కేంద్ర పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) ఖాళీగా ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 159 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేయనుంది. ప్రిలిమ్స్ పరీక్ష పూర్తిచేసినవారు ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్ట్ (పీఈటీ)కి అర్హతసాధిస్తారు. అందులో క్వాలిఫై అయినవారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. ఈ పరీక్షను ఏడాదికి ఒక్కసారిమాత్రమే నిర్వహిస్తారు.
మొత్తం పోస్టులు: 159
ఇందులో బీఎస్ఎఫ్లో 35, సీఆర్పీఎఫ్లో 36, సీఐఎస్ఎఫ్ 67, ఐటీబీపీలో 20, ఎస్ఎస్బీలో 1 చొప్పున ఉన్నాయి.
అర్హత: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 20+25 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి. నేపాల్, భూటాన్‌కు చెందినవారు కూడా ఈ పరీక్ష రాయడానికి అర్హులు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 5
రాతపరీక్ష: ఆగస్టు 8
అడ్మిట్ కార్డులు: జూలై చివరివారంలో
వెబ్సైట్: upsc.gov.in, upsconline.nic.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
గ్యాస్ లీకైందా.. గాబరా వద్దు!
కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా
మహిళ సీజేఐ కావాలి
‘కొవాగ్జిన్’ ఉత్పత్తికి ముంబై సంస్థకు అనుమతి
రష్యా దౌత్యవేత్తలపై అమెరికా బహిష్కరణ వేటు
తాగి నడిపి మృతికి కారణమైనందుకు 10 ఏండ్ల జైలు
గుంటూరులో రెండు లారీలు ఢీ.. ముగ్గురు దుర్మరణం
30 శాతం ఆక్యుపెన్సీతో సినిమా పరిశ్రమ గట్టెక్కేనా ?
- Tags
- Assistant Commandant
- BSF
- CAPF
- CISF
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు