భారతదేశంలోని శాసనసభ విధానం?
పాలిటీ
1. ద్రవ్య బిల్లులకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. వీటిని లోక్సభలో ప్రవేశ పెడతారు
2. వీటిని రాజ్యసభలో ప్రవేశ పెడతారు
3. రాజ్యసభ సవరణలను సిఫారసు చేయగలదు
4. ఉభయ సభలకు వాటిపై సమానాధికారం కలదు
A)1 మాత్రమే B) 1, 3 మాత్రమే
C) 2 మాత్రమే D) 4 మాత్రమే
2. క్రింది వ్యాఖ్యలలో ఏది సరైనది?
A) రాజ్యసభల్లోనే నామినేటెడ్ సభ్యులు ఉంటారు.లోక్ సభలో ఉండరు
B) రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్
చేయవచ్చు
C) నామినేట్ చేసిన సభ్యుడిని కేంద్రమంత్రిగా నియమించేందుకు రాజ్యాంగం ప్రకారం ఎటువంటి అడ్డంకి లేదు
D) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నామినేట్ అయిన సభ్యుడు ఓటు వేయవచ్చు
3. జాబితా – I ని జాబితా -II తో జతపరచండి.
జాబితా – I జాబితా – II
A. వార్షిక ఆదాయాన్ని వివరించే
వేదిక లేదా బడ్జెట్ 1. ప్రకరణ 110
B. అనుబంధ అదనపు
లేదా అధిక నిధులు 2. ప్రకరణ 112
C. వినియోగాధికార బిల్లు 3. ప్రకరణ 114
D. ద్రవ్య బిల్లు నిర్వచనం 4. ప్రకరణ 115
A B C D
A) 2 3 4 1
B) 1 4 3 2
C) 2 4 3 1
D) 1 3 4 2
4. ప్రతిపాదన (A) : ద్రవ్య బిల్లును లోక్ సభ ఆమోదించి రాజ్యసభకు అందజేసిన తర్వాత రాజ్యసభ సిఫారసులను లోక్ సభ స్వీకరించిన 14 రోజుల వ్యవధిలో సమ్మతించాలి, వాటిని బిల్లులో చేర్చాలిహేతువు ( R ) : ద్రవ్య బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టరాదు.
A) A, R రెండు విడివిడిగా సరైనవి మరియు R, A కు సరైన వివరణ
B) A, R రెండు విడివిడిగా సరైనవి కానీ R, A కు సరైన వివరణ కాదు
C) A సరైనది కానీ R తప్పు
D) A తప్పు కానీ R సరైనది
5. పార్లమెంటులోని ప్రతి సభ ఒక సమావేశం చివరి రోజుకు, తర్వాత సమావేశానికి ఖరారైన మొదటి రోజుకు మధ్య గరిష్ఠంగా ఎంతకాలానికి మించరాదు?
A) నాలుగు నెలలు B) ఐదు నెలలు
C) ఆరు నెలలు D) ఎనిమిది నెలలు
6. కింది వాటిని జతపరచండి.
పార్లమెంటరీ సాధనం సారాంశం
A) కోత తీర్మానం 1. అత్యవసర ప్రజా ప్రాముఖ్యం గల విషయం దృష్టిని తెచ్చుటకు
B) సావధాన తీర్మానం 2. మంత్రుల అసంపూర్ణ మరియు తప్పుడు సమాధానంవైపు స్పీకర్ దృష్టిని
C) హక్కుల తీర్మానం 3. బడ్జెట్ ప్రతిపాద నలలోని వ్యయ కు దింపునకు ప్రతిపాద నను ప్రారంభించడానికి
D) వాయిదా తీర్మానం 4. సాధారణ సభ వ్యవహారానికి అంతరాయం కలిగించుటకు
5. నిధుల కోసం డిమాండ్లపై చర్చను ముగించుటకు
A B C D
A) 3 1 2 4
B) 2 4 5 1
C) 3 4 2 1
D) 2 1 5 4
7. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
A) భారత ఉపరాష్ట్రపతి
B) లోక్సభ స్పీకర్
C) రాజ్యసభ చైర్మన్
D) భారత ప్రధానమంత్రి
8. ఏ సంవత్సరంలో రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేయబడింది?
A) 1920 B) 1921
C) 1922 D) 1923
9. భారతదేశంలో ఉన్న శాసనసభ విధానం?
A) కేంద్రంలోని ద్వి సభా విధానం
B) రాష్ర్టాల్లో ఏక సభ విధానం
C) కేంద్ర రాష్ట్ర స్థాయిలో తప్పనిసరిగా ద్విసభ విధానం
D) కేంద్రంలో ద్వి సభా విధానం కానీ రాష్ర్టాల్లో ద్వి సభా విధానం ఐచ్ఛికం
10.భారత రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం ఎందుకు?
A) పార్లమెంటులో సభ్యుడు
B) లోక్ సభ సభ్యునిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలు కలిగి ఉంటాడు
C) శాసన ప్రక్రియతో సంబంధం
కలిగి ఉండడం.
D) పై అన్ని సరైనవే
11. ఖాతా పై ఓటు (ఓట్ ఆన్ అకౌంట్) అంటే?
A) భారత సంచిత నిధికి ప్రభారమైన వ్యయాన్ని పార్లమెంట్ ఓటుకు సమర్పించబడదు
B) బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి ద్వారా సమర్పించబడే ప్రతిపాదన
C) పార్లమెంట్ సంయుక్త సమావేశానికి ముందు రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ప్రతిపాదన తీసుకురావడం
D) ఒకవేళ బడ్జెట్ 1 ఏప్రిల్ కు ముందు ఆమోదించబడకుంటే వ్యయానికి సరిపడా ఎంత నిధినైనా ముందస్తుగా మంజూరు చేసే అధికారం పార్లమెంటుకు కలదు
12. ద్రవ్య బిల్లుకు సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏది సరైనది కాదు?
A) దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్ట్టరాదు
B) ఒకవేళ బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని ప్రశ్న తలెత్తితే లోక్ సభ స్పీకర్ నిర్ణయం అంతిమం
C) ద్రవ్య బిల్లు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే రాష్ట్రపతి పార్లమెంట్ సంయుక్త సమావేశానికి పిలుపునిస్తారు
D) రాష్ట్రపతి సిఫారసుపై మినహా ద్రవ్యాదులను ప్రవేశపెట్టరాదు
13. రాజ్యసభకు లోక్ సభ తో సమానాధికారాలు ఏ సందర్భంలో ఉంటాయి?
A) నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే విషయంలో
B) ప్రభుత్వంను తొలగించడంలో
C) రాజ్యాంగం సవరించడంలో
D) కోత తీర్మానాలు చేయడంలో
14. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. రాజ్యసభలో సీట్ల కేటాయింపులను పూరించుటకు భారత రాజ్యాంగ నాలుగవ షెడ్యూల్లో పొందుపరిచిన నిబంధన అనుసారం కేంద్రపాలిత ప్రాంతాల మరియు రాష్ర్టాల ప్రతినిధుల ద్వారా భర్తీ చేయాలి
2. ప్రతి రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతంలో రాజ్యసభ ప్రతినిధులను రాష్ట్ర శాసనసభ మరియు కేంద్ర పాలిత ప్రాంతంలో శాసనసభగా వ్యవహరిస్తున్న సంఘంలో ఎన్నికైన సభ్యులు ఏక ఓటు బదిలీ మాధ్యమంగా నిష్పత్రిక ప్రాతినిధ్య వ్యవస్థ ద్వారా ఎన్నుకుంటారు
పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో సరైనది?
A)1 మాత్రమే B) 2 మాత్రమే
C) 1, 2 D) 1, 2 తప్పు
15. కింది వ్యాఖ్యల్లో ఏది రాజ్యసభ దృష్టిలో సరైనది?
A) ప్రతి మూడు సంవత్సరాల తర్వాత మూడింట ఒక వంతు దీని సభ్యులు
విరమణ చేస్తారు
B) ప్రతి మూడు సంవత్సరాల తర్వాత మూడింట రెండు వంతుల దీని సభ్యులు విరమణ చేస్తారు
C) ప్రతి రెండు సంవత్సరాల తర్వాత మూడింట రెండు వంతుల దీని సభ్యులు విరమణ చేస్తారు
D) ప్రతి రెండు సంవత్సరాల తర్వాత మూడింట ఒక వంతు దీని సభ్యులు
విరమణ చేస్తారు
సమాధానాలు
1. B 2. C 3. C 4. D
5. C 6. A 7. B 8. B
9. D 10. C 11. D 12. B
13. C 14. A 15. D
– ధరావత్ సైదులు నాయక్ సీనియర్ ఫ్యాకల్టీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, జహీరాబాద్ 9908569970
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు