వీరే మన తెలుగు కవులు..

ఆదికవి నన్నయభట్టు
– శతాబ్దం: 11
– ఆస్థానం: రాజరాజనరేంద్రుడు
– బిరుదులు: ఆదికవి, వాగమశాసనుడు/శబ్ధశాసనుడు
– రచనలు: ఆంధ్రశబ్ధచింతామణి (వ్యాకరణ గ్రంథం)
ఆంధ్ర మహాభారతం
– ఆంధ్రమహాభారతంలో నన్నయ్యకు సహకరించినవారు: నారాయణభట్టు
– అలభ్య రచనలు: ఇంద్ర విజయం, చాముండికా విలాసం, లక్షణ సారం
– నన్నయ ఆంధ్రమహాభారతంలో 21/2 పర్వాలు
(ఆది, సభా పర్వాలు, అరణ్యపర్వం 4వ అశ్వాసం 142 పద్యాల వరకు) రాశాడు.
– కవితా లక్షణాలు: 1. ప్రసన్నకథాకవితార్థయుక్తి 2. అక్షర రమ్యత 3. నానారుచిరార్థ సూక్తినిధిత్వం
– ఆర్యోక్తులు: 1. విశ్వశ్రేయ కావ్యం 2. గత కాలము మేలు వచ్చు కాలముకంటెన్ 3. వార్తలందు జగము వర్థిల్లుచుండగన్
ఎఱ్ఱన
– ఆస్థానం: ప్రోలయ వేమారెడ్డి
– బిరుదులు: ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు
– శైలి: వర్ణనాత్మకశైలి
– రచనలు: రామాయణం (మొదటి రచన-అంకితం ప్రోలయ వేమారెడ్డికి), హరివంశం
– అరణ్య పర్వశేషం (అంకితం: రాజరాజనరేంద్రుడికి)
– నృసింహ పురాణం (అంకితం: అహోబిల నృసింహునికి)
పోతన
– కాలం: 15వ శతాబ్దం
– గురువు: ఇవటూరి సోమనారాధ్యుడు
– బిరుదులు: సహజ పండితుడు, నిగర్వచూడామణి, శబ్ధాలంకార ప్రియుడు, ఆంధ్ర జయదేవుడు,
సకల విద్యానాథుడు
– కవితా శైలి: మధుర కవితా నిర్మాణం
– రచనలు: వీరభద్ర విజయం, బోగినీ దండకం, ఆంధ్రమహా భాగవతం, నారాయణ శతకం
– పోతనగారి మొదటి కృతి: వీరభద్ర విజయం
– అంకితం: ఇవటూరి సోమనారాధ్యుడికి
– తెలుగులో వచ్చిన తొలి దండకం: బోగినీ దండకం
(సర్వజ్ఞ సింగభూపాలుడు, బోగినీల ప్రణయ ఇతివృత్తమే బోగినీ దండకం)
– పోతన రచించిన ఆంధ్రమహాభాగవతం పురాణ ప్రక్రియకు చెందింది.
– ఆంధ్ర మహాభాగవతంలోని స్కంధాల సంఖ్య: 12
– మరోపేరు: సాత్తిత సంహిత
– ఆంధ్ర మహాభాగవతం అంకితం: భద్రాద్రి శ్రీరామచంద్రుడికి
– భాగవతాన్ని తనకు అంకితం ఇవ్వాలని కోరిన రాజు- సర్వజ్ఞ సింగభూపాలుడు
– రాజ తిరస్కారం చేసిన మొదటి కవి: పోతన
– మహత్వ కవిత్వ పటుత్వ సంపద ఇమ్మని దుర్గమ్మను కోరాడు.
– శ్రీరామ ప్రసాద లబ్ధ కవితా విలాసుడు అని పోతనను పిలుస్తారు.
– సత్కవుల్ హాలికులైననేమి అని అన్నాడు.
– విబుధ జనుల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అని పోతన ప్రకటించుకున్నాడు.
శ్రీనాథుడు
– ఆస్థానం: పెదకోమటి వేమారెడ్డి
– బిరుదులు: కవిసార్వభౌముడు, ఈశ్వరార్చన కళాశీలుడు, బ్రాహ్మీదత్త వరప్రసాదుడు
– శ్రీనాథుడు సాహిత్య పాండిత్యంలో గౌడ డిండిమభట్ట్టును ఓడించి అతని కంచుఢంకాను బద్ధలు కొట్టాడు.
– ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో ముత్యాలశాలలో కనకాభిషేకం పొందిన వ్యక్తి శ్రీనాథుడు
– గౌడడిండిమభట్టు అసలు పేరు: అరుణ గిరినాథుడు
రచనలు
– మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, నందనందన చరిత్ర, శృంగారనైషధం, హరవిలాసం, కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీర చరిత్ర, క్రీడాభిరామం
– శ్రీనాథుడు 14 ఏండ్ల వయస్సులోనే రచించిన రచన: మరుత్తరాట్చరిత్ర
– శ్రీనాథుడి సీస పద్యాలకు విశిష్ట స్థానం ఉంది.
– శ్రీనాథుడిని డు ము వుల కవి అని పిలుస్తారు.
తిక్కన సోమయాజి
– ఆస్థానం: మనుమసిద్ధి
– బిరుదులు: కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు, మనుమసిద్ధి రాజ్యస్థాపనాచార్య
– రచనలు: నిర్వచనోత్తర రామాయణం (మొదటి రచన)
– నిర్ అంటే లేనిది
– వచనం లేని రామాయణం నిర్వచనోత్తర రామాయణం
– అంకితం: మనుమసిద్ధి
ఆంధ్రమహాభారతం
– తిక్కన ఆంధ్రమహాభారతంలో 15 పర్వాలు రచించాడు.
(విరాట పర్వం నుంచి మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు)
– అంకితం: హరహరనాథుడు
– ఇతర రచనలు: 1) విజయ సేనము 2) కృష్ణ శతకము (అలభ్యం) 3) కవి సార్వభౌమ ఛందస్సు (ఆలభ్యం)
– శైలి: నాటకీయత
గుర్రంజాషువా
– జన్మస్థలం: గుంటూరు జిల్లా వినుకొండ
– బిరుదులు: కవికోకిల, కవితా విశారద, మధురశ్రీనాథ, నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ
రచనలు- అనాథ, స్వప్నకథ, గబ్బిలం, కాందిశీకుడు, స్వయంవరం, రాష్ట్రపూజ, కొత్తలోకం, ముసాఫరులు, నాగార్జునసాగర్, ముంతాజ్మహల్, ఫిరదౌసి
– స్వీయచరిత్ర: నా కథ (పద్యరూపంలో రాశాడు)
– జీవిత చరిత్రలు: క్రీస్తు చరిత్ర, బాపూజీ, నేతాజీ
– క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
– మాతలకు మాత సకల సంపత్సమేత అని భరతమాత గొప్పతనాన్ని చాటిన కవి గుర్రం జాషువా
– కవినిగన్న తల్లి గర్భంబు ధన్యంబు. కృతిన్ చెందు వాడు నృపండు వాడు.
– నాకు తిరుగులేదు విశ్వనరుండను నేను అని ప్రకటించుకున్నాడు.
– వడగాల్పులు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని అన్నాడు.
సి నారాయణరెడ్డి (సినారె)
– జననం: 1931 కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హన్మాజీపేట గ్రామం
– బిరుదులు: పద్మభూషణ్ (1992)
– ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్న రెండో తెలుగు వ్యక్తి.
– రచన: విశ్వంభర (1988)
రచనలు- మధ్య తరగతి మందహాసం, మంటలూ – మానవుడూ, ఉదయం నా హృదయం, ఇంటిపేరు చైతన్యం, కవిత నా చిరునామ, మార్పు నా తీర్పు, కలం సాక్షిగా, నడక నా తల్లి, ప్రపంచ పదులు
– గేయకావ్యాలు: నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, రుతుచక్రం, జాతిరత్న
– గేయరూపాలు: రామప్ప, తరతరాల వెలుగు
– ఖండ కావ్యాలు: జలపాతం, దివ్వెలమువ్వలు
– పరిశోధన గ్రంథం: ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు
– దీర్ఘకావ్యం: భూమిక, మట్టి మనిషి – ఆకాశం
– ముచ్చటగా మూడువారాలు
– మలేషియాలో తెలుగువాణి
– సోవియట్ రష్యాలో పదిరోజులు
– సినారెవారు ప్రపంచ పదులు రచనలో ఏ రాపిడి లేకుండ వజ్రం ఎలా మెరుస్తుంది, ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది అని అన్నారు.
– మంచి ఏ కొంచమైనా చాలు మార్పు రావాలంటే అని పలికారు
– కురిసేవానకు స్వార్థం లేదుపండే పంటకు స్వార్థం లేదునట్టనడుమ ఉన్న ఈ మానవుడికెందుకు స్వార్థం
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు