విమానం టైర్లలో ఉపయోగించే వాయువు ?
వాయువులు
1. కింది వాటిలో నైట్రోజన్ వాయువుకు సంబంధించి సరైన వాక్యం/వాక్యాలు?
1. గాలిలో అతి తక్కువగా ఉంటుంది
2. గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ వాయువుల నిష్పత్తి 4:1
3. నైట్రోజన్ వాయువు దహనశీలి కాదు, దహన దోహదకారి కూడా కాదు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
2. చిప్స్ ప్యాకెట్లు, పచ్చడి జాడీల్లో ఫంగస్ చేరకుండా ఉండేందుకు వాటిని సీలు చేసే ముందు ఏ వాయువును నింపుతారు?
ఎ) ఆక్సిజన్ బి) ఫ్లోరిన్
సి) హైడ్రోజన్ డి) నైట్రోజన్
3. కింది వాటిలో నీటిలో నిల్వ చేసే అలోహం ఏది?
ఎ) కార్బన్ బి) పాస్ఫరస్
సి) మాంగనీస్ డి) సల్ఫర్
4. గాలిలో నైట్రోజన్ తర్వాత అత్యధికంగా లభించే వాయువు ?
ఎ) హైడ్రోజన్ బి) ఆక్సిజన్
సి) ఫ్లోరిన్ డి) ఆర్గాన్
5. కింది వాటిలో సరికాని అంశం/అంశాలు ?
1. ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఏర్పరిచేది అని అర్థం
2. విద్యుత్ బల్బుల్లో జడ వాతావరణం కోసం నైట్రోజన్ వాయువును నింపుతారు
3. నైట్రోజన్ వాయువు రంగు, రుచిని కలిగి ఉంటుంది
ఎ) 1, 2 బి) 2 సి) 3 డి) 1
6. కింది వాటిలో సరైన అంశం/అంశాలు ?
1. కళేబరాలు కుళ్లినప్పుడు వాటి నుంచి నైట్రోజన్ వాయువు వెలువడుతుంది
2. చిక్కుడు జాతి మొక్కలు గాలిలో నుంచి నైట్రోజన్‌ను గ్రహించి దాన్ని నైట్రేట్ రూపంలో వేర్లలో నిల్వచేస్తాయి. ఈ ప్రక్రియను నైట్రోజన్ స్థిరీకరణం అంటారు.
3. ప్రయోగశాలల్లో అమ్మోనియం నైట్రేట్‌ను వేరుచేసి నైట్రేట్ వాయువును తయారు చేస్తారు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
7. కింది పదార్థాల్లో వేటిని/దేన్ని వేడి చేసినప్పుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది?
ఎ) మెర్క్యూరిక్ ఆక్సైడ్
బి) పొటాషియం నైట్రేట్
సి) పొటాషియం క్లోరేట్ డి) పైవన్నీ
8. కింది వాటిలో ఆక్సిజన్ వాయువుకు సంబంధించి సరైన వాక్యం/వాక్యాలు
1. గాలిలో 1/5 వంతు ఆక్సిజన్ ఉంటుంది
2. పొటాషియం క్లోరేట్‌ను వేడి చేసి ఆక్సిజన్ విడుదలయ్యే చర్యలో ఉత్ప్రేరకంగా మాంగనీస్ డయాక్సైడ్ను వాడుతారు
3. మొక్కలు సూర్యరశ్మితో కిరణజన్య సంయోగక్రియ జరిపినప్పుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
9. కింది వాటిలో సరికానిది గుర్తించండి
1. ఆక్సిజన్‌ను ప్రిస్టీ, షీలే అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు
2. గాలిలో నైట్రోజన్ తర్వాత అత్యధికంగా లభించే వాయువు ఆక్సిజన్
3. ఆక్సిజన్ దహనశీల వాయువు. ఇది దహన దోహదకారి కాదు
ఎ) 1 బి) 2, 3 సి) 3 డి) 2
10. రాకెట్ ఇంధనంగా కింది వాటిలో దేన్ని ఉపయోగిస్తారు?
ఎ) ద్రవ ఆక్సిజన్ బి) క్లోరిన్
సి) ఫ్లోరిన్ డి) ఆర్గాన్
11. కింది వాటిలో సరైన వాక్యం/వాక్యాలు 1. ఆక్సిజన్‌ను ఎసిటలిన్ వాయువులో మం డిస్తే అది ఆక్సీ ఎసిటలిన్ జ్వాల ఏర్పడుతుంది.
2. ఆక్సీ ఎసిటలిన్ జ్వాల ఉష్ణోగ్రత 3300 డిగ్రీల సెల్సియస్
3. సముద్రం లోతుకు ఈతకు వెళ్లేవారు ఆక్సిజన్, హీలియం మిశ్రమాన్ని శ్వాస కోసం ఉపయోగిస్తారు
ఎ) 1 బి) 1, 2 సి) 2, 3 డి) 1, 2, 3
12. కింది వాటిలో సూపర్ హాలోజన్ అని దేనిని పిలుస్తారు?
ఎ) క్లోరిన్ బి) ఫ్లోరిన్
సి) బ్రోమిన్ డి) అయోడిన్
13. సరిత – మూలకాలన్నింటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఫ్లోరిన్ గీత – ఫ్లోరిన్ దంతాల్లో పింగాణీ ఏర్పడేందుకు అవసరం పైవాక్యాల్లో అసత్య వాక్యాన్ని చెప్పింది ఎవరు?
ఎ) సరిత బి) గీత
సి) ఇద్దరూ డి) ఎవరూ కాదు
14. గణేష్ – అలోహాలన్నింటిలో అత్యధిక చర్యాశీలత ఉన్నది ఫ్లోరిన్ రమేష్ – క్లోరిన్ వాయువు తెలుపు రంగులో ఉంటుంది
పైవాక్యాల్లో సత్య వాక్యం తెలిపినది ఎవరు?
ఎ) గణేష్ బి) రమేష్
సి) ఇద్దరూ డి) ఎవరూ కాదు
15. ఫ్లోరిన్‌కు సంబంధించి సరైన వాక్యం/ వాక్యాలు?
1. నీటిలో ఫ్లోరిన్ గాఢత 3 మి.గ్రా
2. నీటిలో ఫ్లోరిన్ గాఢత ఎక్కువైతే ఎముకలు బలహీనమై దంతాలపై పసుపు చారలు ఏర్పడుతాయి
3. నల్గొండ, ప్రకాశం జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య అధికం
ఎ) 1, 2 బి) 2 సి) 2, 3 డి) 1, 2, 3
16. సరికాని వాక్యం?
1. నీటి నుంచి ఫ్లోరిన్‌ను తొలగించే అతి చవకైన పద్ధతిని నేషనల్ ఎన్విరాన్మెంటల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(నాగ్‌పూర్) కనుగొన్నది
2. నీటి నుంచి ఫ్లోరిన్‌ను తొలగించే పద్ధతిలో బ్లీచింగ్ పౌడర్, సున్నం, పటిక కలుపుతారు
3. నీటి నుంచి ఫ్లోరిన్‌ను తొలగించే పద్ధతిని మొదటగా ఏపీ లోని ప్రకాశం జిల్లాలో ప్రయోగించారు
ఎ) 2 బి) 3 సి) 1 డి) 1, 2
17. కింది వాటిలో సరైన వాక్యం?
1. మనకు లభించే మూలకాలన్నింటిలో అత్యధిక ఎలక్టాన్ ఎఫినిటీ కలిగిన మూలకం – క్లోరిన్
2. క్లోరిన్ వాయువు సున్నంతో చర్య జరిపితే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
18. కింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని చెప్పింది ఎవరు?
భావన – క్లోరిన్‌కు నీటిలోని రోగాలను కలిగించే సూక్ష్మ జీవులను చంపే గుణం ఉంది యశస్విని – క్లోరిన్ ఘాటైన, ప్రమాదకరమైన వాయువు కాదు
ఎ) భావన బి) యశస్విని
సి) ఎ, బి డి) ఏదీకాదు
19. క్లోరిన్‌ను వేటి తయారీలో ఉపయోగిస్తారు?
ఎ) పాస్జీన్ బి) మస్టర్డ్ గ్యాస్
సి) భాష్పవాయువు డి) పైవన్నీ
20. కింది వాటిలో ఏడిపించే వాయువు అని దేన్ని అంటారు?
ఎ) భాష్ప వాయువు బి) మస్టర్డ్ గ్యాస్
సి) పాస్జీన్ డి) బి, సి
21. కింది వాటిలో సరికాని వాక్యం చెప్పింది ఎవరు ?
వినీత్ – ఇథిలిన్ వాయువుతో క్లోరిన్ చర్య జరిపితే మస్టర్డ్ గ్యాస్ తయారవుతుంది సంగీత – మొదటి ప్రపంచ యుద్ధంలో మస్టర్డ్ గ్యాస్ అనే విషవాయువును ఉపయోగించారు
ఎ) వినీత్ బి) సంగీత
సి) ఇద్దరూ డి) ఏదీకాదు/ఎవరూకాదు
22. కింది వారిలో సరైన వాక్యాన్ని చెప్పింది?
వరుణ్ – హైడ్రోజన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త – హెన్రీ కావెండిష్ జీవన్ – హైడ్రోజన్ అంటే నీటిని ఏర్పరిచేది అని అర్థం
ఎ) వరుణ్ బి) జీవన్
సి) ఎ, బి డి) ఏదీకాదు
23. కింది వాటిలో సరైనది
1. హైడ్రోజన్ వాయువుకు హైడ్రోజన్ అనే పేరు పెట్టింది- రాబర్ట్ బాయిల్
2. విశ్వంలో అత్యధికంగా లభించే మూలకం హైడ్రోజన్
3. హైడ్రోజన్‌కు ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం అనే మూడు విసోటోపులు ఉన్నాయి
ఎ) 1 బి) 1, 2 సి) 2, 3 డి) 1, 2, 3
24. కింది వాటిలో సరికానిది గుర్తించండి
1. సోడియం, క్యాల్షియం వంటి లోహాలు నీటి లో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది
2. స్వల్పంగా ఆమ్లం కలిపిన నీటిని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది
3. రసాయన పద్ధతిలో జింకు ముక్కలపై సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువును సంగ్రహిస్తారు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) ఏదీకాదు
25. న్యూట్రాన్ ఉండని ఏకైక మూలకం
ఎ) హైడ్రోజన్ బి) ఆక్సిజన్
సి) నైట్రోజన్ డి) ఆర్గాన్
26. కింది వాటిలో హైడ్రోజన్ భౌతిక ధర్మం కానిది?
1. హైడ్రోజన్ దహనశీల వాయువు కాదు
2. మండుతున్న పుల్లను హైడ్రోజన్ వాయువు ఉన్న జాడీలో ఉంచినప్పుడు నీలి రంగు మంటలో మండి టప్ అనే శబ్దం చేస్తుంది
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
27. కింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని చెప్పింది ఎవరు?
సహన – హైడ్రోజన్ దహన దోహదకారి కాదు సాహితి – వాయువులన్నింటిలో అత్యధిక వ్యాపన రేటు ఉన్న హైడ్రోజన్
ఎ) సహన బి) సాహితి
సి) ఎ, బి డి) ఏదీకాదు
28. కింది వాక్యాల్లో సరైనది గుర్తించండి
1. హైడ్రోజన్‌ను ఆక్సిజన్‌తో కలిపి వేడిచేసినప్పుడు నీరు ఏర్పడుతుంది
2. హైడ్రోజన్‌ను నైట్రోజన్‌తో కలిపి వేడిచేసినప్పుడు అమ్మోనియా ఏర్పడుతుంది
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
29. కింది వాటిలో వాతావరణ బెలూన్లలో నింపడానికి ఉపయోగించే వాయువు?
ఎ) ఆక్సిజన్ బి) క్లోరిన్
సి) హైడ్రోజన్ డి) నియాన్
30. కింది వాటిలో హైడ్రోజన్ ఉపయోగాలు ?
1. హైడ్రోజన్‌ను శాఖీయ నూనెలను వనస్పతిగా మార్చడానికి ఉపయోగిస్తారు
2. బెర్జీలియస్ విధానంలో కృత్రిమ పెట్రోల్ తయారీలో హైడ్రోజన్‌ను ముడి పదార్థంగా ఉపయోగిస్తారు
3. హైడ్రోజన్‌ను ఆక్సీహైడ్రోజన్ జ్వాల తయారీలో ఉపయోగిస్తారు
ఎ) 1 బి) 2 సి) 3 డి) 1, 2, 3
31. ఆక్సీ హైడ్రోజన్ జ్వాల ఉష్ణోగ్రత
ఎ) 3300 డిగ్రీలు బి) 2100 డిగ్రీలు
సి) 3000 డిగ్రీలు డి) 1800 డిగ్రీలు
32. కింది వాటిలో హైడ్రోజన్ వాయువుకు సంబంధించినది?
1. హేబర్ విధానంలో అమ్మోనియా తయారీలో ముడి పదార్థంగా హైడ్రోజన్‌ను ఉపయోగిస్తారు
2. ద్రవ హైడ్రోజన్‌ను రాకెట్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
33. కింది వాటిలో జడవాయువులు కానివి
1. హీలియం 2. హైడ్రోజన్ 3. నియాన్ 4. క్లోరిన్ 5. ఆర్గాన్ 6. క్రిప్టాన్
ఎ) 1, 3 బి) 2, 4
సి) 1, 4, 5 డి) 1, 5, 6
34. జడవాయు మూలకాలను కనుగొన్న శాస్త్రవేత్త(లు) ?
ఎ) రాంసే బి) రాలీ
సి) ఎ, బి డి) గెలెస్పీ
35. కింది వాటిలో సరైనది గుర్తించండి
1. జడవాయువులను ఉత్కృష్ట లేదా ఆదర్శ వాయువులు అని అంటారు
2. జడవాయువులను గాలి నుంచి గ్రహిస్తారు. కనుక వీటిని ఏరోజన్లు అంటారు
3. జడవాయువులు రసాయన చర్యల్లో పాల్గొంటాయి
4. జడవాయువులను నోబుల్ వాయువులు లేదా మందకొడి వాయువులు అని అంటారు
ఎ) 1, 2, 3 బి) 1, 2 4
సి) 2, 3, 4 డి) 3, 4
36. కింది వాటిలో జడవాయువుల్లో మొదటిది
ఎ) నియాన్ బి) ఆర్గాన్
సి) హీలియం డి) క్రిప్టాన్
37. సూర్యగోళంలో కేంద్రక సంలీన చర్యలో ఏర్పడే జడవాయువు?
ఎ) నియాన్ బి) ఆర్గాన్
సి) క్రిప్టాన్ డి) హీలియం
38. అన్నింటికంటే తేలికైన జడవాయువు ఏది?
ఎ) హీలియం బి) నియాన్
సి) రేడాన్ డి) జీనాన్
39. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1. వాతావరణ పరిశోధనకు ఉపయోగించే బెలూన్లలో హీలియం వాయువును ఉపయోగిస్తారు
2. సముద్రాల్లో ఈతకు వెళ్లేవారు శ్వాసకోసం ఆక్సిజన్, హీలియంల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
40. కింది వాటిలో విమాన టైర్లలో ఉపయోగించే వాయువు ఏది?
ఎ) నియాన్ బి) క్రిప్టాన్
సి) హీలియం డి) ఆర్గాన్
41. కింది వాటిలో సరికానిది గుర్తించండి
1. నియాన్ అంటే ‘కొత్త’ అని అర్థం
2. నియాన్‌ను రాంసే, ట్రావర్స్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు
3. నియాన్ వాయువును విద్యుత్ బల్బుల్లో నింపినపుడు బల్బులు ఆరెంజ్, ఎరుపు కాంతిని ఇస్తాయి
ఎ) 1, 2 బి) 3
సి) 2 డి) ఏదీకాదు
42. కింది వాటిలో ఫ్లోరోసెంట్ ట్యూబ్‌ల్లో నింపేది ఏది?
ఎ) ఆర్గాన్ బి) పాదరసం
సి) ఎ, బి డి) ఏదీకాదు
43. కింది వాటిలో ఆర్గాన్‌కు సంబంధించి సరైన వాక్యం గుర్తించండి
1. ఆర్గాన్ అంటే లాటిన్ భాషలో బద్దకం అని అర్థం
2. ఆర్గాన్‌ను రాలీ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు
3. వాతావరణంలో అధికంగా ఉన్న జడవాయువు నియాన్
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 2
44. వాతావరణంలో అధికంగా ఉన్న జడవాయువు ఏది?
ఎ) క్రిప్టాన్ బి) రేడాన్
సి) జీనాన్ డి) ఆర్గాన్
45. బొగ్గు గని కార్మికులు శిరస్సుపై ధరించే మైనర్స్ లాంప్లో ఏ వాయువును నింపుతారు?
ఎ) క్రిప్టాన్ బి) జీనాన్
సి) రేడాన్ డి) ఆర్గాన్
జవాబులు
1.బి 2.డి 3.బి 4.బి 5.సి 6.డి 7.డి 8.డి 9.సి 10.ఎ 11.డి 12.బి 13.డి 14.ఎ 15.డి 16.బి 17.సి 18.బి 19.డి 20.ఎ
21.డి 22.సి 23.సి 24.డి 25.ఎ 26.బి 27.డి 28.సి 29.సి 30.డి 31.బి 32.బి 33.బి 34.సి 35.బి 36.సి 37.డి 38.ఎ 39.సి 40.సి
41.డి 42.సి 43.ఎ 44.డి 45.ఎ
స్రవంతి
విషయ నిపుణులు,
ఏకెఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు