ఐరాస అంచనాలు- ప్రపంచ జనాభా
భారత జనాభా 2024 నాటికి చైనాను మించిపోతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2030 నాటికి 150 కోట్లకు చేరుతుందని పేర్కొంది. ఐరాసకు చెందిన ఆర్థిక, సామాజిక, వ్యవహారాల విభాగం ప్రపంచ జనాభా భావి అంచనాలు, 2017 సవరణ పేరుతో నివేదికను వెలువరించింది. ఇవి 25వ అధికారిక అంచనాలు. 2015లో 24వ అంచనాలను విడుదల చేసింది. 2022 నాటికే చైనా జనాభాను భారత్ మించిపోతుందని అప్పటి అంచనాల్లో పేర్కొనగా తాజా అంచనాల్లో 2024గా సవరించింది.
-చైనా ప్రస్తుత జనాభా 141 కోట్లు (ప్రపంచ జనాభాలో 19 శాతం)
-భారత ప్రస్తుత జనాభా 134 కోట్లు (ప్రపంచ జనాభాలో 18 శాతం)
-2024 నాటికి రెండు దేశాలు కూడా దాపు 144 కోట్ల చొప్పున జనాభాను కలిగి ఉంటాయి.
-భారత జనాభా 2030 నాటికి దాదాపు 150 కోట్లకు, 2050 నాటికి 166 కోట్లకు చేరుతుంది.
-2050 నుంచి 2100 మధ్య 50 ఏండ్ల కాలంలో భారత జనాభా తగ్గి 151 కోట్లు కావచ్చు. అయినా ప్రపంచంలో అత్యంత జనాభా గల దేశంగా ఉంటుంది.
-జనన కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి భారత్‌లో జీవిత కాలం (లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎట్ బర్త్) 2025-30లో 71 ఏండ్లు. 2045-50కి 74.2 ఏండ్లకు పెరుగుతుంది.
-ఐదేండ్ల వయసు లోపే మరణాల రేటు 2025-30లో 32.3 (ప్రతి 1000 మంది పిల్లలకు). 2045-2050 నాటికి ఈ రేటు 18.6.
-2030 వరకు చైనా జనాభా స్థిరంగానే ఉంటుంది. ఆ తర్వాత కొంత తగ్గడం మొదలు కావచ్చు.
-ప్రస్తుత ప్రపంచ జనాభా 760 కోట్లు కాగా 2030 నాటికి 860 కోట్లకు , 2050 నాటికి 980 కోట్లకు, 2100 నాటికి 1120 కోట్లకు చేరుతుంది.
-భారత్, నైజీరియా, కాంగో, పాకిస్థాన్, ఇథియోపియా, టాంజానియా, అమెరికా, ఉగాండా, ఇండోనేషియా, ఈజిప్టులు ప్రపంచంలో సగానికి పైగా జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తాయి.
-2015-50 మధ్య వలసల గమ్యస్థానం ఎక్కువగా (ఏడాదికి లక్ష మందికిపైగా) ఉండే దేశాలు అమెరికా, జర్మనీ, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, రష్యా.
-ఏడాదికి లక్ష మందికిపైగా వలసలను పంపించే దేశాలు భారత్, బంగ్లాదేశ్, చైనా, పాకిస్థాన్, ఇండోనేషియా.
పాల ఉత్పత్తిలో భారత్‌దే పైచేయి
-భారత్ 2026 నాటికి ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి దేశంగా అవతరిస్తుందని ఐరాస నివేదిక తాజాగా వెల్లడించింది. గోధుమ, వరి ఉత్పత్తుల్లోనూ అనూహ్యమైన ప్రగతి కనబరుస్తుందని పేర్కొంది. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో), ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) రూపొందించిన 2017-26 అంచనాల నివేదిక పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది.
-21వ శతాబ్దపు తొలి భాగంలో భారత్‌లో పాల ఉత్పత్తి దాదాపు మూడింతలు పెరుగనుంది. 2026 నాటికి 49 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా. పాల ఉత్పత్తిలో యూరోపియన్ యూనియన్ ప్రపంచంలో రెండో స్థానంలో నిలుస్తుంది.
-ప్రపంచ వ్యాప్తంగా గోధుమ ఉత్పత్తి 11 శాతం పెరుగుతుంది. సాగు విస్తీర్ణం 1.8 శాతం పెరుగనుంది. అత్యధికంగా ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో దిగుబడులు ఉంటాయి. ఇక్కడే 46 శాతం అదనపు ఉత్పత్తి ఉంటుందని అంచనా. భారత్ (15 మిలియన్ టన్నులు) పాకిస్థాన్ (6మి.ట.), చైనా (5.5మి.ట.)ల్లో అదనపు దిగుబడులు ఉంటాయి.
-వరి ఉత్పత్తిలో 66 మిలియన్ టన్నుల వృద్ధి ఉంటుంది. భారత్, ఇండోనేషియా, మయన్మార్, థాయ్‌లాండ్, వియత్నాంల్లోనే 15 శాతానికి పైగా వృద్ధి కనిపిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు