దేహానికి ఆకృతి.. అవయవాలకు రక్షణ!
మానవుడి దేహంలోని మొత్తం ఎముకలన్నింటినీ అస్థిపంజర వ్యవస్థ అంటారు. అస్థిపంజరం ఎముకలతో నిర్మిత మైన చట్రం. దీనిలో కొన్ని మృదులాస్థి నిర్మాణాలు కూడా ఉంటాయి. దేహ భాగాలకు నిర్దిష్టమైన ఆకృతి, దృఢత్వా న్ని, మెదడు, గుండె, ఊపిరితిత్తులకు రక్షణనిస్తూ శరీర కదలికల్లో అస్థిపంజర వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
అస్థి పంజర వ్యవస్థ
– అస్థిపంజరం అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు. ఎముకల్లో ఉండే ప్రొటీన్‌ను ఆస్టిన్ అంటారు.
-మానవుడి అస్థిపంజరంలో 206 ఎముకలు ఉంటాయి.
– ఎముకలను ఏర్పరిచే కణాలు ఆస్టియోసైట్స్.
– ఎముకల్లో ఉండే మూలకాలు కాల్షియం, పాస్ఫరస్.
– ఎముకల్లో కాల్షియం పాస్ఫేట్ ఎక్కువగా, కాల్షియం కార్బొనేట్ తక్కువగా ఉంటుంది. కాల్షియం ఎముకకు దృఢత్వాన్నిస్తుంది.
-మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం కాల్షియం.
-పాలు, గుడ్లు, ఆకుకూరల్లో కాల్షియం అధికంగా లభిస్తుంది.
– విటమిన్-డి కూడా చర్మం, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
– ఎముకల మధ్యభాగంలో అస్థిమజ్జ ఉం టుంది. ఎరుపు రంగు అస్థిమజ్జ ఎర రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది.
– పక్షుల రెక్కల ఎముకల్లో అస్థిమజ్జ ఉండదు. వీటిలో గాలి ఉంటుంది. వీటిని వాతులాస్థులు (న్యుమాటిక్ బోన్స్) అంటారు. పక్షుల్లో ఎర రక్తకణాలను ఉత్పత్తి చేసే భాగం బర్సా.
అస్థిపంజరం రెండు రకాలుగా ఉంటుంది. అవి
1. బాహ్యాస్థిపంజరం.
2. అంతరాస్థిపంజరం.
బాహ్య అస్థిపంజరం
-బాహ్య అస్థి పంజరం జీవి దేహం బయట ఉంటుంది.
– వివిధ జీవుల్లో బాహ్యాస్థిపంజరం
చేపలు- పొలుసులు
పక్షులు- ఈకలు
నత్తలు, ఆల్చిప్పలు, ప్రవాళాలు
(కోరల్స్)- కర్పరం
కీటకాలు- స్ల్కీరైట్స్
సకశేరుకాలు- చర్మం, రోమాలు, నఖాలు, కొమ్ములు, గిట్టలు మొదలైనవి. వీటిలో ఉండే ప్రొటీన్ ఆల్ఫాకెరోటిన్.
నోట్: క్యారెట్‌లోని విటమిన్-ఎ ను బీటా కెరోటిన్ అంటారు.
-గోర్లను కత్తిరించినప్పుడు నొప్పి, బాధ అనిపించకపోవడానికి కారణం అవి మృత కణజాలంతో తయారై కొమ్ము వంటి పదార్థంతో ఏర్పడటమే.
అంతర అస్థిపంజరం
– అంతర అస్థిపంజరం దేహం లోపల ఉంటుంది. అస్థిపంజరంలోని ఎముకలు రెండు రకాలు
అవి. మృదులాస్థి, అస్థి
మృదులాస్థి
– మెత్తగా ఉండే ఎముకలను మృదులాస్థి ఎముకలు అంటారు.
-పిండదశలో ఎముకలన్నీ మృదులాస్థి నిర్మితాలు. శిశువు ఎదిగిన తర్వాత ఈ మృదులాస్థులు అస్థులుగా రూపొందుతాయి.
– మృదులాస్థిలో ఉండే ప్రొటీన్ కాండ్రిన్.
-మృదులాస్థి అధ్యయనాన్ని కాండ్రాలజీ అంటారు.
మానవ దేహంలో మృదులాస్థి ఉండే భాగాలు
-ముక్కు కొన (నాసికాగ్రం)
– వెలుపలి చెవి
-వాయునాళంలోని ‘సి’ ఆకారపు ఉంగరాలు
-కొండ నాలుక
-అంగిలి (ఇది నాసికా కుహరం, ఆస్యకుహరాన్ని వేరు చేస్తుంది)
-సొర చేప అస్థిపంజరం పూర్తిగా మృదులాస్థితోనే నిర్మితమై ఉంటుంది. ఇలాంటి చేపలను మృదులాస్థి చేపలు అంటారు.
నోట్: షార్క్ చేపల కాలేయ నూనెలో విటమిన్-ఎ, డి పుష్కలంగా లభిస్తాయి.
అస్థి
-అస్థి అంటే దృఢంగా ఉండే ఎముక.
– చిన్నపిల్లల్లో 300 పైగా ఎముకలు ఉంటాయి.
– మానవుడి శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య 206
– తలలోని ఎముకల సంఖ్య -22
-కాళ్లలో ఉండే ఎముకల సంఖ్య- (30X2)= 60
-చేతుల్లో ఉండే ఎముకల సంఖ్య- (30X2)= 60
– వెన్నుపూసలో ఉండే ఎముకల సంఖ్య- 26
– నాలుక కింది ఎముకల సంఖ్య- 1
– చెవిలోని మొత్తం ఎముకల సంఖ్య- 3X2=6
– పక్కటెముకలు- 12X2=24
* రొమ్ము ఎముక – 1
* కటి వలయం- 2
భుజ వలయం- 4 (రెండు జతలు)
– మొత్తం = 206
– శైశవ దశలో 33 వెన్నుపూసలుంటాయి. తర్వాత వాటిలో చివరి 9 వెన్నుపూసలు (ఐదు కలిసి ఒక త్రికంగా, నాలుగు కలిసి అనుత్రికంగా) రెండు వెన్నుపూసలుగా ఏర్పడతాయి. కాబట్టి పెద్దవారిలో ఉండే మొత్తం వెన్నుపూసల సంఖ్య- 26
– తలలోని ఎముకల గూడును పురె అంటారు. పురెలో మెదడు ఉండే పెట్టె వంటి నిర్మాణం కపాలం (క్రీనియం).
-కపాలం అధ్యయనాన్ని క్రీనియాలజీ అంటారు.
-కపాలంలోని ఎముకలు- 8
-ముఖంలో ఎముకలు- 14
-పురెలో కదిలే ఎముక- 1
-పురెలో కదలని ఎముకలు- 21
– మానవ దేహంలో అతిపెద్ద ఎముక- ఫీమర్ (తొడ ఎముక)
-అతి చిన్న ఎముక- స్టేపిస్ (కర్ణాంతరాస్థి)
-పురెలో అతి దృఢమైన ఎముక- కింది దవడ (మాండిబ్యూల్)
-అతి మెత్తని ఎముక- మృదులాస్థి
చేతి ఎముకలు
– ప్రతి చేయిలో 30 ఎముకలుంటాయి.
-చేయిలో మూడు భాగాలుంటాయి.
1. పైచేయి (భుజాస్థి ఎముక-హ్యూమరస్ -1)
2. ముంజేయి (రత్ని, అరత్ని ఎముకలు- 2)
3. హస్తం (మణిబంధాస్థులు-8, కరబాస్థులు- 5, చేతివేళ్లు- 14)
నోట్: రాస్తున్నప్పుడు పెన్నుకు ఆధారిన్నిచ్చే చేతి వేళ్ల ఎముకలను ఫాలింజెస్ అంటారు.
కాలు ఎముకలు
– ప్రతి కాలులో 30 ఎముకలుంటాయి. కాలులో మూడు భాగాలుంటాయి.
1. తొడ (ఫీమర్)- 1
2. మోకాలు: టిబియా, ఫిబులా (అంతర్జంగిక, బహిర్జంగిక- 2)
3. పాదం (చీలమండలం-టార్సల్స్-7, ప్రపాదాస్థులు -మెటాటార్సల్స్-5, కాలివేళ్లు- ఫాలింజస్- 14, మోకాలి చిప్ప-పటెల్లా-1)
-ఉరో మేఖల (పెక్టోరియల్ గిరిల్డ్): ఇది చేతులను అంటిపెట్టుకుని ఉంటుంది. ఉరోమేఖల/భుజ వలయంలో రెండు ఎముకలుంటాయి. అవి. జతృక (కాలర్ బోన్), అంస ఫలకం (స్కాపులా) ఇది త్రిభుజాకారంలో ఉంటుంది.
ఉరఃపంజరం: ఉరోస్థి ముందు వైపు (రొమ్ము ఎముక), పక్కటెముకల ఇరువైపులా, వెన్నెముక వెనుకవైపు ఉండి గుండె, ఊపిరితిత్తులను రక్షిస్తుంది.
శ్రోణి మేఖల (ఫెళ్విన్ గిరిల్డ్): ఇది కాలి ఎముకలను అంటుకొని ఉదరం కింది భాగంలో ఉంటుం ది. కూర్చోవడానికి ఉపయోగపడుతుంది.
కీళ్లు
– రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని కీలు అంటారు. రెండు ఎముకలను బంధించే కొల్లాజెన్ పోగులను లిగ్మెంట్ (స్నాయువు) అంటారు.
– ఎముకను కండరంతో బంధించే కొల్లాజెన్ పోగును టిండాన్ (స్నాయు బంధనం) అంటారు.
-కీళ్ల మధ్యలో సైనోవియల్ కుహరం ఉంటుంది. దీనిలో సైనోవియల్ ద్రవం ఉంటుంది. సైనోవియల్ ద్రవం కీళ్ల కదలికలో కందెనలా ఉపయోగపడుతుంది.
-ఎముకలు, దేహం కదలడానికి కీళ్లు తోడ్పడుతాయి.
-కీళ్ల అధ్యయనాన్ని ఆర్థాలజీ అంటారు.
– శరీరంలో మొత్తం 230 కీళ్లు ఉంటాయి. కీళ్ల, ఎముకల వైద్య నిపుణుడిని ఆర్థోపెడిక్ డాక్టర్ అంటారు.
కీళ్లు రెండు రకాలు
1. కదలని (స్థిరమైన కీళ్లు) కీళ్లు: పుర్రెలో పైదవడ, కపాలానికి మధ్య ఉండేవి కదలని కీళ్లు.
2. కదిలే కీళ్లు: పుర్రెలో కింది దవడలోనివి కదిలే కీళ్లు.
కదిలే కీళ్లు నాలుగు రకాలు
బొంగరపు కీలు: ఇది మెడలో పురె, వెన్నెముక కలిసే ప్రాంతంలో ఉంటుంది.
– మెడలో 7 ఎముకలు ఉంటాయి. బొంగరపు కీలు చేసే కోణం 180 డిగ్రీలు
నోట్: భరత నాట్యం చేసే వారిలో ఈ కీలు ఎక్కువగా ఉపయోగపడుతుంది.
బంతి గిన్నె కీలు: ఇది భుజం- దండ చేయి, తొడ- కటి వలయం ప్రాంతంలో ఉంటుంది.
– ఈ కీళ్లు చేసే కోణం 360 డిగ్రీలు.
నోట్: చేతులు, కాళ్లను ఈ కీలు వృత్తాకారంగా (గుండ్రంగా) తిప్పుతుంది.
మడతబందు కీలు: ఇది మోచేయి, మోకాలు, కాలు, చేతివేళ్ల మధ్య ఉంటుంది. ఈ కీలు చేసే కోణం 90 డిగ్రీలు.
నోట్: ఈ కీళ్లు మోచేయి, మోకాలును ఒకేవైపు వంచుతుంది. తలుపులు, కిటికీలకు బంధించే నిర్మాణాలు మడత బందులు.
జారుడు కీలు: ఇది వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య పక్కటెముకలు, మణికట్టులో ఉంటుంది.
నోట్: తాళం వేసేటప్పుడు, తీసేటప్పుడు, ఉచ్ఛాస, నిశ్వాస సమయంలో అవసరమయ్యే కీళ్లు జారడు కీళ్లు.
– నేల మీద ఉన్న వస్తువును వంగి తీసుకునేటప్పుడు ఉపయోగపడేవి జారుడు కీళ్లు.
గమనిక: ఎముకలను నిర్వాత స్వేదనం చేసి ఎముకల బొగ్గును తయారుచేస్తారు. ఎముకల బొగ్గును చక్కెర పరిశ్రమలో విరంజనకారి (డీ కలరింగ్ ఏజెంట్) గా ఉపయోగిస్తారు.
ఎముకలు, కీళ్ల వ్యాధులు-లక్షణాలు
ఆర్థరైటిస్: కీళ్లవాపునే ఆర్థరైటిస్ అంటారు. దీని నివారణకు తేనెటీగల విషాన్ని ఔషధంగా వాడుతారు.
సర్వికల్ స్పాండిలైటిస్: మెడనొప్పి
ఆస్టియో ఆర్థరైటిస్ : కీళ్ల నొప్పి
రుమటాయిడ్ ఆర్థరైటిస్: సైనోవియల్ ద్రవం లోపంతో వచ్చే కీళ్ల నొప్పి
ఆస్టియోపోరోసిస్: ఎముకలు పెలుసుగా మారడం.
గౌట్ వ్యాధి: కీళ్ల వాపు
రికెట్స్ వ్యాధి: విటమిన్- డి లోపం వల్ల చిన్నపిల్లల్లో ఎముకలు వంగి పోవడం.
ఆస్టియో మలేషియా: విటమిన్- డి లోపంతో పెద్దవారిలో ఎముకలు పెలుసుగా మారడం.
ఫ్లోరోసిస్: ఫ్లోరిన్ నీటితో దంతాలు పసుపు రంగులోకి, ఎముకలు వికృత రూపంలోకి మారడం.
సైనోవిటిస్: చికున్ గున్యా వ్యాధి వల్ల కీళ్ల వాపు. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి.
గమనిక:
1. ఎముకలు దృఢంగా ఉండటానికి కారణం కాల్షియం, పాస్ఫరస్.
2. ఎముకలో కాల్షియం ఎక్కువగా కాల్షియం పాస్ఫేట్, కాల్షియం కార్బొనేట్ రూపంలో ఉంటుంది.
3. కాల్షియం మానవుడి శరీరంలో ఎక్కువ శాతం ఉండే మూలకం.
4. కాల్షియం ముఖ్య విధులు: కండర సంకోచం, స్త్రీలలో పాల ఉత్పత్తి
5. పాస్ఫరస్ ముఖ్య విధులు: డీఎన్ఏకు వెన్నెముకగా తోడ్పడుతుంది. ఏటీపీని తయారు చేయడం.
ప్రాక్టీస్ బిట్స్
1. మానవుడి చేయిలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? (4)
1) 20 2) 25 3) 28 4) 30
2. కింది వాటిని జతపరచండి. (3)
ఎ. బంతిగిన్నె కీలు 1. మెడ
బి. మడతబందు కీలు 2. మణికట్టు
సి. బొంగరపు కీలు 3. మోచేయి
డి. జారుడు కీలు 4. తుంటి కీలు
1) ఎ-4, బి-1, సి-3, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-1, బి-2, సి-3, డి-4
3. అక్షాస్థి పంజరంలో భాగమైన ఎముక ఏది? (4)
1) ఉరోమేఖల 2) శ్రోణిమేఖల
3) పూర్వాంగ ఎముకలు
4) ఉరోస్థి
4. మానవుడి కాలులో ఉండే మొత్తం ఎముకలు ఎన్ని? (3)
1) 25 2) 20
3) 30 4) 28
5. మానవ దేహంలో అతిపొడవైన, బరువైన ఎముక ఏది? (2)
1) భుజాస్థి 2) ఫీమర్
3) జంఘిక 4) రత్ని
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు