ECONOMY Group-4 Special | విదేశాల్లో అధిక బ్రాంచీలను కలిగి ఉన్న భారతీయ బ్యాంక్?
(ఎకానమీ)
1. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. కెనరా బ్యాంక్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమైంది
బి. విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌లు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యాయి
సి. అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ లో విలీనమైంది
డి. న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమైంది
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) సి, డి 4) ఎ, డి
2. బ్యాంక్‌ల నియంత్రణ చట్టం ఎప్పుడు చేశారు?
1) 1953 2) 1949
3) 1935 4) 1955
3. 1921లో ఏర్పాటైన ఇంపీరియల్ బ్యాంక్‌కు మూలమైన బ్యాంక్ ఏది?
1) బ్యాంక్ ఆఫ్ బొంబాయి
2) బ్యాంక్ ఆఫ్ మద్రాస్
3) బ్యాంక్ ఆఫ్ కోల్‌కతా
4) పైవన్నీ
4. 1934-ఆర్బీఐ చట్టంలోని 2వ షెడ్యూల్లో పేరు నమోదు కావడానికి బ్యాంక్‌కు ఉండాల్సిన అర్హత?
ఎ. ప్రభుత్వ యాజమాన్యం కింద పని చేస్తూ ఉండాలి
బి. భారత్‌లో కనీసం 10 బ్రాంచీలతో లావాదేవీలు జరుపుతూ ఉండాలి
సి. అధీకృత మూలధనం 5 కోట్ల రూపాయలకు మించి ఉండాలి
డి. బ్యాంకింగ్ వ్యాపారం చేస్తూ ఉండాలి
1) బి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, డి
5. భారత్‌లో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏది?
1) ఆర్బీఐ 2) ఎస్బీఐ
3) ఐడీబీఐ 4) ఐసీఐసీఐ
6. ప్రపంచంలో మొదటి వాణిజ్య బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) జర్మనీ 2) జపాన్
3) ఇటలీ 4) బ్రిటన్
7. 1969లో మొదటిసారి జాతీయం చేసిన బ్యాంక్ కానిది?
1) ఇండియన్ బ్యాంక్
2) దేనా బ్యాంక్
3) సిండికేట్ బ్యాంక్
4) విజయా బ్యాంక్
8. ఎస్బీఐ అనుబంధ బ్యాంక్‌ల చట్టం చేయబడిన సంవత్సరం?
1) 1955 2) 1956
3) 1958 4) 1959
9. భారతీయ మహిళా బ్యాంక్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ. ఈ బ్యాంక్ చైర్పర్సన్ ఉషా అనంత సుబ్రహ్మణియన్
బి. ఇది 2013 నవంబర్ 19న ఢిల్లీలో ప్రారంభించారు
సి. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది
డి. ఈ బ్యాంక్ 2017లో రిజర్వ్ బ్యాంక్‌లో విలీనమైంది
1) సి, డి 2) డి
3) సి 4) బి, సి
10. కింది వాటిలో వాణిజ్య బ్యాంక్ కానిది ఏది?
1) ఎస్బీఐ 2) హెచ్డీఎఫ్సీ
3) ఐడీబీఐ
4) పంజాబ్, సింథ్ బ్యాంక్
11. కింది వాటిలో తక్కువ వడ్డీ కలిగిన ఖాతా ఏది?
1) సేవింగ్ డిపాజిట్
2) రికరింగ్ డిపాజిట్
3) ఫిక్స్డ్ డిపాజిట్
4) కరెంట్ డిపాజిట్లు
12. కింది వాటిలో సేవా రుసుమును వసూలు చేసే ఖాతా?
1) సేవింగ్ డిపాజిట్
2) రికరింగ్ డిపాజిట్
3) ఫిక్స్డ్ డిపాజిట్
4) కరెంట్ డిపాజిట్లు
13. నిర్ణీత కాలం ముగిసిన తర్వాత చెల్లించే ఖాతాలు?
1) కాలపరిమితి ఖాతాలు
2) డిమాండ్ డిపాజిట్లు
3) 1, 2 4) ఏదీకాదు
14. ఎలాంటి నగదు నిల్వలు లేకుండా అందించే ఖాతా సౌకర్యం?
1) కరెంట్ డిపాజిట్
2) ప్రాథమిక పొదుపు ఖాతా
3) నిర్ణీత ఖాతా
4) రికరింగ్ డిపాజిట్
15. ఎలాంటి హామీ లేకుండా బ్యాంక్ నుంచి రుణం పొందే వర్గం?
1) రైతులు 2) చిన్న వ్యాపారులు
3) స్వయం సహాయక బృందాల మహిళలు
4) పైవారందరూ
16. భారత్‌లో మొదటి విదేశీ బ్యాంక్?
1) బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్
2) మర్కెంటైల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) సిటీ బ్యాంక్
4) స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్
17. ప్రస్తుతం భారత్‌లో ప్రైవేటు వాణిజ్య బ్యాంక్‌ల సంఖ్య?
1) 27 2) 29 3) 22 4) 20
18. 1969, 1980లో జాతీయం చేసిన మొత్తం బ్యాంకులు?
1) 20 2) 19 3) 12 4) 27
19. కింది వాటిలో బ్యాంక్‌లు నిర్వహించే ఏజెన్సీ విధి ఏది?
1) బీమా ప్రీమియంలు చెల్లించటం
2) బంగారం, షేర్లు కొనటం, అమ్మటం
3) వాయిదా చెల్లింపులు చేయటం
4) పైవన్నీ
20. వాణిజ్య బ్యాంక్‌ల సాధారణ ప్రజోపయోగ విధి కానిది?
1) ఏటీఎం సౌకర్యం
2) లాకర్ సౌకర్యం
3) రుణ మంజూరు
4) డ్రాఫ్ట్‌లను ఇచ్చుట
21. విదేశాల్లో అధిక బ్రాంచీలను కలిగి ఉన్న భారతీయ బ్యాంక్?
1) బ్యాంక్ ఆఫ్ బరోడా 2) ఎస్బీఐ
3) బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) ఇండియన్ బ్యాంక్
22. వ్యవసాయ రంగ పునర్విత్త సంస్థ అయిన నాబార్డు ఏర్పాటును సూచించిన కమిటీ?
1) గోర్వాలా 2) నరసింహం
3) శివరామన్ 4) వైద్యనాథన్
23. భారత్‌లో ఏర్పాటైన మొదటి పూర్తి భారతీయ బ్యాంక్?
1) అవద్ కమర్షియల్ బ్యాంక్
2) బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్
3) పంజాబ్ నేషనల్ బ్యాంక్
4) ఇండియన్ బ్యాంక్
24. సిండికేట్ బ్యాంక్ ఏ బ్యాంక్‌లో విలీనమైంది?
1) ఇండియన్ బ్యాంక్
2) కెనరా బ్యాంక్
3) బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) బ్యాంక్ ఆఫ్ బరోడా
25. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైన బ్యాంక్ ఏది?
1) కార్పొరేషన్ బ్యాంక్
2) అలహాబాద్ బ్యాంక్
3) ఆంధ్రా బ్యాంక్
4) 1, 3
ans
1. 3 2. 2 3. 4 4. 1
5. 2 6. 3 7. 4 8. 4
9. 2 10. 3 11. 1 12. 4
13. 1 14. 2 15. 3 16. 2
17. 3 18. 1 19. 4 20. 3
21. 2 22. 3 23. 3 24. 2
25. 4
బడ్జెట్ బిట్స్
1. బడ్జెట్‌ను Annual Financial Statement గా పేర్కొన్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది?
1) 121వ ఆర్టికల్ 2) 122వ ఆర్టికల్
3) 112వ ఆర్టికల్ 4) 120వ ఆర్టికల్
2. ఒక బడ్జెట్లో ఆదాయ, వ్యయ వివరాలు ఉండి అది 12 నెలల కంటే తక్కువ కాల వ్యవధికి రూపొందించబడితే ఆ బడ్జెట్‌ను ఏమంటారు?
1) సాధారణ బడ్జెట్
2) మధ్యంతర బడ్జెట్
3) ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
4) తాత్కాలిక బడ్జెట్
3. ఒక బడ్జెట్లో ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటే ఆ బడ్జెట్‌ను ఏమని పిలుస్తారు?
1) సంతులిత బడ్జెట్
2) మిగులు బడ్జెట్
3) లోటు బడ్జెట్ 4) ఏదీకాదు
4. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ. గత బడ్జెట్‌ను ఆధారంగా చేసుకొని నిధుల కేటాయింపు జరిగితే అది సంప్రదాయ బడ్జెట్
బి. ప్రస్తుత అంశాలకు, సమస్యలకు ప్రాధాన్యతనిచ్చేది శూన్యాధార బడ్జెట్
సి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వ్యయానికి సంబంధించిన వివరాలు ఉంటే రాబడి వివరాలు తప్పనిసరి కాదు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ 4) ఎ, బి, సి
5. 2017-18 బడ్జెట్ నుంచి బడ్జెట్లో వచ్చిన మార్పులు ఏవి?
ఎ. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయ వర్గీకరణను విడిచిపెట్టారు
బి. ఫిబ్రవరి 1కి బదులుగా ఫిబ్రవరి 28న బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు
సి. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో కలిపేసారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
6. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలిపి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ?
1) ఆక్వర్త్ కమిటీ
2) బిబేక్ దేబ్రాయ్ కమిటీ
3) శివరామన్ కమిటీ
4) గోర్వాలా కమిటీ
7. పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని?
1) ఇందిరాగాంధీ 2) రాజీవ్‌గాంధీ
3) నెహ్రూ 4) మన్మోహన్ సింగ్
8. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్ను, పన్నేతర రాబడులు, వసూలు చేసిన రుణాలు అన్ని ఏ నిధికి జమ చేయబడతాయి?
1) సంఘటిత నిధి 2) ఆగంతుక నిధి
3) ప్రభుత్వ ఖాతా 4) ప్రజా నిధి
9. బడ్జెట్ లోటుకు మార్కెట్ రుణాలు, ఇతర అప్పులను కలిపితే తెలిసేది?
1) ప్రాథమిక లోటు 2) కోశ లోటు
3) రెవెన్యూ లోటు
4) ద్రవ్యీకరించిన లోటు
10. మొత్తం వ్యయం నుంచి రెవెన్యూ రాబడి, రుణేతర మూలధన రాబడులను తీసివేస్తే తెలిసేది?
1) రెవెన్యూ లోటు 2) ప్రాథమిక లోటు
3) బడ్జెట్ లోటు 4) కోశలోటు
11. సంతులిత బడ్జెట్ రూపొందించినప్పుడు ఏ లోటును పరిగణనలోకి తీసుకోరు?
1) రెవెన్యూ లోటు 2) ప్రాథమిక లోటు
3) బడ్జెట్ లోటు 4) కోశ లోటు
12. కోశలోటు, వడ్డీ చెల్లింపులకు మధ్యగల వ్యత్యాసం దేనికి సమానం?
1) ప్రాథమిక లోటు 2) విత్త లోటు
3) బడ్జెట్ లోటు 4) రెవెన్యూ లోటు
13. Budget అనే ఆంగ్ల పదానికి మూలమైన Bougate అనేది ఏ భాషా పదం?
1) లాటిన్ 2) జర్మన్
3) గ్రీక్ 4) ఫ్రెంచ్
14. భారత్‌లో ఇప్పటివరకు ఎక్కువసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టినవారు?
1) చిదంబరం 2) యశ్వంత్‌సిన్హా
3) మొరార్జీదేశాయ్ 4) షణ్ముగం శెట్టి
15. రెవెన్యూ వ్యయానికి, రెవెన్యూ రాబడికి మధ్య గల వ్యత్యాసం?
1) రెవెన్యూ లోటు 2) కోశలోటు
3) బడ్జెట్ లోటు 4) రెవెన్యూ మిగులు
16. 2023-24 బడ్జెట్లో మొత్తం వ్యయం ఎంత?
1) రూ.40.51 లక్షల కోట్లు
2) రూ.42.03 లక్షల కోట్లు
3) రూ.45.03 లక్షల కోట్లు
4) రూ.47.02 లక్షల కోట్లు
17. 2023-24 బడ్జెట్‌ను 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించగా.. దీన్ని ఈ విధంగా పిలుస్తున్నారు?
1) సమ్మిళిత వృద్ధి 2) విశ్వాస్ బడ్జెట్
3) అమృత్కాల బడ్జెట్
4) సమగ్ర బడ్జెట్
18. 2023-24 బడ్జెట్లో మొత్తం రాబడి మార్గాల్లో దేని ద్వారా అధిక ఆదాయం వస్తుంది?
1) పన్ను రాబడి
2) పన్నేతర రాబడి
3) రుణ మూలధన రాబడి
4) రుణేతర మూలధన రాబడి
19. 2023-24 బడ్జెట్ అంచనాల ప్రకారం కోశలోటు ఎంత?
1) 2.9 శాతం 2) 5.9 శాతం
3) 2.3 శాతం 4) 4.9 శాతం
20. 2023-24 బడ్జెట్లో అత్యధిక వ్యయం దేనిపై జరుగుతుంది?
1) కేంద్ర పథకాలు
2) పన్నుల్లో రాష్ర్టాల వాటా
3) కేంద్ర ప్రయోజిత పథకాలు
4) వడ్డీ చెల్లింపులు
ans
1. 3 2. 2 3. 1 4. 4
5. 3 6. 2 7. 3 8. 1
9. 2 10. 4 11. 3 12. 1
13. 4 14. 3 15. 1 16. 3
17. 3 18. 1 19. 2 20. 4
వెంకట్, ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్, 9441022571
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు