విటమిన్ సీ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది?
(నిన్నటి తరువాయి)
127. జతపరచండి
ఎ. ఆనందం సిద్ధాంతం 1. శాసన సభ
బి. నివారణ పిటిషన్ 2. సుప్రీం కోర్టు
సి. ప్రివిలేజెస్ 3. హైకోర్టు
డి. పర్యవేక్షక అధికార పరిధి 4. ఎగ్జిక్యూటివ్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-2, సి-1, డి-3
4) ఎ-3, బి-4, సి-1, డి-2
128. ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ సిఫారసులకు సంబంధించి సరైనది గుర్తించండి
ఎ. పంచాయతీలకు కొత్తగా ఒక భాగాన్ని ఏర్పాటు చేయాలి
బి. క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి
సి. న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి
డి. సర్పంచ్‌ను పరోక్షంగా ఎన్నుకోవాలి
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి, 4) బి, సి, డి
129. ఏ అంశం 19వ రాజ్యాంగ అధికరణలో ప్రత్యేకించి పొందుపరచలేదు?
1) పత్రికా స్వేచ్ఛ
2) స్వేచ్ఛగా సంచరించడం
3) ఏ విధమైన ఆయుధాలు లేకుండా శాంతియుతంగా స్వేచ్ఛగా సమావేశం కావడం
4) వాక్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ
130. భారతదేశంలో ఏ చట్టం ద్వారా ఎన్నికల సూత్రాలు అధికారికంగా మొదటిసారి ప్రవేశపెట్టారు?
1) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం, 1909
2) భరత ప్రభుత్వ చట్టం, 1919
3) భారత ప్రభుత్వ చట్టం, 1935
4) భారత స్వాతంత్య్ర చట్టం, 1947
131. న్యూటన్ మూడవ గమన నియమంలో చెప్పే ‘చర్య’ ‘ప్రతిచర్య’ బలాలకు సంబంధించి సరైన వివరణ?
1) చర్య, ప్రతిచర్యలకు ఒకే వస్తువుపై పని చేస్తాయి
2) చర్య, ప్రతిచర్యలు వేర్వేరు వస్తువులపై పని చేస్తాయి
3) చర్య, ప్రతిచర్యలు సమానంగా ఉంటాయి
4) 1, 2
132. బలాన్ని SI ప్రమాణాల్లో న్యూటన్లుగా, CGS ప్రమాణాల్లో డైనులుగా కొలుస్తారు. అయితే కింది వాటిలో సరైన సంబంధం
1) 1 డైను =105 న్యూటన్లు
2) 1 న్యూటన్ =105 డైను
3) 1 డైను =100 న్యూటన్లు
4) 1 న్యూటన్ =100 డైను
133. భవనంపై నుంచి ‘ఎ’ అనే బంతి క్షితిజ సమాంతరంగా విసిరితే అదే సమయంలో అక్కడి నుంచి మరొక బంతి ‘బి’ కిందికి వదిలితే, ఈ రెండింటిలో ఏది ముందు నేలను తాకుతుంది?
1) ఎ 2) బి 3) ఎ, బి
4) సమాచారం సరిపోదు
134. గురుత్వ త్వరణం విషయంలో కింది వాటి లో సరైన వివరణ ఏది?
1) భూమి ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ ‘g’ తగ్గుతుంది
2) భూమి ఉపరితలం నుంచి లోతుకు వెళ్లేకొద్దీ ‘g’ తగ్గుతుంది
3) భూమి కేంద్రం వద్ద g=0
4) పైవన్నీ సరైనవే
135. మజ్జిగను కవ్వంతో చిలికినప్పుడు జరిగే ప్రక్రియకు కింది వాటిలో సరైన వివరణ ఏది?
1) చిలకడం వల్ల వేడిపుట్టి వెన్న, మజ్జిగలు వేరుపడుతాయి
2) తేలికగా ఉన్న వెన్న అపకేంద్రబలం వల్ల పాత్ర అంచుల వద్దకు చేరుతుంది
3) తేలికగా ఉన్న మజ్జిగ అపకేంద్రబలం వల్ల పాత్ర అంచుల వద్దకు చేరుతుంది
4) బరువుగా ఉన్న మజ్జిగ అపకేంద్ర బలం వల్ల పాత్ర అంచుల వద్దకు చేరుతుంది
136. సిలిండర్లలో ఉండే వాయుపీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం?
1) మానోమీటర్ 2) బారోమీటర్
3) స్పిగ్మోమానోమీటర్ 4) ఆల్టిమీటర్
137. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కింది ఏది ద్రవస్థితిలో ఉంటుంది?
1) పాదరసం 2) సోడియం
3) పాస్ఫరస్ 4) ఏదీకాదు
138. బట్టలను వేడి నీటితో ఉతికితే మురికి తొందరగా పోతుంది. కారణం?
1) నీటి తలతన్యత తగ్గి బట్టలపైకి విస్తరిస్తుంది
2) నీటి తలతన్యత పెరిగి తేలికగా బట్టలపైకి విస్తరిస్తుంది
3) నీటి స్నిగ్ధత పెరిగి తేలికగా బట్టలపైకి విస్తరిస్తుంది 4) 1, 2
139. రేడియో యాంటెనా తరంగాలు గ్రహించడంలో ఏ దృగ్విషయం ఇమిడి ఉంది?
1) పరావర్తనం 2) అనునాదం
3) ప్రతినాదం 4) ప్రతిధ్వని
140. మట్టితో చేసిన కప్, స్టీలు కప్‌లు ఒకే ఆకారం, పరిమాణం కలిగి ఉన్నాయి. ఈ రెండిటినీ ఒకేసారి ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్న వేడి నీటితో నింపితే?
1) స్టీల్ కప్‌లో నీరు త్వరగా చల్లబడుతుంది
2) మట్టి కప్‌లో నీరు త్వరగా చల్లబడుతుంది
3) రెండూ ఒకేసారి చల్లబడతాయి
4) నీటి ఉష్ణోగ్రతను బట్టి పరిస్థితులుంటాయి
141. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. వేగదిశలో మాత్రమే మార్పు తీసుకురాగల త్వరణం ‘అభికేంద్ర త్వరణం’
బి. సమావృత్తాకార చలనంలో ఉన్న వస్తువుపై పనిచేసే ఫలిత బలం ‘అభికేంద్ర బలం’
1) ఎ, బి 2) ఎ 3) బి 4) పైవేవీకావు
142. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం
1) సూర్యుని నుంచి ఎర్రని కాంతి మాత్రమే వెలువడుతుంది
2) సూర్యకాంతి భూమిని చేరేసరికి ఎర్రగా మారుతుంది
3) సూర్యకాంతిలో అన్ని రంగులున్నప్పటికీ పరిక్షేపణం వల్ల ఎరుపురంగు మాత్రమే భూమిని చేరుతుంది
4) మధ్యాహ్నం కంటే, ఉదయం ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల
143. కింది వాటిలో సరైనది గుర్తించండి
ఎ. ఒక వస్తువు యాంత్రిక శక్తి అనేది స్థితి, గతిశక్తులపై ఆధారపడుతుంది
బి. శక్తి ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారడాన్ని ‘శక్తినిత్యత్వ నియమం’ అంటారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) పైవేవీకావు
144. ‘రాడార్’ను ఎందుకు ఉపయోగిస్తారు?
1) కాంతి తరంగాల ద్వారా వస్తువులను శోధించడానికి
2) ధ్వని తరంగాల పరావర్తనం ద్వారా వస్తువులను శోధించడానికి
3) రేడియో తరంగాల వల్ల వస్తువులను గుర్తించడానికి, వస్తువుల ప్రదేశాలను గుర్తించడానికి
4) వర్షం కురిపించే మేఘాలను గుర్తించడానికి
145. జతపరచండి
ఎ. గామా కిరణాలు 1. 10-10 నుంచి 10-16
బి. x కిరణాలు 1. 10-10 నుంచి 10-12
సి. అతినీల లోహిత 1. 4×10-7 నుంచి 10-8
డి. రేడియో తరంగాలు
1. 102 నుంచి 1.5
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
146. కింది వాటిలో దేనిని కణం ‘పవర్ హౌస్’ అంటారు?
1) హరిత రేణువు 2) మైటోకాండ్రియా
3) గోల్గి మృతదేహాలు 4) కేంద్రకం
147. జతపరచండి
ఎ. శిలీంధ్రం 1. యుగ్లీనా
బి. ప్రొటిస్టా 2. అగారికస్
సి. మొనీరా 3. అనబీన
డి. నిడేరియ 4. హైడ్రా
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-4, బి-2, సి-3, డి-1
148. కింది వాటిలో సరైనవి గుర్తించండి
1. వేసవికాల సుప్తావస్థలో గలవి కప్ప, నత్త
2. శీతాకాల సుప్తావస్థలో గలవి ధ్రువపు ఎలుగుబంటి
1) 1 2) 2 3) 1, 2 4) ఏవీకావు
149. గడ్డి-కుందేలు-నక్క-తోడేలు ఈ ఆహారపు గొలుసులో ‘నక్క’ అనేది దేన్ని సూచిస్తుంది
1) ఉత్పత్తిదారులు
2) తృతీయ వినియోగదారులు
3) ద్వితీయ వినియోగదారులు
4) ప్రాథమిక వినియోగదారులు
150. జతపరచండి
ఎ. క్రయోజనిక్స్ 1. శిలాజాల అధ్యయనం
బి. సైటాలజీ 2. అతిశీతల ఉష్ణోగ్రతల
అధ్యయనం
సి. నెఫ్రాలజీ 3. కణాల అధ్యయనం
డి. పురాజీవ శాస్త్రం 4. మూత్రపిండాల అధ్యయనం
5. నాడీ వ్యవస్థ అధ్యయనం
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-4, బి-3, సి-5, డి-2
3) ఎ-3, బి-2, సి-4, డి-5
4) ఎ-3, బి-4, సి-5, డి-1
151. ఆక్సిటోసిన్‌ను స్రవించేది?
1) మూత్రపిండాలు 2) ఎముక మజ్జ
3) గర్భాశయం 4) కాలేయం
152. జతపరచండి
ఎ. మామిడి 1. అంటుకట్టడం
బి. ఉల్లి 2. లశునం
సి. గులాబీ 3. ఛేదనం
1) ఎ-3, బి-2, సి-1
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-3, బి-1, సి-2
4) ఎ-2, బి-1, సి-3
153. విటమిన్ ‘సి’ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది?
1) బెరిబెరి 2) గాయిటర్
3) స్కర్వి 4) ఎనీమియా
154. కింది వాటిలో కృత్రిమ తీపి పదార్థం కానిది ఏది?
1) అస్పార్టేం 2) సుక్రలోజ్
3) రానిటిడీన్ 4) అలిటేం
155. జతపరచండి
ఎ. నీటి ఆకుపచ్చ శైవలాలు 1. ఫైకోసయనిక్
బి. ఎరుపు శైవలాలు 2. ఫైకోఎరిత్రిన్
సి. నత్త 3. హీమోసయనిక్
డి. పసుపు 4. కుల్కుమిన్
1) ఎ-3, బి-2, సి-1, డి-4
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-2, డి-1
156.
ఎ. నీరు ఆవిరి రూపంలో కోల్పోవడాన్ని బాష్పోత్సేకం అంటారు
బి. ఇది పత్రరంధ్రాల ద్వారా కాకుండా జలరంధ్రాల ద్వారా జరుగుతుంది
సి. పత్ర రంధ్రాలు పత్రమంతా విస్తరించును
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, బి, సి
157.
ఎ. అంతస్రావక గ్రంథుల్లో అతిచిన్నది ‘పీయూషగ్రంధి’
బి. అంతస్రావక గ్రంథుల్లో అతిపెద్దది ‘అడ్రినల్ గ్రంథి’
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏవీకావు
158.
ఎ- రెటీనాలో దండకణాలు, శంకు కణాలు ఉంటాయి
పి- దండ కణాలు కాంతి సమక్షంలో చూడడానికి తోడ్పడతాయి
క్యూ- శుంకు కణాలు చీకటిలో చూడడానికి తోడ్పడతాయి
1) ‘ఎ’ కు ‘పి’, ‘క్యూ’లు సరైన వివరణలు
2) ‘ఎ’ కు ‘పి’ సరైన వివరణ
3) ‘ఎ’ కు ‘క్యూ’ సరైన వివరణ
4) ‘ఎ’ సరైన వివరణ
159. ఆక్సాన్కు సంబంధించి సరికానిది ఏది?
1) ఇది నాడీ కణదేహం నుంచి ఏర్పడుతుంది
2) ప్రతినాడీ కణానికి అనేక ఆక్సాన్లు ఉంటాయి
3) ప్రచోదనాలు ఆక్సాన్ల ద్వారా వేగంగా ప్రయాణిస్తాయి
4) ఆక్సాన్ నాడీ పోగులు డెండ్రైట్లతో సంబంధిం కలిగి ఉంటాయి
160.
i. ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలకు ఉదాహరణలు ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు
ii. ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలకు ఉదాహరణలు జిగుర్లు, టానిన్లు
1) i 2) ii 3) i, ii 4) ఏవీకావు
161. కింది వాటిలో అంతరిక్షంలో ఉండే అల్పసాంద్రత గల కణాలు ఏవి?
ఎ. న్యూట్రినోన్ బి. ధూళి
సి. హైడ్రోజన్ ప్లాస్మా డి. హీలియం ప్లాస్మా
1) సి, డి 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
162. లవణాలతో కూడిన సముద్రజలం నుంచి స్వచ్ఛమైన నీటిని పొందే విధానం
ఎ. వడపోత బి. స్వేదనం
సి. స్ఫటికీకరణం డి. తిరోగామి
1) ఎ, సి 2) బి, సి
3) బి, డి 4) అన్నీ
163. సూక్ష్మతరంగాన్ని బట్టి పనిచేసే సూత్రం?
1) మైక్రోతరంగాలు మంటను విడుదల చేస్తాయి
2) సూక్ష్మ తరంగాలు నేరుగా వేడిని విడుదల చేస్తాయి
3) సూక్ష్మ తరంగాలు వండే ఆహారంలోని నీటి బిందువుల్లో కంపనాలు కలగచేయడం ద్వారా వేడి ఉద్గారమవుతుంది
4) సూక్ష్మ తరంగాలు పాత్రను వేడి చేస్తాయి
164. కింది వాటిలో ఏవి భౌతిక చర్యలు?
ఎ) మంచు నీరుగా మారడం
బి) గ్లాసులోని నీరు బాష్పీభవనం చెందడం
సి) ఇనుము తుప్పు పట్టడం
డి) నీరు మంచుగా మారడం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
165. అగ్గిపుల్ల మండటం గురించిన సరైన వాక్యాలు
1) అగ్గిపుల్ల గీసినప్పుడు పెట్టె పక్క భాగానికి గల ఎర్రభాస్వరం మొదట మండుతుంది
2) మండిన భాస్వరం అగ్గిపుల్ల చివరన గల ఆంటిమొనీ సల్ఫైడ్ను మండిస్తుంది
3) కావాల్సిన ఆక్సిజన్‌ను పొటాషియం క్లోరేట్ అందిస్తుంది
4) అన్ని సరైనవే
166. కార్బన్ డై ఆక్సైడ్ గురించి సరైన వాక్యం ఏది?
i. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన వాయువు
ii. కిణ్వ ప్రక్రియలో విడుదలయ్యే వాయువు
iii. గ్రీన్ హౌస్ వాయువు
iv. రాత్రిపూట మొక్కలు విడుదల చేసే వాయువు
1) i, ii 2) i, iii
3) i, ii, iii 4) పైవన్నీ
సమాధానాలు
127.3 128.2 129.1 130.1 131.4 132.2 133.3 134.4 135.4 136.1 137.1 138.1 139.2 140.1 141.1 142.3 143.2 144.3 145.1 146.2 147.1 148.3 149.3 150.1 151.3 152.2 153.3 154.3 155.2 156.1 157.1 158.4 159.2 160.3 161.4 162.3
163.3 164.3 165.4 166.4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు