కవుల కాణాచి తెలంగాణ
జీవన్ముక్తి మహారాజు
॥ఆది నారంభ మత్స్యేంద్రో గోరక్ష గహనీతధా
నివృత్తి జ్ఞాన దేవాయ జీవన్ముక్తాయతే నమః॥
- శివుడు, మత్స్యేంద్ర నాథుడు, గోరఖ్నాథుడు, గహనీనాథుడు, నివృత్తినాథుడు, జ్ఞానదేవుడు, జీవన్ముక్తుడు సప్తనాథులని కూడా చరిత్ర తెలుపుతున్నది.
- నవ నాథులేకాక నాథపంథలోని వారుగా చెప్పబడుతున్న జీవన్ముక్త మహారాజు మహారాష్ట్ర నుంచి వచ్చి మెదక్ జిల్లా (నేటి సంగారెడ్డి జిల్లా) అంత్యారంలో నివాసం ఏర్పరచుకొని ముక్తికి సంబంధించిన జ్ఞాన ప్రబోధ గ్రంథాన్ని గీర్వాణ భాషలో అనువదించారు.
- ఆయన గురించి చారిత్రక పరిశోధకుడు బిరుదురాజు రామరాజు ప్రశంసించారు.
- జ్ఞానేశ్వరులు ఓవి ప్రబంధంగా రాసిన జ్ఞానేశ్వరికి (గీతాభాష్యం) భావర్థ దీపిక, భగవద్గీతను మహారాష్ట్ర భాషలోకి అనువదించారు.
వానమామలై నరసింహదాసు
- ఈయనది ఒకప్పటి నర్సాపూర్ తాలూకా పెదగొట్టిముక్కుల గ్రామం.
- ఈయన తల్లి గంగమాంబ, తండ్రి క్రిష్ణాచారి.
- బలిచక్రవర్తి చరిత్ర యక్షగానాన్ని రచించారు. శ్రీవైష్ణవ తత్వంలో ప్రావీణ్యుడిగా పేరుతెచ్చుకున్నారు.
కం॥ చందా నారాయణ శ్రీ
ష్టం దంబుగ దీని వ్రాయ నాజ్ఞ యొసంగెన్
పొందుగ నృసింహదాసుడు
కందర్పాంతకుని నమ్మి గట్టెను దీనిన్॥
- తెరలోపలి దర్వు, తెర వెడల దర్వు, సంవాద, కందార్థ ద్విపదలు, సీస, కంద గీతాల్లో ఘనుడు. ఈయన బలిచక్రవర్తి చరిత్రను కావ్య రూపంలో రాశారు.
కందాళ సుందరాచార్యులు
- 1864 (19వ శతాబ్ది) ఉత్తరార్ధానికి చెందినవారు. మద్దికుంట జన్మస్థానం.
- నల్లవెల్లి గ్రామంలో, మరికొంత గుమ్మడిదలలో గడిపారు.
- తల్లి అలివేలమ్మ, తండ్రి శేషాచార్యులు. ఈయన ధర్మజు రాజసూయం, సంపూర్ణ రామాయణం, పుష్పవేణి విలాసం, తిరుమంగయాళ్వారు చరిత్ర, హాస్య వైద్య శతకం, 20 మంగళహారతులను రచించారు.
- హాస్యవైద్య శతకంలోని పద్యాలు
కం॥ అంతక సన్ని జనించిన
చింతా కురసంబు జముడు జిల్లెడు పాలున్
వింతగను నూనె తుత్దము
కొంత యొసంగినను జనును కోరిన యెడకున్॥
- వైద్యమే వృత్తిగా ఉన్నప్పటికీ, ఈ వైద్యశతకంలో రోగాలకు ఔషధ విశేషాలు హాస్యం కలిగించేవిగా ఉండటంతో హాస్యవైద్య శతకమయ్యింది.
- మిగతా రచనల్లో ఈ కవికి ప్రాస పదాలపై ఉన్న ప్రేమ అపారం. తిరు మంగయాళ్వారు చరిత్ర అనే నాటకం పూర్వం నర్సాపురం కిడాంబి నరసింహాచార్యుల ఇంట్లో ఉండేది.
చక్రవర్తుల కృష్ణమాచార్యులు
- 20వ శతాబ్దానికి చెందిన ఈయన కిచ్చన్నపల్లి జోగిపేట (ఆందోల్) వాస్తవ్యులు.
- తండ్రి వెంకటాచార్యులు.
- ఆళ్వారు చరిత్ర, ఉడంగ (నాయరు) ఆళ్వారు చరిత్ర, పరకాల వైభవం అనే నాటకాన్ని రాశారు.
- కిచెన్నపల్లి వేంకటేశ్వరస్వామికి అంకితం ఇచ్చారు.
గీ॥ కనుగవల్ నూగారుకౌను పాదములు
చనుగవల్ చెక్కిళ్లు చక్కని మోము
కరములు దంతముల్ కాంతనెమ్మోము
కురులు నాదిగ జేసి కోమలి సొంపు
వర్ణించుటకు పంచవక్తృని వశమే..
కృష్ణమాచారి
- 1867లో దొంతి గ్రామంలో జన్మించారు. తండ్రి బాలకృష్ణమాచారి.
- కవితలను అల్లడంలో ఆశుకవిత్వ ధారా వాక్పటిమ ఈయన సొంతం. ఒకే కావ్యాన్ని రచించాడని తెలుస్తుంది.
కస్తూరి కృష్ణమాచార్యులు
- ఈయన చేటకూరులో జన్మించారు.
- పాపన్నపేట సంస్థాన రెడ్డి రాజుల కాలంలో వారి వారి ఆస్థానాల్లో గురుస్థానంలో ఉన్నట్టు చరిత్ర.
- 1924లో జన్మించిన కృష్ణమాచార్యులు తెలుగు-హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసిద్దుడు. ఈయన స్వాతంత్య్ర దీక్ష రచించారు.
- కృష్ణుని గీతా ప్రబోధం వలే, స్వాతంత్య్ర సమరంలో దీక్షా ప్రబోధం గొప్పగా సాగిందని చరిత్ర వెల్లడిస్తున్నది.
- 1954లో బూర్గుల రామకృష్ణారావు త్రిభాషా కవి సమ్మేళనానికి ఈయన అధ్యక్షత వహించారు.
ఎం రంగ కృష్ణమాచార్యులు
- 1930లో ముడుంబై రంగకృష్ణమాచార్యులు జన్మించారు.
- దాదాపు 25 గ్రంథాలు రచించారు. గురుభక్తి, జోగినాథాస్తవం, దేశం కోసం సందేశం, నవజీవనం, లాల్ బహదూరియం, వీర భద్రీయం, నా కవనం, వేంకటాచల మొదలైన ఎన్నో గ్రంథాలను రంచించారు.
వేముగంటి నరసింహాచార్యులు
- సిద్దిపేటలో 1930లో జన్మించారు. ఈయన తండ్రి రంగాచార్యులు.
- తెలుగు, సంస్కృత, హిందీ భాషలను అభ్యసించి, ఆ భాషల్లో పద్య, శ్లోక, వచన కవితా ప్రక్రియ పండితులకు గురువు. 16 నుంచి 17 గ్రంథాలను రచించారు.
- ఈయనకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేసింది.
- మహారాష్ట్ర పాఠ్యాంశాల్లో ఈయన కవితా చరిత్రను చేర్చారు.
- ప్రబోధం, అమరజీవి బాపూజీ, కవితాంజలి, నవమాలిక, తిక్కన, గోపాలకృష్ణ సుప్రభాతం, వీరపూజ, శ్రీవేంకటేశ్వర వినుతి, మణికింకిణి.
- ఒకప్పటి మెదక్ జిల్లా రచయితల సంఘానికి, సాహితీ వికాస మండలికి అధ్యక్షుడిగా పనిచేశారు.
Previous article
Weapons of Mass Destruction |‘వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్’ పదాన్ని ఎప్పుడు వాడారు?
Next article
ప్రముఖ వ్యక్తులు – ఆత్మకథలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు