Different properties | భిన్న ధర్మాలు
ఏకదేవతారాధన
-Long, sedomలు ప్రతిపాదించారు.
-సృష్టి మొత్తం ఒకే దేవుడి నుంచి ఉద్భవించిందని, దానితోనే మతం ప్రారంభమైనదని తెలిపారు.
-వీరి వాదన ప్రకారం బహుదేవతారాధన కంటే కూడా ఏకదేవతారాధన ప్రాచీనమైనది.
ప్రకార్యవాదం
-దీనిని Radeliff Brown, Malinovsky ప్రతిపాదించారు.
-భయం, వ్యాకులతలను తొలగించి మనోనిశ్చలతను కలిగించే సాధనమే మతమని వీరి అభిప్రాయం.
-ఇలా మనిషిపై, సమాజంపై మతం నిర్వహిస్తున్న ప్రకార్యాల వల్లనే మనుషులు ఏదో ఒక మతాన్ని పాటిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
Fittishism
-Fittish అంటే మహాత్యం అని అర్థం.
-ఇది పోర్చుగీసు పదం.
-ఈ పదాన్ని చార్లెస్ డీ బ్రూస్ తన గ్రంథం డూకల్ట్డిస్ డై మైక్రో పిటిషన్లో తెలిపాడు.
-మన దేశంలో Fittishism గురించి ప్రెజ్లర్ తన Premitire Relegeious in india అనే గ్రంథంలో తెలిపారు.
ఉదా: కత్తికి అతీత శక్తులు ఉన్నాయని నమ్మడం.
2.కిరీటానికి అతీత శక్తులు ఉన్నాయని నమ్మడం. వాటినే దేవుడిగా పూజించడం.
భారతదేశంలోని మత రూపాలు
చార్వాకులు
-హిందూ మతాన్ని విమర్శించిన ప్రథమ తాత్విక విప్లవకారులు బృహస్పతి ఈ వాదాన్ని స్థాపించాడు. చార్వాకుడు ప్రచారంలోకి తీసుకొచ్చాడు.
-భారతదేశ సమాజంలో మొదటి నాస్తికవాదులు.
-వీరినే లోకాయుతులు అని కూడా అంటారు.
-చారు = అందమైన, వాక్కు = మాట – అందమైన మాటలు మాట్లాడేవారు.
-జైన, బౌద్ధ మతాలకు కావాల్సిన తాత్విక పునాదులను ఏర్పాటు చేశారు.
-శాస్త్రీయ దృక్పథానికి, భౌతికవాదానికి ఆద్యులు.
అజీవకులు
-పురాణ కష్యపుడు ఈ వాదకర్త అనే అభిప్రాయం ఉన్నది.
-ఇతని శిష్యుడు గోసలిపుత్ర ఈ వాదాన్ని ప్రచారం చేశాడు.
-వీరిది సన్యాస జీవనం, మద్యపానం, దిమ్మరి జీవనం.
-అజితకేశ కంబలి, కాత్యాయన ఇతర ప్రముఖులు.
-అనాగరిక జీవన విధానాన్ని కలిగి ఉంటారు.
హిందూమతం
-బహుదేవతారాధన, విగ్రహారాధన, వైవిధ్యమైన విశ్వాసాలు, సంస్కారాలతో కూడినదే హిందూమతం.
-ఇది వివిధ జీవన పద్ధతుల సమ్మేళనం, విలీనత్వాన్ని చేసుకొనే లక్షణాన్ని కలిగి ఉన్నది.
-సంగీతం, నాట్యం, ఉప సంస్కృతులు, సాహిత్యం, పండుగలు వంటి రూపాలలో ఆచరిస్తారు.
-హిందూమతానికి మూలం వేద సాహిత్యం.
వేద సాహిత్యం
-నాలుగు వేదాలు – రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం
-యజ్ఞయాగాల గురించి తెలిపేవి బ్రాహ్మణాలు
-వేదాల సారాన్ని, మత సమానత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని తెలిపేవి ఉపనిషత్తులు (108).
-అరణ్యాల్లో జీవించే మునులు, వానప్రస్థాశ్రమాన్ని గురించి తెలిపేవి అరణ్యకాలు
-వేదాలకు అంగాలుగా పిలిచే 6 వేదాంగాలు
1) పాణిని శబ్ధశాస్త్రం (శిక్ష)
2) యాస్కుడు రచించిన నిరుక్త
3) పాణిని వ్యాకరణం
4) పింగళుని ఛందస్సు
5) గార్గుని జ్యోతిష్యం
6) అశ్వాళాయదుడి కల్పం
నాలుగు రకాల ఉపవేదాలు
1) రుగ్వేదం నుంచి ఆవిర్భవించి, ఆయుష్షుకు సంబంధించిన విషయాన్ని తెలిపే ఆయుర్వేదం
2) సామవేదం నుంచి ఉద్భవించి సంగీతం గురించి తెలిపే వేదం గంధర్వం.
3) యజుర్వేదం నుంచి ఉద్భవించి విలువిద్యను తెలిపే ధనుర్వేదం
4) అధర్వణ వేదం నుంచి ఉద్భవించి శిల్ప విద్యను తెలిపే శిల్పశాస్త్రం
-చాతుర్వర్ణ వ్యవస్థ గురించి రుగ్వేదంలోని 10వ కాండం పురుషసూక్తంలో ఉన్నది.
-పురుషసూక్తం ఆధారంగా దైవం నుంచి వర్ణాలు ఏర్పడ్డాయని తెలిపే దైవసిద్ధాంతం, త్రిగుణాలను అనుసరించి వర్ణవ్యవస్థ ఏర్పడిందని తెలిపే భగవద్గీత త్రిగుణ సిద్ధాంతం, పూర్వజన్మ కర్మలను అనుసరించి వర్ణం సిద్ధిస్తుందని తెలిపే మనుస్మృతి కర్మ సిద్ధాంతం, ఆర్యుల వల్లనే వర్ణం ఏర్పడిందని తెలిపే రిస్లే ఆర్యసిద్ధాంతం వంటివి వర్ణవ్యవస్థ పుట్టుకను తెలుపుతున్నాయి.
-సత్యగుణం, రజో, తపోగుణాలను కలిపి త్రిగుణాలు అంటారు.
మనువు ప్రకారం కర్మలు
1) పవిత్ర కర్మలు
2) అపవిత్ర కర్మలు
3) సాత్విక కర్మలు
4) రాజరసిక కర్మలు
హిందూమతం ప్రధాన లోపాలు
-అసమానతలతో కూడిన వర్ణవ్యవస్థ
-స్త్రీలకు రెండోస్థానం
-బ్రాహ్మణాధిపత్యం
-కఠినమైన కర్మకాండలు, పూజావిధానాలు
-పశుపోషణకి, వ్యవసాయానికి ఆటంకంగా మారిన యజ్ఞయాగాదులు
జైనం పుట్టుకకు తోడ్పడిన కారణాలు
-ఉపనిషత్తుల తత్వం
-తీవ్రమైన బ్రాహ్మణాధిపత్యం
-వర్ణవ్యవస్థలోని లోపాలు
-యజ్ఞయాగాలు
-సముద్రంపై నిషేధం
-వైశ్యుల తోడ్పాటు
-జైనమత గురువులను తీర్థంకరులు అంటారు.
-తీర్థంకరులు అంటే జీవితం అనే అగాథాన్ని దాటడానికి వారధి నిర్మించినవారు అని అర్థం.
-రుగ్వేదం నారాయణుని అవతారమే వృషభనాథుడు అని పేర్కొన్నది.
-24 మంది తీర్థంకరుల్లో మొదటివాడు- వృషభనాథుడు
-23వ వాడు పార్శనాథుడు
-24వ వాడు మహావీరుడు
-పార్శనాథుని కాలం వరకు జైనంలో నిర్గ్రంథులు అంటే ప్రాపంచిక సుఖాలను త్యజించినవారిగా పిలిచేవారు.
-వర్ధమాన మహావీరుడికి జ్రుంభిక గ్రామంలో రుజుపాలిక నదీ తీరంలో సాల వృక్షం కింద 42వ ఏట జ్ఞానోదయం అయ్యింది. అందుకే జినుడు అయ్యాడు.
-సల్లేఖన వ్రతం ద్వారా పావాపురిలోని షష్టిపాయిని ఇంట్లో క్రీ.పూ. 468లో మహావీరుడు మరణించాడు.
-జైనులు స్థాపించిన గచ్చాలను అనుసరించి హిందువుల్లో మఠాలు, బౌద్ధుల్లో సంఘాలు ఏర్పడ్డాయి.
జైనమత సిద్ధాంతాలు
-ప్రతి వ్యక్తి పాటించాల్సిన పంచవ్రతాలు/సూత్రాలు
1) అసత్యం పలుకరాదు, 2) అహింస, 3) అస్థేయం
4) అపరిగ్రహం, 5) బ్రహ్మచర్యం
-మొదటి 4 పంచసూత్రాలని పార్శనాథుడు చెప్పగా చివరిది మహావీరుడు తెలిపాడు.
-మోక్షాన్ని సాధించడానికి ఆచరించాల్సిన త్రిరత్నాలు
1) సమ్యక్ క్రియ
2) సమ్యక్ విశ్వాసం
3) సమ్యక్ జ్ఞానం
-విపరీతమైన అహింసను పాటించాలి
-ఏ దేవుడైనా తీర్థంకరుల తర్వాతనే
-పునర్జన్మలు, కర్మలు ఉన్నాయి
-కులవ్యవస్థకు వ్యతిరేకం
-జైనమత పవిత్ర గ్రంథాన్ని 12 అంగాలలో ప్రాకృతం, అర్ధమాగధి భాషలో పొందుపర్చారు.
-ఇతర జైన సాహిత్యాన్ని ద్వాదశాంగాలు అంటారు.
-జైనమతంలో మహావీరుడి అనుచరులైన దిగంబరులు, పార్శనాథ అనుచరులైన శ్వేతాంబరులు అనే ప్రధాన శాఖలు ఉన్నాయి.
-హేమచంద్రుని పరిశిష్టపర్వన్ గ్రంథం ప్రకారం మగధలో సంభవించిన
12 ఏండ్ల కరువు కాటకాల వల్ల
1) భద్రబాహు, చంద్రగుప్తులతో కూడిన సమూహం శ్రావణబెలగోళకు వచ్చి దిగంబరం పాటించింది.
2) స్థూలభద్రుని నాయకత్వంలోని సమూహం మగధలో ఉండి శ్వేతాంబరాన్ని పాటించింది.
3) తర్వాతి కాలంలో శ్వేతాంబరులు తేరపంథీలుగా, దిగంబరులు సమైయాలుగా విడిపోయారు.
భారతీయ సమాజంపై జైనమతం ప్రభావం
1) తీవ్రస్థాయిలో ఉన్న జంతుబలులను తగ్గించారు.
2) వర్ణవ్యవస్థలోని అసమానతలను వ్యతిరేకించారు.
3) స్త్రీల సమానత్వం కోసం విశేష కృషి చేశారు.
4) సముద్రయానానికి అనుమతినిచ్చారు. ఫలితంగా ఆర్థిక పురోగతి, విదేశాలతో సంబంధాలు ఏర్పడ్డాయి.
5) నిమ్న వర్గాలు, వైశ్యుల నుంచి మంచి ఆదరణ లభించింది.
6) కొంతవరకు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తగ్గించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు