విద్యార్థుల్లో నిర్మాణాత్మక భేదాలతోనే దేశాభివృద్ధి!
విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం- వైయక్తిక భేదాలు
పరిచయం
- నవీన మనోవిజ్ఞాన శాస్త్రంలో వైయక్తిక భేదాలు ఒక మలుపు.
- వైయక్తిక భేదాలను గురించి 2000 సంవత్సరాలకు పూర్వమే ప్లేటో పరిశీలించాడు.
- ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా జన్మించలేరు. ప్రతి ఒక్కరు వేరొకరితో సహజ శక్తులు, రూపు రేఖల్లోనూ విభేదిస్తారు.
- తరగతిలో ఉండే ఏ ఇద్దరు విద్యార్థులు ఒకే విధంగా ఉండరు. వీరిలో అనేక విషయాల్లో (శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ) వైవిధ్యాలుంటాయి. ఈ విభేదాలనే వైయక్తిక భేదాలు అంటారు.
- మిలియన్ల కొద్దీ వ్యక్తులను పోల్చినా వారి మధ్య భేదాన్ని చూడవచ్చు- చార్లెస్ డార్విన్
- ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలి- ప్లేటో
- వ్యక్తుల మధ్య భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణనలోకి తీసుకొని బోధనా ప్రక్రియ కొనసాగాలి- రూసో (గ్రంథం- Emily)
- మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశమైనా వైయక్తిక భేదంగా పరిగణించాలి- ఛార్లెస్ E. స్కిన్నర్.
- వ్యక్తిగత విద్యావ్యవస్థ విద్యార్థుల్లో భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వలనే ఒక దేశం అభివృద్ధిని సాధిస్తుంది-జాన్ డ్యూయి (అమెరికా)
- పైవన్నీ అభిప్రాయాలైతే వాటిని శాస్త్రీయ దృష్టిలో విశ్లేషణ చేసిన వ్యక్తి- సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ (మానవశాస్త్ర పరిశోధనశాలను స్థాపించాడు)
- గాల్టన్ రచించిన గ్రంథం- An Inquiry Into Human Faculty and Its Development. ఈగ్రంథం వైయక్తిక భేదాల్లో తొలి శాస్త్రీయ రచన.
- గాల్టన్ వల్ల ప్రభావితుడైన వ్యక్తి- J.M.కాటిల్ (అమెరికా)
- కాటిల్ రచించిన గ్రంథం- Mental Tests anf Measurement
- కాటిల్ సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి, సంవేదన, స్మృతి, ప్రతిచర్య కాలలపై అనేక పరీక్షలు జరిపారు.
వైయక్తిక భేదాలు- రకాలు
ఒకే వ్యక్తిలో ఉండే భేదాలను, వ్యక్తికి, వ్యక్తికి మధ్య ఉండే భేదాలను ఆధారంగా చేసుకొని వైయక్తిక భేదాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి
1. వ్యక్త్యంతర భేదాలు/అంతర వ్యక్తిగత భేదాలు/ వ్యక్తి అంతస్థ భేదాలు (Inter Individual Differences)
2. వ్యక్త్యంతర్గత భేదాలు/ వ్యక్తి అంతర భేదాలు/అంతస్థ/అంతఃవ్యక్తిగత భేదాలు (Intra Individual Differences)
వైయక్తిక భేదాలు కనిపించే అంశాలు
1. ప్రజ్ఞ
2. సహజ సామర్థ్యాలు
3. సృజనాత్మకత
4. అభిరుచులు 5. వైఖరులు
6. అలవాట్లు 7. ఆలోచన
8. వివేచన 9. ఊహాశక్తి
10. స్మృతి 11. శారీరక లక్షణాలు
12. ఉద్వేగ లక్షణాలు
13. సాంఘిక వికాసం
14. నైతిక వికాసం
15. విద్యార్థుల సాధన మొదలైనవి
నోట్: గుణాత్మక మార్పు వ్యక్త్యంతర్గత భేదాలను సూచిస్తుంది.
వైయక్తిక భేదాలు గోచరమయ్యే ముఖ్య రంగాలు
1. ప్రజ్ఞ
2. సహజ సామర్థ్యాలు
3. సృజనాత్మకత
4. అభిరుచులు
5. వైఖరులు 6. అలవాట్లు
7. ఆలోచన (సమైక్య, భిన్న) మొదలైనవి.
8. వైయక్తిక మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు- అట్లర్
9. అట్లర్ గ్రంథాలు-
1. Individual Psychology
2. Life Style
వైయక్తిక భేదాలకు గల కారణాలు
మాదిరి ప్రశ్నలు
1. చరణ్ ఉన్నత సృజనను కలిగిన సగటు ప్రజ్ఞావంతుడు. చిత్రలేఖనంలో దిట్ట, చదువులో సాధారణ ప్రగతిని సాధించగలడు. ఈ లక్షణాలు సూచించేది?
1) వ్యక్త్యంతర్గత భేదాలు
2) వ్యక్త్యంతర భేదాలు
3) అంతర వ్యక్తిగత భేదాలు
4) వ్యక్తి అంతస్థ భేదాలు
2. వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం?
1) Emily
2) Mental Tests and
Measurment
3) Inquiry into Human Faculty
and its Developmement
4) Democracy and Education
3. శ్రీకాంత్ బాగా పరిచయస్తులు ఉన్నప్పుడు గలగలా మాట్లాడుతాడు. కొత్తవారు ఉన్నప్పుడు ముభావంగా ఉంటాడు. ఇది?
1) వ్యక్త్యంతర భేదాలు
2) వ్యక్త్యంతర్గత భేదాలు
3) అంతర వ్యక్తిగత భేదాలు
4) వ్యక్తి అంతస్థ భేదాలు
4. ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలోని విద్యార్థులందరి నుంచి సరైన నిష్పాదన రాబడుతున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు తన బోధనలో అనుసరించిన విధానంలో కింది వాటిలో సరైనది?
1) ఆ ఉపాధ్యాయుడు బోధన పట్ల ఆసక్తి, ఉత్సుకత కలిగి ఉన్నాడు
2) అతడు తరగతి గదిని అందంగా, ఆకర్షణీయంగా మార్చాడు
3) బోధనోపకరణాలను విరివిగా ఉపయోగించాడు
4) బోధనను వైయక్తిక భేదాలను అనుసరించి జరిపాడు
5. కింది వాటిలో అంతస్థ వైయక్తిక భేదంను గుర్తించండి.
1) రహీం ఆటలు ఆడటం ఇష్టపడినంతగా చదువును ఇష్టపడడు
2) అక్బర్ రాయడానికి ఇష్టపడితే, కిరణ్ చదవడానికి ఇష్టపడతాడు
3) రవి గౌరవించినంతగా ఉపాధ్యాయులను రాము గౌరవించడు
4) గిరి, హరి ఇద్దరిలో ఉపాధ్యాయులిచ్చిన ఇంటి పనిని హరి బాగా చేస్తాడు
6. నవీన్ చదరంగం బాగా ఆడలేడు కానీ లెక్కలు బాగా చేస్తాడు. ఇది దేనికి ఉదాహరణ?
1) చరశీల వైయక్తిక భేదాలు
2) అంతర వ్యక్తిగత భేదాలు
3) వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు
4) నిర్మాణాత్మక వైయక్తిక భేదాలు
7. ఈశ్వర్ చేతిరాత బాగుంటుంది. గణితంలో అతడి నిష్పాదన సగటుగా ఉంది. అతని సహాధ్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతడి నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఏ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది?
1) వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదం
2) వ్యక్త్యంతర వైయక్తిక భేదం
3) జోక్య సహిత వైయక్తిక భేదం
4) వ్యక్త్యంతర్గత, వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు
8. కింది వాటిలో వ్యక్తంతర్గత భేదాన్ని సూచించేది?
1) పవన్ తన వయస్సు వారిలో ప్రజ్ఞాశాలి
2) రవి చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు
3) శ్రీకాంత్ తరగతి గదిలో సమయపాలన పాటించే విద్యార్థి
4) ప్రసాద్ స్నేహితుల కంటే వ్యవహారిక దక్షత కలవాడు
9. వ్యక్త్యంతర భేదాలు అంటే?
1) వ్యక్తుల ప్రవర్తనకు సన్నివేశాలకు సంబంధం లేకుండటం
2) వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించడం
3) ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాల్లో ఒకే రకంగా ప్రవర్తించడం
4) ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాల్లో వివిధ రకాలుగా ప్రవర్తించడం
10. అంతర్గత భేదాలు?
1) ప్రతి ఒక్కరికి ఉంటాయి
2) కొంతమందిలో ఉంటాయి
3) విద్యార్థుల్లోనే ఉంటాయి
4) ఒక విద్యార్థికి మరొక విద్యార్థికి బయటకు కనిపించకుండా ఉండే భేదాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు