 3.75%. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 42 ప్రకారం ఎస్డీఎఫ్ కింద డిపాజిట్లు నగదు నిల్వల నిష్పత్తికి అర్హమైనవి కావు. కానీ అవి బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 24 ప్రకారం ఎస్ఎల్ఆర్ నిర్వహణకు అర్హత కలిగి ఆస్తిగా పరిగణించబడతాయి.
నరేశ్‌కుమార్
ఫ్యాకల్టీ
విష్ణు ఐఏఎస్
అకాడమీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు