టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల.. 7 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు


హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్-2021 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఐసెట్ కన్వీనర్ మహేందర్ రెడ్డి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈనెల 7 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయని చెప్పారు. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆగస్టు 19, 20 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17న ఫలితాలను విడుదల చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 రీజినల్ సెంటర్లలో పరీక్షను నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్‌లో 4 రీజినల్ సెంటర్లు ఉన్నాయన్నారు. ఐసెట్ నిర్వహణ కోసం 60 కేంద్రాలను గుర్తించామని తెలిపారు.
కాగా, రూ.250 అపరాధ రుసుముతో జూన్ 30 వరకు, రూ.500 ఫైన్‌తో జూలై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఆగస్టు 15 వరకు అప్లయ్ చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 13 నుంచి ఐసెట్ హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి తరఫున ఈ ఏడాది ఐసెట్‌ను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
ఈ ఆకుల ధర కిలోకు లక్ష
ఆన్లైన్ విమర్శకుల్ని అరెస్టు చేస్తున్న సైన్యం
కేరళలో ట్రాన్స్‌జెండర్ కు బెదిరింపులు.. నామినేషన్ విత్‌డ్రా
కాకి ని చూసి మనషులు సిగ్గు పడాలి.. వీడియో వైరల్
యూట్యూబ్‌లో సర్కారు బడి
బీటెక్‌లో లేకున్నా ఎంటెక్‌లో చదవొచ్చు
మద్యం మత్తులో ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవ దహనం
Latest Updates
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు
త్వరలో ఏఈ నోటిఫికేషన్
అగ్రికల్చరల్ యూనివర్సిటీలో తాత్కాలిక పోస్టుల భర్తీ
రైల్‌టెల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు ఉద్యోగాలు
Start observing your ecosystem for answers
The rise of missionaries
భారతీయ అణు పరిశోధనా పితామహుడు ఎవరు?
రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుని ఓటు విలువను ఎలా గణిస్తారు?
మౌర్యానంతర స్వదేశీ, విదేశీరాజ్యాలు