బోధనలో ప్రయోజనం విలువ

గణిత శాస్త్రం
- గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రం – పావులూరి మల్లన్న
- ప్రకృతి అంతా గణితమయం.
- ప్రకృతి శక్తులకు సంబంధించిన అవగాహనకు గణిత జ్ఞానాన్ని వినియోగించడం.
- నక్షత్రాలు, గ్రహాలు గణిత నియమాల ప్రకారం నడుస్తాయి.
- గ్రహణాలు ఎప్పుడు ఏర్పడుతాయి లాంటి విషయాలు ముందుగానే చెప్పడానికి గణితజ్ఞానాన్ని వినియోగించడం.
- దేశాభివృద్ధి సాధించగల గణితం మరువరానిది- నెపోలియన్
- సకల శాస్ర్తాలకు గణితం మూలం, ద్వారం- బేకన్
- జీవితంలో క్రమపద్ధతి అవసరం. ఇటువంటి లక్షణాన్ని గణిత పఠనం ద్వారా పొందడం.
- గణితానికి ‘పొట్ట పోషించుకునే విలువ /ప్రయోజనం’ ఉంటుంది.
- సమాజంలో ఏ స్థాయికి చెందిన వ్యక్తికయినా, ఏ వృత్తికయినా గణితజ్ఞానం అవసరం.
- ఉదా: ఒక కూలివాడు తనకు రావలసిన కూలీని లెక్కగట్టడం.
- వ్యాపారి వస్తువులను అమ్మడం, కొనడం, ద్వారా తన లాభ, నష్టాలను లెక్కించడం.
- గృహిణి ఇంటి బడ్జెట్ను తయారు చేసుకోవడం.
- గణితాన్ని నేర్చుకొన్న రాము సొంతంగా వ్యాపారం చేసుకోగలుగుతున్నట్లయితే అతడికి గణితం ద్వారా ఏ విలువను పొందినట్లు- ప్రయోజన విలువ
- నిజజీవిత సమస్యలను పరిష్కరించుకోవడంలో నేర్చుకొన్న గణిత జ్ఞానం ఉపయోగపడితే ఆ గణిత శాస్ర్తానికి ఏ విలువ ఉన్నట్లు -ప్రయోజన విలువ
- శ్రీను గణితాన్ని నేర్చుకొని తన జీవనోపాధిని గడుపుతున్నాడు. ఇది గణిత శాస్త్ర ఏ విలువను సూచిస్తుంది-ప్రయోజన విలువ
సాంఘిక శాస్త్రం
- భౌగోళిక శాస్త్రం వల్ల నేలలు, ఆ నేలల్లో పండే పంటలు, ఖనిజ సంపద మొదలైన వాటికి సంబంధించిన జ్ఞానం లభించడం.
- చరిత్రవల్ల మన పూర్వీకుల గొప్పదనం, అప్పటి పరిస్థితులను అర్థం చేసుకోవడం.
- అధ్యయనంవల్ల విద్యార్థి తన హక్కులు, విధులు, బాధ్యతలను తెలుసుకోవడం.
- అర్థశాస్త్రం వల్ల మార్కెట్లు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడం.
క్రమశిక్షణ విలువ
గణిత శాస్త్రం
- గణితమనేది ఒకవిధమైన, కచ్చితమైన ఆలోచన.
- హేతువాదం ద్వారా గణితం విద్యార్థుల్లో ‘క్రమశిక్షణ విలువను’ పెంపొందిస్తుంది.
- హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం – జాన్ లాక్
- ప్రతి విద్యార్థికి లేదా వ్యక్తికి, సంఘానికి లేదా దేశానికి ఒక క్రమ పద్ధతి అవసరం. ఇలాంటి లక్షణాన్ని విద్యార్థులు గణితాధ్యయనం ద్వారా పొందడం.
- పాఠ్యాంశాలను ఒకదాని తరువాత ఒకటి క్రమపద్ధతిలో నేర్చుకోవడం.
- ఉదా: సుధ అనే అమ్మాయి ముందు సంకలనం, గుణకారం, భాగహారం, ఇలా ఒక క్రమం లో నేర్చుకొంటుంది. ఇది ఆమెలోని ఏ విలువను సూచిస్తుంది- క్రమశిక్షణ
- గణిత సమస్యలన్నీ దత్తాంశాల నుంచి సారాంశాన్ని కనుక్కొనే పద్ధతిలో పరిష్కరించడం.
- రాజు అనే విద్యార్థి సమస్యను దత్తాంశం నుంచి సారాంశం వైపునకు వేగంగా, కచ్చితంగా సాధించగలిగాడు. అయితే అతను గణిత శాస్త్రం ద్వారా పొందిన విలువ – క్రమశిక్షణ
సమస్య సాధనకు సరైన పద్ధతిని ఎన్నుకోవడం, ఫలితాలను ఊహించడం, జవాబును సరిచూడటం లాంటి నైపుణ్యాలు గణితం ద్వారా నేర్చుకోవడం. - గణితాంశాలను సరళమైన భాషలో వివరించడం.
- సరళత లేదా స్పష్టత స్వభావం.
- ఉపజ్ఞతను కలిగి ఉండటం.
- గణనలు చేయడంలో వేగం, కచ్చితత్వాన్ని పెంపొందించడం.
- గణితాధ్యయనం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత అభివృద్ధి చెందడం.
- గణితాధ్యయనం సరిగా చేసిన విద్యార్థి సూత్రాన్ని మర్చిపోతే దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి బదులు ఆ సూత్రాన్ని మళ్లీ రూపొందిచడానికి ప్రయత్నించడం.
- శృతి అనే అమ్మాయి దీర్ఘ చతురస్రం చుట్టుకొలత సూత్రం మర్చిపోతే ఆమె మళ్లీ రూపొందించుకుంటే ఆమెలోని విలువ- క్రమశిక్షణ
- గణితాధ్యయనం ద్వారా నైతిక విలువలు, ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవం, ఇతరులను గౌరవించడం, నిరాడంబరం, మితభాషణం, విచక్షణాజ్ఞానం, మొదలైన క్రమ శిక్షణ విలువలను పొందుతారు.
- గణితశాస్త్రంలోని శాస్త్రవేత్తలను గురించి నేర్చుకొన్న విద్యార్థి తన తోటివారిని గౌరవిస్తున్నట్లయితే ఇది అతడిలోని ఏ విలువను సూచిస్తుంది.- క్రమశిక్షణ విలువ
విజ్ఞాన శాస్త్రం
- విజ్ఞాన శాస్త్రం విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. ఇది వారిలో నిష్పాక్షిక పరిశీలన, మానసిక ఏకాగ్రత, క్రమబద్ధమైన ఆలోచనా సరళి, ఓర్పు, సరైన నిర్ణయాలు చేయడం, నిశితంగా పరిశీలించడం, పరికల్పనలు రూపొందించడం, పరీక్షించడం లాంటి సుగుణాలను క్రమశిక్షణా విలువలు పెంపొందిస్తాయి.
- క్రమబద్ధమైన జీవిత విధానంతో ఆనందాన్ని పొందుతారు.
సాంఘిక శాస్త్రం
- సాంఘిక శాస్త్రం అధ్యయనం నీతి నిజాయితీతో, సంయమనాన్ని పాటిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ, మంచి జీవితానికి నాంది పలుకుతూ, వ్యక్తి ఆలోచనలో, ప్రవర్తనలో మార్పులను తీసుకురావడాన్ని ‘క్రమశిక్షణా విలువలు’ అంటారు.
- సాంఘికశాస్త్రం అధ్యయనం సమస్యను నిశితంగా పరిశీలించడం, సమగ్రంగా ఆలోచించడం, నివేదికలను తయారు చేయడం, పరికల్పనలను రూపొందించి పరీక్షించడం వంటి సుగుణాలను పెంపొందిస్తుంది.
Previous article
When women joined agitation…
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు