ఏ జీవుల వేటను రేలింగ్ అంటారు? ( జనరల్ సైన్స్)
గత తరువాయి…
116. కింది వాటిని జతపర్చండి.
ఎ. కీలోన్ 1. మంచినీటి తాబేలు
బి. టెస్టుడో 2. హట్టేరియా బల్లి
సి. ట్రయోనిక్స్ 3. భౌమ తాబేలు
డి. స్పీనోడాన్ 4. సముద్ర తాబేలు
1) ఎ-4, బి-3, సి-1, డి-2 2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-1, సి-3, డి-2 4) ఎ-1, బి-2, సి-4, డి-3
117. కింది వాటిని జతపర్చండి.
ఎ. అరేలియా 1. కటిల్ఫిష్
బి. సెపియా 2. డెవిల్ ఫిష్
సి. ఆక్టోపస్ 3. జెల్లీఫిష్
డి. ఎస్టీరియాస్ 4. స్టార్ ఫిష్
1) ఎ-1, బి-3, సి-2, డి-4 2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-4, బి-2, సి-3, డి-1 4) ఎ-1, బి-4, సి-2, డి-3
118. కింది కీటకాలు, వాటి ముఖ భాగాలను జతపర్చండి.
ఎ. బొద్దింక, చీమ, పట్టుపురుగు 1. చూషక రకం
బి. ఈగ 2. కొరికి నమిలే రకం
సి. లక్క, దోమ, నల్లి, పేను 3. గుచ్చిపీల్చే రకం
డి. తుమ్మెద, సీతాకోక చిలుక 4. సైఫనింగ్ రకం
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-3, డి-4 4) ఎ-1, బి-2, సి-4, డి-3
119. కింది కీటకాలు, వాటి డింబకాలను జతపర్చండి.
ఎ. ఈగ 1. రిగ్లర్
బి. దోమ 2. నింఫ్
సి. బొద్దింక 3. మాగట్
డి. తేనెటీగ, చీమ, బీటిల్స్ 4. గ్రబ్
1) ఎ-3, బి-1, సి-2, డి-4 2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-2, బి-1, సి-3, డి-4 4) ఎ-4, బి-3, సి-2, డి-1
120. కింద పేర్కొన్న పట్టురకం, ఆ పట్టును ఉత్పత్తిచేసే కీటకాలను జతపర్చండి.
ఎ. మల్బరీ 1. అట్టాకస్ రెసిని, అట్టాకస్ సిందియా
బి. టుస్సార్ 2. బాంబిక్స్ మోరీ
సి. ఈరీ 3. ఆంథీరియా పాపియా
డి. ముంగా 4. థియోఫిలా రిలీజియోజా
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-2, డి-4 4) ఎ-2, బి-3, సి-1, డి-4
121. కింది వాటిని జతపర్చండి.
ఎ. ప్రాన్ కల్చర్ 1. మంచినీటి రొయ్యల పెంపకం
బి. పిసీ కల్చర్ 2. జలచర జీవుల పెంపకం
సి. ఆక్వా కల్చర్ 3. చేపల పెంపకం
డి. ష్రింప్ కల్చర్ 4. సముద్ర రొయ్యల పెంపకం
1) ఎ-4, బి-2, సి-3, డి-1 2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2 4) ఎ-2, బి-4, సి-1, డి-3
122. కింది వాటిని జతపర్చండి.
ఎ. గాజు పురుగు (స్పైరోస్ట్రిప్టస్) 1. శతపాది
బి. కాలు జెరి (స్కాలోపెండ్రా) 2. సహస్రపాది
సి. రొయ్య (పేలిమాన్) 3. అరాక్నిడ్
డి. తేలు (పేలిమ్నియాస్) 4. క్రష్టేషియన్
1) ఎ-2, బి-1, సి-4, డి-3 2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-1, బి-2, సి-3, డి-4
123. కింది వాటిని జతపర్చండి.
ఎ. ఎఫ్రోడైట్ 1. లగ్ వార్మ్
బి. అరెనికోల 2. భూచర జలగ
సి. పాంటోబ్డెల్లా 3. సముద్ర చుంచెలుక
డి. హిమడిప్సా 4. సముద్ర జలగ
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2 4) ఎ-2, బి-4, సి-1, డి-3
124. కింది వాటిని జతపర్చండి.
ఎ. టీనియా సోలియం 1. బ్లడ్ ఫ్లూక్
బి. టీనియా సాజినేటా 2. డాగ్ టేప్ వార్మ్
సి. ఇఖైనోకోకస్ గ్రాన్యులోసిస్ 3. బీఫ్ టేప్ వార్మ్
డి. షిస్టోసోమా 4. పోర్క్ టేప్ వార్మ్
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3 4) ఎ-3, బి-4, సి-1, డి-2
125. కింది వాటిని జతపర్చండి.
ఎ. ఒబీలియా 1. సముద్ర విసనకర
బి. పైసేలియా 2. సీఫర్
సి. గార్గోనియా 3. సముద్ర కలం
డి. పెన్నాట్యులా 4. పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్
1) ఎ-4, బి-2, సి-3, డి-1 2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-4, బి-3, సి-2, డి-1
126. కింది వాటిని జతపర్చండి.
ఎ. స్పాంజిల్లా 1. గాజుతాడు స్పంజిక
బి. యూస్పాంజియా 2. మంచినీటి స్పంజిక
సి. హయలోనీమా 3. స్నాన స్పంజిక
డి. యూప్లెక్టెల్లా 4. వీనస్ పూలసజ్జ
1) ఎ-4, బి-1, సి-3, డి-2 2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1 4) ఎ-2, బి-3, సి-1, డి-4
127. కింది వాటిని జతపర్చండి.
ఎ. ప్లాస్మోడియం వైవాక్స్ 1. మాలిగ్నెంట్ టెర్షియన్ మలేరియా
బి. ప్లాస్మోడియం పాల్సిఫెరం 2. బినైన్ టెర్షియన్ మలేరియా
సి. ప్లాస్మోడియం ఒవేల్ 3. మైల్డ్ టెర్షియన్ మలేరియా
డి. ప్లాస్మోడియం మలేరియే 4. క్వార్టన్ మలేరియా
1) ఎ-4, బి-3, సి-2, డి-1 2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-3, డి-4 4) ఎ-1, బి-2, సి-4, డి-3
128. కింది వాటిని జతపర్చండి.
ఎ. పుస్తకాకార మొప్పలు 1. పేలిమ్నియాస్
బి. పుస్తకాకార ఊపిరితిత్తులు 2. లిమ్యులస్
సి. వాయునాళాలు 3. పేలిమాన్
డి. మొప్పలు 4. పెరిప్లానేటా
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-2, సి-3, డి-1 4) ఎ-3, బి-2, సి-1, డి-4
129. కింది వాటిని జతపర్చండి.
ఎ. కోక్సల్ గ్రంథులు 1. సాలీడు
బి. హరిత గ్రంథులు 2. బొద్దింక
సి. మాల్ఫీజియన్ నాళికలు 3. రొయ్య
డి. పుస్తకాకార ఊపిరితిత్తులు,
వాయునాళాలు 4. తేలు
1) ఎ-4, బి-1, సి-2, డి-3 2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-3, బి-2, సి-1, డి-4
130. బొద్దింక, లిమ్యులస్, తేలు, రొయ్యల్లో శ్వాస అవయవాలను వరుస
క్రమంలో అమర్చండి.
ఎ. మొప్పలు బి. పుస్తకాకార మొప్పలు
సి. పుస్తకాకార ఊపిరితిత్తులు డి. వాయునాళాలు
1) డి, సి, బి, ఎ 2) సి, డి, ఎ, బి
3) డి, బి, సి, ఎ 4) ఎ, సి, బి, డి
131. కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
ఎ. యుక్త వయస్సులో వృద్ధాప్య లక్షణాలు కనబడటాన్ని పొజేరియా అంటారు
బి. సైబీరియా దేశపు ప్రత్యేక పులి – అముర్
సి. కృష్ణజింక బిష్ణోయ్ తెగకు చెందిన పవిత్రమైన జంతువు
డి. చింపాంజీ అతి తెలివైన ఏప్
1) ఎ, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
132. కింది వాటిలో సరైన వ్యాఖ్యలు ఏవి?
ఎ. చిరుత భూమిపై వేగంగా పరిగెత్తే క్షీరదం
బి. తోడేలు ద్విభాగస్వామిని కలిగి ఉంటుంది
సి. కజిరంగా నేషనల్ పార్కులో ఖడ్గమృ గాల సంరక్షణ చేస్తారు
1) ఎ, సి 2) ఎ, బి
3) ఎ, బి 4) ఎ, బి, సి
133. కింది వాటిలో సరైనవి ఏవి? ఎ.ఖడ్గమృగం (రైనోసిరస్) ముక్కుపై ఉన్న వెంట్రుకలు కొమ్ముగా రూపాంతరం చెందాయి
బి. జిరాఫీలో పొడవైన నాడీకణం ఉంటుంది
సి. క్షీరదాల ఎరరక్త కణాల్లో కేంద్రకం ఉండదు, కానీ ఒంటె, లామాలో కేంద్రకం ఉంటుంది
డి. ఒంటె ఒక్కసారి నీటిని తాగితే 12-15 రోజులు నీరు లేకుండా ఉండగలదు
1) ఎ, బి 2) సి, డి 3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
134. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. డాల్ఫిన్ జాతీయ జలచర జంతువు
బి. తిమింగలాల వేటను రేలింగ్ అంటారు
సి. జలచర క్షీరదాల అధ్యయనం సీటాలజి
డి. కంగారు అపరిపక్వ శిశువులను కంటుంది
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి 3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
135. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ఎకిడ్నా చీమలను ఆహారంగా తీసుకుంటుంది బి. అనాటినస్ విషపూరిత ప్రొటోథీరియా క్షీరదం
సి. సెరుమినస్ గ్రంథులు కన్నీటిని స్రవిస్తాయి
డి. సెబేషియస్ గ్రంథి సెబం అనే తైలాన్ని విడుదల చేస్తుంది.
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి 3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
136. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు అస్థిరోష్ణ/శీతలరక్త జంతువులు (Poikilo Thermic/cold blooded animals)
బి. పక్షులు, క్షీరదాలు స్థిరోష్ణ/ఉష్ణరక్త జంతువులు (Homeothermic/ Warm bloo ded animals) సి. చేపలు, ఉభయచరాలు ఉల్బరహిత జీవులు (Anomniotes)
డి. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఉల్బదారులు (Amniotes) ఇ. ప్రొటోథీరియా క్షీరదాలు శిశూత్పాదకాలు
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, సి, డి, ఇ 4) బి, సి, డి, ఇ
137. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, ప్రొటోథీరియా క్షీరదాలు దాదాపుగా అండోత్పదకాలు
బి. తేలు, సాలమాండ్ర అట్ర, నెక్టోఫైనా యిడా అనే కప్ప, సొరచేప, రైనోసోమా, రక్తపింజర, సముద్రపాము, మెటాథీరియా క్షీరదాలు, యూథీరియా క్షీరదాలు శిశూత్పాదకాలు.
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఎ, బి
138. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ఆది ఆంత్రరంధ్రం నోరుగామారే జీవులను ప్రథమ ముఖదారులు అంటారు
బి. ఆది ఆంత్రరంధ్రం పాయువుగా మారే జీవులను ద్వితీయ ముఖదారులు అంటారు
సి. ఇఖైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటాలు ద్వితీయ ముఖదారులు
డి. అనెలిడా, ఆర్థోపొడా, మొలస్కాలు ప్రథమ ముఖదారులు
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
139. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ప్లాటీహెల్మెంథిస్ వర్గపు జీవులు శరీర కుహర రహిత జీవులు
బి. నిమాటీహెల్మెంథిస్, రోటిఫెరాలు మిధ్యా శరీరకుహర జీవులు
సి. అనెలిడా, ఆర్థోపొడా, మొలస్కా, ఇఖై నోడర్మేటా, హెమీకార్డేటా, కార్డేటా జీవులు నిజ శరీరకుహర జీవులు
డి. ప్రొటోజొవా, పొరిఫెరా, సిలెంటిరేటా జీవులు కూడా నిజ శరీరకుహర జీవులు
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ, బి 2) ఎ, బి, సి
3 ) ఎ, బి, సి, డి 4) ఎ
140. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. అనెలిడా, ఆర్థోపొడా, మొలస్కాలు
విభక్త శరీరకుహర జీవులు
బి. ఇఖైనోడర్మేటా, హెమీకార్డేటా, కార్డేటా
లు ఆంత్ర శరీరకుహర జీవులు
సి. ప్రౌఢ గ్యాస్ట్రోపొడా, ఇఖైనోడర్మేటా జీవులు ద్విపార్శ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ, సి 2) ఎ, బి 3) బి, సి 4) సి
141. కింది వాక్యాలను పరిశీలించండి. (4)
ఎ. స్పంజికలు, ప్రౌఢ గ్యాస్ట్రోపొడా జీవులు సౌష్ఠవరహిత (అసౌష్ఠవ) జీవులు
బి. సీలెంటిరేటా, టీనోఫొరా, ఇఖైనోడర్మేటాలు వలయ/వ్యాసార్థ సౌష్ఠవం ప్రదర్శిస్తాయి
సి. ఇఖైనోడర్మ్లలో వ్యాసార్థ సౌష్ఠవం పంచవికిరణ సౌష్ఠవంగా మారింది
డి. అన్ని త్రిస్తరిత జీవులు (ప్రౌఢ గ్యాస్ట్రోపొడా, ఇఖైనోడర్మేటాలు తప్ప) ద్విపార్శ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి.
ఇ. సీ అనిమోన్, వెనిడేరియన్లు ద్విపార్శ వలయసౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి.
పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1) ఎ, బి సరైనవి 2) ఎ,బి, సి సరైనవి
3) ఎ, బి, సి, డి సరైనవి
4) ఎ, బి, సి, డి సరైనవి
సమాధానాలు
116-1, 117-2, 118-3, 119-1, 120-4, 121-2, 122-1, 123-3, 124-1, 125-2, 126-2, 127-3, 128-2, 129-2, 130-3, 131-4, 132-1, 133-4, 134-4, 135-2, 136-2, 137-3, 138-3, 139-2, 140-2. 141-4
డాక్టర్ మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు