వివిధ రకాల ద్రవ్యాలు-ద్రవ్య ప్రసార వేగం (ఎకానమీ)
పిలుపు ద్రవ్యం (Call Money)
-ఒక రోజు అవసరం కోసం ఒక బ్యాంకు ఇతర బ్యాంకుల దగ్గర తీసుకునే ద్రవ్యాన్ని ‘పిలుపు ద్రవ్యం’ అంటారు. దీన్నే ‘డిమాండ్ మనీ’ అని కూడా అంటారు.
నోటీస్ మనీ (Notice money)
ఒక బ్యాంకు ఇతర బ్యాంకుల దగ్గర 1 నుంచి 14 రోజులు/ రెండు వారాల అవసరాలకు తీసుకునే ద్రవ్యాన్ని నోటీస్ మనీ అంటారు.
టర్మ్ మనీ (Term Money)
14 రోజుల కంటే ఎక్కువ అవసరాల కోసం ఒక బ్యాంకు ఇతర బ్యాంకుల వద్ద తీసుకునే ద్రవ్యాన్ని టర్మ్ మనీ అంటారు.
అంతర్గత ద్రవ్యం (Internal Money)
ప్రైవేటు బ్యాంకులు కలిగి ఉన్న ద్రవ్యాన్ని అంతర్గత ద్రవ్యం అంటారు.
ఉదా: యాక్సిస్ బ్యాంక్ , హెచ్డీఎఫ్సీ బ్యాంక్
బహిర్గత ద్రవ్యం (External Money)
ప్రభుత్వ నిర్వహణ బ్యాంకుల్లో ద్రవ్యాన్ని బాహ్య /బహిర్గత ద్రవ్యం అంటారు.
ఉదా: ఎస్బీఐ
సులభ ద్రవ్యం (Easy Money)
-ఆర్బీఐ వివిధ సాధనాల ద్వారా అంటే సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపోరేటు, రివర్స్ రెపోరేటులను తగ్గించినప్పుడు బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయి. ఈ స్థితిలో లభించే ద్రవ్యాన్ని ‘సులభ ద్రవ్యం’ అంటారు.
– దేశంలో ద్రవ్య సప్లయ్ పెరిగి, ద్రవ్యం విలువ తగ్గడాన్ని సులభ ద్రవ్యం/ క ద్రవ్యం అంటారు.
కఠిన ద్రవ్యం (Hard Currency)
-ఆర్బీఐ వివిధ సాధనాల ద్వారా అంటే సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపోరేటు, రివర్స్ రెపోరేటులను పెంచినప్పుడు బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతాయి. ఈ స్థితిలో లభించే ద్రవ్యాన్ని ‘కఠిన ద్రవ్యం’ అని ప్రియమైన ద్రవ్యం (Dear Money) అని కూడా అంటారు.
-దేశంలో ద్రవ్య సప్లయ్ తగ్గి ద్రవ్యం విలువ పెరగడాన్ని కఠిన ద్రవ్యం అంటారు.
ఫియట్ మనీ (Fiat money)
-ప్రభుత్వ అధికారం వల్ల చెలామణిలో ఉన్న కాగితపు ద్రవ్యాన్ని ‘Fiat money’ అంటారు.
– అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని జారీ చేస్తుంది. దేశంలో ఉన్న ద్రవ్యం ఈ రకమైనదే.
కరెన్సీ (Currency)
-ప్రభుత్వం, కేంద్రబ్యాంకు ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉంచిన ద్రవ్యరూపమే ‘కరెన్సీ’ అంటే కాగితపు కరెన్సీ నాణేలు
-ఒక రూపాయి నోట్లు తప్ప మిగతా కరెన్సీ నోట్లు కేంద్ర బ్యాంకు జారీ చేస్తుంది. ఒక రూపాయి నోట్లను ప్రభుత్వం
(ఆర్థిక మంత్రిత్వ శాఖ) జారీ చేస్తుంది.
హార్డ్ కరెన్సీ (Hard Currency)
– అంతర్జాతీయమార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండే కరెన్సీని హార్డ్ కరెన్సీ అంటారు.
ఉదా: డాలర్, పౌండ్, యూరో
సాఫ్ట్ కరెన్సీ (Soft Currency)
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తక్కువ గా ఉన్న కరెన్సీని ‘సాఫ్ట్ కరెన్సీ’ అంటారు.
రిజర్వ్ కరెన్సీ (Reserve Currency)
ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు తమ బంగారాన్ని విదేశీ మారక నిల్వల్లో ఉంచుకోవడానికి ఇష్టపడే కరెన్సీని ‘రిజర్వ్ కరెన్సీ’ అంటారు.
అంచనా ద్రవ్యం (Speculative Money)
బాండ్ మార్కెట్, స్టాక్ మార్కెట్ మనీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన ద్రవ్యాన్ని అంచనా ద్రవ్యం అంటారు.
హాట్ మనీ (Hot Money)
అధిక వడ్డీరేటు గల దేశం నుంచి లబ్ధి పొందుటకు ఆ దేశంలోకి ప్రవహించే ద్రవ్యాన్ని ‘హాట్ మనీ’ అంటారు.
ప్రికాషనరీ మనీ (Precautionary Money)
ఆర్థిక వ్యవస్థలో అనుకోని ఒడుదుడుకులు సంభవించినపుడు ఆ పరిస్థితులను ఎదుర్కో వడానికి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించేందుకు భద్రపరిచిన ద్రవ్యాన్ని ‘ప్రికాషనరీ మనీ అంటారు.
న్యూట్రల్ మనీ (Neutral Money)
ఉత్పాదకతను పెంచి తద్వారా దీర్ఘకాలం పాటు ధరల స్థిరత్వాన్ని కల్పించే సమయం లో సరఫరా అయ్యే ద్రవ్యాన్ని ‘న్యూట్రల్ మనీ’ అంటారు.
ఆవర్జా ద్రవ్యం (Account Money)
జమ, ఖర్చు లెక్కలను ఏ ద్రవ్య యూనిట్ రూపంలో రాస్తారో ఆ ద్రవ్యాన్ని ‘ఆవర్జా ద్రవ్యం’ అంటారు.
ఉదా: భారతదేశంలో రూపాయి, అమెరికాలో డాలర్
విశ్వసాశ్రిత ద్రవ్యం
ప్రభుత్వం కేంద్ర బ్యాంకుపై విశ్వాసం ఆధారంగా ముద్రించే ద్రవ్యాన్ని ‘విశ్వ సాశ్రిత ద్రవ్యం’ అంటారు.
మార్పిడి ద్రవ్యం (Transaction Money)
– వస్తు, సేవలకు చేసే రోజువారీ ఖర్చులకు ఇచ్చే ద్రవ్యాన్ని‘మార్పిడి ద్రవ్యం’ అంటారు.
క్రిప్టో కరెన్సీ (Crypto Currency)
– బ్లాక్‌చైన్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కరెన్సీ చెలామణి చేయడాన్ని క్రిప్టో కరెన్సీ అంటారు. ఇది ఒక రకమైన డిజిటల్ కరెన్సీ. దీనిని ‘ప్రత్యామ్నాయ కరెన్సీ’ అని వర్చువల్ కరెన్సీ అని కూడా అంటారు.
-భారతదేశంలో ఆర్బీఐ ఈ రకమైన కరెన్సీని నిషేధించింది. ఉదా: బిట్ కాయిన్
పరపతి ద్రవ్యం (Credit Money)
– దీనిని ‘బ్యాంకు ద్రవ్యం’ అని కూడా పిలుస్తారు.
– పరపతి ద్రవ్యాన్ని వాణిజ్య బ్యాంకులు సృష్టిస్తాయి.
-బ్యాంకులు జారీ చేసే చెక్కులు, డీడీలు, వినిమయ బిల్లులు మొదలైన వాటిని పరపతి ద్రవ్యం అంటారు.
వ్యవహారిక ద్రవ్యం (Actuval Money)
– ఆర్థిక వ్యవస్థలో వాస్తవంగా చెలామణిలో ఉన్న ద్రవ్యాన్ని ‘వ్యవహారిక ద్రవ్యం’ అంటారు.
కరెన్సీ విలువ తగ్గుదల
-అంతర్జాతీయ మార్కెట్లో కరెన్సీ డిమాండ్ కంటే కరెన్సీ సప్లయ్ ఎక్కువగా ఉన్నప్పుడు కరెన్సీ విలువ తగ్గుదల ఏర్పడుతుంది.
కరెన్సీ విలువ పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో కరెన్సీ డిమాండ్ కంటే కరెన్సీ సప్లయి తక్కువగా ఉన్నప్పుడు కరెన్సీ విలువ పెరుగుతుంది.
ద్రవ్యప్రసార వేగం (Monetary Transmi ssion Speed)
– ఒక నిర్ణీత కాలంలో ఒక యూనిట్ ద్రవ్యం, వస్తు సేవలను కొనుగోలు చేయడానికి ఎన్ని సార్లు చేతులు మారుతుందో తెలియజేసే దానిని ద్రవ్యప్రసార వేగం’ అంటారు.
– ఒక నిర్ణీత కాలంలో ద్రవ్యం ఎన్ని ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తుందో దానిని ‘ద్రవ్యచలామణి వేగం’ (Velocity of Money) అంటారు.
ద్రవ్య ప్రసార వేగం కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.
1) పరపతి సంస్థల సంఖ్య పెరిగే కొద్ది ద్రవ్యప్రసార వేగం పెరుగుతుంది.
2) నగదు, వ్యవహారాలు పెరిగే కొద్ది ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుంది.
3) కీన్స్ ప్రకారం వినియోగస్థాయి పెరిగే కొద్ది ద్రవ్యప్రసార వేగం పెరుగుతుంది.
4) రెగ్యులర్ ఆదాయం అయితే ప్రసార వేగం పెరుగుతుంది.
5) రవాణా, ప్రసార సాధనాలు పెరిగితే ప్రసార వేగం పెరుగుతుంది.
6) పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రసార వేగం ఎక్కువగా ఉంటుంది.
7) ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య ప్రసార వేగం ఎక్కువగా ఉంటుంది.
8) ఆర్థిక మాంద్యం కాలంలో ద్రవ్య ప్రసార వేగం తక్కువగా ఉంటుంది.
9) ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉంటే ద్రవ్య ప్రసార వేగం తక్కువగా ఉంటుంది.
10. ఎక్కువ కాలాంతరాల్లో వేతన చెల్లింపు జరిగితే ప్రసార వేగం తగ్గుతుంది .
మంచి ద్రవ్యానికి ఉండవలసిన లక్షణాలు
1) ఆమోద యోగ్యత (Acceptability)
2) సులభంగా తీసుకొని పోయేందుకు వీలుగా ఉండటం (Portability)
3) మన్నిక (Durability)
4) విభాజ్య (Divisibility)
5) సజాతీయత (Homogeneity)
6) వ్యాకోత్వం (Elasticity)
7) అల్పబరువు (Low weight)
8) స్థిరత్వం (Stability)
9) తేలికగా గుర్తించుట (Cognizability)
గ్రేషమ్ లా సూత్రం
-ఎలిజిబెత్ రాణి-1 సలహాదారుడు
సర్ థామస్ గ్రేషమ్ మెరుగైన, నాసికరపు ద్రవ్యాలు రెండు ఒకేసారి చెలామణిలో ఉంటే నాసిరకం ద్రవ్యం మేలైన ద్రవ్యాన్ని చెలామణి నుంచి తరిమి వేస్తుందని గ్రేషమ్ సూత్రీకరించాడు. అంటే చెడు ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని తరిమి వేస్తుంది. దీనినే గ్రేషమ్ లా సూత్రం అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. రెండు వారాల అవసరాలకు ఒక బ్యాంక్ ఇతర బ్యాంకుల వద్ద తీసుకునే ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) పిలుపు ద్రవ్యం బి) నోటీసు మనీ
సి) టర్మ్మనీ డి) పైవన్నీ
2. ప్రైవేటు బ్యాంకులు కలిగి ఉన్న ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) అంతర్గత ద్రవ్యం
బి) బహిర్గత ద్రవ్యం
సి) కఠిన ద్రవ్యం
డి) సులభ ద్రవ్యం
3. ఆర్బీఐ వివిధ సాధనాల ద్వారా అంటే సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపోరేటు, రివర్స్ రెపోరేటులను తగ్గించి వడ్డీరేటు తగ్గినపుడు లభించే ద్రవ్యాన్ని ఏమంటారు.
ఎ) సులభ ద్రవ్యం బి) కఠిన ద్రవ్యం
సి) అంతర్గత ద్రవ్యం డి) బాహ్య ద్రవ్యం
4. ప్రభుత్వ అధికారం వల్ల చెలామణిలో ఉన్న కాగితపు ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) కఠిన ద్రవ్యం బి) క ద్రవ్యం
సి) ఫియట్ మనీ డి) ప్రికాషనరీ మనీ
5. ఒక రూపాయి నోట్లు తప్ప మిగతా కరెన్సీ నోట్లను ఎవరు జారీ చేస్తారు?
ఎ) ఆర్థిక మంత్రిత్వ శాఖ
బి) కేంద్ర బ్యాంకు
సి) రాష్ట్ర బ్యాంకు డి) పైవేవీకాదు
6. అధిక వడ్డీరేటు గల దేశం నుంచి లబ్ధి పొందడానికి ఆ దేశంలోకి ప్రవహించే ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) సాఫ్ట్ మనీ బి) హాట్ మనీ
సి) క ద్రవ్యం డి) కఠిన ద్రవ్యం
7. ఆర్థిక వ్యవస్థలో అనుకోని ఒడుదుడుకులు ఎదుర్కోవడానికి ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి భద్రపరిచిన ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) ఫియట్ మనీ బి) హాట్ మనీ
సి) న్యూట్రల్ మనీ డి) ప్రికాషనరి మనీ
8. వినియోగస్థాయి పెరిగే కొద్ది ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుందని పేర్కొన్న ఆర్థిక వేత్త ఎవరు?
ఎ) ఆడమ్‌స్మిత్ బి) మార్షల్
సి) కీన్స్ డి) ఫిషర్
9. జమ ఖర్చు లెక్కలను ఏ ద్రవ్య యూనిట్ రూపం లో రాస్తారో ఆ ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) ఆవర్జా ద్రవ్యం బి) మార్పిడి ద్రవ్యం
సి) పరపతి ద్రవ్యం
డి) వ్యవహారిక ద్రవ్యం
10. క్రిప్టో కరెన్సీకి ఉదాహరణ?
ఎ) భారత్‌లో రూపాయి
బి) అమెరికాలో డాలర్
సి) బిట్ కాయిన్ డి) యూరో
11. పరపతి ద్రవ్యానికి మరొక పేరు?
ఎ) బ్యాంకు ద్రవ్యం బి) ద్రవ్యత్వం
సి) సమీప ద్రవ్యం డి) పైవన్నీ
12. కరెన్సీ డిమాండ్ కంటే కరెన్సీ సప్లయ్ ఎక్కువగా ఉన్నప్పుడు కరెన్సీ విలువ?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) స్థిరంగా ఉంటుంది డి) పైవేవీకావు
13. ద్రవ్య సంస్థల సంఖ్య పెరిగే కొద్ది ద్రవ్య ప్రసార వేగం?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) స్థిరంగా ఉంటుంది డి) పైవన్నీ
14. మంచి ద్రవ్యానికి ఉండవలసిన లక్షణాల్లో సరైనవి ఏవి?
ఎ) ఆమోద యోగ్యత బి) మన్నిక
సి) విభాజ్యత డి) పైవన్నీ
15. ఆర్థిక మాంద్యం కాలంలో ద్రవ్య ప్రసార వేగం?
ఎ) తక్కువ బి) ఎక్కువ
సి) స్థిరంగా ఉంటుంది డి) పైవన్నీ
16 స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) మార్పిడి ద్రవ్యం
బి) అంచనా ద్రవ్యం
సి) వ్యవహారిక ద్రవ్యం
డి) పరపతి ద్రవ్యం
17. బ్యాంకులు జారీ చేసే చెక్కులు, డీడీలు, వినిమయ బిల్లులు మొదలైనవి ఏ ద్రవ్యం?
ఎ) పరపతి ద్రవ్యం
బి) వ్యవహారిక ద్రవ్యం
సి) బ్యాంక్ ద్రవ్యం డి) ఎ, సి
18. ఆర్థిక వ్యవస్థలో వాస్తవంగా చెలామణిలో ఉన్న ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) వ్యవహారిక ద్రవ్యం
బి) మార్పిడి ద్రవ్యం
సి) ఆవర్జా ద్రవ్యం డి) సమీప ద్రవ్యం
పానుగంటి కేశవ రెడ్డి
లెక్చరర్
గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు