ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ ‘స్పాట్’ అడ్మిషన్లు
– ఏడాది నుంచి సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్‌కు గ్రీన్‌సిగ్నల్
-1400 పైగా మురిగిపోయే సీట్ల భర్తీకి అనుమతి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లకు సాంకేతిక విద్యాశాఖ అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాది సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్ ద్వారా రాష్ట్రంలోని సర్కారీ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లన్నీ భర్తీ చేయాలని నిర్ణయించారు. ఆయా ఫీజులను కూడా ఖరారు చేశారు. ప్రతి ఏటా పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు. గతంలో సెంట్రలైజ్డ్ స్పాట్ అడ్మిషన్స్ విధానం ద్వారా ప్రైవేట్ కాలేజీల్లో మాత్రమే సీట్లను భర్తీ చేసేవారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ విధానం అమలు చేయకపోవడంతో ప్రతి ఏటా 1,400పైగా సీట్లు మురిగిపోయేవి. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లకు తీవ్రపోటీ ఉన్నా.. కౌన్సెలింగ్‌లో మాత్రమే సీట్లను భర్తీచేసేవారు. ఈ నేపథ్యంలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్స్ ద్వారా భర్తీచేయాలని ఇటీవలే నిర్ణయించారు. స్పాట్ అడ్మిషన్స్ కోసం విద్యార్థులు ఈ నెల 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 13 వరకు వెబ్ ఆప్షన్స్, 16న సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు.
స్పాట్ అడ్మిషన్లలో భర్తీచేసే సీట్ల వివరాలు
యాజమాన్యం కాలేజీలసంఖ్య మొత్తంసీట్లు కౌన్సెలింగ్‌లో భర్తీ అయినవి స్పాట్ అడ్మిషన్లద్వారా భర్తీచేసేవి
ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు 54 11,922 10,448 1,474
ఎయిడెడ్ 01 230 197 33
ప్రైవేట్ 63 16,410 10,064 6,346
మొత్తం 118 28,562 20,709 7,853
ఫీజులు ఇలా..
# పాలిసెట్ క్వాలిఫై అయ్యి స్పాట్ అడ్మిషన్స్లో సీట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఏడాదికి రూ. 16,330, ఇతర అభ్యర్థులు రూ.16,780 ఫీజుగా చెల్లించాలి.
# పాలిసెట్ క్వాలిఫై, క్వాలిఫై కాని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఏడాదికి రూ. 16,080, ఇతర అభ్యర్థులు రూ. 16,380 ఫీజుగా చెల్లించాలి.
# పాలిసెట్‌లో అర్హత సాధించని విద్యార్థులు రిజిస్ట్రేషన్ సమయంలో అదనంగా ఎస్సెస్సీ పాస్ మెమో, కుల ధ్రువీకరణ పత్రాన్ని అప్లోడ్చేయాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు