Weapons of Mass Destruction |‘వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్’ పదాన్ని ఎప్పుడు వాడారు?
విపత్తు నిర్వహణ
-విపత్తులు సంభవించే వేగం, వాటికి దారితీసే కారణాల ఆధారంగా విపత్తులను పలు రకాలుగా వర్గీకరించవచ్చు.
I. విపత్తులు సంభవించే వేగాన్ని బట్టి..
II. విపత్తులు సంభవించే కారణాలను బట్టి వాటిని వర్గీకరించారు.
I) విపత్తులు సంభవించే వేగాన్ని బట్టి 2 రకాలుగా విభజించారు.
ఉదా : కరువు, తెగుళ్లదాడి, పర్యావరణ క్షీణత, అంటువ్యాధులు మొదలైనవి.
2. వేగంగా వచ్చే విపత్తు : సెకనులు, నిమిషాలు, గంటల వ్యవధిలో చాలా తక్కువ సమయంలోనే సంభవించే విపత్తును/తక్షణ విఘాతం వల్ల సంభవించే విపత్తును ‘వేగంగా వచ్చే విపత్తు’ అంటారు. దీనివూపభావం స్వల్ప/దీర్ఘకాలం ఉండవచ్చు.
ఉదా : భూకంపం, ఆకస్మిక వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనం, తుఫానులు (సైక్లోన్లు), చక్రవాతం, సునామీలు మొదలైనవి.
II) విపత్తులు సంభవించే కారణాలను బట్టి 2 రకాలు.
1) సహజ/వూపకృతిసిద్ధమైన విపత్తులు
2) మానవకారక విపత్తులు
1) సహజ/వూపకృతిసిద్ధమైన విపత్తులు : ఇవి ప్రకృతి వైపరీత్యం కారణంగా సంభవించే విపత్తులు వీటివల్ల ప్రజలు ఎదుర్కోలేని విధంగా ప్రాణ, ఆస్తి నష్టాలతో పాటు, పర్యావరణ నష్టం జరుగుతుంది.
ఉదా : భూకంపాలు ( 2015లో నేపాల్ భూకంపం), వరదలు (2013లో ఉత్తరాఖండ్ వరదలు), తుఫానులు (2014లో విశాఖపట్నం తుఫాను), సునామీ (2004లో హిందూ మహాసమువూదంలో సంభవించినది).
-సహజసిద్ధ విపత్తులను మనం నివారించలేము. కానీ మనకున్న శాస్త్ర, సాంకేతిక, సమాచార పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని విపత్తుల వల్ల సంభవించే నష్టాలను తగ్గించవచ్చు.
2) మానవకారక విపత్తులు : మానవుల తప్పిదాల కారణంగా, మానవులు ప్రేరేపితం కారణంగా సాధారణ జీవితానికి తీవ్ర అంతరాయం కలగజేసే వాటిని ‘మానవకారక విపత్తులు’ అంటారు. వీటి వల్ల ప్రాణ, ఆస్తి, పర్యావరణ నష్టాలు జరుగుతాయి.
ఉదా : 1. భోపాల్ గ్యాస్ దుర్ఘటన (1984)
2. తమిళనాడులోని కుంభకోణం పాఠశాలలో అగ్ని ప్రమాదం (2003)
3. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంటబాంబు పేలుళ్లు (2013)
4. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై వేయబడిన అణుబాంబులు (1945)
5. రాజధాని ఎక్స్‌వూపెస్ రైలు పట్టాలు తప్పడం (2002)
6. జపాన్‌లోని ఫుకుషిమా అణువిపత్తు (2011)
7. భారత పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి (2001)
8 మానవకారక విపత్తులను నివారించడానికి ప్రజల ఆలోచనా సరళిలో మార్పును తీసుకురావడం, విపత్తుల గురించి అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణ మొదలైన చర్యలు చేపట్టడం అవసరం.
నోట్ : ప్రాణ, ఆస్తి, పర్యావరణానికి భారీ నష్టాన్ని కలిగించే ఆయుధాలను ‘సామూహిక విధ్వంసక ఆయుధాలు’ అంటారు.
-2003లో జరిగిన అమెరికా -ఇరాక్ యుద్ధంతో ‘వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్’ పదం వాడుకలోకి వచ్చింది.
-విపత్తు నిర్వహణపై 1999లో ఏర్పాటు చేయబడిన అత్యున్నత అధికార కమిటీ 31 రకాల విపత్తులను గుర్తించి వాటిని 5 ప్రధాన గ్రూపులుగా విభజించింది.
-దుర్బలత్వం: భౌతిక, సామాజిక, ఆర్థిక, పర్యావరణ కారకాలు (లేదా) ప్రక్రియలచే నిర్ధారించబడి పెంచే స్థితిని ‘దుర్బలత్వం’ అంటారు.
ఉదా: సురక్షితం కాని ప్రాంతాల్లో (లేదా) దిగువ ప్రాంతాల్లో వరద ముప్పు ఎక్కువగా కలిగి ఉంటారు. వరదల వల్ల వారి ఇళ్లు/భవనాలు కొట్టుకుపోవడం/కుప్పకూలడం/జారిపోవడం వల్ల దెబ్బతింటాయి. వారి జీవనోపాధిపై కూడా ప్రభావం పడుతుంది.
-దుర్బలత్వం వల్ల మొదటగా చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు, స్త్రీలు మిగతావారికంటే ఎక్కువ ప్రభావానికి గురవుతారు.
నోట్: 2000లో విడుదల చేసిన ‘సెంటర్ ఫర్ రిసర్చ్ ఆన్ ది ఎపిడెమియాలజీ ఆఫ్ డిజాస్టర్స్’ (సీఆర్ఈడీ) నివేదిక ప్రకారం విపత్తుల సందర్భంగా చనిపోయే వారిలో 85శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.
1. భౌతిక దుర్బలత్వం: విపత్తు జరిగే సమయంలో భవనాలు, మౌలిక వసతులు వంటి ముంపు కలిగిన నిర్మాణాలు, ప్రజలు ఆ వైపరీత్యానికి ఉన్న సామీప్యత, ప్రదేశం, స్వభావంపై ఆధారపడి ఉంటుంది. విపత్తు వల్ల ఏర్పడే బలాలను, నిర్మాణాలను ఎదుర్కోవడానికి కలిగి ఉన్న సాంకేతిక సామర్థ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది.
2. ఆర్థిక, సామాజిక దుర్బలత్వం: సమువూదతీరంలో నివసించే పేద ప్రజలకు దృఢమైన కాంక్రీట్ భవనాలు నిర్మించుకోవడానికి అవసరమైన డబ్బు ఉండదు. అందువల్ల వారు ముప్పులోనే ఉంటారు. బలమైన విపత్తుల వల్ల (తుఫానులు/ ఈదురుగాలులు) తమ నివాసాలను కోల్పోతారు. పేదరికం కారణంగా తిరిగి ఇళ్లను నిర్మించుకోలేరు.
-ప్రభావ కారణాలు : 1. ఆర్థికపరిస్థితి, 2. వయస్సు, 3. పేదరికం, 4. నిరక్షరాస్యత, 5. సరైన అవగాహన లేకపోవడం, 6. పట్టణీకరణ, 7. జనాభా పెరుగుదలపై ఆధారపడి ఉంటాయి.
నోట్ : 2004 సునామీ తర్వాత తమిళనాడులోని సామియార్పెట్టయి గ్రామంలో ఇతర గ్రామాలతో పోల్చుకుంటే తక్కువ మరణాలు సంభవించాయి. కారణం ఆ గ్రామానికి చెందిన ప్రజలు శోధన, రక్షణ, ఖాళీ చేయటంతో పాటు ప్రథమ చికిత్సలో శిక్షణ కలిగి ఉన్నారు.
-వైపరీత్యం (Hazard) : ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించే శక్తి ఉన్న ప్రమాదకరమైన సహజ/మానవ కార్యకలాప పరిస్థితినే ‘వైపరీత్యం’ అంటారు.
-Hazard అనే పదానికి అర్థం ‘ప్రమాదకరమైన పరిస్థితి’. Hazard అనేది పురాతన ‘ఫ్రెంచిపదం’. Az-zahr అనేది అరబిక్ పదం నుంచి వచ్చినది. వైపరీత్యాల తీవ్రత పెరిగే కొద్దీ విపత్తుగా మారుతుంది.
-వైపరీత్యాలు ప్రధానంగా 2 రకాలు అవి.
1. ప్రకృతి వైపరీత్యాలు: ప్రకృతి వల్ల సంభవించేవి.
2. మానవ వైపరీత్యాలు: మానవుని చర్యలు/తప్పిదం వల్ల జరిగేవి.
-విపత్తు నిర్వహణ వెబ్సైట్లు :
1. Indian Meterological Department – www.imd.gov.in
2. National Institute of Disaster Management – http:// nidm.gov.in
3. National Disaster Management Authority – http:// ndma.gov.in
4. Central Water Commission – www. cwc.nic.in
5. Regional Integrated Multihazard Early Warning System – www.rimes.int
6. United Nations Office for Disaster Risk Reduction – www.unisdr.org
7. Central Disaster Management and Humanitation – www.cdmha.org
8. SAARC Desaster Managemant Center – http:// saarc.sdmc.nic
9. World Conference on Disaster Management – www. wcdm.org
మాదిరి ప్రశ్నలు
1. కిందివాటిలో మానవుల వల్ల ఏర్పడే విపత్తులేవి? (4)
1) వరదలు 2) భూకంపాలు
3) కరువులు 4) అగ్ని ప్రమాదాలు
2. సముద్రం లోపల భూకంపాల వల్ల వచ్చేది? (3)
1) అగ్ని పర్వతాలు 2) భూతాపాలు
3) సునామీలు 4) వరదలు
3. కిందివాటిలో ప్రకృతి వైపరీత్యం ఏది? (4)
1) భూకంపం 2) తుఫాను
3) భూతాపం 4) పైవన్నీ
4. అంటువ్యాధులు అనేవి ఏరకమైన వైపరీత్యం? (3)
1) భౌగోళిక విపత్తు 2) ప్రమాద విపత్తు 3) బయోలాజికల్ విపత్తు 4) రసాయనిక విపత్తు
5. కరువు అనేది ఏరకమైన వైపరీత్యం? (1)
1) నీరు, వాతావరణ విపత్తు 2) రసాయన విపత్తు 3) భౌగోళిక విపత్తు 4) బయోలాజికల్ విపత్తు
మాదిరి ప్రశలు
1. ఏ ప్రమాదం ఒక అపాయికారి సంఘటన అది? (4)
1) భూకంపం 2) సునామీ
3) వరదలు 4) పైవన్నీ
2. ‘Hasard’అనేది ఏ భాష పదం? (2)
1) అరబిక్ 2) ఫ్రెంచి 3) లాటిన్ 4) గ్రీకు
3. విపత్తులను వర్గీకరించటానికి ఆధారం? (1)
1) అవి కలిగించే ప్రాణనష్టం
2) అవి కలిగించే ఆస్తినష్టం
3) దాని వేగం 4) దాని గత చరిత్ర
4. విపత్తు నిర్వహణపై ఏర్పడిన ఉన్నత అధికార సంఘం 1999, ఆగస్టులో విపత్తులను 5 రకాలుగా వర్గీకరించింది. వాటి అంతర్భాగాలు? (4)
1) భౌగోళిక సంబంధ విపత్తులు
2) జీవ సంబంధ విపత్తులు
3) నీరు, వాతావరణ సంబంధ విపత్తులు
4) పైవన్నీ
5. విపత్తు తీవ్రత దేని పరంగా లెక్కించబడుతుంది? (1)
1) ప్రాణనష్టం 2) ఆస్తినష్టం
3) జంతునష్టం 4) గృహనష్టం
6. కిందివాటిలో సరైనది? (4)
1) విపత్తును నివారించవచ్చు
2) విపత్తును ఊహించవచ్చు
3) విపత్తు ఆసియాలోనే సంభవిస్తుంది
4) విపత్తు దుష్ఫలితాలను తగ్గించవచ్చు
7. కిందివాటిలో విపత్తును తగ్గించే వ్యూహం? (3)
1) చౌకగా విద్యుత్‌ను అందించడం
2) పిల్లలకి స్కూల్ యూనిఫాంలు ఇవ్వడం
3) తుఫాన్ నెలవును నిర్మించడం
4) బ్యాంకుల నుంచి అప్పులు ఇవ్వడం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?