BIOLOGY | మానవుని జీర్ణవ్యవస్థలో ఎంజైమ్స్ ఉత్పత్తి కాని భాగం?
1. మానవ శరీర ఇంధనం?
1) కార్బోహైడ్రేట్స్
2) ప్రొటీన్స్ 3) విటమిన్స్
4) ఖనిజలవణాలు
2. కింది వాటిలో కార్బోహైడ్రేట్స్‌కి సంబంధించినది?
1) మానవ ఆహారంలో అతిముఖ్యమైనవి
2) ఇవి కిరణజన్యసంయోగక్రియ ద్వారా తయారవుతాయి
3) ైగ్లెకోజన్ను ‘జంతు చక్కెర’ అంటారు
4) పైవన్నీ
3. ఏ సరళ చక్కెరలను జంతువులు శక్తి కోసం వినియోగిస్తాయి?
1) సుక్రోజ్ 2) సెల్యులోజ్
3) ఫ్రక్టోజ్ 4) మాల్టోజ్
4. మానవునిలో జీర్ణమయ్యే పిండిపదార్థాలు?
ఎ. ైగ్లెకోజెన్ బి. సెల్యూలోజ్
సి. స్టార్చ్ డి. మాల్టోజ్
1) ఎ, డి
2) ఎ, బి, డి
3) ఎ, సి, డి
4) ఎ, బి, సి, డి
5. మానవునికి అధికశక్తినిచ్చే భవిష్యత్ నిల్వ ఆహారం?
1) కార్బోహైడ్రేట్ 2) మినరల్స్
3) ప్రొటీన్స్ 4) ఫ్యాట్
6. కండర సంకోచానికి కావాల్సిన ఆవశ్యక మూలకం?
1) Na 2) K
3) Ca 4) P
7. అమైనో ఆమ్లాలకు సంబంధించినవి?
1) జంతువులకు అమైనో ఆమ్లాలు ప్రొటీన్ల ద్వారా మాత్రమే అందుతాయి
2) ఇవి యాంటీబాడీస్ ఉత్పత్తికి మూలం
3) ఇవి శరీర నిల్వ ఆహారపదార్థాలు
4) శరీరంలో ఉత్పత్తికాని ఆవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య-9
8. ‘Hypervitaminosis’ దేనికి సంబంధించినది?
1) Vit – A 2) Vit – C
3) Vit – D 4) Vit – K
9. విటమిన్-ఎ ముందురూపం?
1) ఎర్గోస్టిరాల్ 2) కొలెస్టిరాల్
3) ప్రోథ్రాంబిన్ 4) కెరోటిన్-బీటా
10. జతపరచండి.
ఎ. విటమిన్-ఎ 1. థయమిన్
బి. విటమిన్-బి1 2. రెటినాల్
సి. విటమిన్-బి2 3. పైరిడాక్సిన్
డి. విటమిన్-బి6 4. రైబోఫ్లావిన్
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-2, బి-3, సి-4, డి-1
11. ఒక వ్యక్తి నాడీ పక్షవాతం, బలహీనత, కండరనొప్పితో బాధపడితే అది ఏ విటమిన్ లోపం?
1) విటమిన్-ఎ 2) విటమిన్-బి1
3) విటమిన్-డి 4) విటమిన్-బి2
12. జతపరచండి.
ఎ. విటమిన్-బి12 1. సయనోకోబాలమిన్
బి. విటమిన్-సి 2. ఎక్రోబిక్ యాసిడ్
సి. విటమిన్-డి 3. కాల్సిఫెరాల్
డి. విటమిన్-ఇ 4. టోకోఫెరాల్
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-1, బి-2, సి-3, డి-4
13. పాలలో లేని విటమిన్?
1) విటమిన్-డి 2) విటమిన్-బి1
3) విటమిన్-సి 4) విటమిన్-బి12
14. ఏ విటమిన్ లోపం వల్ల శరీరం లోపల రక్తస్రావం జరుగుతుంది?
1) విటమిన్-డి 2) విటమిన్-బి1
3) విటమిన్-బి6 4) విటమిన్-బి12
15. శరీరంలోని కొవ్వు అతినీలలోహిత కిరణాల సమక్షంలో విటమిన్-డిగా మారే భాగం?
1) క్లోమం 2) ప్లీహం
3) మూత్రపిండం 4) కాలేయం
16. ఏ విటమిన్ రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే ప్రోథ్రాంబిన్ కారకం తయారీలో తోడ్పడుతుంది?
1) విటమిన్-కె 2) విటమిన్-డి
3) విటమిన్-ఇ 4) విటమిన్-బి12
17. బాగా పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల కలిగే వ్యాధి?
1) స్కర్వీ 2) బెరిబెరి
3) పెల్లాగ్రా 4) గాయిటర్
18. అధికంగా ఆల్కహాల్ తీసుకొనే వ్యక్తులు మరణించడానికి కారణం?
1) గుండెపోటు 2) కాలేయ క్యాన్సర్
3) సిర్రోసిస్
4) మూత్రపిండాల ఫెయిల్యూర్
19. ఆహార సేకరణకు కారణం?
1) వివిధ జీవక్రియలకు కావాల్సిన ఉష్ణశక్తి కోసం
2) వివిధ క్రియలకు కావాల్సిన యాంత్రిక శక్తి కోసం
3) వివిధ జీవ క్రియలకు కావాల్సిన రసాయనశక్తి కోసం
4) హైపోథలామస్ అనే మెదడు భాగం ప్రేరణ ఆపడానికి
20. కింది వాటిలో ఐరన్ అధికంగా ఉండి, శరీర నిర్మాణానికి తోడ్పడే ఆహారం?
1) పొటాటో 2) ఆకుకూరలు
3) పెరుగు 4) మాంసం
21. అధిక ప్రొటీన్ ఉన్న ఆహారం?
1) గుడ్డు 2) పప్పు
3) పాలు 4) కూరగాయలు
22. కొవ్వు ఎక్కడ నిల్వ ఉంటుంది?
1) ఎపిథీలియల్ కణజాలం
2) ఎడిపోజ్ కణజాలం
3) అంతశ్చర్మం
4) కాలేయం
23. 100 కేజీలు కలిగిన మానవుని శరీరంలో నీటిశాతం?
1) 70 2) 80
3) 65 4) 75
24. శాకాహారుల్లో సీరమ్ (అంధనాళం) పని?
1) మానవునిలోని అవశేష అంగం వలె ఉంటుంది
2) మానవునిలోని చూషకాల వలె ఆహారాన్ని పీల్చుతుంది
3) బ్యాక్టీరియాలను కలిగి పిండిపదార్థ జీర్ణక్రియలో పాల్గొంటుంది
4) జీర్ణం కాని ఆహారాన్ని సేకరించే జీర్ణాశయంలోని భాగం
25. రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణం కన్నా పెరిగినప్పుడు అది ఇన్సులిన్ అనే హార్మోన్ సమక్షంలో కొవ్వుగా మారడాన్ని ఏమంటారు?
1) Glycogenesis
2) Lipogenesis
3) Gluconeogenesis
4) Glyoneogenesis
26. కాలేయంలో జరిగే Deamination ప్రక్రియ (లేదా) ఆర్నిథిన్ వలయం అంటే?
1) అదనంగా ఉన్న ప్రొటీన్స్ యూరియాగా మారడం
2) కొవ్వు, గ్లూకోజ్‌గా మారడం
3) ైగ్లెకోజన్ కార్బోహైడ్రేట్‌గా మారడం
4) ఆర్‌బీసీలు పైత్యరసంగా మారడం
27. బ్రెడ్‌ను నమిలినప్పుడు తీపిగా ఉండటానికి కారణం?
1) లాలాజల గ్రంథులు క్రియావంతంగా మారి తీపి లాలాజలం ఉత్పత్తి కావడం
2) బ్రెడ్లోని గ్లూకోజ్ నీటిలో కరగడం వల్ల రుచి మొగ్గలు గ్రహించడం
3) లాలాజలం పిండి పదార్థాన్ని గ్లూకోజ్‌గా మార్చడం
4) లాలాజలం పిండి పదార్థాన్ని మాల్టోజ్‌గా మార్చడం
28. పొడవైన జీర్ణ (లేక) ఆహారనాళం కలిగిన జీవులు?
1) శాకాహారులు 2) మాంసాహారులు
3) సర్వభక్షకులు 4) కీటకాహారులు
29. జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన అతిగాఢత గల HCL ఆహార జీర్ణక్రియలో పాల్గొంటుంది. కానీ, జీర్ణాశయాన్ని ప్రభావితం చేయదు. కారణం?
1) జీర్ణాశయం లోపలి పొర ఉత్పత్తి చేసే ఎంజైమ్ HCLను తటస్థపరచడం
2) జీర్ణాశయం గోడ HCL చేత ప్రభావితం కాని కొవ్వు ఆమ్లాలతో ఏర్పాటు చేయడం
3) జీర్ణాశయ గోడ ఎల్లప్పుడూ ఏర్పాటు కావడం
4) జీర్ణాశయ గోడ మ్యూకస్ పొరచే రక్షించబడుతుంది
30. కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ ప్రారంభమయ్యే ప్రదేశం?
1) నోరు 2) ఆహార వాహిక
3) జీర్ణాశయం 4) చిన్నపేగు
31. మానవుని జీర్ణవ్యవస్థలో ఎంజైమ్స్ ఉత్పత్తి కాని భాగం?
1) నోరు 2) ఆహారవాహిక
3) జీర్ణాశయం 4) పెద్దపేగు
32. ఆల్కహాల్ శోషణ ప్రారంభమయ్యే ప్రదేశం?
1) ఆహారవాహిక 2) జీర్ణాశయం
3) చిన్నపేగు 4) పెద్దపేగు
33. కొవ్వుల జీర్ణక్రియ ప్రారంభమయ్యే, అంతమయ్యే ప్రదేశం?
1) జీర్ణాశయం 2) ఆంత్రమూలం
3) శేషాంత్రికం 4) పెద్దపేగు
34. జీర్ణక్రియ, శోషణ పూర్తయ్యే ప్రదేశం?
1) జీర్ణాశయం 2) ఆంత్రమూలం
3) చిన్నపేగు 4) పెద్దపేగు
35. కింది వాటిలో ఏ పదార్థాలకు అధిక ప్రొటీన్ ఎఫిషియన్సీ నిష్పత్తి ఉంది?
1) బియ్యం 2) కందులు
3) గోధుమ 4) మొక్కజొన్న
36. జతపరచండి.
ఎ. టయలిన్ 1. నోరు
బి. రెనిన్ 2. జీర్ణాశయం
సి. ట్రిప్సిన్ 3. క్లోమం
డి. మాల్టేజ్ 4. చిన్నపేగు
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
37. కింది వాటిలో జఠరరసంలో లేనిది?
1) పెప్సిన్ 2)లైపేస్
3) పెప్టిడేస్ 4) HCl
38. జతపరచండి.
ఎ. లైపేస్ 1. సరళ పాలిపప్టైడ్స్
బి. ట్రిప్సిన్ 2. పాలి & డై పప్టైడ్స్
సి. పెప్సిన్ 3. కొవ్వు
డి. పప్టైడసిస్ 4. ప్రొటీన్స్
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
39. పైత్యరసం విధి కానిది?
1) కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా మార్చడం
2) ఆహారాన్ని ఆమ్లస్థితిలోకి మార్చడం
3) కొవ్వుల ఎమల్సీకరణ
4) Putrifaction నుంచి కాపాడటం
40. అధిక జీవశాస్త్రీయ విలువ ఉన్నది?
1) పాలు 2) గుడ్డు
3) మాంసం 4) గోధుమ
41. శరీరంలో తయారుకాని ఆవశ్యక అమైనో ఆమ్లాలు?
1) లైసిన్ 2) మిథియోనిన్
3) లినోలిక్
4) అరాఖిడోనిక్ ఆమ్లం
42. రక్తంలో అధిక కొలెస్టిరాల్ స్థాయిని పెంచేవి?
1) ఆముదం నూనె 2) సెసెమి ఆయిల్
3) కొబ్బరినూనె 4) వేరుశనగ నూనె
43. అన్ని నత్రజని సంబంధింత వ్యర్థాల్లో తక్కువ విషతత్వం ఉన్నది?
1) యూరియా 2) అమ్మోనియా
3) యూరిక్ యాసిడ్ 4) క్రియాటినైన్
44. మూత్రవిసర్జన జరిగిన వెంటనే వాసన ఉండదు. కొంతకాలం తర్వాత అధిక వాసనకు కారణం?
1) యూరియా, యూరికామ్లంగా మారడం
2) యూరికామ్లం, యూరియాగా మారడం
3) బ్యాక్టీరియా చేత యూరియా, అమ్మోనియాగా మారడం
4) బ్యాక్టీరియా చేత యూరికామ్లం, క్రియాటినైన్గా మారడం
45. మధ్యవయస్సు మానవుడు ఒకరోజు విసర్జించే మూత్రం?
1) 750 ml
2) 1000 ml (1 lt.)
3) 1500 ml 4) 2000 ml
46. కింది వాటిలో మొక్కల వ్యర్థాలను గుర్తించండి.
1) H2O 2) CO2
3) O2 4) పైవన్నీ
47. జతపరచండి.
ఎ. WBC : RBC నిష్పత్తి 1. 1:500/400
బి. Rods : Cones 2. 2:1
సి. H2Oలో H : O నిష్పత్తి 3. 15:1
డి. నీరు : గాలిలో O2 నిష్పత్తి 4. 10:21
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-1, బి-4, సి-2, డి-3
4) ఎ-1, బి-3, సి-2, డి-4
48. క్వినైన్, మార్ఫిన్ అనేవి?
1) ఫలాల్లో నిల్వ ఆహారం
2) కాండాల్లో నిల్వచేసే అత్యవసర ఆహారం
3) ద్రవాభిసరణ పీడనం సమతుల్యతను పెంచేవి
4) మొక్కల్లో వ్యర్థపదార్థాలు
49. రీనల్ గ్రంథులు వేటిలో విసర్జక అవయవాలు?
1) మంచినీటి చేపలు 2) మొలస్కా
3) కీటకాలు 4) ఈగలు
50. మంచినీటి చేపల్లో వ్యర్థాలు విసర్జించే ప్రదేశం?
1) మొప్పలు 2) దూరస్థనాళం
3) చర్మం 4) రీనల్ గ్రంథి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు