ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యశిక్షణ
#ఐసీఐసీఐతో కళాశాల విద్యా శాఖ ఎంఓయూ
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించనున్నారు. అందుకు ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ సంస్థతో కళాశాల విద్య అధికారులు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నారు. బుధవారం ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ సౌత్ అండ్ ఈస్ట్ ఆపరేషన్స్ హెడ్ సాకేత్‌కుమార్, కళాశాల విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు.
హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఐసీఐసీఐ అకాడమీ ఫర్ స్కిల్స్ సెంటర్ ద్వారా ప్రస్తుతం 2వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. శిక్షణానంతరం ప్లేస్‌మెంట్స్ కల్పిస్తారు. కార్యక్రమంలో కళాశాల విద్య ఆర్జేడీ యాదగిరి, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ దాశరథి తిరువెంగళాచారి, ఐసీఐసీఐ సంస్థ ప్రతినిధులు బీకే వెంకటేశ్, ఎస్ గిరీశ్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు