ఐఐటీ హైదరాబాద్లో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలు
హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరానికి గాను పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకోసం ఐఐటీ హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 7 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.
కోర్సులు: ఎంఏ, ఎండీఈఎస్ (మాస్టర్ ఆఫ్ డిజైన్), ఎంటెక్లో అడ్డిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, బయో మెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, క్లైమెట్ చేంజ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఈ-వేస్ట్ రిసోర్స్ అండ్ ఇంజినీరింగ్ మేనేజ్మెంట్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ సెన్సార్ సిస్టమ్, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటల్లర్జికల్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, మెడికల్ డివైస్ ఇన్నోవేషన్, నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, పాలీమర్స్ అండ్ బయోసిస్టమ్స్ ఇంజినీరింగ్, స్మార్ట్ మొబిలిటీ.
పీహెచ్డీలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, డిజైన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, లిబరల్ ఆర్ట్స్, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటల్లర్జికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఫిజిక్స్
అర్హతలు: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అదేవిధంగా ఎండీఎస్ కోర్సు కోసం.. బీటెక్, ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ డిజైన్, బీఎఫ్ఏలో ఏదో ఒకటి చేసి ఉండాలి. పీహెచ్డీ కోర్సులకు.. సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్ మార్కుల ఆధారంగా
అప్లికేషన్ విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 7
వెబ్సైట్: IIT Hyderabad @iith.ac.in
- Tags
- Admissions
- GATE
- IIT Hyderabad
- MDes
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు