మే 2 నుంచి యూజీసీ నెట్.. వాయిదా వేయాలంటున్న అభ్యర్థులు
న్యూఢిల్లీ: అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) చేయడానికి అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష వచ్చే నెల 2న ప్రారంభం కానుంది. మే 2 నుంచి 17 వ తేదీవరకు ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల చేయనుంది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో ఈ పరీక్ష నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సీబీఎస్సీ పరీక్షలు, జేఈఈ మెయిన్ వంటి ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో యూజీసీ నెట్‌ను కూడా వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీంతో ఎన్టీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
కాగా, దేశంలో వరుసగా ఐదో రోజు కూడా రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,73,810 కేసులు రికార్డవగా, రికార్డు స్థాయిలో 1619 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1.5 కోట్లు దాటాయి. ఇందులో 1.78 లక్షల మంది బాధితులు కరోనాతో మరణించారు.
ఇవికూడా చదవండి..
‘రెమ్‌డెసివిర్’ను దిగుమతి చేసుకుంటాం.. అనుమతివ్వండి
ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి
అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి
కరోనాతో విద్యాశాఖ మాజీ మంత్రి మృతి
ప్రముఖ రచయిత వెంకటసుబ్బయ్య కన్నుమూత
అందంగా ఉన్న బిగ్ బ్యూస్ బ్యూటీని అంద విహీనంగా మార్చిన డాక్టర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు