శాస్త్రాలు-చరిత్ర-స్వభావాలు-సహసంబంధాలు
1. విజ్ఞాన శాస్త్ర గొప్పతనాన్ని వివరించే క్రమంలో ‘సముద్ర గర్భంలో రత్నాలు ఏరుకుందామని వచ్చి, గుళకరాళ్లు ఏరుకున్న పసివాడిని’ అని తనకు తానుగా పేర్కొన్న శాస్త్రవేత్త?
1) న్యూటన్ 2) ఐన్స్టీన్
3) సీవీ రామన్ 4) అరిస్టాటిల్
2. పదవ తరగతి విద్యార్థులకు అంకగణిత సమస్యలు, బీజగణితం ఆధారం చేసుకొని భోధించారు. ఇది సూచించే సహసంబంధం?
1) అంశాలతో బాహ్య సహసంబంధం
2) విషయాలతో బాహ్య సహ సంబంధం
3) శాఖలో అంతర్గత సహ సంబంధం
4) గణితంలో వివిధ శాఖలతో అంతర్గత సహ సంబంధం
3. ప్లాస్టిక్ సర్జరీ, సిజేరియన్లను వివరించిన ప్రాచీన గ్రంథం?
1) రస రత్నాకరం
2) చరక సంహిత
3) సుశ్రుత సంహిత
4) రుగ్వేదం
4. కింది వాటిలో సాంఘికశాస్త్ర ఆశయానికి సంబంధించి సరికానిది?
1) ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడం
2) విశ్వశాంతిని నెలకొల్పడం
3) తార్కిక ఆలోచనలు పెంపొందించడం
4) సత్పౌరులుగా తయారు చేయడం
5. కింది వాటిలో గణితం-జీవశాస్త్రం మధ్య సహసంబంధం తెలియజేసే అంశం?
1) ఉష్ణోగ్రత-వర్షపాతం
2) క్రిమిసంహారక మందులు, భూసార పరీక్షలు
3) రసాయన మిశ్రమాలు, సమ్మేళనాలు
4) ఆటలు ఆడే స్థలాలు, కోర్టులు గీయడం
6. గౌతమీపుత్ర శాతకర్ణి యుద్ధాలు, ఆక్రమించిన రాజ్యాలు, బోధిస్తున్నప్పుడు ఆ రాజ్యం సరిహద్దులు, అక్షాంశ రేఖాంశాల పరిధుల గురించి బోధించడం?
1) బాహ్య సహసంబంధం
2) అంతర్గత సహసంబంధం
3) సబ్జెక్టు సహసంబంధం
4) ఏదీకాదు
7. కింద ఇచ్చిన గణిత నిర్వచనాలు, గణితవేత్తల్లో తప్పుగా గుర్తించిన దానిని సూచించండి?
1) సంఖ్యారాశులు, మాపనాల విజ్ఞానమే గణితం- బెల్
2) గణితమంటే పరిమాణ శాస్త్రం- అరిస్టాటిల్
3) ఎక్కడ లయ కలదో, అచట సంఖ్య కలదు- బెంజిమన్ పీర్స్
4) పరోక్ష మాపనం- ఆగస్ట్కోమ్టే
8. పరికల్పన అంటే?
1) అనేక ఉదాహరణలు పరిశీలించిన తరువాత ఏర్పడిన సాధారణీకరణం
2) విస్తారంగా పరీక్షించి రూఢియైన, నిశ్చయమైన సిద్ధాంతం
3) ప్రకృతిలో ప్రతినిత్యం జరిగే మూర్తాను భావ నిజం
4) సమస్యకు ఊహించిన తాత్కాలిక పరిష్కారం
9. జేబీ కొన్నేట్ ప్రకారం యదార్థం లక్షణాలు కానివి?
1) వివాద రహితంగా ఉండాలి
2) సందర్భాన్ని బట్టి మారుతూ ఉండాలి
3)ఎప్పుడైనా,ఎన్నిసాైర్లెనా ప్రదర్శించేదిగా ఉండాలి
4) ప్రత్యక్ష పరిశీలనకు అవకాశం లేనిదిగా ఉండాలి
1) 1, 4 2) 2, 4
3) 3, 4 4) 4 మాత్రమే
10. బుద్ధగుప్తునిచే నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన ప్రఖ్యాత గణితవేత్త?
1) భాస్కరాచార్యుడు
2) బ్రహ్మగుప్తుడు
3) ఆర్యభట్ట
4) వరాహమిహిరుడు
సమాధానాలు
1-2, 2-4, 3-3, 4-3, 5-2, 6-3, 7-3, 8-4, 9-2, 10-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు