జీవ కణాలన్నింటిలోకెల్లా అతి చిన్న కణం ఏది?
జీవశాస్త్రం – ప్రాథమిక అంశాలు
జీవశాస్త్రం – పరిచయం (Introduction of Biology)
- జీవులను గురించి లేదా జీవ రూపాలు (Life forms), జీవ ప్రక్రియలను (Living processes) గురించి వివరించే శాస్ర్తాన్ని జీవశాస్త్రం అంటారు.
- జీన్ లామార్క్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త 1809లో Biology అనే పదాన్ని ప్రతిపాదించాడు.
- సాధారణంగా మొక్కలు, జంతువులను కలిపి జీవులు అంటారు.
- మొక్కల గురించిన అధ్యయనాన్ని వృక్షశాస్త్రం (Botany) అని, జంతువుల గురించిన అధ్యయనాన్ని జంతుశాస్త్రం (Zoology) అని అంటారు.
- అరిస్టాటిల్ను జీవశాస్త్ర, జంతుశాస్త్ర పితామహుడు అని, థియోఫ్రాస్టస్ను వృక్షశాస్త్ర పితామహుడు అని అంటారు.
- భూమిపై మొదటగా ఏర్పడిన జీవి నీలి ఆకుపచ్చ శైవలం (సయనో బ్యాక్టీరియా)
జీవుల నామీకరణం (Nomenclature of Organisms)
- నిరంతరంగా గుర్తిస్తున్న కొత్త జీవులకు శాస్త్రీయంగా పేరుపెట్టడాన్ని నామీకరణం అంటారు.
- జీవులకు శాస్త్రీయ నామాలు ICBN (International Code for Botanical Nomenclature), ICZN (International Code for Zoological Nomenclature) ప్రకారం పెడుతారు.
- ప్రతి జీవికి అంతర్జాతీయంగా ఒకపేరు మాత్రమే ఉండేలాగా ICBN, ICZN నియమావళులు చూసుకుంటాయి.
ద్వినామ నామీకరణం (Binomial Nomenclature)
- ఒక జీవికి రెండు పదాలతో కూడిన పేరు పెట్టడాన్ని ద్వినామీకరణం అంటారు. దీన్ని ప్రవేశపెట్టినది కరోలస్ లిన్నేయస్.
- ఈ నామీకరణంలో జీవి శాస్త్రీయ నామంలో రెండు పదాలు ఉంటాయి. అవి.. ప్రజాతి (Genus), జాతి (Species).
- ఉదా: మాంజిఫెరా ఇండికా – మామిడి
- (ప్రజాతి) (జాతి) (వాడుక పేరు)
త్రినామ నామీకరణం (Trinomial Nomenclature)
- ఈ నామీకరణంలో జీవి శాస్త్రీయ నామంలో మూడు పదాలు ఉంటాయి. అవి ప్రజాతి, జాతి, ఉపజాతి (Sub-Species).
- ఉదా: కార్వోస్ స్లెండెన్స్ స్లెండెన్స్ – కాకి
- (ప్రజాతి) (జాతి) (ఉపజాతి) (వాడుక పేరు)
టాటోనిమీ (Toutonymy)
- శాస్త్రీయ నామంలో జాతి, ప్రజాతి పేర్లు ఒకే విధంగా ఉన్నట్లయితే అలాంటి నామాన్ని టాటోనిమీ అంటారు.
- ఉదా: ఏక్సిస్ ఏక్సిస్ – మచ్చల జింక
- (ప్రజాతి) (జాతి) – (వాడుక పేరు)
- నాజా నాజా – నాగుపాము
- (ప్రజాతి) (జాతి) – (వాడుక పేరు)
వర్గీకరణ శాస్త్రం (Taxonomy)
- జీవులను దగ్గరి లక్షణాల ఆధారంగా సమూహాలుగా చేయడాన్ని వర్గీకరణ (Classification) అని, దీని అధ్యయనాన్ని వర్గీకరణ శాస్త్రం అని అంటారు. – కరోలస్ లిన్నేయస్ను వర్గీకరణశాస్త్ర పితామహుడు అంటారు.
- జీవులను వర్గీకరించేటప్పుడు వర్గీకరణ ప్రమాణాలు లేదా స్థాయిలు (Levels or hierarachy of Calssification) కింది విధంగా ఉంటాయి.
- రాజ్యం (Kingdom)
- విభాగం/వర్గం (Division/Phylum)
- తరగతి (Class)
- క్రమం (Order)
- కుటుంబం (Family)
- ప్రజాతి (Genus)
- జాతి (Species)
- వర్గీకరణలో అతిపెద్ద ప్రమాణం రాజ్యం. అతిచిన్న/ప్రాథమిక/మూల ప్రమాణం జాతి.
- గమనిక: వర్గీకరణలో విభాగం (Division)ను మొక్కలకు, వర్గం (Phylum)ను జంతువులకు వాడుతారు.
జీవులను వర్గీకరించడానికి హెర్బేరియం, వృక్షశాస్త్ర ఉద్యానవనాలు, జంతుప్రదర్శన శాలలు, మ్యూజియంలు సహాయకాలుగా తోడ్పడుతాయి. - చాలామంది శాస్త్రవేత్తలు జీవులను వర్గీకరించారు. వారిలో లిన్నేయస్ 1735లో జీవులను రెండు రాజ్యాలుగా, 1866లో ఎర్నెస్ట్ హెకెల్ మూడు రాజ్యాలుగా, 1938లో కోప్లాండ్ జీవులను నాలుగు రాజ్యాలుగా, 1969లో రాబర్ట్ విట్టేకర్ ఐదు రాజ్యాలుగా వర్గీకరించారు.
- రాబర్ట్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త జీవులను మొనిరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, అనిమేలియా అనే ఐదు రాజ్యాలుగా
వర్గీకరించాడు.
ప్రశ్నలు
1. 1969లో రాబర్ట్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త జీవులను ఐదు రాజ్యాలుగా వర్గీకరించాడు. కింది వాటిలో విట్టేకర్ వర్గీకరణలోని రాజ్యాల్లో ఒకటి కానిది?
1) మొనిరా 2) ప్రొటిస్టా
3) ఫంగై 4) వెజిటేబిలియా
2. కింది వాటిని జతపర్చండి.
శాస్త్రం పితామహుడు
ఎ. జీవశాస్త్రం 1. కరోలస్ లిన్నేయస్
బి. జంతుశాస్త్రం 2. అరిస్టాటిల్
సి. వృక్షశాస్త్రం 3. థియోఫ్రాస్టస్
డి. వర్గీకరణశాస్త్రం 4. ఏపీ డీ కండోల్
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-2, బి-2, సి-3, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-1, బి-2, సి-3, డి-4
3. జీవుల నామీకరణకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించి సరైనదాన్ని గుర్తించండి?
ఎ. శాస్త్రీయ నామం లాటిన్ భాషలో ఉండి, ఇటాలిక్ భాషలో రాయాలి
బి. ప్రజాతి పేరు పెద్ద అక్షరంతో (Capital letter) రాయాలి
సి. జాతి పేరును చిన్న అక్షరంతో (Small letter) రాయాలి
డి. అదే చేతిరాతతో రాసినట్లయితే ప్రజాతి, జాతి పేర్ల కింద గీత గీయాలి
ఇ. శాస్త్రీయ నామం చివర ఆ జీవిని కనుగొన్న శాస్త్రవేత్త పేరును క్లుప్తంగా (abbreviated form) రాయాలి
1) ఎ, డి, ఇ 2) ఎ, బి, ఇ 3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి, డి, ఈ
4. టాటోనిమీ (Toutonymy)కి ఉదాహరణను గుర్తించండి.
1) ఏక్సిస్ ఏక్సిస్ 2) నాజా నాజా
3) ఫెలిస్ లియో 4) 1, 2
5. మొక్కలకు శాస్త్రీయ నామం కింది ఏ నియమావళి ప్రకారం పెడుతారు?
1) ICBN, ICZN 2) ICBN
3) ICZN 4) BSI
6. భూమిపై మొదట ఏర్పడిన జీవి ఏది?
1) అనబీన 2) యూగ్లినా
3) అగారికస్ 4) సయనోబ్యాక్టీరియా
7. నిశ్చితం (ఎ): వర్గీకరణ విధానంలో జీవుల అమరిక రాజ్యం నుంచి ప్రారంభమవుతుంది.
కారణం (ఆర్): వర్గీకరణలో మొక్కలకు విభాగంను, జంతువులకు వర్గంను వాడుతారు.
1) ఎ, ఆర్ రెండూ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది కానీ ఆర్ సరైనది కాదు
4) ఎ సరైనది కాదు కానీ ఆర్ సరైనది
8. నిశ్చితం (ఎ): వర్గీకరణలో అతిపెద్ద ప్రమాణం రాజ్యం.
కారణం (ఆర్): వర్గీకరణలో అతిచిన్న/ప్రాథమిక ప్రమాణం జాతి
1) ఎ, ఆర్ రెండూ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది కానీ ఆర్ సరైనది కాదు
4) ఎ సరైనది కాదు కానీ ఆర్ సరైనది
9. కింది వాటిలో వర్గీకరణకు తోడ్పడే సహాయకం ఏది?
1) హెర్బేరియం 2) జంతుప్రదర్శన శాల
3) వృక్షశాస్త్ర ఉద్యాన వనాలు 4) 1, 2, 3 ఐశ్చికాలు
10. కిందివాటిలో ఏది అతిపెద్ద హెర్బేరియంను కలిగి ఉన్నది?
1) రాయల్ బొటానికల్ గార్డెన్ – క్యూ (Kew)
2) ఇండియన్ బొటానికల్ గార్డెన్ – హౌరా
3) నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ – లక్నో
4) పైవన్నీ
11. వర్గీకరణకు సంబంధించి వర్గీకరణ ప్రమాణాలు/స్థాయిల వరుసక్రమం ఏది?
1) రాజ్యం, తరగతి, విభాగం/వర్గం, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి
2) రాజ్యం, విభాగం/వర్గం, తరగతి, కుటుంబం, క్రమం, ప్రజాతి, జాతి
3) రాజ్యం, విభాగం/వర్గం, తరగతి, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి
4) రాజ్యం, తరగతి, విభాగం/వర్గం, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి
12. కిందివాటిని జతపర్చండి?
జాబితా-1 జాబితా-2
ఎ. జాతి 1. జాన్ రే
బి. రెండు రాజ్యాల వర్గీకరణ 2. లిన్నేయస్
సి. మూడు రాజ్యాల వర్గీకరణ 3. ఎర్నెస్ట్ హెకెల్
డి. నాలుగు రాజ్యాల వర్గీకరణ 4. కోప్లాండ్
ఇ. రెండు సామ్రాజ్యాల వర్గీకరణ 5. చాటన్
13. నిశ్చితం (ఎ): మొనిరా రాజ్యంలో కేంద్రకపూర్వ జీవులను చేర్చారు
కారణం (బి): మొనిరా రాజ్యానికి ఉదాహరణ బ్యాక్టీరియా, మైకోప్లాస్మా
1) ఎ, ఆర్ రెండూ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్ రెండూ సరైనవి, ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైనది కానీ ఆర్ సరైనది కాదు
4) ఎ సరైనది కాదు కానీ ఆర్ సరైనది
14. జీవ కణాలన్నింటిలోకెల్లా అతిచిన్న కణం ఏది?
1) అండకణం 2) మైకోప్లాస్మా
3) ఎర్రరక్త కణం 4) తెల్లరక్త కణం
15. కింది వాటిలో వృక్ష రాజ్యానికి సంబంధం లేనివి?
1) ప్రొటొజొవా 2) బ్యాక్టీరియా
3) హెల్మెంథిస్ పరాన్న జీవులు 4) పైవన్నీ
సమాధానాలు
1-4, 2-2, 3-4, 4-4, 5-2, 6-4,
7-2, 8-2, 9-4, 10-1, 11-3, 12-1,
13-2, 14-2, 15-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు