BIOLOGY | జన్యు చికిత్స ద్వారా నయమైన మొట్టమొదటి వ్యాధి?
బయాలజీ
1. అతిసన్నిహిత సంబంధం ఉన్న జీవుల మధ్య జరిగే ప్రజననం?
1) రేఖాప్రజననం
2) అతి సన్నిహిత ప్రజననం
3) బాహ్య సంపర్కం
4) పరప్రజననం
2. వరణం, ఎంపికలు దేనికి సబంధించినవి?
1) పర ప్రజననం 2) బాహ్య సంపర్కం
3) అంతఃప్రజననం 4) జాతి సంకరణం
3. కాల్షియం క్లోరైడ్ ద్రావణంతో ప్రేరేపించినప్పుడు సంయుక్తబీజం DNAను గ్రహించే పద్ధతి?
1) ట్రాన్స్‌ఫెక్షన్ 2) ట్రాన్స్డక్షన్
3) ట్రాన్స్ఫర్మేషన్ 4) ట్రాన్స్‌పొజిషన్
4. జంతు పరివర్తిత ప్రయోగాల్లో వేరుచేసి జన్యువును దేనిలో అనుసంధానిస్తారు?
1) ప్రమోటర్ 2) ఆపరేటర్
3) వేరుగా ఏ వాహకంలోనైనా
4) రెగ్యులేటర్ జన్యువు
5. అనాదిగా మానవుడు జంతువుల ప్రజననకు ఉపయోగించిన సరళమైన పద్ధతి?
1) జంతువుల వరణం 2) పర ప్రజననం
3) క్లోనింగ్
4) కృత్రిమ బీజావాహం
6. తెలియని జంతు సంపద నుంచి జన్యురీత్యా సమయుగ్మజపు జనాభాను పొందాలంటే ఉపయోగపడే పద్ధతి?
1) అంతఃప్రజననం
2) బాహ్య సంపర్కం
3) పర ప్రజననం 4) ఎంపిక
7. వేటి సంకరణ వల్ల హెన్నీ ఏర్పడుతుంది?
1) మగ గాడిద, ఆడ గుర్రం
2) ఆడ గాడిద, మగ గుర్రం
3) మగ గాడిద, ఆడ గాడిద
4) ఆడ గుర్రం, మగ గుర్రం
8. వేటి సంకరణ వల్ల కంచర గాడిద ఏర్పడుతుంది?
1) మగ గాడిద, ఆడ గుర్రం
2) మగ గుర్రం, ఆడ గాడిద
3) మగ గాడిద, ఆడ గాడిద
4) ఆడ గుర్రం, మగ గుర్రం
9. ఏ సంకరణం వల్ల ఫలవంతమైన సంతతి తరం ఏర్పడుతుంది?
1) మగ గాడిద, ఆడ గుర్రం
2) మగ గుర్రం, ఆడ గాడిద
3) మగ గాడిద, ఆడ గాడిద
4) పైవన్నీ
10. డాలీ దృశ్యరూపేణా కింది వాటిలో దేన్ని పోలి ఉంటుంది?
1) సరోగేట్ (మరు) తల్లి
2) అండ దాత
3) శాఖీయ కణదాత 4) శుక్రకణ దాత
11. అణు కత్తెరలు అంటే?
1) ఆక్సిడోరిడక్టేజ్లు 2) ప్రొటియేజ్‌లు
3) పాలిన్డ్రోమ్లు
4) రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్‌లు
12. రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్లను ఎవరు కనుగొన్నారు?
1) నాథన్స్ 2) ముల్లర్
3) ఎరికే 4) హేబర్‌లాండ్
13. DNA అతుక్కునే కొనల మధ్య దేని ద్వారా బంధాన్ని ఏర్పరచవచ్చు?
1) DNA లైగేజ్
2) DNA పాలిమరేజ్
3) ఆల్డోలేజ్
4) ఎండో న్యూక్లియేజ్‌లు
14. మానవ ఇన్సులిన్, హ్యుమ్యులిన్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఏది?
1) జాంథోమోనాస్ 2) సాల్మొనెల్లా
3) క్లాస్ట్రీడియమ్ 4) ఈ-కోలై
15. ప్లాస్మిడ్ DNA, వాంఛనీయ జన్యువు కలిసి ఏర్పడే హైబ్రిడ్ DNAను ఏమంటారు?
1) C DNA 2) r DNA
3) B DNA 4) z DNA
16. కింది జన్యు పరివర్తిత మొక్కల్లో ఏ రకం ఆలస్యంగా పక్వానికి రావడం వల్ల రవాణా, నిల్వచేయడానికి దోహదకారిగా ఉంటుంది?
1) తైపీ వరి రకం
2) టమాటా ఫ్లెవర్ సెవర్ రకం
3) బీటీ పత్తి
4) బ్రాసికా నాపస్లో పురుష వంధ్యత్వాన్ని చూపే మొక్కలు
17. తైపీ జన్యు పరివర్తిత రకం ప్రజాతిని తెలపండి.
1) సొలానమ్ 2) ట్రిటికమ్
3) బ్రాసికా 4) ఒరైజా
18. జన్యు పరివర్తిత బంగాళదుంప మొక్కలు దేనికి నిరోధకతను చూపిస్తాయి?
1) బ్యాక్టీరియా 2) వైరస్
3) శిలీంధ్రం 4) నిమటోడ్
19. ఫైటాఫ్తొరా అనేది ఒక?
1) శిలీంధ్రం 2) బ్యాక్టీరియా
3) శైవలం 4) ఆవృతబీజం
20. బాస్మతి రకం ప్రజాతి దేనికి సంబంధించినది?
1) ఒరైజా 2) ట్రిటికమ్
3) నికోటియానా 4) పైసమ్
21. అణు స్విచ్‌లు అని వేటినంటారు?
1) ఎండో న్యూక్లియేజ్‌లు
2) జన్యువులు
3) క్రోమోజోమ్‌లు
4) న్యూక్లియోజోమ్లు
22. పరివర్తితం చెందిన కణం దేన్ని కలిగి ఉంటుంది?
1) r-DNA 2) c-DNA
3) t-DNA 4) z-DNA
23. వాహక DNA, DNA ఖండితం మధ్య ఏర్పడే ఖాళీని పూరించే ఎంజైమ్?
1) DNA- పాలిమరేజ్
2) గ్లూకోరోసైడేజ్లు
3) DNA- లైగేజ్
4) ఉత్క్రమ అనులేఖనం
24. జెనెటిక్ ఇంజినీరింగ్ ప్రయోగాల్లో ప్రోబ్లను దేన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు?
1) ఇన్సులిన్‌ను ఉత్పత్తిచేసే జన్యువు
2) ఒక జీవిలోని సంపూరక క్షారాల వరుస క్రమం
3) సూక్ష్మజీవనాశక ఔషధాన్ని ఉత్పత్తిచేసే జన్యువు
4) ఒక కాలనీలో విశిష్ట ప్రొటీన్
జవాబులు
1.2 2. 3 3. 1 4. 1
5.1 6. 1 7. 2 8. 1
9.3 10.1 11.4 12.1
13.1 14.4 15.2 16.2
17.4 18.3 19.1 20.1
21.2 22.1 23.3 24.2
25. G.T అంటే?
1) వ్యాధి చికిత్స కోసం ఒక వ్యక్తి కణంలోనికి వేరొక జన్యువును ప్రవేశపెట్టడం
2) సెట్ డైరెక్టెడ్ మ్యుటాజెనిసిస్
3) ఒక సాధారణ జన్యువును ఇన్‌వివో పద్ధతిలో సరిచేయడం
4) పైవన్నీ
26. దైహిక జన్యు చికిత్స అంటే?
1) ఒక అసాధారణ కణాన్ని ఇన్‌వివో పద్ధతిలో సాధారణ కణంతో ప్రతిస్థాపన చేయడం
2) వ్యాధి చికిత్సలో భాగంగా ఒక జన్యువును బీజకణంలోకి ప్రవేశపెట్టడం
3) వ్యాధి చికిత్స కోసం ఒక జన్యువును దైహిక కణంలోకి ప్రవేశపెట్టడం
4) ఒక బీజకణంలోని అసాధారణ జన్యువును ఇన్‌వివో పద్ధతిలో సరిచేయడం
27. ఎక్స్వివో జన్యు చికిత్స అంటే?
1) దైహిక కణంలోని జన్యువును జీవి దేహంలోనే బాగుచేయడం
2) వ్యాధి చికిత్స కోసం ఒక జన్యువును బీజకణంలోకి ప్రవేశపెట్టడం
3) జీవి దేహం వెలుపల కణాల్లో జన్యుమార్పిడి చేసి తిరిగి వాటిని జీవిలో ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధిని నయంచేయడం
4) ఒక జీవి దేహంలోని బీజకణంలోని జన్యువును బాగుచేయడం
28. జన్యు చికిత్స ద్వారా నయమైన మొట్టమొదటి వ్యాధి?
1) SCID 2) AIDS
3) గోనోకోకల్ గనేరియా
4) క్షయ వ్యాధి
29. SCID చికిత్సలో భాగంగా ప్రతిస్థాపించిన జన్యువు?
1) ఎడినోసిన్ డీ ఎమినేజ్ జన్యువు
2) ఎడినోసిన్ డీ కార్బాక్సిలేజ్ జన్యువు
3) ఎడినోసిన్ పాస్ఫేటేజ్ జన్యువు
4) ఎడినోసిన్ హైడ్రోజన్ జన్యువు
30. రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్ అనే ఎంజైమ్‌ను కలిగినది?
1) ఎడినో వైరస్
2) ఎడినో అసోసియేటెడ్ వైరస్
3) రిట్రో వైరస్ 4) బ్యాక్టీరియా
31. లైపోలెక్స్లు అంటే?
1) ప్లాస్మిడ్లు+లిపిడ్లు
2) ఫాస్మిడ్లు+ లిపిడ్లు
3) కాస్మిడ్లు+లిపిడ్లు
4) ప్లాస్మిడ్లు+పాలిశాఖరైడ్‌లు
32. వ్యాధికారక జన్యువును నిస్తేజపరచడానికి దేన్ని వాడతారు?
1) వరణాత్మక విపర్య ఉత్పరివర్తనం
2) పాలిప్లెక్స్లు
3) కృత్రిమ ఆలిగో న్యూక్లియోటైడ్లు
4) లైపోప్లెక్స్లు
33. కణజాల వర్ధనం ఏ సూత్రం మీద ఆధారపడింది?
1) కణ సిద్ధాతం
2) సెల్యూలార్ టోటిపొటెన్సి
3) కణ వంశానుక్రమ సిద్ధాంతం
4) అమ్నిస్ సెల్యూలా-ఇ-సెల్యూలా
34. టోటిపొటెన్సిని మొదటిసారిగా ప్రయోగాత్మకంగా నిరూపించింది ఎవరు?
1) షల్ 2) హేబర్‌లాండ్
3) ష్టీవార్డ్ 4) మోర్గాన్
35. టోటిపొటెన్సి అనే పదాన్ని ఉపయోగించినది ఎవరు?
1) మోర్గాన్ 2) స్టీవార్డ్
3) ముల్లర్ 4) డీవ్రీస్
36. కణజాలవర్ధనంలో యానకం PH ఏ విధంగా ఉండేటట్లు సరిచేస్తారు?
1) 3.0-5.0 2) 7-2-8.0
3) 5.6-6.0 4) 6.3-7.4
37. కణజాలవర్ధనంలో ఎక్కువగా ఉపయోగించే యానకం?
1) బి.ఎస్. యానకం
2) ఎస్.ఎం. యానకం
3) ఎం.ఎస్. యానకం
4) ఎల్.ఎస్. యానకం
38. మౌలిక యానకంలో లోపించేది ఏది?
1) సూక్ష్మ మూలకాలు
2) విటమిన్లు
3) కార్బోహైడ్రేట్లు
4) వృద్ధి నియంత్రకాలు
39. ఆటోక్లేవ్ దేనికి ఉపయోగిస్తారు?
1) పోషక కణజాల యానకం తయారు చేయడానికి
2) వర్ధన యానకాన్ని సూక్ష్మజీవ రహితం చేయడానికి
3) ఎక్స్ ప్లాంట్‌ను తయారు చేయడానికి
4) ఎక్స్ ప్లాంట్‌ను అంతర్నివేశనం చేయడానికి
40. కణజాలవర్ధన ప్రయోగాల్లో ఏర్పడే అవయవ విభేదనం చెందని కణాల సమూహాన్ని ఏ విధంగా పిలుస్తారు?
1) కాలస్ 2) కాలోస్
3) క్లోన్ 4) ఎక్స్‌ప్లాంట్
41. శాఖీయ పిండాలు వేటి నుంచి ఏర్పడతాయి?
1) కాలస్
2) సంయోగబీజ కణజాలం
3) సంయుక్త బీజం 4) విత్తనాలు
42. వైరస్ రహిత మొక్కలను ఏవిధంగా ఉత్పత్తి చేస్తారు?
1) వేరు అగ్రాల వర్ధనం
2) కాండాగ్రాల వర్ధనం
3) పత్ర వర్ధనం
4) పరాగకోశ వర్ధనం
43. సూక్ష్మజీవ రహిత పోషక వర్ధన యానకంలోకి ఎక్స్‌ప్లాంట్‌ను అంతర్నివేశనం చేయడానికి దేన్ని ఉపయోగిస్తారు?
1) ఆటోక్లేవ్
2) బయో రియాక్టర్
3) లామినార్ ఎయిర్‌ఫ్లో గది
4) ఎలక్ట్రోపోరోసిస్
44. గుళికలుగా మార్చే అలైంగిక పిండ భాగాలను ఏవిధంగా పిలుస్తారు?
1) అనిషేక ఫలాలు
2) సంశ్లేషిత విత్తనాలు
3) సంకర విత్తనాలు
4) ఆవృత ఫలాలు
45. యానకాన్ని సూక్ష్మజీవ రహితం చేయడానికి ఆటోక్లేవ్‌లో అందుబాటులో ఉండే పరిస్థితులు?
1) 1210C ఉష్ణోగ్రత, పీడనం 151b
2) 1510C ఉష్ణోగ్రత, పీడనం 1201b
3) 300CC ఉష్ణోగ్రత, పీడనం 2401b
4) 2400CC ఉష్ణోగ్రత, పీడనం 301b
జవాబులు
25.4 26.3 27.3 28.1
29.1 30.3 31.1 32.3
33.2 34.3 35.1 36.3
37.3 38.4 39.2 40.1
41.1 42.2 43.3 44.2
45.1
రక్తపీడనం (బీపీ)
- రక్తాన్ని వల వంటి రక్తనాళాల ద్వారా ప్రవహింపజేయాలంటే చాలా ఎక్కువ ఒత్తిడి కావాలి. గుండెలోని జఠరికలు సంకోచించి అత్యధిక పీడనంతో రక్తాన్ని ధమనుల్లోకి పంపుతాయి. ఈ పీడనాన్నే రక్త పీడనం అంటారు. సాధారణంగా బీపీ అని పిలుస్తారు. డాక్టర్లు స్పిగ్మోమానోమీటరు అనే పరికరంతో రక్తపీడనాన్ని కొలుస్తారు. రక్తపీడనం మన శరీరంలోని వివిధ భాగాల్లో వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ శరీరంలో నియమిత ప్రదేశంలో మాత్రమే రక్తపీడనాన్ని కొలిస్తే వేర్వేరు సమయాల్లో పీడనాన్ని సరిపోల్చడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల డాక్టర్లు మన దండచేయి (మోచేయి పైభాగం)లో ఉండే ధమనీ పీడనాన్ని మాత్రమే కొలుస్తారు.
- రక్తపీడనాన్ని అంచనా వేయడానికి డాక్టర్లు రెండు రీడింగులను నమోదు చేస్తారు. జఠరికలు అత్యంత ఎక్కువ పీడనంతో రక్తాన్ని ధమనుల్లోకి పంపినప్పుడు మొదటి రీడింగ్ తీస్తారు. ఇది ఆరోగ్యవంతమైన యువతలో 120mm పాదరస పీడనంగా ఉంటుంది. దీన్ని ‘సిస్టోలిక్ పీడనం’ అంటారు. జఠరికలు యథాస్థితికి చేరుతూ రక్తాన్ని నింపుకునే సమయంలో రెండో రీడింగ్ తీస్తారు. ఇది 800mm పాదరస పీడనానికి సమానంగా ఉంటుంది. దీన్ని ‘డయాస్టోలిక్ పీడనం’ అంటారు. సామాన్య రక్తపీడనం 120/80 mmHg. రక్తపీడనం మనం చేసే పనినిబట్టి మారుతుంది. విశ్రాంతి, నడవడం, పరిగెత్తడం వంటి పనులు చేసేటప్పుడు రక్తపీడనం వేర్వేరుగా ఉంటుంది.
- విశ్రాంతి సమయంలో సాధారణ రక్తపీడనం (120/80) కంటే ఎక్కువ రక్తపీడనం ఉంటే ఆ వ్యక్తికి అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఉన్నట్లుగా భావిస్తారు. రక్తపోటు తక్కువగా ఉండటం లోబీపీ (హైపోటెన్షన్) కు దారితీస్తుంది.
హైపర్ టెన్షన్ లక్షణాలు - విపరీతమైన తలనొప్పి.
- నిద్రలేమి, చూపు మసకబారడం.
- విపరీతమైన అలసట, చెవుల్లో రింగురింగుమని శబ్దాలు రావడం.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెదడ, తికమకపడటం.
- హైపర్ టెన్షన్ ప్రభావం ఎక్కువైనప్పుడు మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి, పక్షవాతం రావచ్చు.
- మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు.
హైపోటెన్షన్ లక్షణాలు - త్వరగా అలిసిపోవడం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం.
- తేలికపాటి తలనొప్పి, వికారం, మూర్చ.
- తల తిరగడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం.
- చెమటలు పట్టడం, చేతులు, పాదాలు నల్లగా మారుతాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు