సర్పిలాకార హరిత రేణువులను కలిగి ఉన్న శైవలం ఏది?
1. కింది వాటిలో పిండయుత మొక్కలను గుర్తించండి.
1) బ్రయోఫైటా 2) టెరిడోఫైటా
3) ఆవృత బీజాలు, వివృత బీజాలు
4) పైవన్నీ
2. పుష్పించని పిండయుత మొక్కలు ఏవి?
1) థాలోఫైటా, బ్రయోఫైటా
2) బ్రయోఫైటా, టెరిడోఫైటా
3) టెరిడోఫైటా, వివృత బీజాలు
4) వివృతబీజాలు, ఆవృతబీజాలు
3. పుష్పించే పిండయుత మొక్కలు ఏవి?
1) థాలోఫైటా, బ్రయోఫైటా
2) బ్రయోఫైటా, టెరిడోఫైటా
3) టెరిడోఫైటా, వివృతబీజాలు
4) వివృతబీజాలు, ఆవృతబీజాలు
4. పిండరహిత మొక్కలు ఏవి?
1) థాలోఫైటా 2) బ్రయోఫైటా
3) టెరిడోఫైటా 4) పైవన్నీ
5. నాళికా కణజాలం లేని మొక్కలు ఏవి?
1) ఆవృతబీజాలు 2) వివృతబీజాలు
3) టెరిడోఫైటా 4) బ్రయోఫైటా
6. నాళికా కణజాలం కలిగిన మొక్కలు ఏవి?
1) ఆవృతబీజాలు, వివృతబీజాలు
2) టెరిడోఫైటా
3) పై రెండూ 4) బ్రయోఫైటా
7. నాళికాయుత పుష్పించని మొక్కలు ఏవి?
1) థాలోఫైటా 2) బ్రయోఫైటా
3) టెరిడోఫైటా 4) వివృతబీజాలు
8. నాళికాయుత పుష్పించే మొక్కలు ఏవి?
1) ఆవృత బీజాలు 2) వివృత బీజాలు
3) ఆవృతబీజాలు, వివృతబీజాలు
4) టెరిడోఫైటా
9. నాళికారహిత పుష్పించని మొక్కలు ఏవి?
1) థాలోఫైటా, టెరిడోఫైటా
2) టెరిడోఫైటా 3) బ్రయోఫైటా
4) థాలోఫైటా, బ్రయోఫైటా
10. పుష్పించని మొక్కలు ఏవి?
1) థాలోఫైటా 2) బ్రయోఫైటా
3) టెరిడోఫైటా 4) పైవన్నీ
11. పుష్పించే మొక్కలు ఏవి?
1) వివృతబీజాలు 2) ఆవృతబీజాలు
3) వివృతబీజాలు, ఆవృతబీజాలు
4) థాలోఫైటా, బ్రయోఫైటా
12. ఎక్కువగా వర్ధనం చేసే శైవలాలు ఏవి?
1) క్లోరెల్లా, డునాలియెల్లా, స్పైరులినా
2) వాల్వాక్స్, స్పైరోగైరా
3) కారా, ఎక్టోకార్పస్
4) లామినేరియా, ఫూకస్
13. భారతదేశపు శైవలశాస్త్ర పితామహుడిగా ఎవరు కీర్తించబడ్డారు?
1) ఫ్రిట్చ్ 2) ఎంవోపీ అయ్యంగార్
3) మైకేలి 4) ఆశ్రే
14. సూక్ష్మమైన ఏకకణ శైవలం ఏది?
1) క్లామిడో మోనాస్ 2) యూలోథ్రిక్స్
3) కారా 4) అల్వా
15. సర్పిలాకార హరిత రేణువులను కలిగి ఉన్న శైవలం?
1) క్లోరెల్లా 2) వాల్వాక్స్
3) స్పైరోగైరా 4) యూలోథ్రిక్స్
16. ఆక్వాటిక్ హార్స్టేల్ అనే శైవలం ఏది?
1) అల్వా 2) కారా
3) డిక్టియోటా 4) ఫూకస్
17. అయోడిన్ లభించే శైవలాలు ఏవి?
1) ఆకుపచ్చ శైవలాలు (క్లోరోఫైసి)
2) గోదుమ శైవలాలు (ఫియోఫైసి)
3) ఎరుపు శైవలాలు (రొడోఫైసీ)
4) నీలిఆకుపచ్చ శైవలాలు (సయనోఫైసి)
18. అతిపెద్ద శైవలాలు ఏవి?
1) సయనోఫైసి 2) రొడోఫైసి
3) ఫియోఫైసి 4) క్లోరోఫైసి
19. అతిపొడవైన శైవలం ఏది?
1) మైక్రోసిస్టిస్ 2) సర్గాసమ్
3) ఎక్టోకార్పస్ 4) లామినేరియా
20. కర్రాజీన్ అనే పదార్థాన్ని పాల చిక్కదనానికి ఉపయోగిస్తారు. అది ఏ శైవలం నుంచి లభిస్తుంది?
1) జెలీడియం 2) గ్రాపిల్లేరియా
3) పోర్పైరా 4) కాండ్రస్ (Irish moss)
21. అగార్ అగార్ అనేది ఏ శైవలం నుంచి లభిస్తుంది?
1) జెలీడియం 2) గ్రాపిల్లేరియా
3) జెలీడియం, గ్రాపిల్లేరియా
4) పోర్పైరా
22. నీటిపై తేలియాడే పచ్చికబయళ్లు అని వేటిని అంటారు?
1) డయాటమ్లు
2) నీలిఆకుపచ్చ శైవలాలు
3) గోధుమ శైవలాలు
4) ఎరుపు శైవలాలు
23. జీవ ఎరువులుగా ఉపయోగపడే శైవలాలు ఏవి?
1) పచోయ్ 2) నాస్టాక్
3) అనబీనా 4) నాస్టాక్, అనబీనా
24. ఏకకణ శిలీంధ్రం ఏది?
1) మ్యూకార్ 2) ఈస్ట్
3) ఆల్బుగో 4) రైజోపస్
25. ఆవాల మొక్కపైన తెల్లమచ్చల వ్యాధిని కలుగజేసే శిలీంధ్రం?
1) పెనిసీలియం 2) న్యూరోస్పోరా
3) ఆల్బుగో 4) మ్యూకార్
26. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొదటి యాంటీ బయాటిక్ అయిన పెన్సిలిన్ను ఏ శిలీంధ్రం నుంచి తయారుచేశాడు?
1) పెనిసీలియం క్రైసోజీనం
2) పెనిసీలియం నొటేటం
3) పెనిసీలియం ఆక్యుపెన్సి
4) పెనిసీలియం మార్సా
27. వేరుశనగలపై పెరిగి అప్లోటాక్సిన్ అనే విషపదార్థాన్ని ఉత్పత్తిచేసే శిలీంధ్రం?
1) న్యూరోస్పోరా
2) ఆస్పర్జిల్లస్ ప్లావస్
3) పెనిసీలియం మార్సా 4) క్లావిసెప్స్
28. జీవరసాయనిక, జన్యుశాస్త్ర పరిశోధనల్లో విస్తృతంగా వాడే శిలీంధ్రం ఏది?
1) న్యూరోస్పోరా 2) ఈస్ట్
3) ఆస్పర్జిల్లస్ నైగర్ 4) పెనిసీలియం
29. చెరుకులో ఎర్రకుళ్లు తెగులును కలిగించే శిలీంధ్రం ఏది?
1) ఆల్టర్నేరియా 2) కొల్లెటోట్రైఖమ్
3) ట్రైకోడెర్మా 4) పాలీపోరస్
30. ఏ లైకెన్ను కామెర్ల వ్యాధి చికిత్సలో వాడుతారు?
1) అంబెల్లికేరియా 2) ఫార్మీలియా
3) అస్నియా 4) పెల్టిజెరాకానినా
31. ఉభయచరాలు అని ఏ మొక్క లను అంటారు?
1) థాలోఫైటా 2) బ్రయోఫైటా
3) టెరిడోఫైటా 4) ఆవృతబీజాలు
32. మొదటి నేలయుత మొక్కలు ఏవి?
1) థాలోఫైటా 2) బ్రయోఫైటా
3) టెరిడోఫైటా 4) వివృత బీజాలు
33. మొదటి నిజమైన నేలయుత మొక్కలు ఏవి?
1) థాలోఫైటా 2) బ్రయోఫైటా
3) టెరిడోఫైటా 4) వివృతబీజాలు
34. వృక్షరాజ్యపు సరీసృపాలు అని ఏ మొక్కలను అంటారు?
1) వివృతబీజాలు 2) ఆవృతబీజాలు
3) బ్రయోఫైటా 4) టెరిడోఫైటా
35. అలంకరణ కోసం పెంచే మొక్కలు ఏవి?
1) థాలోఫైటా 2) బ్రయోఫైటా
3) టెరిడోఫైటా 4) వివృతబీజాలు
36. వరి పొలాల్లో జీవ ఎరువుగా ఉపయోగించే టెరిడోఫైట్ మొక్క ఏది?
1) సైలోటం 2) ఈక్విజిటం
3) మార్సీలియా 4) అజొల్లా
37. విత్తనాలు ఫలంలో కాకుండా మొక్క బహిర్గత భాగాలకు అతికివుండే మొక్కలు ఏవి?
1) ఆవృతబీజాలు 2) వివృతబీజాలు
3) టెరిడోఫైటా 4) పైవన్నీ
38. ఏ మొక్కల పుష్పాలను శంఖులు అంటారు?
1) వివృతబీజాలు 2) ద్విదళ బీజాలు
3) ఏకదళబీజాలు 4) పైవన్నీ
39. వృక్షరాజ్యంలో అతిపెద్ద అండం కలిగిన మొక్క ఏది?
1) సైకస్ 2) పైనస్
3) సికోయ 4) దేవదారు
40. సజీవశిలాజ (Living fossile) వివృతబీజ మొక్క ఏది?
1) సాలిక్స్ 2) టాక్సస్
3) గింగో 4) నీటం
41. క్రికెట్ బ్యాట్లు, హాకీ హ్యాండిల్స్ తయారీకి ఉపయోగించే కలప ఏ వివృతబీజ మొక్క నుంచి లభిస్తుంది?
1) సాలిక్స్ /విల్లో 2) సికోయ
3) దేవదారు 4) పైనస్
42. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మొక్క ఏది?
1) సికోయ 2) సిడ్రస్
3) వెదురు 4) పైనస్
43. విత్తనాలు ఫలాల లోపల ఉండే మొక్కలు ఏవి?
1) వివృతబీజాలు 2) బ్రయోఫైటా
3) ఆవృతబీజాలు 4) టెరిడోఫైటా
44. కిందివాటిలో ద్విదళబీజ మొక్కలు ఏవి?
1) వేరుశనగ, చిక్కుడు, చింత, బఠానీ, ఆవాలు
2) కందులు, పెసలు, మినుములు, మామిడి, వేప
3) 1, 2
4) వరి, మొక్కజొన్న, గోధుమ, కొబ్బరి, కర్జూర, జొన్న, సజ్జ, తాటి, ఈత, వెదురు
45. కింది వాటిలో బీజదళం పరంగా భిన్నమైన మొక్క ఏది?
1) కంది 2) పెసర
3) జొన్న 4) ఆవాలు
46. రైల్వే స్లీపర్స్ తయారీకి ఏ మొక్క కలపను వాడుతారు?
1) సాలిక్స్/విల్లో 2) సికోయ
3) దేవదారు (సిడ్రస్) 4) టాక్సస్
47. కింది మొక్కలు, వాటి శాస్త్రీయ నామాలను జతపర్చండి.
ఎ. సీతాఫలం 1. మాంజిఫెరా ఇండికా
బి. మామిడి 2. అనోనా స్కామోసా
సి. మల్లె 3. జాస్మినమ్ ఇండికా
డి. తంగేడు 4. కేసియా అరిక్యులేటా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
48. కింది మొక్కలు, వాటి శాస్త్రీయ నామాలను జతపర్చండి.
ఎ. తామర 1. అజడరిక్టా ఇండికా
బి. వేప 2. ప్రొసోపిస్ సినరేరియా
సి. జమ్మి 3. నీలంబో న్యూసిఫెరా
డి. మర్రి 4. ఫైకస్ బెంగాలెన్సిస్
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-3, బి-1, సి-2, డి-4
49. కింది మొక్కలు, వాటి శాస్త్రీయ నామాలను జతపర్చండి.
ఎ. వరి 1. ట్రిటికం వల్గేర్/ఈస్టివం
బి. గోధుమ 2. సోర్గమ్ వల్గేర్
సి. మొక్కజొన్న 3. ఒరైజా సెటైవా
డి. జొన్న 4. జియామేజ్
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-1, సి-3, డి-4
50. కింది మొక్కలు, వాటి శాస్త్రీయ నామాలను జతపర్చండి.
ఎ. సజ్జ 1. ఎల్యుసినే కొరకానా
బి. కొర్రలు 2. పెన్నిసిటం టైపాయిడెస్
సి. ఖర్జూర 3. బాంబూసా వల్గారిస్
డి. వెదురు 4. ఫోనిక్స్ డాక్టెలిఫెరా
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-3
51. కింది మొక్కలు, వాటి శాస్త్రీయ నామాలను జతపర్చండి.
ఎ. వేరుశనగ 1. ఫోనిక్స్ సిల్వెస్ట్రిస్
బి. ఈత 2. కోకస్ న్యూసిఫెరా
సి. కొబ్బరి 3. బొరాసిస్ పాబెల్లిఫెరా
డి. తాటి 4. అరాఖిస్ హైపోజియా
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-2, బి-1, సి-3, డి-4
52. కింది మొక్కలు, వాటి శాస్త్రీయ నామాలను జతపర్చండి.
ఎ. టేకు 1. కెలోట్రోపిస్
బి. జిల్లేడు 2. డాలికస్ బైఫ్లోరస్
సి. ఉలవలు 3. పైసమ్ సటైవం
డి. బఠాని 4. టెక్టోనా గ్రాండిస్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-4, బి-1, సి-2, డి-3
53. కింది మొక్కలు, వాటి శాస్త్రీయ నామాలను జతపర్చండి.
ఎ. రాగులు 1. ప్రాసియోలస్ ఆరియస్
బి. బార్లీ 2. హార్డియం వల్గేర్
సి. మినుములు 3. ఎల్యుసైన్ కొరకాన
డి. పెసలు 4. ప్రాసియోలస్ మాంగో
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-2, బి-3, సి-1, డి-4
54. కింది మొక్కలు, వాటి శాస్త్రీయ నామాలను జతపర్చండి.
ఎ. కంది 1. టామరిండస్ ఇండికా
బి. శనగ 2. కజానస్ కజానస్
సి. చింత 3. డాలికస్ లాబ్లాబ్
డి. చిక్కుడు 4. సైసర్ ఎరైటినమ్
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-3
55. కింది మొక్కలు, వాటి శాస్త్రీయ నామాలను జతపర్చండి.
ఎ. పొద్దు తిరుగుడు 1. డాల్బర్జియా లాటిపోలియా
బి. జిట్టేగి (Indian rosewood) 2. టీరోకార్పస్ సాంటాలం
సి. తెల్లచందనం (Sandal wood) 3. హీలియాంథస్ అన్యువస్
డి. ఎర్రచందనం 4. సాంటాలమ్ ఆల్బం
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-4, బి-3, డి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-3
సమాధానములు
1-4 2-2 3-4 4-1 5-4 6-3 7-3 8-3 9-4 10-4 11-3 12-1
13-2 14-1 15-3 16-2 17-2 18-3 19-1 20-4 21-3 22-1 23-4 24-2
25-3 26-2 27-2 28-1 29-2 30-1 31-2 32-2 33-3 34-4 35-3 36-4
37-2 38-1 39-1 40-3 41-1 42-1 43-3 44-3 45-3 46-3 47-2 48-4
49-3 50-4 51-1 52-4 53-3 54-2 55-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు