శ్వాసక్రియను దహనక్రియ అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?
బయాలజీ
- జీవులు మనుగడ సాగించాలంటే జీవిలో అతి ముఖ్యమైన క్రియ ‘శ్వాసక్రియ’.
- జీవ క్రియల్లోని విచ్ఛిన్న ప్రక్రియల్లో శక్తి విడుదలవుతుంది. దీనిలో సంక్లిష్ట కర్బన పదార్థాలు (కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రొటీన్లు) విచ్ఛిన్నం చెంది సరళ పదార్థాలుగా మారుతాయి. ఈ విచ్ఛిన్నకర చర్యలో రసాయనిక శక్తి విడుదలవుతుంది. ఇది సేంద్రియ పోషక అణువుల నిర్మాణంలో అంతర్గతమై ఉంటుంది.
- 14వ శతాబ్దంలోనే శ్వాసక్రియపై పరిశోధనలు జరిగాయి.
- 1783లో ‘లెవోయిజర్’ అనే శాస్త్రవేత్త శ్వాసక్రియ ఒక దహనక్రియ అని తెలిపారు.
- ‘రాబిన్సన్’ అనే శాస్త్రవేత్త కూడా శ్వాస క్రియను దహన క్రియగా పేర్కొన్నాడు.
- 19వ శతాబ్దంలో ‘జాన్ డాపర్’ మానవ శరీర ధర్మశాస్త్రం అనే పుస్తకంలో శ్వాసక్రియ గురించి పేర్కొన్నాడు.
- గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు, ప్రొటీన్లను, కార్బన్ డై ఆక్సైడ్ నీరుగా మార్చే చర్యనే శ్వాసక్రియ అంటారు. ఇది కణం స్థాయిలో జరిగితే కణ శ్వాస క్రియ అంటారు.
- శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ. శక్తిమోచక చర్య.
- శ్వాసక్రియ అనే పదం ‘Respire (రెస్పైర్)’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది.
- ‘Respire’ అంటే పీల్చడం అని అర్థం. ఇది కేవలం ఉచ్ఛాస, నిశ్వాసలనే కాకుండా కణాల్లో ఆక్సిజన్ వినియోగించడం వరకు అన్ని దశలను కలిపి సూచిస్తుంది.
- శ్వాసక్రియ, దహనక్రియలకు పోలికలుంటాయి. ఈ రెండు చర్యల్లో చక్కెర (గ్లూకోజ్), కార్బన్‌డైఆక్సైడ్ (CO2), నీరు (H2O)గా మారుతుంది. ఈ రెండు చర్యలకు ఆక్సిజన్ అవసరం.
- శ్వాసక్రియలో అనేక యౌగికాలు, మధ్యస్త పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. దహన క్రియలో ఎలాంటి పదార్థాలు ఏర్పడవు.
శ్వాసక్రియ రకాలు
ఆక్సిజన్ ఆవశ్యకతను అనుసరించి శ్వాస క్రియను రెండు రకాలుగా వర్గీకరించారు.
అవి 1. వాయు శ్వాసక్రియ (వాయుసహిత)- ఈ విధానంలో ఆక్సిజన్ వినియోగం జరుగుతుంది.
2. అవాయు శ్వాసక్రియ (వాయు రహిత) – ఈ విధానంలో ఆక్సిజన్ వినియోగం జరగదు.
వాయు శ్వాసక్రియ
- ఇది ఉన్నత వర్గానికి చెందిన మొక్కల్లో సర్వసాధారణంగా జరుగుతుంది.
- ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. గ్లూకోజ్ పూర్తిగా ఆక్సీకరణం చెందుతుంది.
- వాయుసహిత శ్వాసక్రియలో అధిక శక్తి 686 K. Cal విడుదలవుతుంది.
- దీనిలో 38 ATPలు ఏర్పడుతాయి. అంత్య ఉత్పన్నాలుగా CO2, H2O లు ఏర్పడుతాయి.
- దీనిలో 4 నిర్దిష్టమైన దశలున్నాయి.
- అవి 1. గ్లైకాలసిస్
2. పైరువిక్ ఆమ్లం ఆక్సీకరణ, డీ కార్బాక్సిలేషన్
3. క్రెబ్స్ వలయం
4. ఎలక్ట్రాన్ రవాణా - పై చర్యల్లో గ్లైకాలసిస్ కణద్రవ్యంలో జరుగుతుంది. మిగిలిన మూడు దశలు మైటోకాండ్రియాలో జరుగుతాయి.
- C6H12O6 + 6O2 ———> 6CO2 + 6H2O + 686 K.Cal
అవాయు శ్వాసక్రియ
- ఇది సాధారణంగా నిమ్నస్థాయి జీవుల్లో (బ్యాక్టీరియమ్, ఈస్ట్) జరుగుతుంది.
- ఆక్సిజన్ అవసరం లేదు. గ్లూకోజ్ పాక్షికంగా ఆక్సీకరణం చెందుతుంది.
- అవాయు శ్వాసక్రియలో తక్కువ శక్తి 56K. Cal విడుదలవుతుంది.
2 ATPలు ఏర్పడుతాయి. - అంత్య ఉత్పన్నాలుగా CO2, ఇథైల్ ఆల్కహాల్, ఎసిటికామ్లం, లాక్టికామ్లం, కర్బన పదార్థాలు ఏర్పడుతాయి.
- ఇది రెండు నిర్దిష్టమైన దశల్లో జరుగుతుంది. అవి 1. ైగ్లెకాలసిస్ 2. కిణ్వనం
- దీనిలో గ్లైకాలసిస్, కిణ్వనం రెండూ కణ ద్రవ్యంలో జరుగుతాయి.
- C6H12o6 —–> 2C2H5OH + 2CO2 + 56 K.Cal
అవాయుసహిత శ్వాసక్రియ
- వాయు శ్వాసక్రియలో మొదటి దశ ‘గ్లైకాలసిస్’. ఇది కణద్రవ్యంలో జరుగుతుంది.
- దీనిలో హెక్సోజ్ చక్కెర (గ్లూకోజ్) పాక్షిక ఆక్సీకరణం చెంది పైరువిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది.
- ఇది ATP అణువుల పాస్ఫారిలేషన్ ద్వారా ఏర్పడుతుంది.
- వాయు శ్వాసక్రియలో రెండో దశ పైరూవిక్ ఆమ్లం ఆక్సీకరణం, డీ కార్బాక్సిలేషన్ చెంది ఎసిటైల్ కోఎంజైమ్-A గా రూపొందు తాయి.
- ఇది మైటో కాండ్రియాలోని మాత్రికలో జరుగుతుంది.
- మూడో దశ (క్రెబ్స్ వలయం) ఎసిటైల్ కోఎంజైమ్-A పూర్తిగా ఆక్సీకరణం చెంది CO2, H2O గా ఏర్పడుతుంది.
- ఈ దశలో NADH, FADH2 లు ఏర్పడుతాయి.
- చివరి దశలో (ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ) మైటోకాండ్రియా లోపలి త్వచంలో NADH, FADH2 లు పూర్తిగా ఆక్సీ కరణం చెందుతాయి.
- దీనిలో విడుదలైన శక్తి అధిక పరిమాణంలో ATP సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. దీన్ని ‘ఆక్సీకరణ పాస్ఫారిలేషన్’ అంటారు.
- ఆక్సీకరణ పాస్ఫారిలేషన్ను ‘విట్చెల్’ ప్రతిపాదించిన ‘కెమీ ఆస్మాటిక్ సిద్ధాంతాన్ని’ అనుసరించి జరుగుతుంది.
గ్లైకాలసిస్
- గ్లైకాలసిస్ అనే పదం గ్రీకుపదాలైన ‘గ్లైకిస్’ = చక్కెర, ‘లైసిస్’ = విచ్ఛిత్తి లేదా ‘లయం’ నుంచి ఉద్భవించింది.
- గ్లైకాలసిస్ యాంత్రికాన్ని జర్మనీ శాస్త్రవేత్తలు గుస్టవ్ ఎంబ్డెన్, ఆండ్రు మేయర్ హాఫ్, జాకఫ్ పారనస్ లు వివరించారు. దీన్ని ‘EMP పథం’ అంటారు. దీనినే ‘హెక్సోస్ డై పాస్ఫేట్ పథం’ అని కూడా అంటారు.
- గ్లూకోజ్ అణువును శక్తిమంతం చేయడానికి కొంత శక్తి అవసరం. గ్లైకాలసిస్ మొదటి చర్యలోనే గ్లూకోజ్‌కు పాస్ఫేట్ అణువు చేర్చడంవల్ల ఉత్తేజితమవుతుంది.
- ఈ పాస్ఫేట్‌ను ATP నుంచి తీసుకొంటుంది.
- ఇది ఆరు కర్బన పరమాణువులు గల గ్లూకోజ్ -6-పాస్ఫేట్గా ఏర్పడుతుంది. (అంటే పాస్ఫేట్ గ్లూకోజ్‌లోని ఆరో కర్బన్ పరమాణువుకు చేరుతుంది)
- ఇది తర్వాత ఫ్రక్టోజ్ -1, 6 డై పాస్ఫేట్ (అంటే పాస్ఫేట్ మొదటి, ఆరో కర్బన పరమాణువుకు చేరుతుంది)
- రెండో పాస్ఫేట్ ATP నుంచి వస్తుంది. అందుకే ైగ్లెకాలసిస్ ప్రారంభ చర్యలో రెండు ATP లు ఉపయోగపడతాయి.
- ఫ్రక్టోజ్-1, 6 డై పాస్ఫేట్ చక్కెర చివరకు రెండు పైరువిక్ ఆమ్ల అణువులుగా మారుతుంది. దీనిలో నాలుగు ATPలు, రెండు NADHలు ఏర్పడుతాయి.
- రెండు ATPలు ఈ చర్యలో వినియోగించ బడి చివరకు రెండు ATP లు నికర లాభంగా మిగులుతాయి.
పైరూవిక్ ఆమ్లం ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్
- ఇది వాయు శ్వాసక్రియలో రెండో దశ. మైటోకాండ్రియాలోని మాత్రికలో మాత్రమే జరుగుతుంది.
- గ్లైకాలసిస్లో ఏర్పడిన రెండు అణువుల పైరువేట్ ఆమ్లం, పైరువేట్ ట్రాన్స్లొకేటర్ ప్రత్యేక పాస్ఫేట్ సాయంతో మాత్రికలో ప్రవేశిస్తుంది.
- దీని మొదటి డీ కార్బాక్సిలేషన్, తర్వాత ఆక్సీకరణ చర్యలు జరిగి చివరికి ఎంజైమ్ Aతో చర్య జరుపుతుంది. ఇది క్రెబ్స్ వలయంలోకి చేరుతుంది.
- ఎసిటైల్ కోఎంజైమ్-A గా మారుతుంది. దీన్ని ైగ్లెకాలసిస్, క్రెబ్స్ వలయాల ‘కనెక్టింగ్ లింక్’గా వ్యవహరిస్తారు.
క్రెబ్స్ వలయం
- పైరువిక్ ఆమ్లం మైటోకాండ్రియాలోని మాత్రికను చేరి విచ్ఛిన్నం చెంది CO2 గా ఏర్పడే చర్యలను ‘సర్హన్స్ క్రెబ్స్’ 1937లో వివరించారు. అందుకే దీన్ని ‘క్రెబ్స్ వలయం’ లేదా ‘సిట్రిక్ ఆమ్ల వలయం’ అంటారు.
- ‘ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయం’ (TCA) అని కూడా అంటారు.
- దీనిపై క్రెబ్స్కు 1953లో నోబెల్ బహుమతి లభించింది.
- సిట్రిక్ ఆమ్లం ట్రైకార్బాక్సిలిక్ ఆమ్లంగా మారుతుంది.
- మొదటి చర్యలో పైరువిక్ ఆమ్లం ఒక కార్బన్, CO2 రూపంలో తొలగించబడుతుంది.
- పైరువేట్ రెండు CO2 లు ఉండే ఎసిటైల్కో ఎంజైమ్ -A గా మారుతుంది.
- తర్వాత ఇది నాలుగు కార్బన్ పరమాణువు లు ఉండే ఆక్సాలో ఎసిటలిక్ ఆమ్లానికి చేరుతుంది.
- దీని ఫలితంగా ఆరు పరమాణువులు ఉండే సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
- ఇది ఒక వలయంగా కొనసాగుతుంది. కాబట్టి దీనిని ‘సిట్రిక్ ఆమ్ల వలయం’ అంటారు.
- ఈ చర్యలో GTP (గ్వనోసిన్ ట్రైపాస్ఫేట్) ఏర్పడుతుంది. ఈ GTP క్రమేణా జంతు కణంలోని మైటో
- కాండ్రియాలోని క్రెబ్స్ వలయంలో ట్రాన్స్పాస్ఫారిలేషన్ అనే చర్య ద్వారా ATPగా మారుతుంది. కానీ మొక్కల్లో ATP గా ఉంటుంది.
ఎలక్ట్రానిక్ రవాణా
- గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణాలో ప్రతి గ్లూకోజ్ అణువులో ఏర్పడిన పైరువిక్ ఆమ్లానికి గైకాలసిస్ చర్యలో రెండు NADH, అందులో ఒక గ్లూకోజ్ ఆక్సీకరణం చెంది10 NADH లు ఏర్పడతాయి.
- (2 ైగ్లెకాలిసిస్ నుంచి, 8 క్రెబ్స్ వలయం నుంచి=10)
- మైటోకాండ్రియాలో ఆక్సీకరణం చెందిన ఎలక్ట్రాన్ రవాణా ద్వారా ప్రతి NADH అణువు నుంచి మూడు అణువులు, ప్రతి FADH2 నుంచి రెండు ATP లు ఏర్పడుతాయి.
- ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెంది CO2, H2O ఏర్పడినప్పుడు ATPల సంఖ్య 40 ఇందులో రెండు ATPలు వాడుకోవడం జరుగుతుంది.
- గ్లూకోజ్ అణువు ఆక్సీకరణ నికర లాభం 38 ATP లు (38-2=40).
- ఒక ATP అణువు జల విశ్లేషణం చెంది 7200 శక్తిని విడుదల చేస్తుంది.
- 38 ATPలు మొత్తం 7200X38 = 2,73,600 కేలరీలు (273.6 K.Cal)
- ఈ శక్తి గ్లూకోజ్‌లో నిల్వ ఉండే మొత్తం శక్తిలో 40 శాతం ఉంటుంది.
- ATPని కణంలో ‘ఎనర్జీ కరెన్సీ’ అంటారు.
Previous article
బోధనోద్దేశాలు – విలువలు
Next article
Find the range of 7cosx-24sinx+5sin2A
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు