మానవుడిలో ఆకలి కోరికను ఉత్పత్తి చేసే హార్మోన్ ? టెట్ ప్రత్యేకం
ఈవీఎస్ (ఎన్విరాన్ మెంటల్ సైన్స్)
1. మానవుడి అంతర్గత భాగాలలో పెద్ద అవయవం?
1) క్లోమం 2) చర్మం
3) కాలేయం 4) మెదడు
2. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
1) చెవులు- శ్రవణ జ్ఞానం
2) ముక్కు-జిహ్వజ్ఞానం
3) కళ్ళు – దృశ్య జ్ఞానం
4) చర్మం – స్పర్శజ్ఞానం
3. కంటి జాగ్రత్తల్లో సరికానిది?
1) వాహనాల్లో ప్రయాణిస్తూ చదవచ్చు
2) ప్రతిరోజు చల్లని నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి.
3) కళ్ళను గట్టిగా నలపడం, రుద్దడం చేయరాదు
4) కళ్లుకలక వచ్చినవారు రుమాలును, టవలును ఉపయోగించకూడదు.
4. పాఠశాలలో కళ్ళను పరిశీలించి కళ్ళద్దాలు ఇచ్చే కార్యక్రమం?
1) కంటిచూపు 2) పల్లెచూపు
3) కంటివెలుతురు 4) చిన్నారిచూపు
5. చెవిటివారికి గుర్తులు, సైగలతో సమాచారాన్ని తెలపటాన్ని ఏమంటారు?
1) సైన్ లాంగ్వేజ్ 2) బ్రెయిలి లిపి
3) డోంగ్రి లిపి 4) శ్రవణ లిపి
6. కింది వాటిలో ప్రతిధ్వనుల ద్వారా ప్రయాణించే జీవి?1) కప్ప 2) మొసలి
3) గబ్బిలం 4) కివి
7. కింది వాటిలో ఏ చెట్టు పుల్లలను ఉపయోగించి దంతాలను తోముకోవచ్చు?
1) ఉత్తరేణి 2) వేప
3) తుమ్మ 4) పైవన్నీ
8. మానవుడిలో నమిలే దంతాల సంఖ్య?
1) 12 2) 6 3) 4 4) 8
9. మాంసాహారుల్లో ఆహారాన్ని చీల్చుటకు ఉపయోగపడే దంతాలు?
1) కొరకు దంతాలు
2) కోర దంతాలు
3) నమలు దంతాలు
4) విసురు దంతాలు
10. మానవుడి దంత సూత్రం 2123/ 2123 కాగా 1 అనే సంఖ్య దేన్ని సూచిస్తుంది?
1) కొరకు దంతాలు
2) నమలు దంతాలు
3) విసురు దంతాలు 4) కోరదంతాలు
11. చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణుడు?
1) ఈఎన్ టీ 2) ఎంఎన్ ఆర్
3) ఏటీపీ 4) ఎఫ్ ఐటీ
12. కింది వాటిలో సరైన జతను గుర్తించండి?
1) కళ్ళు-ఆప్తాల్మాలజిస్ట్
2) చర్మం- డెర్మటాలజిస్ట్
3) దంతాలు- డెంటిస్ట్
4) పైవన్నీ
13. నేత్ర దానంలో సేకరించే కంటిలోని భాగం?
1) నేత్ర పటలం 2) కంటిపొర
3) శుక్లపటలం 4) తారిక
14. చర్మవ్యాధి కానిది ఏది?
1) తట్టు 2) తామర
3) కుష్ఠు 4) ప్లేగు
15. చెవిలో గల ఎముకల క్రమం
1) కర్ణాంతరాస్థి – కూటకం – దాగిలి
2) కూటకం – కర్ణాంతరాస్తి – దాగిలి
3) దాగిలి- కర్ణాంతరాస్తి – కూటకం
4) కూటకం – దాగిలి- కర్ణాంతరాస్తి
16. ఆరోగ్యవంతుడి దృష్టి కోణం సుమారుగా?
1) 60o 2) 50o
3) 80o 4) 90o
17. కనుపాపలోని కండరాలు ఏ రకానికి చెందినవి?
1) అసంకల్పిత రేఖిత కండరాలు
2) సంకల్పిత రేఖిత కండరాలు
3) అసంకల్పిత అరేఖిత కండరాలు
4) సంకల్పిత అరేఖిత కండరాలు
18. ముక్కుతో చెట్లకు రంధ్రాలు చేసే పక్షి?
1) కాకి 2) పావురం
3) చిలక 4) వడ్రంగి పిట్ట
19. కింది వాటిలో నాలుక లోపించిన జీవులు?
1) కప్పలు 2) చేపలు
3) పాములు 4) పక్షులు
20. ఒక ఉపాధ్యాయుడు నాలుక గురించి బోధిస్తూ నాలుకపై సూకా్ష్మాంకురాలు కలవు. వాటిలో ఒక రకమైన సూకా్ష్మాంకురాలు ఎలాంటి రుచిని గ్రహించవు అని తెలిపాడు. అయిన ఆ సూకా్ష్మాంకురాలు ఏవి?
1) ఫంగిఫార్మ్ పాపిల్లె
2) పోలియెట్ పాపిల్లె
3) సర్కంవెల్లెట్ పాపిల్లె
4) ఫిలిఫార్మ్ పాపిల్లె
21. మానవ శరీరానికి మొదటి రక్షక కవచం?
1) చర్మం 2) మెదడు
3) గుండె 4) వెంట్రుకలు
22. కింది వాటిలో మలకబలనం చేసే జంతువు?
1) పిల్లి 2) ఎలుక
3) బల్లి 4) కుందేలు
23. మానవుడి జీర్ణాశయంలో ఆహారం సుమారు ఎంత సమయం వుంటుంది?
1) 3-5 గంటలు 2) 5- 30 సెకన్లు
3) 8 గంటలు 4) 5-8 గంటలు
24. మానవుడి జీర్ణక్రియ రహస్యాలు తెలుసుకోవడానికి కడుపు కిటికీ ప్రయోగం చేసినది?
1) విలియం హార్వే 2) బీమౌంట్
3) మాల్ఫీజీ 4) డార్విన్
25. మానవుడిలో ఆకలి కోరికలను ఉత్పత్తి చేసే హార్మోన్ ?
1) లెప్పిన్ 2) ఇన్సులిన్
3) గ్రీలిన్ 4) గ్లూకాగాన్
26. కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1) లాలాజల గ్రంథులు
2) జఠర గ్రంథులు
3) అంతర్ గ్రంథులు
4) అధివృక్క గ్రంథులు
27. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ ?
1) న్యూరాలజిస్ట్ 2) పల్మోనాలజిస్ట్
3) కార్డియాలజిస్ట్ 4) అప్తాల్మలజిస్ట్
28. చర్మం, మొప్పలు, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరిపే జీవులు వరుసగా?
1) వానపాము, డాల్ఫిన్ , పాము
2) వానపాము, తిమింగళం, కోతి
3) కప్ప, సిల్వర్ ఫిష్ , కంగారు
4) కప్ప, సముద్ర గురం, పావురం
29. మానవుడు ఉచ్చ్వాసించే గాలిలో CO2 శాతం?
1) 10 శాతం 2) 21 శాతం
3) 0.03 శాతం 4) 4 శాతం
30. కిందివారిలో శ్వాసక్రియ రేటు అధికంగా ఉన్నవారు?
1) 5 సంవత్సరాల పిల్లలు
2) అప్పుడే జన్మించిన పిల్లలు
3) 50 సంవత్సరాలున్నవారు
4) 25 సంవత్సరాల పిల్లలు
31. ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో శ్వాసక్రియ ఈస్ట్ సమక్షంలో జరగటం?
1. కిణ్వనం 2. బాష్పోత్సేకం
3. బిందుస్రావం 4. అంశిక స్వేదనం
32. ఊపిరితిత్తులలో వాయు వినిమయం జరిగే ప్రదేశం?
1) వాయునాళం 2) శ్వాసనాళిక
3) వాయుగోణులు 4) శ్వాసనాళం
33. మడ మొక్కలలో శ్వాసక్రియ జరిపే భాగం?
1) వేర్లు 2) కాండం
3) పత్రం 4) పుష్పం
34. అధికంగా పనిచేసినప్పుడు కండరాల ప్పిపుట్టడానికి కారణమయ్యే ఆమ్లం?
1) నైట్రిక్ ఆమ్లం 2) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
3) ఎసిటిక్ ఆమ్లం 4) లాక్టిక్ ఆమ్లం
35. కణశ్వాసక్రియ జరిగే ప్రదేశం?
1) హరితరేణువు 2) మైటోకాండ్రియా
3) కేంద్రకం 4) రిక్తిక
36. కిందివాటిలో సరైన వాక్యను తెలపండి?
1) రక్తాన్ని పంపుచేసే అవయవం – గుండె
2) రక్తాన్ని శుద్ధిచేసే అవయవం-ఊపిరితిత్తులు
3) రక్తాన్ని వడపోసే అవయవం -మూత్రపిండాలు 4) పైవన్నీ
37. మానవ శరీరంలో గుండె ఎటువైపు అమరి ఉంటుంది?
1) 2/3వ వంతు కుడివైపు
2) 2/3వ వంతు ఎడమవైపు
3) 1/3వ ఎడమవైపు
4) పూర్తిగా ఎడమవైపు
38. మానస అనే విద్యార్థి రక్తహీనతతో బాధపడుతుంది. రక్తాన్ని వృద్ధి చేసుకోవడానికి ఏ ఆహార పదార్థాలు తినమని సలహా ఇస్తావు?
1) పల్లీఉండలు 2) నువ్వుండలు
3) బెల్లం 4) పైవన్నీ
39. మానవ శరీరంలో ద్రవరూపంలో వుండే కణజాలం?
1) ఎముక 2) మృధులాస్థి
3) రక్తం 4) సందిబంధనం
40. రక్తం రంగుకు కారణమైన హీమోగ్లోబిన్ లో ఉండే మూలకం?
1) మెగ్నీషియం 2) జింక్
3) ఐరన్ 4) సోడియం
41. మానవుడిలోని గుండె గదులకు సంబంధించి సరికానిది గుర్తించండి?
1) కుడికర్ణిక పరిమాణంలో పెద్దది
2) ఎడమ కర్ణిక పరిమాణంలో చిన్నది
3) పై గదులను జఠరికలు అంటారు
4) కింది గదులు జఠరికలు
42. కిందివాటిలో తక్కువ హృదయస్పందన రేటు గల జీవి?
1) గాడిద 2) పిల్లి
3) ఎలుక 4) పిచ్చుక
43. వాక్యం -ఎ: హృదయ స్పందనను కొలిచే పరికరం స్పిగ్మోమానోమీటర్
వాక్యం -బి : రక్తపీడనాన్ని కొలిచే పరికరం – స్టెతస్కోప్
1) ఎ సత్యం, బి సత్యం
2) ఎ అసత్యం, బి అసత్యం
3) ఎ సత్యం, బి అసత్యం
4) ఎ అసత్యం, బి సత్యం
44. కిందివాటిలో సరైన జతను గుర్తించండి?
1) ఊపిరితిత్తులు – నెఫ్రాన్ లు
2) మెదడు – వాయుగోణులు
3) మూత్ర పిండాలు- న్యూరాన్ లు
4) ముష్కాలు – శుక్రకణాలు
45. మానవ దేహంలోని వివిధ భాగాల నుంచి సమాచారాన్ని మెదడుకు చేరవేసే నాడులు?
1) జ్ఞాననాడులు 2) చాలక నాడులు
3) అపవాహినాడులు 4) 2, 3
46. శివ అనే విద్యార్థి పోలియో వ్యాధితో బాధపడుతున్నాడు. అయిన అతడిలో నశించిన నాడులు?
1) చాలక నాడులు 2) జ్ఞాన నాడులు
3) అపవాహి నాడులు 4) 2/3
47. పూర్ణిమ అనే విద్యార్థి పదునైన వస్తువుపై కాలువేసి వేగంగా, అకస్మాత్తుగా అనియంత్రితంగా తన కాలుని వెనకకు తీసుకుంది. అయిన ఈ చర్య జరగడానికి కారణమైన భాగం?
1) మెదడు 2) వెన్నుపాము
3) అనుమస్తిష్కం 4) పీయూషగ్రంథి
48. ఆల్కహల్ సేవించిన వ్యక్తి తూలుతూ నడుస్తూ తన శరీర సమతుల్యతను కోల్పోవడానికి కారణమైన భాగం?
1) అనుమస్తిష్కం 2) మస్తిష్కం
3) ద్వారగోర్థం 4) మజ్జాముఖం
49. కేంద్ర నాడీవ్యవస్థ అనగా?
1) మెదడు 2) వెన్నుపాము
3) వినాళగ్రంథులు 4) 1,2
50. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక ప్రశ్నవేసి దానికి ఆలోచించి సమాధానం చెప్పండి అని అన్నాడు. అయిన విద్యార్థులు మెదడులోని ఏ భాగాన్ని ఉపయోగించుకుంటారు?
1) మస్తిష్కం 2) అనుమస్తిష్కం
3) ద్వారగోర్థం 4) మజ్జిముఖం
51. చక్కెర వ్యాధికి కారణం అయిన హార్మోన్
1) వాసోపెస్రిన్ 2) ఇన్సులిన్
3) గ్లూకాగాన్ 4) థైరాక్సిన్
52. వాక్యం-ఎ: వినాళగ్రంథులు హార్మోన్ లను స్రవిస్తాయి
వాక్యం -బి : నాళగ్రంథులు ఎంజైమ్ లను స్రవిస్తాయి
1) ఎ సత్యం, బి అసత్యం
2) ఎ అసత్యం, బి అసత్యం
3) ఎ సత్యం, బి సత్యం
4) ఎ అసత్యం, బి అసత్యం
53. మానవ శరీరంలో ఎంజైమ్ లు, హర్మోన్ లు స్రవించే మిశ్రమ గ్రంథి?
1. కాలేయం 2. క్లోమం
3. థైరాయిడ్ 4. అధివృక్క
54. అక్షయ అనే విద్యార్థి పామును చూసి భయపడి పారిపోయి కాసేపటికి సాధారణ స్థితికి చేరుకుంది. దీనికి కారణం అయిన హార్మోన్ ?
1) థైరాక్సిన్ 2) ఈస్ట్రోజన్
3) వాసోప్రెసిన్ 4) అడ్రినలిన్
55. విసర్జక పదార్థాలలో అత్యంత విషపూరితమైంది?
1) యూరియా 2) యూరికామ్లం
3) సోడియం 4) అమ్మోనియా
56. కిందివాటిలో మానవ శరీరంలో విసర్జక అవయవం కానిది?
1) క్లోమం 2) కాలేయం
3) చర్మం 4) పెద్ద పేగు
57. కిందివాటిలో మూత్రం ఏర్పడే విధానంలో సరైన క్రమం?
1) గుచ్ఛగాలనం- వరణాత్మక పునఃశోషణం- నాళికస్రావం
2) నాళికస్రావం- గుచ్ఛగాలనం-వరణాత్మక పునఃశోషణం
3) గుచ్ఛగాలనం- నాళికస్రావం-వరణాత్మక పునఃశోషణం
4) నాళికస్రావం-వరణాత్మక పునఃశోషణం-గుచ్ఛగాలనం
58. విశ్వ అనే వ్యక్తి మూత్రాన్ని సరిగ్గా విసర్జించకపోవటం వల్ల కాళ్ళు, చేతులు ఉబ్బి, నీరసం, అలసట వచ్చింది. ఈ స్థితిని ఏమంటారు?
1) ఎడిమా 2) ఎపీసిమా
3) యురేమియా 4) గ్లకోమా
59. డయాలసిస్ అనే ప్రక్రియను ఎవరికి చేస్తారు?
1) ఊపరితిత్తులు పనిచేయనివారికి
2) కాలేయం పనిచేయనివారికి
3) సక్రమంగా జీర్ణక్రియ జరగనివారికి
4) మూత్రపిండాలు పనిచేయనివారికి
60. జాతి అంతరించిపోకుండా ఉండటానికి ఉపయోగపడే జీవక్రియ?
1) ప్రత్యుత్పత్తి 2) శ్వాస క్రియ
3) జీర్ణక్రియ 4) విసర్జన క్రియ
61. మానవుల్లో గర్భావధి కాలం?
1) 360 రోజులు 2) 270 రోజులు
3) 200-220 రోజులు
4) 600 రోజులు
62. శుక్రకణం, అండం ఏ స్థితిలో ఉంటాయి?
1) ఏక స్థితి 2) ద్వయ స్థితి
3) త్రయ స్థితి 4) బహు స్థితి
63. మొదటిసారిగా క్లోనింగ్ ప్రకియ ద్వారా ఉత్పత్తి చేసిన క్షీరదం?
1) మేక 2) ఆవు 3) గేదె 4) గొర్రె
64. మానవుడి పరధీయ నాడీ వ్యవస్థలో ఏవి ఉంటాయి?
1) కపాలనాడులు, మెదడు
2) మెదడు, వెన్నుపాము
3) వెన్నునాడులు, మెదడు
4) కపాలనాడులు, వెన్నునాడులు
సమాధానాలు
1-3 2-2 3-1 4-4
5-1 6-3 7-4 8-4
9-2 10-4 11-1 12-4
13-3 14-4 15-4 16-1
17-3 18-4 19-2 20-4
21-1 22-4 23-1 24-2
25-3 26-4 27-2 28-4
29-4 30-2 31-1 32-3
33-1 34-4 35-2 36-4
37-2 38-4 39-3 40-3
41-3 42-1 43-2 44-4
45-1 46-1 47-2 48-1
49-4 50-1 51-2 52-3
53-2 54-4 55-4 56-1
57-1 58-3 59-4 60-1
61-2 62-1 63-4 64-4
శ్రీకాంత్
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
- Tags
- competitive exams
- TET
- TSPSC
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు