Khudrakhast lands | ఖుద్ఖాస్త్ భూములు అంటే?
1. బాబర్ కింది ఏ ఢిల్లీ సుల్తాన్‌ను ఓడించి మొఘల్ రాజ్యస్థాపన చేశాడు?
1) మహ్మద్ లోడి 2) ఇబ్రహీం లోడి
3) దౌలత్‌ఖాన్ లోడి 4) అలంఖాన్ లోడి
2. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో భయంకరమైన వారసత్వ యుద్ధాలు జరిగాయి?
1) అక్బర్ 2) షాజహాన్
3) జహంగీర్ 4) హుమాయున్
3. జబ్త్ అంటే?
1) రెవెన్యూ విధానం 2) మున్సబ్‌దారీ విధానం
3) ఒక ప్రత్యేక హోదా 4) ఏదీకాదు
4. కిందివాటిలో సరైనవి
1) నాయంకర విధానం – కాకతీయుల సామ్రాజ్యం
2) అమరనాయంకర విధానం-విజయ నగర సామ్రాజ్యం
3) మున్సబ్‌దారీ విధానం – మొఘల్ సామ్రాజ్యం
4) పైవన్నీ
5. సర్వాయి పాపన్న ఏ మెఘల్ చక్రవర్తికి సమకాలికుడు?
1) షాజహాన్ 2) అక్బర్
3) జహంగీర్ 4) ఔరంగజేబ్
6. కింది ఏ ప్రాంతంలో సర్వాయి పాపన్న చెక్‌డ్యాం నిర్మించాడు?
1) తాటికొండ 2) ఖిలా షాపూర్
3) వేములకొండ 4) షాపురం
7. ఏ నిజాం మూసీనది వరదలవల్ల ఇబ్బంది పడ్డ ప్రజలకు అండగా నిలిచాడు?
1) అఫ్జల్ ఉద్ దౌలా 2) నిజాం అలీఖాన్
3) మీర్ మహబూబ్ అలీఖాన్
4) మీర్ ఉస్మాన్ అలీఖాన్
8. సాలార్జంగ్ ఏ కాలంలో నిజాం రాజులకు దివాన్‌గా పనిచేశాడు?
1) 1853-1883 2) 1856-1886
3) 1873-1883 4) 1843-1873
9. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో పోరాడిన విప్లవకారుడు
1) కున్వర్సింగ్ 2) కన్నెగంటి హన్మంతు
3) తుర్రెబాజ్ ఖాన్ 4) షోయబుల్లాఖాన్
10. అంటురోగాల నుంచి కాపాడే దేవతగా భావించే దేవత?
1) మైసమ్మ 2) ఎల్లమ్మ
3) గంగమ్మ 4) పోచమ్మ
11. తెలంగాణ ప్రజలు పంటకోత సమయంలో కింది ఏ దేవుడికి పూజలు చేస్తారు?
1) బీరప్ప 2) కాటమరాజు
3) పోతరాజు 4) పెద్దమ్మ
12. పశువుల పాకలో ఒక గూడుకు సున్నం వేసి కుంకుమతో అలంకరించిన దానిని ప్రజలు ఏవిధంగా పిలుస్తారు?
1) కాటమరాజు గూడు 2) మైసమ్మ గూడు
3) ఎల్లమ్మ గూడు 4) బీరప్ప గూడు
13. సమ్మక్క, సారక్కలు ఏ కాకతీయ రాజు సైన్యంతో పోరాడారు?
1) మొదటి ప్రతాపరుద్రుడు
2) రెండో ప్రతాపరుద్రుడు
3) గణపతి దేవుడు 4) మహదేవుడు
14. మహ్మద్ ప్రవక్త మనుమడి జ్ఞాపకంగా ముస్లింలు జరుపుకొనే పండుగ?
1) ఉర్సు 2) బక్రీద్ 3) మొహర్రం 4) రంజాన్
15. మహబూబ్‌నగర్ జిల్లాలోని జహంగీర్ పీర్ దర్గాను సందర్శించిన మొఘల్ చక్రవర్తి?
1) జహంగీర్ 2) ఔరంగజేబ్
3) అక్బర్ 4) షాజహాన్
16. పోతరాజు పూజ గురించి తెలిపే గ్రంథం?
1) పల్నాటి వీరచరిత్ర 2) క్రీడాభిరామం
3) ప్రేమాభిరామం 4) ఏదీకాదు
17. మోక్ష సాధనకు జ్ఞానమార్గాన్ని అనుసరించాలన్న వారు?
1) రామానుజాచార్యులు 2) శంకరాచార్యులు
3) చైతన్యుడు 4) కబీర్
18. ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమానికి కారకుడు?
1) చైతన్యుడు 2) శంకరాచార్యులు
3) రామానుజాచార్యులు 4) రామానందుడు
19. అల్లమ ప్రభువు, అక్కమహాదేవి ఏ మతానికి చెందినవారు?
1) వీరశైవం 2) వీర వైష్ణవం
3) పాశుపతం 4) కాపాలిక
20. ఇతరుల బాధను అర్థం చేసుకొనేవాళ్లే వైష్ణవులు అన్నవారు?
1) తుకారాం 2) నర్సీమెహతా
3) ఏక్నాథ్ 4) జ్ఞాన దేవుడు
21. భగవద్గీత, భాగవత పురాణాల ఆధారంగా భక్తి యోగాన్ని ప్రవచించింది?
1) చైతన్యుడు 2) తులసీదాస్
3) మీరాబాయి 4) దాదుదయాళ్
22. తులసీదాస్ తన రామచరిత మానస్‌ను ఏ భాషలో రాశాడు?
1) అర్ధమాగధి 2) సౌరసేని 3) అవధి 4) హిందీ
23. విష్ణుభక్తిని చాటుతూ అస్సామీ భాషలో కావ్యాలు, నాటకాలు రాస్తూ సామ్ఘర్ పేరుతో ధ్యాన మందిరాలను ఏర్పాటు చేసింది?
1) శంకర దేవుడు 2) నర్సీమెహతా
3) రవిదాసు 4) నామదేవుడు
24. గురుగ్రంథ్ సాహెబ్‌లో ఏ భక్తి ఉద్యమకారుడి బోధనలు ఉన్నాయి?
1) తులసీదాస్ 2) కబీర్
3) చోఖామేళుడు 4) సామ్దేవ్
25. నామ్, దాన్, ఇస్నాన్ అనే మూడు మాటలు చెప్పింది?
1) గురునానక్ 2) షేక్ సలీం
3) అర్జున్ దేవ్ 4) కబీర్
26. కందరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించిన ఛందేల రాజు?
1) చంద్రదేవుడు 2) జయదేవుడు
3) ధంగదేవుడు 4) పృథ్వీరాజ్
27. హౌజ్-ఇ-సుల్తాని/రాజుగారి జలాశయం నిర్మించింది?
1) బాల్బన్ 2) ఇల్టుట్మిష్
3) అల్లావుద్దీన్ ఖిల్జీ 4) కుతుబుద్దీన్ ఐబక్
28. మహానవమి దిబ్బ ఏ రాజులకు సంబంధించి గొప్ప కట్టడం?
1) కాకతీయులు 2) చోళులు
3) విజయనగర 4) పాండ్యులు
29. ఏ మొఘల్ చక్రవర్తి నిర్మించిన సమాధులు తైమూరు కట్టడాలను పోలి ఉన్నాయి?
1) అక్బర్ 2) బాబర్
3) హుమాయున్ 4) షాజహాన్
30. నలభై స్తంభాల గదిని నిర్మించింది?
1) ఇల్టుట్మిష్ 2) షాజహాన్ 3) బాల్బన్ 4) అక్బర్
31. ఏ మొఘల్ చక్రవర్తి సమాధిని అష్టబిహిష్ట్ అని పిలుస్తారు?
1) షాజహాన్ 2) ఔరంగజేబ్
3) హుమాయున్ 4) అక్బర్
32. ఖుద్ఖాస్త్ భూములు అంటే?
1) చక్రవర్తుల భూములు 2) రైతుల భూములు
3) జమీందారుల భూములు 4) ఏదీకాదు
33. కారన్‌వాలీస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు?
1) 1783 2) 1793 3) 1786 4) 1796
34. 1866లో లండన్‌లో ఈస్టిండియా అసోసియేషన్‌ను స్థాపించింది?
1) మౌలానా అబుల్ కలాం ఆజాద్
2) దాదాబాయి నౌరోజీ
3) సురేంద్రనాథ్ బెనర్జీ 4) ఎంజీ రనడే
35. బెంగాల్‌ను విభజించిన రోజు?
1) 1905 అక్టోబర్ 16 2) 1905 సెప్టెంబర్ 16
3) 1905 ఆగస్టు 16 4) 1905 నవంబర్ 16
36. ఏ కాంగ్రెస్ సమావేశంలో అతివాదులు, మితవాదులుగా విడిపోయారు?
1) కలకత్తా 2) సూరత్ 3) లక్నో 4) అహ్మదాబాద్
37. ఏ ఉద్యమం ఫలితంగా పీసీరే బెంగాల్ కెమికల్ ఫ్యాక్టరీని స్థాపించాడు?
1) సహాయ నిరాకరణ ఉద్యమం 2) స్వదేశీ ఉద్యమం 3) ఖిలాఫత్ ఉద్యమం 4) క్విట్ ఇండియా
38. కిందివాటిలో సరైనవి.
1) 1917- చంపారన్ ఆందోళన
2) 1918- ఖెడా సత్యాగ్రహం
3) 1918-అహ్మదాబాద్ నూలుమిల్లు కార్మికుల ఆందోళన
4) పైవన్నీ
39. ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపబడ్డాడు?
1) 1920-నాగ్‌పూర్ కాంగ్రెస్
2) 1885-బొంబాయి కాంగ్రెస్
3) 1916-లక్నో సమావేశం
4) 1907 – సూరత్ సమావేశం
40. ముస్లిం లీగ్ ఏరోజున ప్రత్యక్ష కార్యాచరణ దినం జరిపింది?
1) 1947 ఆగస్టు 16 2) 1946 ఆగస్టు 16
3) 1945 ఆగస్టు 16 4) 1946 సెప్టెంబర్ 16
41. అంజుమన్-ఎ-మారెఫ్ సంస్థను స్థాపించింది?
1) ముల్లా అబ్దుల్ ఖయ్యూం 2) షోయబుల్లా ఖాన్
3) అఘోరనాథ ఛటోఫాధ్యాయ 4) రెవరెండ్ గిల్టర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?