ఆ 4 ఏండ్లు ఎక్కడ చదివితే అదే లోకల్
– పరిగణనలోకి 4 నుంచి 7వ తరగతులు
– టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో రాష్ట్రపతి ఉత్తర్వులు
వరుస ఉద్యోగ ప్రకటనలతో అభ్యర్థుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. యువత భారీగా దరఖాస్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసేలా టీఎస్పీఎస్సీ అన్ని చర్యలు తీసుకొంటున్నది. కొత్త సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపరుస్తున్నది. ప్రస్తుతం లోకల్ (స్థానికత)కు సంబంధించి అభ్యర్థుల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. వాటన్నింటినీ నివృత్తి చేసేలా.. రాష్ట్రపతి ఉత్తర్వులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అసలు.. లోకల్ క్యాడర్‌గా ఎవరిని పరిగణిస్తారనే సమాచారం అందులో స్పష్టంగా ఉన్నది. జిల్లా పోస్టులకు (జూనియర్ అసిస్టెంట్ కిందిస్థాయి), జిల్లా, జోనల్ పోస్టులకు (సూపరింటెండెంట్), జోనల్, మల్టీజోనల్ పోస్టులకు (సూపరింటెండెంట్ పైస్థాయి) మల్టీజోనల్ లోకల్ ఏరియా పరిధిలోకి వస్తుంది. రాష్ట్రంలో 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లు ఉన్నాయి. గతంలో ఉన్న రాష్ట్రస్థాయి పోస్టులు కూడా ఈసారి మల్టీజోనల్ పరిధిలోకే మారాయి.
ఆ నాలుగేండ్లే కీలకం..
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి పోటీపడే అభ్యర్థి 4 నుంచి 7వ తరగతి వరకు వరుసగా ఎక్కడ చదివితే అక్కడ స్థానికత వర్తిస్తుంది. 4 నుంచి 7వ తరగతి వరకు ఏ ఒక్క ఏడాది వేరే రాష్ట్రంలో చదివినా అతడిని నాన్ లోకల్ కింద పరిగణిస్తారు. అయితే.. 1 నుంచి 3వ తరగతి వరకు ఎక్కడ చదివినా దానిని పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థి తెలంగాణలోని రెండు, మూడు ఏరియాల్లో 1 నుంచి 7వ తరగతి వరకు చదివితే.. చివరి తరగతులు చదివిన ప్రాంతం లోకల్ ఏరియా అవుతుంది. అంటే.. 1 నుంచి 3 వరకు ఒక జిల్లాలో, 4, 5 మరో జిల్లాలో, 6, 7వ తరగతులు ఇంకో జిల్లాలో చదివితే.. చివరి రెండేండ్లు చదివిన జిల్లాలోనే స్థానికత లభిస్తుంది. 1 నుంచి 7వ తరగతి వరకు లేదా 4 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో చదవకుండా.. 8వ తగరతి నుంచి ఆపైన తెలంగాణలో చదివినా ఆ అభ్యర్థి నాన్ లోకల్ కిందే పరిగణిస్తారు. అంటే.. 4 నుంచి 7వ తరగతి వరకు ఆ నాలుగేండ్లు ఎక్కడ చదివితే అదే ఆ అభ్యర్థి స్థానికత అవుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు