సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉన్నది?
విపత్తు నిర్వహణ
1. 2016 డిసెంబర్లో చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన తుఫాను ఏది?
1) హుద్ ద్ 2) లెహర్
3) పైలిన్ 4) వార్ధా
2. అన్ని రకాల ప్రకృతి ప్రమాదాలకు, విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమన్వయ పర్చడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న శాఖ?
1) హోంశాఖ 2) గ్రామీణాభివృద్ధి శాఖ
3) రక్షణ శాఖ 4) సమాచార ప్రసార శాఖ
3. దేశంలో తరచూ భూకంపాలు సంభవించే రాష్ట్రం?
1) అసోం 2) బీహార్
3) మేఘాలయా 4) మహారాష్ట్ర
4. సముద్రం లోపలి భూకంపాన్ని ఏమంటారు?
1) తుఫాను
2) సునామీ
3) ఉరుము
4) మెరుపు
5. కింది వాటిలో మానవ ప్రేరిత విపత్తు ఏది?
1) భూకంపం
2) సునామీ
3) వరద 4) పైవేవీ కావు
6. సునామీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
1) జపనీస్ 2) చైనీస్
3) గ్రీకు 4) ఫ్రెంచ్
7. ఆగ్నేయ ఇరాన్లో శక్తిమంతమైన భూకంపం సంభవించడంతో భారీ ఆస్తి నష్టంతోపాటు 30 వేల మంది మరణించారు. ఆ భూకంపం సంభవించిన రోజు?
1) 2003 డిసెంబర్ 26
2) 2003 నవంబర్ 26
3) 2003 అక్టోబర్ 26
4) 2002 అక్టోబర్ 26
8. కింది వాటిలో ప్రకృతి సంబంధ ప్రమాదం ఏది?
1) భూకంపం 2) భూపాతం
3) తుఫాను 4) పైవన్నీ
9. ఒక కుటుంబ విపత్తు సామగ్రిలో ఉండాల్సినవి ఏవి?
1) దుస్తుల జత (వేడిని ఇచ్చేవి)
2) ఆహారం, నీరు
3) మందులు 4) పైవన్నీ
10. ఒక విపత్తు నిర్వహణ బృందంలో ఉండా ల్సిన టీమ్లు ఏవి?
1) ప్రథమ చికిత్స టీమ్
2) అన్వేషణ & కాపాడే టీమ్
3) అవగాహన కల్పించే టీమ్ 4) పైవన్నీ
11. కింది ప్రమాదాల్లో ఏవి విపత్తుగా మారవచ్చు?
1) తుఫానులు 2) భూకంపాలు
3) సునామీలు 4) పైవన్నీ
12. విపత్తు నిర్వహణ కార్యక్రమాలు ఎప్పుడు జరుగవచ్చు?
1) విపత్తుకు ముందుగా
2) విపత్తు సమయంలో
3) విపత్తు తర్వాత 4) పైవన్నీ
13. కింది వాటిలో ఏది విపత్తు నిర్వహణలో అంతర్భాగం?
1) ఉపశమనం 2) అత్యవసర స్పందన
3) పునరావాసం 4) పైవన్నీ
14. 2011లో ఏ రోజున జపాన్ ఈశాన్య తీరంలో సంభవించిన భూకంపం సునామీగా మారి 19 వేల మందిని బలితీసుకున్నది?
1) 2011 ఏప్రిల్ 5
2) 2011 ఏప్రిల్ 11
3) 2011 మార్చి 5
4) 2011 మార్చి 11
15. కింది వారిలో సునామీల మీద పరిశోధనలు చేస్తున్న తెలుగు మహిళ ఎవరు?
1) సునంద 2) సురేఖ
3) సుమతి 4) సుస్మిత
16. విపత్తులను వేటి ఆధారంగా వర్గీకరించవచ్చు?
1) మానవ నష్టం 2) వేగం
3) గత చరిత్ర 4) పైవన్నీ
17. భూపాతాలు జరుగడానికి కారణం?
1) వర్షపాత తీవ్రత 2) తీవ్ర ఏటవాలు
3) నేల అరుగుదల 4) పైవన్నీ
18. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉన్నది?
1) జకర్తా 2) గోవా
3) టోక్యో 4) హొనలులు
19. విపత్తు సమయాల్లో నమ్మకమైన ప్రసారాలు ఏవి?
1) రేడియో ప్రసారాలు
2) ఉపగ్రహ ఆధార ప్రసారాలు
3) ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రసారాలు
4) పైవన్నీ
20. కింది వాటిలో విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోగల సంస్థలు?
1) పంచాయతీరాజ్ సంస్థలు
2) సహకార సంస్థలు
3) వ్యవసాయ అభివృద్ధి బ్యాంకులు
4) గ్రామీణ బ్యాంకులు
21. నేషనల్ సివిల్ డిఫెన్స్ కళాశాలను 1957లో ఎక్కడ స్థాపించారు?
1) నాగపూర్ 2) పుణె
3) కొచ్చిన్ 4) గోవా
22. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉన్నది?
1) న్యూఢిల్లీ 2) ముంబై
3) సూరత్ 4) విశాఖపట్నం
23. విపత్తు అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
1) అరబిక్ 2) ఫ్రెంచ్
3) గ్రీకు 4) లాటిన్
24. దేశంలో ఏ నదివల్ల ఎక్కువగా వరదలు వస్తాయి?
1) గోదావరి 2) గోమతి
3) బ్రహ్మపుత్ర 4) కావేరి
25. రాష్ట్ర సంక్షోభ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఎవరు?
1) ముఖ్య కార్యదర్శి
2) ముఖ్యమంత్రి
3) ఆర్థిక కార్యదర్శి 4) ఆర్థిక మంత్రి
26. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం-2005 ప్రకారం ఏర్పాటైనవి?
1) డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (DRF)
2) డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ (DMF)
3) NIDM & NDRF 4) పైవన్నీ
27. ఆంధ్రప్రదేశ్లో తరచూ వరదలకు ప్రభావితమయ్యే ప్రాంతం ఏది?
1) పెన్నార్ బేసిన్
2) కృష్ణా, గోదావరి ప్రాంతం
3) ఉత్తరకోస్తా ప్రాంతాలు
4) దక్షిణ కోస్తా ప్రాంతాలు
28. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కరువులకు గురయ్యే ప్రదేశం?
1) అనంతపురం 2) శ్రీకాకుళం
3) రాయలసీమ 4) కోస్తాంధ్ర
29. 2005లో ప్రపంచ విపత్తుల నిర్వహణ సమావేశం ఎక్కడ జరిగింది?
1) చిలీ 2) చైనా
3) కొరియా 4) జపాన్
30. కింది వాటిలో ఏవి మానవ తప్పిదం వల్ల ఏర్పడే విపత్తులు?
1) వరదలు 2) భూకంపాలు
3) కరువులు 4) అగ్నిప్రమాదాలు
31. DMT అంటే..?
1) డిజాస్టర్ మిటిగేషన్ టీమ్
2) డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్
3) డిజాస్టర్ మానిటరింగ్ టీమ్
4) డిజాస్టర్ మెయింటెనెన్స్ టీమ్
32. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధ్యక్షుడిగా ఎవరుంటారు?
1) ప్రధానమంత్రి 2) రాష్ట్రపతి
3) హోంమంత్రి 4) క్యాబినెట్ సెక్రటరీ
33. రింగ్ ఆఫ్ ఫైర్ (మంటల చట్రం) ఏ సముద్రానికి సంబంధించినది?
1) అట్లాంటిక్ 2) పసిఫిక్
3) హిందూ మహాసముద్రం
4) అంటార్కిటిక్
34. భూకంపాల తీవ్రతనుబట్టి భారత్ ఎన్ని జోన్లుగా విభజితమైంది?
1) 5 2) 4 3) 6 4) 8
35. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో పొడవైన కోస్తా ప్రాంతం ఉన్నది?
1) నెల్లూరు 2) ప్రకాశం
3) విశాఖపట్నం 4) శ్రీకాకుళం
36. వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి?
1) స్ట్రాటోస్పియర్ 2) ట్రోపోస్పియర్
3) మీసోస్పియర్ 4) ఐనోస్పియర్
37. కొండ ప్రదేశాల్లో కురిసే వర్షపాతాలను ఏ పేరుతో పిలుస్తారు?
1) తుఫానులు
2) సాంప్రదాయక వర్షపాతం
3) ఓరోగ్రాఫిక్ వర్షపాతం
4) ఫ్రంటల్ వర్షపాతం
38. విపత్తు నిర్వహణ చట్టం కింద ఏర్పాటైన యంత్రాంగాలు?
1) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ
2) రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ
3) జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ
4) పైవన్నీ
39. ఇండోనేషియాలోని సుమత్రాలో తీవ్రమైన భూకంపాలు ఎప్పుడు సంభవించాయి?
1) 2012 ఏప్రిల్ 11
2) 2012 ఏప్రిల్ 15
3) 2012 ఏప్రిల్ 18
4) 2012 ఏప్రిల్ 22
40. సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉన్నది?
1) ఖాట్మండు 2) ఢాకా
3) న్యూఢిల్లీ 4) కొలంబో
41. సార్క్ విపత్తు నిర్వహణ వెబ్సైట్?
1) sdmc.nic.in
2) saarc.sdmc.in
3) saarc.nic.in
4) saarc.sdmc.nic.in
42. విపత్తు వచ్చినప్పుడు ముందుగా ఎవరు స్పందించాలి?
1) జన సముదాయం
2) కేంద్ర ప్రభుత్వం
3) రెడ్ క్రాస్ 4) రాష్ట్ర ప్రభుత్వం
43. భోపాల్ దుర్ఘటనను ఏ రకమైన విపత్తుగా చెప్పవచ్చు?
1) రసాయన 2) జీవ సంబంధ
3) సహజ 4) చెప్పటం కష్టం
44. జాతీయ విపత్తు తగ్గింపు దినం ఏది?
1) అక్టోబర్ 29 2) సెప్టెంబర్ 11
3) సెప్టెంబర్ 29 4) నవంబర్ 1
45. భూకంప కేంద్రానికి సరిగ్గా పైనున్న స్థానాన్ని ఏమంటారు?
1) ఎపిసెంటర్ 2) మెటాసెంటర్
3) మైపర్ సెంటర్ 4) హైపోసెంటర్
46. ఢిల్లీ, ముంబై ఏ రకపు భూకంప రిస్క్ జోన్లో ఉన్నాయి?
1) జోన్-4 2) జోన్-1
3) జోన్-5 4) జోన్-3
47. ఒక సునామీలో మొదటి అల..
1) అన్నింటి కంటే పెద్దది
2) అన్నింటి కంటే పెద్దది కాకపోవచ్చు
3) అన్నింటి కంటే ప్రమాదకరమైనది
4) ఏదీకాదు
48. ప్రథమ చికిత్స కార్య ప్రణాళికను ఆంగ్లంలో సంక్షిప్తంగా ఏమంటారు?
1) RADBC 2) BCRAD
3) DRABC 4) ABCDR
49. విపత్తు నిర్వహణ ప్రణాళిక ప్రకారం.. న్యూక్లియర్ విపత్తుల నిర్వహణకు ఏ మంత్రిత్వ శాఖ నోడల్ శాఖగా ఉంటుంది?
1) హోంశాఖ 2) అణుశక్తి శాఖ
3) రక్షణ శాఖ 4) ఆరోగ్య శాఖ
50. విపత్తులవల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశం పెరుగడానికి ఇది కారణం కాదు?
1) జనాభా పెరుగుదల
2) వాతావరణ మార్పులు
3) కాలుష్యం పెరుగడం
4) శాస్త్రసాంకేతికతల్లో స్తబ్దత
జాతీయ, అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు
#అంతర్జాతీయ విపత్తు తగ్గింపు వ్యూహ కేంద్రం – జెనీవా (స్విట్జర్లాండ్)
# అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం – హొనలులు (అమెరికా)
# పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం – హవాయి (అమెరికా)
#అంతర్జాతీయ వాతావరణ సంస్థ – జెనీవా (స్విట్జర్లాండ్)
#ఆసియా విపత్తు తగ్గింపు కేంద్రం – కోబ్ (జపాన్)
# అంతర్జాతీయ రెడ్క్రాస్, రెడ్ క్రీసెంట్ సొసైటీ – జెనీవా (స్విట్జర్లాండ్)
#సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ – న్యూఢిల్లీ (భారత్)
# ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ క్లెమేట్ ఛేంజ్ – జెనీవా (స్విట్జర్లాండ్)
# ఎర్త్ క్వేక్ ఇంజినీరింగ్ రిసెర్చ్ సెంటర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
– హైదరాబాద్ (భారత్)
# జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ – న్యూఢిల్లీ
#జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం – న్యూఢిల్లీ
#నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ – హైదరాబాద్
# భారత సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్రం – హైదరాబాద్
# డిజాస్టర్ మిటిగేషన్ ఇన్స్టిట్యూట్ – అహ్మదాబాద్
# కేంద్ర జల సంఘం – న్యూఢిల్లీ
#సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ – రూర్కీ (ఉత్తరాఖండ్)
#నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ – పనాజీ (గోవా)
# పారిశ్రామిక విష పదార్థాల పరిశోధన సంస్థ – లక్నో (ఉత్తరప్రదేశ్)
#సెంట్రల్ సిస్మోలాజికల్ అబ్జర్వేటరీ – కొడైకెనాల్
#నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ ఎర్త్క్వేక్ ఇంజినీరింగ్ – కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)
#డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ – భోపాల్ (మధ్యప్రదేశ్)
# డిజాస్టర్ మిటిగేషన్ ఇన్స్టిట్యూట్ – అహ్మదాబాద్ (గుజరాత్)
#సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ – పుణె (మహారాష్ట్ర)
జవాబులు
1-4, 2-1, 3-1, 4-2, 5-4, 6-1, 7-1, 8-4, 9-4, 10-4, 11-4, 12-4, 13-4, 14-4, 15-1, 16-4, 17-4, 18-4, 19-4, 20-1, 21-1, 22-1, 23-2, 24-3, 25-1, 26-4, 27-2, 28-1, 29-4, 30-4, 31-2, 32-1, 33-2, 34-1, 35-4, 36-2, 37-3, 38-4, 39-1, 40-3, 41-4, 42-1, 43-1, 44-1, 45-1, 46-1, 47-2, 48-3, 49-1, 50-4.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు