Economy | అత్యధిక, అత్యల్ప తలసరి ఆదాయం గల జిల్లాలు?
1. కింది వాటిలో సరైనది గుర్తించండి?
ఎ. 2022-23 సంవత్సరానికి ముందస్తు అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ ప్రస్తుత ధరల వద్ద రూ.13.27 లక్షల కోట్లు
బి. 2022-23 సంవత్సరానికి ముందస్తు అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద రూ.3.17 లక్షల కోట్లు
సి. ప్రస్తుత ధరల వద్ద చూసినప్పుడు గత సంవత్సరం (2021-22)తో పోల్చినప్పుడు 2022-23 సంవత్సరంలో జీఎస్డీపీలో వృద్ధి శాతం- 15.6 శాతం
1) ఎ, బి సరైనవి 2) బి, సి సరైనవి
3) ఎ, బి, సి సరైనవి 4) పైవేవీకావు
2. 2021-22 సంవత్సరానికి ప్రస్తుత ధరల వద్ద జీఎస్డీపీ ప్రొవిజినల్ ఎస్టిమేట్స్కు సంబంధించిన వృద్ధి రేటులో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసిన 18 సాధారణ రాష్ర్టాలకు సంబంధించిన జీఎస్డీపీ (పీఈ) వృద్ధి రేటులో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది?
1) 3 2) 4 3) 5 4) 2
3. 2014-15 నుంచి 2022-23 మధ్య భారత జీడీపీకి తెలంగాణ జీఎస్డీపీ అందించిన వాటా ఎంత శాతం నుంచి ఎంత శాతానికి పెరిగింది (ప్రస్తుత ధరల వద్ద చూసినప్పుడు)?
1) 5.1 నుంచి 5.9 వరకు
2) 4.1 నుంచి 4.9 వరకు
3) 3.1 నుంచి 3.9 వరకు
4) 4.5 నుంచి 4.9 వరకు
4. కింది వాటిలో సరైనవి?
ఎ. 2022-23 సంవత్సరానికి ముందస్తు అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ స్థిర ధరల వద్ద రూ.7.27 లక్షల కోట్లు
బి. 2022-23 సంవత్సరానికి ముందస్తు అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద భారతదేశ తలసరి ఆదాయానికి 1.86 రెట్లు
సి. ప్రస్తుత ధరల వద్ద చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం గత సంవత్సరంతో పోల్చినప్పుడు 15.1 శాతం పెరిగింది
1) ఎ, బి సరైనవి 2) బి, సి సరైనవి
3) ఎ, సి సరైనవి 4) ఎ, బి, సి సరైనవి
5. ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల వద్ద 2022-23 సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర అదనపు విలువలో వివిధ రంగాల వాటా ప్రకారం సరైనది?
1) సేవల రంగం వాటా 62.8 శాతం
పారిశ్రామిక రంగం వాటా 19.0 శాతం
వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 18.2 శాతం
2) సేవల రంగం వాటా 61.5 శాతం
పారిశ్రామిక రంగం వాటా 19.7 శాతం
వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 18.7 శాతం
3) సేవల రంగం వాటా 60 శాతం
పారిశ్రామిక రంగం వాటా 19.7 శాతం
వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 20 శాతం
4) పైవేవీ కావు
6. తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి అదనపు స్థూల రాష్ట్ర విలువ (జీఎస్వీఏ)లో ఏ రంగం వాటా క్రమేపీ తగ్గుతూ వస్తుంది (ఇటీవల సంవత్సరాల్లో)?
1) వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా
2) పారిశ్రామిక రంగం
3) సేవల రంగం 4) ఏదీకాదు
7. కింది ఏ రంగంలో 2014-15 (రాష్ట్ర ఏర్పాటు సమయంలో)లో వృద్ధి రేటు రుణాత్మకంగా ఉండి 2022-23 సంవత్సరానికి వృద్ధి రేటు 11.9 శాతంగా నమోదయ్యింది (జీఎస్వీఏకి సంబంధించి ప్రస్తుత ధరల వద్ద)?
1) వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా
2) పారిశ్రామిక రంగం వాటా
3) సేవా రంగం 4) ఏదీకాదు
8. 2011-12 స్థిర ధరల ప్రకారం జీఎస్డీపీలో వివిధ రంగాల వాటా 2022-23 సంవత్సరానికి ముందస్తు అంచనాల ప్రకారం సరైనది గుర్తించండి?
1) ప్రాథమిక రంగం వాటా- 17.2 శాతం
ద్వితీయ రంగం వాటా- 19.8 శాతం
తృతీయ రంగం వాటా- 62.9 శాతం
2) ప్రాథమిక రంగం వాటా- 17.8 శాతం
ద్వితీయ రంగం వాటా – 20.7 శాతం
తృతీయ రంగం వాటా – 61.5 శాతం
3) ప్రాథమిక రంగం వాటా- 19.0 శాతం
ద్వితీయ రంగం వాటా – 21.1 శాతం
తృతీయ రంగం వాటా – 59.9 శాతం
4) ప్రాథమిక రంగం వాటా- 18.1 శాతం
ద్వితీయ రంగం వాటా – 20.6 శాతం
తృతీయ రంగం వాటా – 61.3 శాతం
9. తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2023 ప్రకారం రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం, అత్యల్ప తలసరి ఆదాయంగల జిల్లాలు వరుసగా.. (2011-12 స్థిర ధరల వద్ద 2020-21 సంవత్సరానికి సంబంధించి మొదట సవరించిన అంచనాల ప్రకారం)
1) రంగారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్
2) రంగారెడ్డి, వికారాబాద్
3) రంగారెడ్డి, ములుగు
4) రంగారెడ్డి, నారాయణపేట
10. తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి జనాభాతో దశాబ్ద వృద్ధి రేటుకు సంబంధించిన దశాబ్దాలను జనాభా వృద్ధి రేటుతో జతపర్చండి?
ఎ. 1981-91 1. 29.27 శాతం
బి. 1971-81 2. 27.59 శాతం
సి. 1961-71 3. 24.60 శాతం
డి. 1991-2001 4. 18.77 శాతం
ఇ. 2001-11 5. 13.58 శాతం
1) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
3) ఎ-3, బి-2, సి-1, డి-5, ఇ-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5
11. 1961 నుంచి 2011 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత దాదాపు ఎన్ని రెట్లు అయింది?
1) 2 2) 3 3) 2.5 4) 1.5
12. కింది వాటిలో సరైనవి? (2011 జనాభా లెక్కల ప్రకారం)
ఎ. అత్యధిక గ్రామీణ జనాభా గల జిల్లా- నల్లగొండ
బి. అత్యధిక పట్టణ జనాభా గల జిల్లా- మేడ్చల్ మల్కాజిగిరి (హైదరాబాద్ మినహా)
సి. గ్రామీణ జనాభా లేని జిల్లా- హైదరాబాద్
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి
13. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2020-21 ప్రకారం తెలంగాణ రాష్ట్ర లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్ఎఫ్పీఆర్) – 65.4 శాతం
బి. గ్రామీణ ప్రాంతంలో ఎల్ఎఫ్పీఆర్ – 72.2 శాతం
సి. పట్టణ ప్రాంతంలో ఎల్ఎఫ్పీఆర్ – 55.7 శాతం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
14. కింది వాటిలో సరైనవి గుర్తించండి? (పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2020-21 ప్రకారం)
ఎ. నిరుద్యోగిత రేటు తెలంగాణలో 2019-20 నుంచి 2020-21 వరకు 7.5 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది
బి. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగిత రేటు 2019-20 నుంచి 2020-21 వరకు 5.7 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గింది
సి. పట్టణ ప్రాంతంలో నిరుద్యోగిత రేటు 2019-20 నుంచి 2020-21 వరకు 10.7 శాతం నుంచి 8 శాతానికి తగ్గింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
15. ఉద్యోగిత ఆధారంగా (ఉద్యోగాలను కల్పిస్తున్న రంగాలను ఆధారంగా తీసుకొని) తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలను కల్పిస్తున్న రంగాలను అవరోహణా క్రమంలో అమర్చండి?
1) వ్యవసాయం, అనుబంధ రంగాలు > పారిశ్రామిక రంగం > సేవారంగం
2) సేవారంగం > పారిశ్రామిక రంగం > వ్యవసాయం, అనుబంధ రంగం
3) వ్యవసాయం, అనుబంధ రంగం > సేవారంగం > పారిశ్రామిక రంగం
4) ఏదీకాదు
16. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సామాజిక ముఖచిత్రం-2023లో పేర్కొన్న ప్రకారం రైతుబంధుకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ. 2018 వానాకాలం- 2022 వానాకాలం మధ్య రూ.65,192 కోట్లు రైతుబంధు కింద 65 లక్షల మంది లబ్ధిదారులకు అందజేశారు
బి. లబ్ధిదారుల్లో బీసీలు 53 శాతం, ఎస్సీలు 13 శాతం, ఎస్టీలు 13 శాతం, ఇతరులు 21 శాతం
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
సమాధానాలు
1-3, 2-1, 3-2, 4-4,
5-1, 6-2, 7-1, 8-1, 9-2, 10-2, 11-2, 12-1, 13-4, 14-4, 15-3 16-3.
గతవారం తరువాయి.
140. రాష్ర్టాల పునర్విభజన నివేదిక ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ తలసరి వార్షిక ఆదాయం ఆంధ్ర రాష్ట్ర వార్షిక ఆదాయం కంటే..
1) 50 శాతం ఎక్కువ (దాదాపు)
2) 50 శాతం తక్కువ (దాదాపు)
3) 100 శాతం ఎక్కువ (దాదాపు)
4) ఏదీకాదు
ఆధారం: ఎస్ఆర్సీ ప్రకారం తెలంగాణ తలసరి వార్షికాదాయం 15.04, ఆంధ్రా వార్షికాదాయం 10.53 (రూ.లు)
141. కే లలిత్ను ఏ మధ్యకాలానికి చెందిన తెలంగాణ మిగులు మొత్తాన్ని నిర్ధారించడానికి నియమించారు?
1) 1-11-1956 నుంచి 31-12-1968
2) 1-11-1956 నుంచి 31-03-1968
3) 1-11-1956 నుంచి 31-12-1969
4) ఏదీకాదు
- మార్చి 1969లో లలిత్ తాను రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
142. లలిత్ కమిటీ నివేదిక ప్రకారం 1956 నుంచి 1968 మధ్య కాలంలో రాష్ట్ర రెవెన్యూ ఆదాయంలో తెలంగాణ ప్రాంతం వాటా, రాష్ట్ర వ్యయంలో తెలంగాణ ప్రాంతానికి వాటా? (శాతాల్లో)
1) 41.7, 38.6 2) 47.1, 36.8
3) 41.7, 36.8 4) ఏదీకాదు
ఆధారం: కే లలిత్ తెలంగాణ మిగులు పరిమాణంపై నివేదిక సెక్షన్-4 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969.
143. 2003-04 నుంచి 2006-07 మధ్య 4 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజల తలసరి వార్షిక రెవెన్యూ ఆంధ్రా ప్రజల వార్షిక రెవెన్యూ కంటే..
1) ఒకటిన్నర రెట్లు ఎక్కువ
2) రెండు రెట్లు ఎక్కువ
3) ఒకటిన్నర రెట్లు తక్కువ
4) రెండు రెట్లు తక్కువ - తలసరి వార్షిక రెవెన్యూ అంటే వార్షిక రెవెన్యూ ఆదాయాన్ని జనాభాతో భాగించాలి. తెలంగాణ- రూ.1978, ఆంధ్ర- రూ.959
144. నిజాం రాజుల కాలంలో తెలంగాణలో తలసరి భూమి శిస్తు ఆదాయం?
1) రూ.3.42 2) రూ.2.43
3) రూ.4.32 4) ఏదీకాదు - ఆంధ్రాలో రూ.1.82. అంటే తెలంగాణలో 88 శాతం ఎక్కువ.
145. 1992 నుంచి 2011 వరకు నీటిపారుదల కింద ఉన్న భూమి దాదాపు ఎంత శాతం బోరు బావులు, ఇతర బావుల కింద ఉంది?
1) 70 శాతం కంటే ఎక్కువ
2) 60 శాతం కంటే ఎక్కువ
3) 50 శాతం కంటే ఎక్కువ
4) ఏదీకాదు - తెలంగాణ నీటి పారుదల వ్యవస్థపై ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో బోర్ల సంఖ్య పెరిగింది.
146. 1966-67 నుంచి 2004-05 వరకు ఎన్ని గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు చేపట్టే ప్రతిపాదన ఉండగా వాటిని ఆంధ్రా పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు?
1) 2 2) 3 3) 4 4) 5 - శంకర్పల్లి, నేదునూరు వద్ద చేపట్టాల్సిన గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు.
147. తెలంగాణ పంటల ఉత్పాదక వ్యయం బాగా పెరిగి ఆదాయం పడిపోయి రుణ భారం మోయలేక ఏ సంవత్సరం నుంచి రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు?
1) 1995 2) 1996
3) 1997 4) ఏదీకాదు - నీటిపారుదల, విద్యుచ్ఛక్తికి ద్రవ్య కేటాయింపులు తెలంగాణలో సరిగా ఇవ్వకపోవడం వల్ల బోరు బావుల సంఖ్య పెరిగింది.
148. మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పరిశ్రమల గనులపై వ్యయ శాతం?
1) 50:50 2) 60:40
3) 70:30 4) ఏదీకాదు - ఆంధ్రాలో 405.61 లక్షల ఖర్చు, తెలంగాణలో 175.98 లక్షల ఖర్చు జరిగింది.
149. 1969, ఏప్రిల్ 30న పార్లమెంటులో కేఎల్ రావు తెలంగాణకు ఏ విషయంలో అన్యాయం జరగలేదని బుకాయించాడు?
1) వ్యవసాయ రంగం
2) నీటి పారుదల
3) ఉపాధి రంగం 4) ఏదీకాదు - తెలంగాణ మిగులును తెలంగాణలో ఖర్చు చేయనప్పటికీ వ్యయ నిష్పత్తి ఆంధ్రా-తెలంగాణ మధ్య 2:1గా ఉందని వ్యాఖ్యానించాడు.
150. వార్షిక ప్రణాళిక (1966-69) కాలంలో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతంలో జరిగిన ప్రణాళిక వ్యయం శాతం?
1) 44-56 2) 46-54
3) 45-55 4) ఏదీకాదు - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్- 232.8 లక్షలు. ఆంధ్రా- 130.3 లక్షలు, తెలంగాణ- 102.5 లక్షలు (ప్రణాళిక వ్యయం).
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు