Economy | ప్రణాళికలు – లక్షణాలు- వికేంద్రీకరణ ధోరణి -వనరుల సమీకరణ
భారతదేశ ప్రణాళికలు – లక్షణాలు
- భారత ఆర్థిక వ్యవస్థ – మిశ్రమ వ్యవస్థ లక్షణాలు కలిగి ఉంది.
- భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని అనుసరిస్తుంది.
- ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పని చేసే విధానాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు.
- మిశ్రమ ఆర్థిక వ్యవస్థను మొదట జె.ఎం.కీన్స్ ప్రతిపాదించారు.
- 1948లో ప్రవేశ పెట్టిన మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించారు.
- మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు సూచనాత్మక ప్రణాళికలు సరిపోతాయి.
- అంటే భారత ప్రణాళికలు సూచనాత్మక స్వభావం కలిగి ఉంటాయి.
- భారత ప్రణాళికలు భౌతిక, విత్త ప్రణాళికల సమ్మేళనంగా చెప్పవచ్చు.
- భౌతిక ప్రణాళికలకు పీసీ మహలనోబిస్, పీతాంబర్ పంత్‌లు రెండో ప్రణాళికలో ప్రాధాన్యం ఇచ్చారు.
- భారత ప్రణాళికలను పూర్తిగా ఆర్థిక ప్రణాళికలు అనడం కంటే సాంఘిక ప్రణాళికలు అని చెప్పవచ్చు. ఎందుకంటే భారత ప్రభుత్వం భూ సంస్కరణలు ఆర్థిక వికేంద్రీకరణ, అసమానతల తొలగింపు మొదలగు అంశాలకు ప్రాధాన్యం ఇస్తుంది.
- మొదటి ప్రణాళిక నుంచి ఏడో ప్రణాళిక వరకు అంటే 1951 నుంచి 1990 వరకు భారతదేశంలో నిర్దేశాత్మక/ఆదేశాత్మక ప్రణాళికలు అమలు చేశారు. అంటే సామ్యవాద తరహా ఆర్థిక విధానాలు అమలు చేశారు.
- ఎనిమిదో ప్రణాళిక నుంచి అంటే 1992 నుంచి భారతదేశంలో సూచనాత్మక ప్రణాళి కలు అమలు చేశారు.
- 1978 నుంచి 1980 వరకు భారతదేశంలో నిరంతర ప్రణాళికలు అమలు చేశారు.
- 1966 నుంచి 1969 వరకు 3 వార్షిక ప్రణాళికలు 1990 నుంచి 1992 వరకు 2 వార్షిక ప్రణాళికలు అమలు చేశారు.
- భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు స్థిర ప్రణాళికలుగా అమలు జరిగాయి.
- భారతదేశంలో 1951 నుంచి 2016 వరకు 12 పంచవర్ష ప్రణాళికలు 6 వార్షిక ప్రణాళికలను అంటే 65 సంవత్సరాల ప్రణాళికను 6 1/2 దశాబ్దాల ప్రణాళికలను సుమారు 200 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి నిధులతో ప్రణాళికలను అమలు చేశారు.
- 2017 నుంచి ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో దీర్ఘదర్శి ప్రణాళికలు అమలవుతున్నాయి.
భారతదేశం ప్రణాళికలు – వికేంద్రీకరణ ధోరణి
- భారతదేశంలోని ప్రణాళికలు వికేంద్రీకరణ ధోరణిలో కింది క్రమానుగత శ్రేణిలో అమర్చడం జరిగింది.
ఎ) జాతీయస్థాయి ప్రణాళిక (Central Plan)
బి) రాష్ట్రస్థాయి ప్రణాళిక (State Plan)
సి) జిల్లాస్థాయి ప్రణాళిక (District Plan)l - జాతీయస్థాయిలో / కేంద్రస్థాయిలో ప్రణాళికల రూపకల్పన ప్రణాళిక సంఘం చేసేది.
- జాతీయస్థాయిలో ప్రణాళికలను రూపొందించేటపుడు దేశంలోని వనరుల ఆధారంగా అంటే సహజ వనరులు, మానవ వనరులు, ఆదాయ వనరుల ఆధారంగా ప్రణాళిక సంఘం కేంద్ర ప్రణాళికలను రూపొందించేది.
- జాతీయ స్థాయిలో ఆర్థిక మంత్రి, ప్రణాళిక శాఖ మంత్రి, సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉంటారు.
- జాతీయస్థాయిలో ప్రణాళికల రూపకల్పన చేసే ప్రణాళిక సంఘానికి చైర్మన్‌గా ప్రధానమంత్రి, వైస్ చైర్మన్ ఉంటారు.
- జాతీయ స్థాయిలో ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళికను అంతిమంగా జాతీయాభివృద్ధి మండలి ఆమోదిస్తుంది.
- ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు. అంటే జాతీయస్థాయిలో ప్రణాళికల రూపకల్పన విధి విధానాలు ప్రస్తుతం నీతి ఆయోగ్ నిర్వహిస్తుంది.
- రాష్ట్రస్థాయిలో ప్రణాళికల రూపకల్పన స్టేట్ ప్లానింగ్ బోర్డ్ చేస్తుంది.
- రాష్ట్రస్థాయిలో ప్రణాళికలను రూపొందించేటపుడు స్టేట్ ప్లానింగ్ బోర్డ్ కేంద్ర ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రంలోని వనరులను బట్టి, వాటి ప్రాధాన్యతను బట్టి రాష్ట్ర ప్రణాళికలను తయారు చేస్తారు.
- రాష్ట్ర ప్రణాళిక బోర్డుకు చైర్మన్‌గా ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్ ఉంటారు.
- రాష్ట్రస్థాయిలో స్టేట్ ప్లానింగ్ బోర్డ్ తయారు చేసిన ప్రణాళికను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రణాళిక సంఘం ముందు పెట్టి/ ప్రస్తుతం నీతి ఆయోగ్ ముందు పెట్టి ఆమోదం పొందుతారు.
- జిల్లాస్థాయిలో ప్రణాళికల రూపకల్పన జిల్లా ప్రణాళిక బోర్డ్ చేస్తుంది. ఇది చట్ట బద్ధ సంస్థ/ రాజ్యాంగ బద్ధ సంస్థ
- జిల్లాస్థాయిలో ప్రణాళికలను రూపొందించేటప్పుడు జిల్లా ప్రణాళిక బోర్డు జాతీయ, రాష్ట్ర ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని, జిల్లాలోని వనరులను బట్టి, వాటి ప్రాధాన్యతను బట్టి జిల్లా ప్రణాళికలను తయారు చేస్తారు.
- జిల్లాస్థాయి ప్రణాళిక రూపకల్పనలో జిల్లా కలెక్టర్ సమన్వయ కర్తగా ఉంటారు. వివిధ విభాగాల అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లా ప్రణాళిక బోర్డుకు చైర్మన్‌గా కలెక్టర్, వైస్‌చైర్మన్ ఉంటారు.
- జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళిక బోర్డ్ తయారు చేసిన ప్రణాళికను రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ ఆమోదిస్తుంది.
- గ్రామస్థాయిలో ప్రణాళికలను గ్రామ సచివాలయం తయారు చేసుకొని అమలు చేస్తుంది.
ప్రణాళికలకు వనరుల సమీకరణ
- ప్రణాళికలకు అవసరమైన వనరులను
3 మార్గాల ద్వారా సమీకరిస్తారు. అవి..
1) దేశీయ వనరులు
2) విదేశీ వనరులు
3) లోటు ద్రవ్యం
దేశీయ వనరులు: దేశీయ వనరులు 4 మార్గాల ద్వారా సమకూరుతాయి. - ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు.
- ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తుల ధరలు పెంచుట ద్వారా, అదనపు పన్ను విధించుట ద్వారా వచ్చే రాబడి.
- మార్కెట్ రుణాలు, చిన్న మొత్తాల పొదుపు అంటే దేశీయ పొదుపులు. కరెంట్ రెవెన్యూలో మిగిలిన నిధులు
- దేశీయ వనరులను డొమెస్టిక్ బడ్జెట్ రిసోర్సెస్/ దేశీయ బడ్జెట్ వనరులు అని కూడా అంటారు.
- ప్రణాళికలకు ఎప్పుడూ దేశీయ బడ్జెట్ వనరులు ఉత్తమమైన మార్గం అని చెప్పవచ్చు.
- దేశీయ వనరుల ద్వారా నిధులు / వనరులు సరిపోకపోతే విదేశీ వనరులను సేకరించవలసి ఉంటుంది.
విదేశీ వనరులు - విదేశీ వనరులు 2 మార్గాల ద్వారా లభించును. విదేశీ గ్రాంట్లు, విరాళాలు
- విదేశీ రుణాలు, అంతర్జాతీయ విత్త సంస్థల నుంచి తీసుకునే రుణాలు
- అంతర్జాతీయ విత్త సంస్థలకు ఉదా: ఐబీఆర్డీ, ఐఎంఎఫ్, ఏడీబీ
- విదేశీ సహాయం, రుణాలపై అధికంగా ఆధారపడితే కొత్త రుణాలు, పాత రుణాలపై వడ్డీ చెల్లింపులకై సరిపోయి, దేశం విదేశీ రుణాల ఊబిలో చిక్కుకుంటుంది.
- ఈ విధంగా కొనసాగే పద్ధతిని డెబిట్ ట్రాప్ (రుణ ఉచ్చు) అంటారు.
- విదేశీ గ్రాంట్లు, విరాళాలపై అధికంగా ఆధారపడితే దేశ సార్వభౌమాధికారానికి ఇబ్బంది ఏర్పడుతుంది.
- ప్రస్తుతం భారత్‌కు విదేశీ రుణం అధికంగా లభిస్తున్న మార్గం ‘ప్రపంచబ్యాంకు’
- ప్రస్తుతం భారత్‌కు విదేశీ గ్రాంట్లు అధికంగా అందజేస్తున్న దేశం జపాన్, బ్రిటన్, అమెరికా
లోటు విత్తం/ లోటు ద్రవ్యంత - దేశీయ వనరులు, విదేశీ వనరుల ద్వారా వనరులను సమకూర్చుకోకపోవడంగాని సమీకరించిన వనరులు సరిపోకపోవడం గాని, చివరగా ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకోవడం లేదా అంతిమంగా నూతన కరెన్సీ నోట్లను ముద్రించడం.
- లోటు ద్రవ్యం వల్ల, నూతన కరెన్సీ నోట్ల ముద్రణ వల్ల ద్రవ్య సప్లయ్ పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.
- సుకమయి చక్రవర్తి కమిటీ (1982-85) సూచన మేరకు 1997-98 నుంచి అంటే 9వ ప్రణాళిక నుంచి ప్రణాళిక నిధుల సమీకరణకు లోటు ద్రవ్య విధానం ఉపయోగించడం లేదు.
- భారతదేశంలో దేశీయ బడ్జెట్ వనరుల (డీబీఆర్) ద్వారా అధిక, అల్పంగా సమకూర్చుకున్న ప్రణాళికలు. అతి ఎక్కువ 8వ ప్రణాళిక 86శాతం (10, 11వ ప్రణాళిక 100 శాతం) అతి తక్కువ 2వ ప్రణాళిక 56 శాతం.
- విదేశీ వనరులను అధిక, అల్పంగా ఉపయోగించిన ప్రణాళికలు. అత్యధికంగా 3వ ప్రణాళిక 28శాతం. అతి తక్కువ 8వ ప్రణాళిక 5 శాతం (10, 11వ ప్రణాళిక 0 శాతం)
- లోటు ద్రవ్య విధానాన్ని అధిక, అల్పంగా ఉపయోగించిన ప్రణాళికలు. అధికంగా 2వ ప్రణాళిక 20.4 శాతం. అల్పంగా 5వ ప్రణాళిక 3 శాతం (10వ ప్రణాళిక 0 శాతం)
- ప్రస్తుతం భారతదేశం ప్రణాళికల వనరుల సమీకరణకు అధిక భాగం దేశీయ బడ్జెట్ వనరుల ద్వారా సమీకరించుకుంటుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని ప్రకటించిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది?
ఎ) 1948 పారిశ్రామిక విధాన తీర్మానం
బి) 1956 పారిశ్రామిక విధాన తీర్మానం
సి) 1991 పారిశ్రామిక విధాన తీర్మానం
డి) 1977 పారిశ్రామిక విధాన తీర్మానం
2. భౌతిక ప్రణాళికలకు ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థిక వేత్తలు ఎవరు?
ఎ) మహలనోబీస్, పీతాంబర్ పంత్
బి) మహలనోబిస్, నెహ్రూ
సి) దాదాభాయ్ నౌరోజీ, నెహ్రూ
డి) మహలనోబీస్, అశోక్‌మెహతా
3. భారతదేశంలో ఏ ప్రణాళిక నుంచి సూచనాత్మక ప్రణళికలను అమలు చేశారు?
ఎ) 7 బి) 8 సి) 9 డి) 10
4. 1990-92 సంవత్సరాల మధ్య అమలు చేసిన ప్రణాళికలు ఏవి?
ఎ) వార్షిక ప్రణాళికలు
బి) నిరంతర ప్రణాళికలు
సి) పిగ్మి ప్రణాళికలు డి) ఎ, సి
5. నీతి ఆయోగ్ ఏ రకమైన ప్రణాళికలను అమలు చేస్తుంది?
ఎ) వార్షిక ప్రణాళికలు
బి) స్వల్పకాలిక ప్రణాళికలు
సి) దీర్ఘకాలిక ప్రణాళికలు
డి) నిరంతర ప్రణాళికలు
6. భారతదేశంలో ప్రణాళికల వికేంద్రీకరణ ధోరణి ఎన్ని స్థాయిల్లో రూపొందుతుంది?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
7. రాష్ట్రస్థాయిలో ప్రణాళికల రూపకల్పన చేసేది.
ఎ) జాతీయ ప్రణాళిక బోర్డు
బి) రాష్ట్ర ప్రణాళిక బోర్డు
సి) జిల్లా ప్రణాళిక బోర్డు
డి) నీతి ఆయోగ్
8. జిల్లాస్థాయిలో రూపొందించిన ప్రణాళికలను అంతిమంగా ఆమోదించేది ఏది?
ఎ) జాతీయ ప్రణాళిక బోర్డ్
బి) నీతి ఆయోగ్
సి) రాష్ట్ర ప్రణాళిక బోర్డ్
డి) జిల్లా ప్రణాళిక బోర్డ్
9. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను మొదట ప్రతిపాదించినది ఎవరు?
ఎ) ఆడమ్‌స్మిత్ బి) మార్షల్
సి) జె.ఎం.కీన్స్ డి) పై అందరూ
10. 12 పంచవర్ష ప్రణాళికలతో పాటు ఎన్ని వార్షిక ప్రణాళికలను అమలు చేశారు?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 6
11. స్టేట్ ప్లానింగ్ బోర్డ్ అనేది…
ఎ) రాజ్యాంగ బద్ధ సంస్థ
బి) చట్టబద్ధ సంస్థ
సి) రాజ్యాంగేతర సంస్థలు డి) ఎ, బి
12. ప్రణాళికల అమలుకు కావసిన వనరుల సమీకరణ మార్గాలు ఎన్ని?
ఎ) 2 బి) 3 సి) 4 డి) అనంతం
13. ప్రణాళికలు వనరుల సమీకరణలో ఉత్తమమైన మార్గం
ఎ) దేశీయ వనరులు బి) విదేశీ వనరులు
సి) లోటు ద్రవ్యం డి) పైవన్నీ
14. కిందివాటిలో అంతర్జాతీయ విత్త సంస్థ కానిది ఏది?
ఎ) ఐబీఆర్డీ బి) ఐఎంఎఫ్
సి) ఏడీబీ డి) ఐసీఐసీఐ
15. ఒక దేశ సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలిగించేవి ఏవి?
ఎ) విదేశీ గ్రాంట్లు బి) విదేశీ విరాళాలు
సి) విదేశీ రుణాలు డి) పైవన్నీ
16. ప్రస్తుతం భారతదేశానికి అధిక విదేశీ రుణం అందిస్తున్నది ఏది?
ఎ) అమెరికా బి) రష్యా
సి) ఐఎంఎఫ్ డి) ఐబీఆర్డీ
17. లోటు ద్రవ్య విధానాన్ని అనుసరిస్తే
ఎ) ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యసప్లయ్ పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది
బి) ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యసప్లయ్ పెరిగి ఆర్థిక మాద్యం ఏర్పడుతుంది
సి) ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది
డి) పైవన్నీ
18. లోటు ద్రవ్య విధానాన్ని అనుసరించకూడదని సూచించిన కమిటీ ఏది?
ఎ) మల్హోత్రా కమిటీ
బి) సుకమయి చక్రవర్తి కమిటీ
సి) కాల్ధార్ కమిటీ
డి) రంగరాజన్ కమిటీ
19. భారతదేశానికి అధిక విదేశీ గ్రాంట్లను అందజేస్తున్న దేశం ఏది?
ఎ) అమెరికా బి) రష్యా
సి) జపాన్ డి) బ్రిటన్
20. అతి తక్కువ దేశీయ వనరులను ఉపయోగించిన ప్రణాళిక ఏది?
ఎ) 2వది బి) 3వది
సి) 8వది డి) 5వది
సమాధానాలు
1-ఎ 2-ఎ 3-బి 4-డి
5-సి 6-బి 7-బి 8-సి
9-సి 10-డి 11-డి 12-బి
13-ఎ 14-డి 15-డి 16-డి
17-ఎ 18-బి 19-సి 20-ఎ
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు