దక్షిణాసియా ఉపగ్రహం ఎవరి కానుక?
జీఎస్ఎల్వీ: ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు ఇస్రో జీశాట్ 9 (దక్షిణాసియా ఉపహ్రం) ఉపగ్రహాన్ని నిర్మించింది. 2014లో తన ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాల నేతలను ప్రధాని ఆహ్వానించి ఒక ఉపగ్రహాన్ని కానుకగా ప్రకటించారు.
-దక్షిణాసియా దేశాలకు పరస్పర సమాచార వ్యవస్థను మెరుగుపర్చడానికి మొదట ఈ ఉపగ్రహానికి సార్క్ అని నామకరణం చేశారు. ఈ ప్రాజెక్టులో చేరేందుకు పాకిస్థాన్ నిరాకరించిడంతో సౌత్ ఏసియా శాటిలైట్ (సాస్ దక్షిణాసియా ఉపగ్రహం)గా పేరు మార్చారు.
-ఈ ఉపగ్రహం భారత అంతరిక్ష దౌత్యంలో తొలి అడుగు. దీంతో అందరితో కలిసి, అందరి అభివృద్ధి అనే నినాదాన్ని పొరుగుదేశాలకు విస్తరించాలనే భారత్ ఆకాంక్ష నెరవేరింది. ఇప్పటికే చంద్రయాన్, మంగళ్యాన్తోపాటు ఒకే రాకెట్లో 104 ఉపగ్రహాలను ఒకేసారి పంపి ఇస్రో చరిత్ర సృష్టించింది. జీశాట్ 9ని శ్రీహరికోట నుంచి 2017, మే 5న ప్రయోగించింది.
-జీఎస్ఎల్వీ ఎఫ్-09 రాకెట్ 17 నిమిషాల వ్వవధిలోనే జీశాట్ 9 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది. అంచనాలకు అనుగుణంగా భూమికి 36 వేల కిలోమీటర్ల దూరంలోని వృత్తాకారపు భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపారు. ఈ ఉపగ్రహం దక్షిణాసియాలోని 7 దేశాలకు 12 ఏండ్ల పాటు సేవలను అందించనున్నది.
-ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ ఉపగ్రహం దోహదపడుతుంది. జీఎస్ఎల్వీ వరుసలో ఇది 11వది. ఇందులో ఇస్రో శాస్త్రవేత్తలు 8 సార్లు విజయం సాధించారు.
-పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో వరుసగా 38 విజయాలు సాధించిన ఇస్రో, మరోసారి దేశీయంగా అభివృద్ధిపరిచిన క్రయోజనిక్ ఇంజిన్తో వరుసగా నాలుగోసారి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. 2014 జనవరి, 2015 ఆగస్టు, 2016 సెప్టెంబర్లలో వరుసగా క్రయోజనిక్ ఇంజిన్లు ఉపయోగించి హ్యాట్రిక్ సాధించింది.
-ఇస్రో మొదటిసారిగా జీశాట్ 9 ఉపహ్రంలో విద్యుత్ చోదక వ్యవస్థ (ఎలక్టికల్ ప్రొపల్షన్ సిస్టం)ను వినియోగించింది. దీనివల్ల కక్ష్యలో ఉపగ్రహస్థానాన్ని మార్చే అవకాశం ఉంది. ఇది 75 మిల్లీ న్యూటన్ల శక్తిని విడుదల చేయనుంది.
-ఈ ఉపగ్రహంలో 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు ఉన్నాయి. వాటిలో 6 కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులకు సేవలందించడంతో పాటు మిగతా ఆరు కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు భారతదేశానికి అవసరమైన సమాచార వ్యవస్థ బలోపేతానికి పనిచేసేవిధంగా ఇస్రో సామర్థ్యం పెంచుకోవడానికి జీశాట్ 9ని పొరుగుదేశాలు వాడుకోవచ్చు.
-ఈ ఉపగ్రహం వనరుల అన్వేషణ, టీవీ, వీశాట్, దూరవిద్య, దూరవైద్యం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో సేవలందించనుంది. దక్షిణాసియా దేశాల్లో భూకంపాలు, సైక్లోన్లు, వరదలు, సునామీలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.
-ఈ నేపథ్యంలో కీలకమైన సమాచారం, సంబంధాలు నెరవేర్చేందుకు సభ్యదేశాల మధ్య సురక్షితమైన హాట్లైన్ల ఏర్పాటుకు కూడా అవకాశం ఉంటుంది. జీశాట్ 9 వల్ల దక్షిణాసియాలో భూటాన్, మాల్దీవులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు