ప్రాథమిక హక్కులు గుర్తుండాలంటే ఏం చేయాలి..?
ప్రతి పోటీ పరీక్షకు సంబంధించి ప్రాథమిక హక్కులు చాలా కీలకం. అలాగే వీటితో ముడిపడి ఉన్న కేసులు కూడా ప్రధానమైనవే. కథనాల రూపంలో అల్లడం ద్వారా వాటిని తేలికగా గుర్తుంచుకోవచ్చు. గతంలో అంకెలు లేదా సంఖ్యలను ఎలా చిత్రాలుగా మలుచుకోవొచ్చో తెలుసుకున్నాం. ప్రాథమిక హక్కులను సులువుగా గుర్తుంచుకోవడమెలాగో ఒక చిన్న కథనం ద్వారా చూద్దాం..
క్వాలిటీ ఐస్‌క్రీం కొనేందుకు ఐస్‌క్రీం పార్లర్‌కు వెళ్లారనుకుందాం..
-ఐస్‌క్రీమ్ కొనుక్కొని బైక్‌పైన వస్తూ ఉన్నారు. దారిలో ఉన్న స్టేషన్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జెన్ కార్ల ర్యాలీ ఉండటంతో వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత కొంత దూరం వచ్చాక మరోసారి జామ్, ఈ సారి చిన్న పిల్లల ర్యాలీ (అందులో బౌద్ధ, సిక్కు, జైన, ఇస్లామ్, పార్శీ, క్రైస్తవ)తో జామ్ అయింది. పిల్లలు అందరూ రెడిమేడ్ డ్రస్సులు వేసుకున్నారని ఊహించండి.
ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానం గుర్తించండి
-ఏ బైక్ మీకు ఉంది? మీరు మొదట ఏం కొన్నారు? ట్రాఫిక్ జామ్ ఎక్కడ అయింది? చిన్న పిల్లలందరూ ఏం వేసుకున్నారు?
-తేలికగా గుర్తుకు వచ్చాయి కదా. గతంలో ప్రస్తావించిన ఒక టెక్నిక్ ప్రకారం.. నేర్చుకోవాల్సిన అంశాన్ని మనకు తెలిసిన పదంతో అనుసంధానం చేయాలి. దాన్ని ఉపయోగించి పదాలను ఎలా విడదీయాలో చూద్దాం..
1. Right to equality (క్వాలిటీ ఐస్‌క్రీమ్‌తో అనుసంధానం)
2. Right to freedom (ఫ్రీడమ్ బైక్)
3. Right against Exploitation (స్టేషన్ దగ్గర జాం, స్టేషన్, ఎక్స్‌ప్లాయిటేషన్ దగ్గరగా ఉన్నాయి)
3. Right to Religion (జెన్ కార్ల ర్యాలీ, ర్యాలీ, జెన్, అంటే రిలీజియస్)
4. Cultural and Educational rights to minorities (వివిధ మతాల చిన్నారులను ప్రస్తావించాం, వారంతా మైనార్టీలు)
5. Right to Constitutional Remidies (రెమిడీస్ అనే పదాన్ని రెడిమేడ్తో అనుసంధానం)
-ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్న కేసులు కూడా చాలా కీలకం. వీటిని ఎలా అనుసంధానం చేయాలంటే.. మొదట రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించి క్వాలిటీ ఐస్‌క్రీమ్ కొనేందుకు వెళ్లినప్పుడు అక్కడ మీ మిత్రుడు చిరంజీవి కనిపించాడని ఊహించండి. అతను కోల్ పట్టుకున్నాడని ఊహించండి. (కోల్ అంటే బొగ్గు లేదా కోయిలను పట్టుకున్నాడని కూడా ఊహించొచ్చు). ఎక్కడ నుంచి వచ్చావని అతన్ని అడిగితే ఆమనగల్ నుంచి వచ్చానని చెప్పాడు. చిరంజీవి అంటే చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కోల్ అంటే బెన్నెట్ కొల్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, విశాఖ అంటే విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసు.
-లాల్, బెన్నెట్ కొల్మన్ కేసులో సమానులను మాత్రమే సమానంగా చూడాలని తీర్పు చెప్పారు. విశాఖ కేసు పనిచేసే ప్రదేశాల్లో మహిళల రక్షణకు సంబంధించింది. ఇలా అనుసంధానం ద్వారా ఆయా హక్కులకు సంబంధించిన కోర్టు తీర్పులను గుర్తుంచుకోవాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు