షాజహాన్ ఆఫ్ హైదరాబాద్ అని ఎవరిని పిలుస్తారు?
- తెలంగాణలో ఆదిమమానవుడు నడయాడిన ఆనవాళ్ళు కోకోల్లలు, అటువంటి వాటి తో నాటి చిత్రకళా
- నైపుణ్యాన్ని తెలియజేసే ‘ఒంటిగుండు’ ప్రాంతం ఎక్కడ కలదు? – భద్రాద్రి కొత్తగూడెం
- చిందు యక్షగాన పితామహుడు? – పిల్లుట్ల వెంకయ్య
- ‘మనఊరు- మన కూరగాయలు’ పథకం ఎప్పుడు ప్రారంభించారు? -2014, ఆగస్ట్ 6.
- తెలంగాణ ‘రవివర్మ’ అని ఎవరిని అంటారు? – మార్చల రామారావు, కల్వకుర్తి వాసి
- ‘పికాసో ఆఫ్ ఇండియా’ అని పిలువదగిన చిత్రకారుడు ఎవరు? – పాకాల తిరుమల రెడ్డి (పీటీ రెడ్డి)
- తెలంగాణలో ‘స్టీల్ బ్యాంక్’ ఎక్కడ ఉంది. – సిద్దిపేట
- హైదరాబాద్‌లోని ‘జూబ్లిహాల్’ ఎవరు ఎప్పుడు నిర్మించారు?- 1913లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ (పబ్లిక్‌గార్డెన్‌లో)
- మూసీనది పక్కన గల ఎరుపు, తెలుపు రాళ్లతో నిర్మించిన ‘హైకోర్టు’ను డిజైన్ చేసిన ఇంజినీర్స్ ఎవరు? -1915లో జైపూర్‌కి చెందిన శంకర్‌లాల్, హైదరాబాద్‌కి చెందిన మెహర్ అలీ ఫజిల్
- నిర్మల్ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది? – 400 సం.రాల క్రితం నిమ్మనాయుడు పరిపాలించడం వల్ల నిర్మల్ అని పేరు వచ్చింది.
- ముసారాంబాగ్ ఆ పేరు వచ్చింది? – ఫ్రెంచి సైనిక అధికారి మూన్సే రేమాండ్- సమాధి ఉండడం వల్ల
- రాష్ట్ర అటవీ అకాడమీ ఎక్కడ కలదు? – దూలపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
- నెహ్రూ జూలాజికల్ పార్క్ వద్ద ‘మీర్- అలమ్-ట్యాంక్’ ఎవరి పేరుతో, ఏ సంవత్సరంలో ఏర్పడింది? -1806లో అప్పటి ప్రధాని మీర్ ఆలం బహదూర్ పేరుతో
- మలక్‌పేట ఎవరి పేరుతో ఏర్పడింది? అతను ఏదేశస్థుడు?- ‘తానిషా’ అంతరంగిక కార్యదర్శి పేరు ‘బడే మాలిక్’. ఇతను ఇథియోపియా నుండి వచ్చిన హబ్సీ తెగకు చెందినవాడు.
- హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఎప్పుడు శంకుస్థాపన చేశారు. ఎవరు ప్రారంభోత్సవం చేశారు? -1960 మార్చి 23న శంకుస్థాపన చేశారు. 1961 మే 11న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభోత్సవం చేశారు.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మించిన తొలి ప్రాజెక్టు? – భక్త రామదాసు ప్రాజెక్టు కూసుమంచి (రిజర్వాయర్) వద్ద పాలేరు నదిపై
- తెలంగాణ ప్రభుత్వం సద్దిమూట పథకాన్ని ఎక్కడ ప్రారంభించింది? – టి. హరిష్‌రావు(మంత్రి)సిద్దిపేట మార్కెట్ యార్డ్‌లో 2014 అక్టోబర్ 13న
- హైదరాబాద్ గండిపేట వద్దగల ఇబ్రహీం బాగ్‌లో ‘తారామతి నాట్యమందిరం’ ఎవరి పేరుతో, ఎవరి కాలంలో ఏర్పడింది?- 7వ సుల్తాన్”అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో ప్రముఖ నర్తకి తారమతి పేరుతో
- భారతదేశంలో సీబీటీసీ టెక్నాలజీతో ఏర్పడిన మొట్టమొదటి మెట్రో రైల్వే ఏది? – హైదారాబాద్ మెట్రో రైల్వే (కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ -సీబీటీసీ)
- హైదరబాద్ నగరంలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? – మొత్తం 19 యూనివర్సిటీలు
- మిషన్ భగీరథ ఎక్కడ, ఎవరు ప్రారంభించారు? – 2016 ఆగస్ట్ 7న గజ్వేల్ నియోజక వర్గంలోని కోమటి బండలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది.
- ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ‘తెలంగాణ చేను కబుర్లు’ కార్యక్రమాన్ని కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు?- 2015 జనవరి 26న.
- ఆసియాలోనే అతిపెద్ద జాతరను ప్రభుత్వం ఏ సంవత్సరంలో జాతీయ పండుగగా గుర్తించింది. -1996లో
- విశ్వనాధ సత్యనారాయణ గారికి సన్మానం చేయుటకు ఆహ్వనించగా, ఆయనతోనే సన్మానించుకున్న మునగాల ప్రాంత తెలంగాణ కవి ఎవరు? – శ్రీ చివులూరి లక్షి నర్సింహాచార్యులు
- సమ్మక్క సారక్క జాతరలో కీలకమైన ఘట్టాలు ఏవి? -సమ్మక్క తల్లిరాక, పోలీస్ అధికారి గాలిలో కాల్పులు
- షాజహాన్ ఆఫ్ హైదరాబాద్ అని ఎవరిని అంటారు? -6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ దివాన్ ‘వికారుల్ ఉమ్రా’
- 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కేంద్రం హైదరాబాద్ నగరంలోని గౌలిగూడ. దీని అసలు పేరు – గొల్లగూడ
- హైదరాబాద్‌లోని ఉప్పుగూడలోని ‘కందికల్’ గేట్ సమీపంలో 3 1/2 ఎకరాల విస్తీర్ణంలో గల చిత్రగుప్త ఆలయాన్ని బీహర్ నుండి వచ్చిన కాయస్థులు నిర్మించారు. దీన్ని వెలుగులోకి తెచ్చిందెవరు? – రాజా కిషన్ పర్షాద్
- హైదరాబాద్‌లోని బిర్లామందిర్ ఏ సంవత్సరంలో నిర్మించారు. -1976లో
- జూబ్లీహిల్స్ -మాదాపూర్ మధ్యలో ఉన్న దుర్గం చెరువును నిర్మించిన రాజులెఎవరు? -కుతుబ్‌షాహీలు
- బైండ్లవారు ఎల్లమ్మ, పోచమ్మ, అక్కమ్మ, సారంగధర చరిత్రలను గానం చేయడానికి ఉపయోగించే వాయిద్యం ఏది? – బవనిక (జమిడిక)
- తెలంగాణలో హుండీలేని దేవాలయం, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన దేవాలయం ఏది? -చిలుకూరు బాలాజీ దేవాలయం (హైదరాబాద్‌కు 25 కి.మీ.ల దూరంలో ఉంది)
- తెలంగాణకు చెందిన ఏ కళాకారుని పుట్టిన రోజును మిమిక్రీ డే గా డిసెంబర్ 28న జరుపుకుంటారు? – నేరెళ్ళ వేణు మాధవ్, ఒన్ మ్యాన్ ఆర్కెస్ట్రా
- తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ 5వ సమావేశం 2020, జనవరి 18,19 తేదీల్లో ఎక్కడ జరిగింది? -నడిగూడెంలోని నాయని వెంకట రంగారావుగారి కోటలో
- ప్రపంచంలో రెండవ ఐలాండ్ మ్యూజియంగా పేరుగాంచిన నాగార్జునకొండకు శంఖుస్థాపన ఎప్పుడు, ఎవరు చేశారు? – 1959 జనవరి 31న అప్పటి కేంద్ర మంత్రి హుమాయున్ కబీర్
- తెలంగాణాలో మొదటిసారిగా రాతి చిత్రాలను గుర్తించిన శాస్త్రవేత్తలెవరు? ఎక్కడ? – 1934లో
- మహబూబ్‌నగర్ జిల్లాలోని సంగనోనిపల్లెలో లియోనార్డ్మన్, మహదేవన్‌లు
- తెలంగాణలో పర్షియన్ భాష స్థానంలో ఉర్దూను ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు? – 1884
- తెలంగాణ సినిమా పితామహుడు ధీరెన్ గంగూలీ (ధీరేంద్రనాథ గంగోపాధ్యాయ) ఎప్పుడు, ఎక్కడ జన్మించారు? – 1893 మార్చి 23న బంగ్లాదేశ్‌లో జన్మించారు.
- తెలంగాణలో గల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చిని ఎవరు నిర్మించారు. – చార్లెస్ వాకర్ ఫాస్ఫీట్ అనే ఇంజనీర్
- 1890లో హైదరాబాద్‌లో పర్షియన్ అరబిక్ తాళపత్ర గ్రంథాల ముద్రణ కోసం దైరతుల్ మారిఫ్ అనే సంస్థను స్థాపించినదెవరు? -అబ్దుల్ ఖయూమ్
- శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం అనే గ్రంథాలయానికి తెలంగాణలోని ఏ జమిందారు 40 సంవత్సరాలు అధ్యక్షులుగా పనిచేశారు? -మునగాల రాజా నాయని వెంకట రంగారావు
గాంధీజీ హైదరాబాద్ ప్రథమ పర్యటనలో మహిళ సభను ఎక్కడ ఏర్పాటు చేశారు? – ప్రేమ్ థియేటర్లో - కాకతీయ మొదటి ప్రతాపరుద్రుడు వేయిస్తంభాలగుడి వంటి గుడులను తెలంగాణలో ఎక్కడెక్కడ నిర్మించాడు? -కొలనుపాక, మంథని
- శ్రీ పర్వతంపై నిలువెత్తు బంగారు విగ్రహాలున్నాయని రాసిన చైనా యాత్రికుడెవరు? -హుయాన్‌త్సాంగ్
- గోల్కొండ రాజ్యంలోని ‘కోలార్’ వజ్రపు గనులను సందర్శించిన ఆంగ్లేయుడెవరు? – విలియం మైథోల్డ్
- ఉత్తర సర్కార్లు కావాలని 1788లో మీర్ ఆలం అనే దూతను గవర్నర్ జనరల్ ‘కారన్ వాలీస్’ వద్దకు పంపిన నిజాం రాజెవరు? – 2వ నిజాం – నిజాం ఆలీఖాన్
- కుతుబ్‌షాహీల విపులమైన చరిత్ర ‘తారిఖే కుతుబ్షాహి’ని రచించిన కవి ఎవరు? -ఖోర్షాహఖ బాదుల్ హుస్సేనీ
- ప్రపంచంలో ఉర్దూభాష పుట్టింది. హైదరాబాద్‌లో దానికి ఆ పేరు పెట్టిన వ్యక్తి ఎవరు? – మీర్జా సిరాజుద్దీన్ ఖాన్ అర్జూ ఢిల్లీ (1689-1765)
- ఉస్మానియా విశ్వవిద్యాలయ జనకుడు అనిచెప్పే నిజాం రాజు కార్యదర్శి ఎవరు? – సర్ అక్బర్ హైదరీ
- చారిత్రాత్మక ‘రాచకొండ’ గిరి దుర్గాన్ని నిర్మించిన రాజు ఎవరు? – అనపోతనీడు (మొదటి సింగమ నాయకుని కుమారుడు)
- 1971లో తెలంగాణ వ్యక్తికే సీఎం పదవి ఇవ్వాలన్న అప్పటి మంత్రి ఎవరు? – అక్కిరాజు వాసుదేవరావు
- కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం తెలంగాణ ఎర్రకోట అని ఏ కోటను అంటారు. – రాజాపేట కోట (యాదాద్రి భువనగిరి జిల్లా)
- తెలంగాణలో జైన మతస్థుల ధాన్యాగారం ఏది? -గొల్లత్తగుడి జైన కేంద్రం మహబూబ్‌నగర్ జిల్లా
- ‘కొమరం భీం’ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ తీసుకున్న తెలంగాణ వ్యక్తి ఎవరు? – అల్లాణి శ్రీధర్, కొడకంబ, మెదక్‌జిల్లా
- హైదరాబాద్‌లో మహ్మద్ ఇక్బాల్ అనే ప్రముఖ జాతీయ కవి స్థూపం ఎక్కడ ఉంది? – సైఫాబాద్, హైదరాబాద్
- బాల నాగమ్మ, మాయల మరాటీ, జానపదగాథలు తెలంగాణలో ఏ ప్రాంతానికి చెందినవి? – పానగల్లు, నల్లగొండ
- చారిత్రక తారామతి మందిరం నిర్మాత ఎవరు? ఎక్కడ ఉంది? -అబ్దుల్లా కుతుబ్ షా గండిపేట దగ్గర ఇబ్రహీం బాగ్‌లో ఉంది.
- కాకతీయుల చరిత్రలో యుగంధరుడు అన్న బిరుదున్న సేనాపతి ఎవరు? -నాగయ గన్నయ ఇతనికి మరోపేరు మాలిక్ మక్బూల్ – రుద్రమదేవి, 2వ ప్రతాపరుద్రుని కాలంలో పనిచేశాడు.
- తెలంగాణకు చెందిన ఒక సాధారణ ‘డోలు’ వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డ్ అందు కున్నారు. ఆయన ఎవరు? – సకిని రామచంద్రయ్య, మణుగూరు.
- తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఏ గ్రామ పంచాయతీ ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుంది? – సిద్దాపుర్ (గ్రామం), నందిపేట మండలం, నిజామాబాద్ జిల్లా.
- ఇటీవల జనగాం జిల్లాలో రాతియుగం నాటి ఆనవాళ్ళు బయల్పడిన గ్రామం ఏది? – గోవర్ధనగిరి
- ఇటీవల మరణించిన తెలంగాణ సాయుధపోరాటంలో తుపాకి పట్టిన కమ్యూనిస్ట్ యోధురాలు ఎవరు? – మల్లు స్వరాజ్యం
- ఇటీవల భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించిన తెలంగాణ వాసి ఎవరు? – కెతావత్ సోమ్లాల్, ఆకుతోటబావి గ్రామం, నల్లగొండ జిల్లా
- ప్రపంచంలోనే మొట్టమొదటి మత్తుమందు డాక్టర్ మన తెలంగాణ ముద్దు బిడ్డే? – రూపాబాయి, ఫర్దూనీ- హైదరాబాద్
- గొప్ప సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు గురువైన సంగీత దర్శకుడు? – జి.కె. వెంకటేష్ హైదరాబాద్, తెలంగాణ
- హైదరాబాద్‌లోని మొజాంజాహీ మార్కెట్‌ను ఏ సంవత్సరంలో ఎవరి పేరుతో నిర్మించారు? -1935లో మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ (7వ నిజాం) మొదటి కుమారుడు మొజాంజాహీ పేరుతో
- మాభూమి’ కన్నా ముందే మృణాళ్ సేన్ నిర్మించిన ‘ఒక ఊరి కథ’ అనే సినిమాను ఏ ఊరిలో చిత్రీకరించారు.- రంగారెడ్డి జిల్లాలోని చీదేడ్ గ్రామం
- తెలంగాణ ముద్దుబిడ్డ పాతతరం సినిమా, నాటకరంగం నటుడు‘భానుప్రకాష్’ ఎక్కడ జన్మించాడు. – నల్లగొండలో 1939 ఏప్రిల్ 11న
- దక్కన్ ఆయుర్వేద వైద్యమండలిని హైదరాబాద్‌లో స్థాపించిందెవరు? -వేదుల తిరుమల వెంకట రామానుజ శతావధాని
- ఛత్రపతి శివాజీ 1677లో దర్శించిన తెలంగాణలోని దేవాలయం ఏది? -మహేశ్వరం (హైదరాబాద్ దగ్గర శ్రీశైలం రోడ్డు)
- సికింద్రాబాద్‌లోని బొల్చారం చర్చిని హోలీ ట్రినిటీ చర్చి అనికూడా అంటారు. దీనిని నిర్మించినదెవరు?- 1847లో విక్టోరియా మహారాణి
- 1948లో హైదరాబాద్‌లోని వెటర్నరీ సైన్స్ కళాశాల ప్రథమ ప్రిన్సిపాల్ ఎవరు? – డా.ఎం. హబీబ్‌ఖాన్
- దక్షిణ భారతదేశ చరిత్రలో దేవాదాయ ధర్శాదాయ భూములపై పన్ను విధించిన మంత్రి ఎవరు? – మాదన్న (అబుల్ హసన్ తానీషా మంత్రి)
- హైదరాబాద్‌కు చెందిన చంద్రకాంత ప్రెస్‌ను గౌలిగూడలో ఎవరు స్థాపించారు? – కృష్ణస్వామి ముదిరాజ్
- జయదేవుని గీత గోవిందాన్ని తెలుగులోకి అనువదించిన గద్వాల పెదసోమభూపాలుని ఆస్థాన విద్వాంసుడెవరు? – కామ సముద్రం అప్పలాచార్యుడు
Next article
తెలుగులో వచ్చిన తొలి అప్పగింత కావ్యం ఏది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు