గోళాకారంలో ఉన్న పుల్లరిన్లను ఏమంటారు?
కార్బన్ దాని సమ్మేళనాలు
- కార్బన్ ఒక అలోహం. ఇది ఆధునిక ఆవర్తన పట్టికలో IV-A గ్రూప్‌కు చెందిన మూలకం.
- బాహ్యకర్పరంలో 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి.
- కార్బన్ పరమాణువుల సంఖ్య- 6
- చారిత్రక పూర్వయుగంలోనే దీనిని కనుగొన్నారు. మన పూర్వీకులు జీవ పదార్థాన్ని దహనం చెందించి ‘చార్కోల్’ను తయారు చేసేవారు.
- కార్బన్ ఎల్రక్టాన్ విన్యాసం 1S2, 2S2, 2P2
- భూమి పొరల్లో కార్బన్ 0.3% వివిధ రూపాల్లో లభిస్తుంది.
- ఉత్తేజ స్థాయిలో కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1S2, 2S2, 2Px1 2Py1 2Pz1
- కార్బన్‌కు చెందిన నాలుగు ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న ఆర్బిటాళ్లు శక్తితత్వ సమానమని సంకరీకరణం ద్వారా చూపవచ్చు.
సంకరీకరణం
- సంకరీకరణం అనే భావనను మొదట ప్రవేశ పెట్టింది- లైనన్ ఫాలింగ్ (1931)
- ఒక పరమాణువులో దాదాపు సమానశక్తి గల ఆర్బిటాళ్లు పునరేఖీకరణ చెందడం ద్వారా అదే సంఖ్యలో శక్తి, ఆకృతి వంటి ధర్మాల్లో సారూప్యత కలిగిన నూతన ఆర్బిటాళ్లు ఏర్పడటాన్ని సంకరీకరణం అంటారు.
- కార్బన్ సంకర SP3, SP2, SP ఆర్బిటాళ్లను ఏర్పరుస్తుంది.
- SP3 సంకరీకరణం- మీథేన్ (CH4)
- SP2 సంకరీకరణం- ఇథిలిన్ (C2H4)
- SP సంకరీకరణం- ఎసిటలిన్ (C2H2)
కార్బన్ రూపాంతరాలు
- ఏదైనా ఒక మూలకం రెండు కంటే ఎక్కువ రూపాల్లో లభిస్తూ రసాయన ధర్మాలు దాదాపు సారూప్యత కలిగి ఉండి భౌతిక ధర్మాల్లో విభేదించే ధర్మాన్ని రూపాంతరత (Allotropy) అంటారు.
- ఆ మూలకం విభిన్న రూపాలను రూపాంతరాలు అంటారు.
- ఇవి వాటి పరమాణువుల అమరికల్లో తేడా వల్ల ఏర్పడుతాయి.
కార్బన్ రూపాంతరాలు రెండు రకాలు
- స్పటిక రూపాంతరాలు (Crystalline)
- అస్పటిక రూపాంతరాలు (Amorphous Forms)
- అస్పటిక రూపాంతరాలు: బొగ్గు, కోక్, కలప, చార్కోల్, జంతు చార్కోల్, నల్లని మణి వాయురూప కార్బన్, పెట్రోలియం కోల్, చక్కెర చార్కోల్ మొదలైనవి అస్పటిక రూపాంతరాలు
- స్పటిక రూపాంతరాలు
- కార్బన్లో 4 రకాలైన స్పటిక రూపాంతరాలున్నాయి.
- 1. వజ్రం 2. గ్రాఫైట్ 3. బక్మిన్స్టర్ పుల్లరిన్ 4. నానో నాళాలు
వజ్రం
- ప్రతి కార్బన్ పరమాణువు ఉత్తేజస్థితిలో SP3 సంకరీకరణం చెందుతుంది.
- ప్రతి కార్బన్ పరమాణువు చతుర్ముఖీయ ఆకృతిని కలిగి ఉంటుంది.
- C – C బంధాలు చాలా బలమైనవి. ఏక సంయోజనీయ బంధం కలిగి ఉంటుంది.
- వజ్రం సాంద్రత 4.51 గ్రా/సెం.మీ.
- వజ్రం వక్రీభవన గుణకం విలువ 2.41
- వజ్రం అధమ ఉష్ణ,
- అధమ విద్యుత్ వాహకం
- C – C బంధ దూరం 1.54 Ao, బంధ కోణం 109o 28
- ఇప్పటి వరకు తెలిసిన అన్ని పదార్థాల్లో గట్టి పదార్థం వజ్రం
గ్రాఫైట్
- ఇది ద్విమితీయ (2D) నిర్మాణం గల పొరలను కలిగి ఉంటుంది.
- ఈ పొరల మధ్య C H బంధాలు సాపేక్షంగా బలహీనంగా ఉంటాయి.
- గ్రాఫైట్ SP2 సరళీకరణాల గల కార్బన్ పరమాణువులతో ఉంటుంది.
- గ్రాఫైట్ పొరల మధ్య దూరం 3.35 Ao
- నల్లటి, మెత్తటి స్ఫటిక ఘన పదార్థం. దీనిని కందెనలు, పెన్సిల్ లెడ్‌గా ఉపయోగిస్తారు.
- ఇది ఉత్తమ విద్యుత్ వాహకం, దీని సాంద్రత 2.25 గ్రా/సెం.మీ
- గ్రాఫైట్ మంచి విద్యుత్ వాహకంగా పనిచేయడానికి గల కారణం విస్తాపనం చెంది ఉన్న ఎలక్ట్రాన్ వ్యవస్థ.
- C -C బంధ దూరం 1-42Ao బంధకోణం 120o
బక్మిన్స్టర్ పుల్లరిన్ C60
- దీనిని 1985లో క్రోట్, స్మాలీ అనే శాస్త్రవేత్తల బృందం కనుగొన్నది.
- 1996లో రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి లభించింది.
- జడవాయు వాతావరణంలో భాష్ప కార్బన్ ఘనీభవించడం వల్ల పుల్లరిన్లు ఏర్పడతాయి.
- గోళాకారంలో ఉన్న పుల్లరిన్లను బక్కి బాల్స్ అని కూడా అంటారు.
- బక్మిన్స్టర్ పుల్లరిన్ గోళాకారంలో ఉండి సాకర్బాల్ (ఫుట్‌బాల్) ఆకారంలో అమరిన C60 అణువులను కలిగి ఉంటుంది.
- C60 అణువు ఉపరితలంపై 12 పంచముఖ ఆకృతి, 20 షట్ముఖ ఆకృతి వలయాలు ఉంటాయి.
- ప్రతికర్బన SP2 పరమాణువు సంకర ఆర్బిటాళ్లను కలిగి ఉంటాయి.
- విశిష్ట నిరోధక ఔషదం (Specific anti biotic) మెలనోమా వంటి క్యాన్సర్ కణాలను నిర్మూలించే ఔషదాల తయారీలో C60 ఉపయోగిస్తారు.
నానో నాళాలు
- 1991లో సుమియో లీజిమ నానో నాళాలను కనుగొన్నారు.
- సంయోజనీయ బంధాల్లో పాల్గొనే కర్బన్ పరమాణువుల షట్ముఖ అమరికల వల్ల నానో ట్యూబులు ఏర్పడుతాయి.
- ఇవి గ్రాఫైట్ పొరలను పోలి ఉంటాయి.
- ఇవి విద్యుత్ వాహకాలు కాబట్టి అణుతీగలుగా, సమీకృత వలయాల్లో రాగికి బదులుగా వాడుతారు.
- శాస్త్రవేత్తలు అతి చిన్న కణంలోకి జీవాణువులను పంపించడానికి వీటిని ఉపయోగిస్తారు.
- 1 mm మందం గల గ్రాఫైట్ 3 మిలియన్ పొరల గ్రాఫిన్‌ను కలిగి ఉంటుంది.
- గ్రాఫిన్ రాగి కంటే మంచి విద్యుత్ వాహకం స్టీలు కంటే 200 రెట్లు బలమైనది. కానీ 6 రెట్లు తేలికైనది.
- కాంతి దృష్ట్యా సంపూర్ణ పారదర్శక పదార్థం.
కార్బన్ స్వభావం (Vessatile Nature of Carbon)
- జేజే బెర్జిలియస్ సజీవుల్లో తయారయ్యేవాటిని కర్బన సమ్మేళనాలను నిర్జీవుల్లో తయారయ్యే వాటిని అకర్బన సమ్మేళనాలు అని పిలిచాడు.
- l 1829 ఫ్రెడరిక్ వోలర్ ప్రయోగశాలలో అమ్మోనియం సయనేట్‌ను వేడిచేస్తూ ‘యూరియా’ కనుగొన్నారు.
- మొట్టమొదటగా తయారు చేసిన కృత్రిమ కార్బన్ సమ్మేళనం ‘యూరియా’
- వోలర్ ఆవిష్కరణ ప్రాణాధార శక్తి సిద్ధాంతం తప్పని నిరూపించింది.
- జీవులు జీవించడానికి తోడ్పడే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, న్యూక్లిక్ ఆమ్లాలు, కొవ్వులు, హార్మోన్లు, విటమిన్లు, కార్బన్‌ను కలిగి ఉంటాయి.
కార్బన్‌కు ఉన్న అసమాన ధర్మాలు
- శృంఖల సామర్థ్యం (కాటినేషన్)
- సాదృశ్యత
- బహుబంధాలను ఏర్పర్చడం
- శృంఖల సామర్థ్యం
- కార్బన్ ఇతర పరమాణువులతో కలిసి పొడవైన గొలుసుల వంటి నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఏదైనా మూలకం దానికి చెందిన పరమాణువుల మధ్య బంధాలను ఏర్పర్చుకోవడం ద్వారా అతి పెద్దవైన
- అణువులను ఏర్పర్చగల ధర్మాన్ని శృంఖల ధర్మం అని అంటారు.
- కార్బన్‌కు కాటనేషన్ సామర్థ్యం చాలా ఎక్కువ.
సాదృశ్యత
- ఒక అణుఫార్ములా కలిగి వివిధ నిర్మాణాత్మక ఫార్ములాగల సాదృశ్యాలను సాదృశ్యత అంటారు.
- ఒక అణుఫార్ములాలో రెండు లేదా ఎక్కువ పదార్థాలు ఉంటాయి.
- హైడ్రోకార్బన్లు
హైడ్రో కార్బన్లు
- కార్బన్, హైడ్రోజన్ మాత్రమే కలిగి ఉన్న సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటారు.
ఇవి రెండు రకాలు
- 1. వికృత శృంఖల హైడ్రోకార్బన్లు (ఏలిఫాటిక్ లేదా అచత్రీయ)
- 2. సంవృత శృంఖల హైడ్రోకార్బన్లు
- C-C బంధం ఏక బంధం ఉంటే వాటిని సంతృప్త హైడ్రోకార్బన్లను, రెండు కార్బన్ల మధ్య ద్విబంధం లేదా ఒక త్రిక బంధం ఉన్నట్లయితే వాటిని అసంతృప్త హైడ్రోకార్బన్లు అని అంటారు.
- ఒక కర్బన సమ్మేళనం గుణాత్మక ధర్మాలు ప్రధానంగా దానిలోని ఒక పరమాణువు లేదా పరమాణు సమూహంపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రమేయ సమూహాలు అంటారు.
- C,H,X ఉండే సమ్మేళనాలను హాల్ హైడ్రోకార్బన్లు అని అంటారు. (X= హాలోజన్ Cl, Br etc.)
- l Ex: Ch3Cl, CH3-CH3-Br,
- CH3-CHCl2
- వీటిని హైడ్రోకార్బన్ల హాలోజన్ ఉత్పన్నాలు అంటారు.
- C, H, Oలతో కార్బన్ సమ్మేళనాలు
ఆల్కహాల్‌లు:
OH గ్రూపు కలిగిన హైడ్రోకార్బన్లను ఆల్కహాల్ అంటారు. H2Oలోని హైడ్రోజన్ పరమాణువు R ద్వారా ప్రతిక్షేపించగా R-OH ఏర్పడును. దీంతో R అంటే ఆల్కైల్ గ్రూపు.
Ex: CH3OH, CH3CH2OH, CH3-CHOH-CH3 etc
ఆల్డిహైడ్లు
CHO ప్రమేయ సమూహం గల కర్బన పదార్థాలను ఆల్డిహైడ్లు అంటారు.
ప్రమేయ సమూహం కలిగిన హైడ్రో కార్బన్లను ‘కీటోన్’లు అంటారు.
కార్బాగ్జిలిక్ ఆమ్లం
R-COOH ను కార్బాగ్జిలిక్ ఆమ్లం అంటారు. ప్రమేయ సమూహం- COOH
ఈథర్లు
l R-O-Rను ఈథర్ అని అంటారు. నీటి అణువుతో ఒక విధమైన సంబంధం కలిగి ఉంది.
l ఉదా: CH3-O-CH3
డై మిథైల్ ఈథర్
CH3-CH2-O-CH2
ఈథైల్ మిథైల్ ఈథర్
ఎస్టర్లు
R-COOR లేదా కార్బాగ్జిలిక్ ఆమ్లాల ఉత్పన్నాలను ఎస్టర్లు అంటారు.
అమైన్లు
NH2 ప్రమేయ సమూహం ఉన్న హైడ్రోకార్బన్లు అమైన్లు
అణుసాదృశ్యం: ఒకే అణుఫార్ములా గల సమ్మేళనాలు వేర్వేరు ధర్మాలను కలిగి ఉండే ధర్మాన్ని అణుసాదృశ్యం అంటారు.
Isomer’s+ > Iso= ఒకే విధమైన mers=భాగాలు
సమాంతర శ్రేణులు (Hemologous series)
కర్బన సమ్మేళనాల శ్రేణుల్లోని వరుసగా ఉండే రెండు సమ్మేళనాలు CH2 భేదంతో ఉంటే వాటిని సమజాత శ్రేణులు అంటారు.
ఉదా: CH4,C2H6,C3H8 ………
CH3OH, C2H5OH, C3H7OH …
సమజాత శ్రేణి కర్బన సమ్మేళనాలు-లక్షణాలు
ఇవి ఒక సాధారణ ఫార్ములాను కలిగి ఉంటాయి.
Cn H2n+2 (ఆల్కేన్) Cn H2n (ఆల్కీన్) Cn H2n-2 (ఆల్కైన్)
రెండు సమ్మేళనాల మధ్య భేదం CH2 గా ఉంటుంది
సమజాతి శ్రేణికి చెందిన అణువులను సమజాతాలు లేదా సంగతాలు అంటారు.
అల్కేన్లు: వీటిని సంతృప్త హైడ్రోకార్బన్లు అని అంటారు. లేదా పారాఫిన్లు అంటారు.
వీటి సాధారణ ఫార్ములా CnH3n+2
దీని నుంచి ఒక హైడ్రోజన్‌ను తొలగిస్తే ఆల్కైల్ సమూహం ఏర్పడుతుంది. ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి.
ఉదా: CH4 – మీథేన్
C2 H6 ఈథీన్
C3 H8 ప్రొపేన్
C4 H10- బ్యూటేన్ (ఎల్పీజీలో అధిక శాతం ఉంటుంది)
C5 H12 పెంటేన్
ఆల్కీన్లు:
వీటిని అసంతృప్త హైడ్రోకార్బన్లు లేదా ఓలిఫిన్లే అని కూడా అంటారు.
వీటి సాధారణ ఫార్ములా CnH2n సంకలన చర్యల్లో పాల్గొంటాయి.
ఉదా: C2H4 – ఈథీన్
C3 H6 ప్రొపేన్
C4 H8 బ్యూటీన్
C5 H10- పెంటీన్
C6 H12 హెక్సీన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు