సామాజిక స్థరీకరణ అంటే ఏమిటి?
సమాజంలోని కొన్ని వర్గాలు ఏదో ఒక ప్రత్యేక కారణాలతో సామాజిక ప్రకియలో లేదా అభివృద్ధి ప్రక్రియలో విలీనం కానటువంటి ప్రత్యేక పరిస్థితులనే సామాజిక మినహాయింపు లేదా సామాజిక నెట్టివేత అంటారు.
-ఈ పదాన్ని మొదట వాడినవారు- రీన్ లెనోయిర్ (ఫ్రాన్స్)
-ఈ పదాన్ని భారతదేశ సందర్భంలో మొదటగా వాడినది -అమర్త్యసేన్
-దేశంలో కులం, మతం, తెగ, లింగ, ప్రాంత భేదం, వైకల్యం, వృద్ధాప్యం వంటి సాంఘిక నిర్మితుల వల్ల సమాజం నుంచి వెలికి గురైనవారు సరైన హక్కులను పొందలేకపోతున్నారు
-మానవ పరిణామ క్రమంలో భాగంగా సమాజంలో అధికారం, హోదా, సంపద పంపిణీలో కొన్ని వర్గాల పట్ల వివక్ష జరిగింది. ఫలితంగా ఈ వర్గాలు తీవ్రమైన వెనుకబాటుతనానికి గురయ్యాయి.
-దేశంలో సామాజిక మినహాయింపునకు ప్రధాన అంశం కులం.
సామాజిక అసమానతలు
-సమాజంలోని కొందరు మిగతా వారితో పోల్చితే ఎక్కువ శక్తియుక్తులను, సామర్థ్యాలను కలిగి ఉంటారు.
-ఈ సామర్థ్యాలు ఆర్థిక, విద్య, సాంస్కృతిక, రాజకీయపరమైనవి కావచ్చు.
-ఇదే సందర్భంలో కొందరు అల్ప శక్తియుక్తులను, సామర్థ్యాలను కలిగి ఉండవచ్చు. దీనివల్లే సమాజంలో అసమానతలు ఏర్పడ్డాయి.
-సమాజంలో ఈ అసమానతలు వల్ల కొన్ని అంతస్థులు లేదా స్థరాలు ఏర్పడును. దీన్నే సామాజిక స్థరీకరణ అంటారు.
సామాజిక మినహాయింపు-అమర్త్యసేన్ భావన
-అమర్త్యసేన్ అభిప్రాయం ప్రకారం సామాజిక మినహాయింపు అనేది రెండు రకాలు..
పూర్తిస్థాయి సామాజిక మినహాయింపు
-సమాజంలో పేదరికం, వలస వంటి విభిన్న కారణాలను చూపిస్తూ పూర్తిగా హక్కులు, రక్షణలు పొందలేని పరిస్థితిని పూర్తిస్థాయి సామాజిక మినహాయింపు అంటారు.
-సామాజిక మినహాయింపు: నెట్టివేయబడిన వర్గాలకు హక్కులు, రక్షణలు, భాగస్వామ్యం కల్పించినట్లయితే దాన్ని పాక్షిక సామాజిక మినహాయింపు అంటారు.
సామాజిక మినహాయింపు రకాలు
-రాజకీయ మినహాయింపు: రాజకీయ ప్రక్రియలు లేదా హక్కుల నుంచి, వ్యక్తులను లేదా వర్గాలను నెట్టివేయడం
-ఆర్థిక మినహాయింపు: ఆర్థిక ప్రక్రియల నుంచి నెట్టివేయడం, ఆర్థిక వనరులపై నియంత్రణ లేదా నిషేధం
-సామాజిక మినహాయింపు: సాంఘిక ప్రక్రియ, సామాజిక స్థాయిలో తగిన హోదా, భాగస్వామ్యం ఇవ్వకపోవడం
-సాంస్కృతిక మినహాయింపు: ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక సంబంధ విషయాల్లో నియంత్రణ లేదా నిషేధం
సామాజిక మినహాయింపు -నష్టాలు
-సామాజిక మినహాయింపు వల్ల విలువైన మానవ వనరులను స్వల్పంగా కానీ, భారీగాకానీ వినియోగించుకోలేక పోతున్నాయి.
-సామాజిక మినహాయింపునకు గురైన వ్యక్తులు అసంతృప్తికి లోనవుతున్నారు. దీని ఫలితంగా ఉద్యమాలు, తిరుగుబాట్లు, విప్లవాలు వచ్చి సామాజిక అనిశ్చితికి కారణం అవుతున్నాయి.
-సామాజిక మినహాయింపు పాటించే దేశాలు ప్రపంచ ర్యాంకింగ్లో వెనుకబడి, పెట్టుబడులు మందగిస్తాయి. దీనిఫలింతగా ప్రపంచీకరణలో వెనుకబాటుతనం ఏర్పడుతుంది.
-రెండో ప్రపంచ యుద్ధానంతరం సంక్షేమ భావనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో భారతదేశంలో కూడా సాంఘిక మినహాయింపు వల్ల పీడించిన వారికి కొన్ని ప్రత్యేకమైన హక్కులను ఏర్పాటుచేశారు.
కులం:
-Caste అనే ఇంగ్లిష్ పదం కాస్ట స్పానిష్, పోర్చుగీస్ పదం నుంచి వచ్చింది.
-Caste అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది-గార్సియా డీ ఓర్టా.
-Caste అంటే తెగ, సంతతి అని అర్థం.
-పరిమిత సమూహాలు, సన్నిహిత సంబంధాలు గల జనసమూహమే కులం- ఎం ఎన్ శ్రీనివాస్
-కులవ్యవస్థ హిందూసమాజ ప్రత్యేక లక్షణం
-ఒక కులంవారు, మరో కులంపై ఈర్ష్య, ద్వేషం, పక్షపాతాలను కలిగి ఉండే ప్రవర్తనే కులతత్వం అంటారు.
-కులతత్వానికి ప్రధానకారణం: కులపంచాయితీ
-కులతత్వానికి ఆయువుపట్టు- గ్రామాలు
-కులతత్వంలోని ముఖ్యాంశాలు- స్వకులాభిమానం, పరకుల ద్వేషం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు