ఏ కేసులో తొలిసారి న్యాయసమీక్ష అధికారాన్ని వినియోగించింది?
31. సుఖ్‌దేవ్ సింగ్ Vs భగత్ రాం(1975) కేసులో సుప్రీంకోర్టు దేనిని రాజ్యం/ రాజ్య సంస్థగా పేర్కొన్నది?
1) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్
2) ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్
3) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
4) వాలంటరీ ఆర్గనైజేషన్స్
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 2, 4 డి) 2, 3, 4
32. పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఆదేశాలను న్యాయస్థానం జారీ చేయరాదని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది?
ఎ) టి.ఎం.ఎ. పాయ్ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు
బి) శంకరి ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
సి) ఎ.ఆర్. అంతూలే Vs ఆర్.ఎస్.నాయక్ కేసు
డి) నందినీ శతపతి Vs స్టేట్ ఆఫ్ ఒరిస్సా కేసు
33. ఆర్టికల్ 16కు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 16(1) – ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పౌరులందరికీ సమాన అవకాశాలు
2) ఆర్టికల్ 16(2) – ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో 7 రకాల వివక్షతలు నిషేధం
3) ఆర్టికల్ 16(3) – ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్థానికులకు ప్రాధాన్యతను కల్పిస్తూ పార్లమెంటు చట్టం రూపొందించ గలదు
4) ఆర్టికల్ 16(4) ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు.
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 1, 2, 4
34. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 13 ప్రకారం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన శాసనాలు చెల్లుబాటు కావు
2) ఆర్టికల్ 13(1) ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే అంతవరకు అమల్లో ఉన్న చట్టాల్లో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే నిబంధనలు ఉంటే ఆ మేరకు ఆ చట్టాలు చెల్లుబాటు కావు
3) ఆర్టికల్ 13(2) ప్రకారం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ప్రభుత్వం ఎలాంటి చట్టాలను రూపొందించరాదు
4) ఆర్టికల్ 13(3) ప్రకారం శాసనం/ చట్టం అనే పదాన్ని నిర్వచించారు
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 4
35. ప్రభుత్వ రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్లు, ప్రభుత్వం గుర్తించిన చట్టబద్ధత ఉన్న ప్రజల ఆచార వ్యవహారాలను శాసనాలుగా గుర్తించవచ్చునని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
ఎ) ఆర్టికల్ 13(1) బి) ఆర్టికల్ 13(2)
సి) ఆర్టికల్ 13(3) డి) ఆర్టికల్ 13(4)
36. ఆర్టికల్ 13(1) ప్రకారం శాసనం/చట్టం అంటే ?
1) ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్స్
2) ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్ర గవర్నర్ జారీచేసే ఆర్డినెన్స్
3) పార్లమెంటు రూపొందించిన శాసనం
4) రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనం
ఎ) 1, 2 బి) 3, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 3, 4
37. ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగానికి ఆర్టికల్ 13(4)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చింది?
ఎ) 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
బి) 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
సి) 26వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
డి) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
38. సుప్రీంకోర్టు తొలిసారిగా న్యాయసమీక్ష (judicial Review) అధికారాన్ని ఏ కేసు సందర్భంగా వినియోగించింది.
ఎ) చంపకం దొరై రాజన్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు
బి) బాబులాల్ పరాటే Vs స్టేట్ ఆఫ్ బాంబే
సి) శంకరీ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియ కేసు
డి) మినర్వామిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
39. ఆర్టికల్ 368 ప్రకారం జరిగే రాజ్యాంగ సవరణ చట్టాలు ఆర్టికల్ 13 పరిధిలోకి రావని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
ఎ) ఆర్టికల్ 13(1) బి) ఆర్టికల్ 13(2)
సి) ఆర్టికల్ 13(3) డి) ఆర్టికల్ 13(4)
40. గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఏ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు సవాల్ చేయడం జరిగింది?
ఎ) 17వ రాజ్యాంగ సవరణ చట్టం
బి) 21వ రాజ్యాంగ సవరణ చట్టం
సి) 24వ రాజ్యాంగ సవరణ చట్టం
డి) 25వ రాజ్యాంగ సవరణ చట్టం
41. ఆర్టికల్ 368 ప్రకారం జరిపే రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా ఆర్టికల్ 13 పరిధిలోకి వస్తాయని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా రాజ్యాంగ సవరణలు చేసే హక్కు పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా కీలకమైన తీర్పునిచ్చింది?
ఎ) ఎస్.ఆర్.బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
సి) సజ్జన్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు
డి) బేలా బెనర్జీ Vs స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్ కేసు
42. ప్రభుత్వం రూపొందించిన శాసనాల్లో ఏదైనా భాగంగాని, నియమం గాని ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, వ్యతిరేకంగా ఉన్న భాగం/నియమాన్ని మాత్రమే వేరుచేసి అది చెల్లుబాటు కాదని న్యాయస్థానం తీర్పు ఇవ్వడాన్ని ఏమంటారు?
ఎ) Doctrine of Introvert
బి) Doctrine of Individuality
సి) Doctrine of Separability
డి) Doctrine of Decade
43. మిథు Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని ఏ సెక్షన్ ప్రాథమిక హక్కుల్లోని సమానత్వపు హక్కుకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పు నివ్వడంతో దాన్ని తొలగించారు?
ఎ) సెక్షన్ 302 బి) సెక్షన్ 303
సి) సెక్షన్ 304 డి) సెక్షన్ 305
44. చట్టసభలు రూపొందించిన శాసనాలు రాజ్యాంగ వ్యతిరేకమని న్యాయస్థానాలు తీర్పునిచ్చిన తర్వాత కూడా, అదే శాసనాన్ని మార్పులు, చేర్పులు చేసి శాసనంగా తీసుకువస్తే ప్రత్యక్షంగా ఒప్పు కానిది పరోక్షంగా కూడా ఒప్పు కాదని పేర్కొనడాన్ని కింది విధంగా చెప్పవచ్చు?
ఎ) Colourable legislation
బి) Colourable liality Vs
సి) legislation with Decade
డి) Legislation Docket
45. సుప్రీంకోర్టు తొలిసారిగా Colourable legislation గురించి ఏ కేసు సందర్భంగా పేర్కొన్నది?
ఎ) సజ్జనార్ రీతు దేశాయ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
బి) నారాయణ్ దేవ్ Vs స్టేట్ ఆఫ్ ఒరిస్సా కేసు
సి) ప్రపుల్లకుమార్ మహంత్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) నందినీ శతపతి Vs స్టేట్ ఆఫ్ ఒరిస్సా కేసు
46. Doctrine of Eclipse (గ్రహణ సిద్ధాంతం) గురించి సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొన్నది?
ఎ) రణదేవ్ ఖుల్లాన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) బాలాజీ రాఘవన్ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు
సి) భికాజీ నారాయణ్ Vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్
డి) రాజ్ నారాయణ్ సింగ్ Vs ఇందిరాగాంధీ కేసు
47. Doctrine of waiver (హక్కులను వదులుకునే సిద్ధాంతం) గురించి సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొన్నది
ఎ) బేహారం Vs స్టేట్ ఆఫ్ బాంబే కేసు
బి) మునిస్వామి అయ్యర్ Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు
సి) రణబీర్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
డి) దిశా మిశ్రా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
48. రాజ్యాంగం అమల్లోకి రాకముందు చేసిన శాసనాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం కొనసాగించడాన్ని ఏమంటారు?
ఎ) గ్రహణ సిద్ధాంతం (Doctrine of Eclipse)
బి) అధికార పృథక్కరణ సిద్ధాంతం (Doctrine of Separation)
సి) పరిత్యజించే సిద్ధాంతం (Doctrine of Waiver)
డి) తప్పించుకునే సిద్ధాంతం (Doctrine of Escape)
49. ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ప్రారంభ భారత రాజ్యాంగంలో 7 రకాల ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు
2) ప్రస్తుతం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు 6 రకాలుగా ఉన్నాయి
3) ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఇందిరాగాంధీ ప్రభుత్వం తొలగించింది
4) ప్రాథమిక హక్కుల రక్షణకు న్యాయస్థానాలు జారీచేసే ఆదేశాలను రిట్స్ అంటారు
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 3, 4
50. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు వాటి వివరణకు సంబంధించిన ఆర్టికల్స్‌లో సరైన జవాబును గుర్తించండి?
a) స్వేచ్ఛా, స్వాతంత్య్ర హక్కు i) ఆర్టికల్ 23 నుంచి 24
b) పీడనాన్ని నిరోధించే హక్కు ii) ఆర్టికల్ 32
c) రాజ్యాంగ పరిహారపు హక్కు iii) ఆర్టికల్ 19 నుంచి 22
d) సమానత్వపు హక్కు iv) ఆర్టికల్ 14 నుంచి 18
ఎ) a-iii, b-i, c-ii, d-iv
బి) a-i, b-iii, c-ii, d-iv
సి) a-iii, b-i, c-iv, d-ii
డి) a-ii, b-i, c-iii, d-iv
51. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు, వాటి వివరణకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
a) ఆస్తి హక్కు i) ఆర్టికల్ 29 నుంచి 30
b) విద్యా సాంస్కృతిక హక్కు ii) ఆర్టికల్ 25 నుంచి 28
c) మతస్వాతంత్య్రపు హక్కు iii) ఆర్టికల్ 31
ఎ) a-ii, b-i, c-iii
బి) a-iii, b-ii, c-i
సి) a-iii, b-i, c-ii
డి) a-i, b-iii, c-ii
52. రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం వంటిదని ఎవరు వాఖ్యానించారు?
ఎ) పాల్ ఆపిల్ బీ
బి) డా. బి.ఆర్. అంబేద్కర్
సి) అనంత శయనం అయ్యంగార్
డి) డా. బాబు రాజేంద్ర ప్రసాద్
53. ‘సమానత్వపు హక్కు’కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 14(ఎ) – చట్టం దృష్టిలో సమానత్వం గురించి వివరిస్తుంది
2) ఆర్టికల్ 14(బి) – చట్టం మూలంగా సమానత్వం గురించి వివరిరిస్తుంది
3) ఆర్టికల్ 14(సి) చట్టం, సమన్వయం గురించి వివరిస్తుంది
4) ఆర్టికల్ 361 – రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లకు గల ప్రత్యేక రక్షణ, మినహాయింపులు గురించి వివరిస్తుంది
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 2, 4
54. సమానత్వపు హక్కుకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) చట్టం మూలంగా సమాన రక్షణ అనే భావనను అమెరికా నుంచి గ్రహించారు
బి) చట్టం దృష్టిలో సమానత్వం అనే భావనను బ్రిటన్ నుంచి గ్రహించారు
సి) అమెరికాలో అమల్లో ఉన్న The Rule of Law ఆధారంగా భారత్‌లో సమానత్వపు హక్కును పొందుపరిచారు
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 3, 4
55. సమాన పరిస్థితుల్లో మాత్రమే సమానత్వాన్ని వర్తింప చేయవచ్చునని, సమానులలో మాత్రమే సమానత్వం అమలు పరచడం జరుగుతుందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
ఎ) శంకరీ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) చిరంజిత్ లాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) దేవీలాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) అశోక్ కుమార్ ఠాకూర్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు
56. ఆర్టికల్ 14(3) ప్రకారం మనదేశ రాజ్యాంగంలో కింది అంశాన్ని వివరించారు?
ఎ) చట్టం ముందు / చట్టం దృష్టిలో ప్రజలందరూ సమానులే
బి) చట్టం కారణంగా కొన్ని రకాల వివక్ష తొలగింపు
సి) చట్టం ఆధారంగా సమాన రక్షణలు
డి) పైవన్నీ సరైనవే
57. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం ఏ రకమైన వివక్ష నిషేధం?
ఎ) కుల, మత, ప్రాంత, ఆస్థి సంబంధమైన వివక్ష
బి) కుల,మత, జాతి, లింగ, జన్మసంబంధమైన వివక్ష
సి) కుల, జాతి, ప్రాంత, ఆదాయ, మత సంబంధమైన వివక్ష
డి) జాతి, ప్రాంత, నివాస, లింగ సంబంధమైన వివక్ష
58. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 15(1) – కేవలం కుల, మత, జాతి లింగ, జన్మ సంబంధమైన అంశాల ప్రాతిపదికపై ఏ వ్యక్తినీ ప్రభుత్వం వివక్షకు గురిచేయరాదు
బి) ఆర్టికల్ 15(2) కేవలం కుల, మత, జాతి, లింగ జన్మసంబంధమైన కారణాలతో వ్యక్తులను బహిరంగ, పబ్లిక్ ప్రదేశాల్లో ప్రవేశాన్ని నిరాకరించరాదు.
సి) ఆర్టికల్ 15(3) మహిళలు, బాలబాలికలకు కల్పించే ప్రత్యేక రక్షణను వివక్షగా పరిగణించరాదు
డి) ఆర్టికల్ 15(4) సాయుధ దళాల సిబ్బందికి ప్రత్యేక రక్షణలు కొనసాగింపు
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 2, 3, 4
59. రాజ్యాంగానికి ఆర్టికల్ 15(4)ను చేర్చడానికి కారణమైన సుప్రీంకోర్టు కేసును గుర్తించండి?
ఎ) మినర్వామిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) ఆనందభాయ్ పటేల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
సి) శంకరీ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) చంపకం దొరై రాజన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు
60. రాజ్యాంగంలో ఆర్టికల్ 15(4) ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
ఎ) ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం -1951
బి) రెండవ రాజ్యాంగ సవరణ చట్టం -1951
సి) 7వ రాజ్యాంగ సవరణ చట్టం -1956
డి) 14వ రాజ్యాంగ సవరణ చట్టం -1961
సమాధానాలు
31-బి 32-సి 33-ఎ 34-బి 35-ఎ 36-సి 37-ఎ 38-సి 39-డి 40-ఎ 41-బి 42-సి 43-బి 44-ఎ 45-బి 46-సి 47-ఎ 48-ఎ 49-సి 50-ఎ 51-సి 52-బి 53-డి 54-ఎ 55-బి 56-ఎ 57-బి 58-బి 59-డి 60-ఎ
సత్యనారాయణ
ఎకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు